Law cet | ఇ‘లా సెట్’ అవుదామా!
లాయర్/అడ్వకేట్ సమాజంలో అత్యంత గౌరవం, హోదా ఉన్న వృత్తి. సమాజంలో సమస్యలపై, సాంఘిక దురాచారాలపై, అన్యాయం జరుగుతున్న చోట న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారికి భరోసానిస్తూ, వారి కోసం న్యాయస్థానాల్లో తమ గళంతో నిత్యం చట్టానికి కట్టుబడి, సమానత్వం కోసం పని చేస్తారు న్యాయవాదులు. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి మొదలుకొని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబా సాహెబ్ అంబేద్కర్, భారత తొలి ప్రధాని నెహ్రూ ఇలా ఎందరో స్వాతంత్య్ర యోధులు ‘లా’ వృత్తిని చేపట్టినవారే. న్యాయవాద విద్య చదివేందుకు నేటి యువత మొగ్గు చూపుతున్నది. ఈ సందర్భంలో లా పట్టా పొందాలంటే కావాల్సిన అర్హతలు, లా సెట్ ప్రవేశ పరీక్ష, విధివిధానాలు, సిలబస్, ప్రిపరేషన్ తదితర విషయాలు తెలుసుకుందాం.
– బీఏ (kkb) 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లా డిగ్రీ కోర్సులు ఉన్నాయి.
-ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే లా సెట్ ప్రవేశ పరీక్ష రాయాలి.
– ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా రాష్ట్రంలోని లా కాలేజీల్లో సీటు కేటాయిస్తారు.
అర్హతలు: ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీ డిగ్రీ చేయాలనుకునేవారికి ఇంటర్ విద్యార్హత తప్పనిసరి.
-మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ డిగ్రీ చేయాలనుకునే వారు సాధారణ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
– వయస్సు నిబంధన లేదు. ఏ వయస్సువారైనా లా చేయవచ్చు.
పరీక్ష విధానం
– ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి.
క్లాట్-2022
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022
నోటిఫికేషన్ విడుదలైంది.
క్లాట్-2022
కోర్సులు: లా (యూజీ, పీజీ)
అర్హతలు: యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్ఎల్బీ డిగ్రీ ఉత్తీర్ణత.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 9
పరీక్ష తేదీ: జూన్ 19
వెబ్సైట్: https://consortiumofnlus.ac.in
జీకే & మెంటల్ ఎబిలిటీ
-దీనిలో జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. దేశంలో, ప్రపంచంలో మొదటివి, పెద్దవి, చిన్నవి, నదులు, ఎడారులు, అడవులు, ఆవిష్కరణలతో పాటు చారిత్రక సంఘటనలు, భౌగోళిక-ఆర్థిక అంశాలు, జనరల్ సైన్స్ ఉంటాయి.
– మెంటల్ ఎబిలిటీ నుంచి బేసిక్ న్యూమరసి, నంబర్ సిరీస్, శాతాలు, లాభ-నష్టాలు, బాడ్‌మాస్ రూల్ ఉంటాయి.
-ఇంగ్లిష్ నుంచి 5-6 ప్రశ్నలు వస్తాయి. సినానిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్- ఫ్రేజెస్, ప్రిపోజిషన్స్ చదవాలి.
కరెంట్ అఫైర్స్
-ఈ విభాగంలో సమకాలీన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ముఖ్యమైన వ్యక్తులు-రోజులు, పుస్తకాలు-రచనలు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు.
– అవార్డులు, క్రీడలు, 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆర్థిక అంశాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సుప్రీంకోర్టు తీర్పులు ఉంటాయి.
లీగల్ ఆప్టిట్యూడ్
– దీనిలో భారత రాజ్యాంగంతో పాటు లా సబ్జెక్టులపై కూడా ప్రశ్నలు ఉంటాయి.
– రాజ్యాంగం నుంచి రాజ్యాంగ నిర్మాణం, సెక్షన్లు, షెడ్యూళ్లు, చట్టాలు, అధికరణలు, సవరణలు, ప్రాథమిక హక్కులు, విధులు చదవాలి.
– లీగల్ ఆప్టిట్యూడ్‌ను రాజ్యాంగ అంశాలతో కలిపి చదవాలి. చట్టాలు, సెక్షన్లు, నిబంధనలు, కాంటాక్ట్ లా చట్టం, టోర్స్ లా, హిందూ లా చట్టం, ఐపీఎస్, సీఆర్పీసీ, పర్యావరణ చట్టాలు, అంతర్జాతీయ లా చట్టం, మేధో సంపత్తి హక్కులు కీలకమైన అంశాలపై పట్టు సాధించాలి.
ప్రిపరేషన్
– లా సెట్‌కు మూడు నెలల ప్రిపరేషన్ అవసరం. ఇందులో అన్ని విభాగాలు, సబ్జెక్టులపై పట్టు సాధిస్తే లా సెట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లే.
– మూడు నెలల సమయం ఉంది. కాబట్టి దరఖాస్తు చేసిన వెంటనే శిక్షణ మొదలుపెట్టాలి.
– సిలబస్‌కు అనుగుణంగా నిర్ధారిత సమయంలో చదువుకునేలా అనుకూలమైన టైం టేబుల్‌ను సిద్ధం చేసుకోవడంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు.
-సొంతంగా నోట్స్ తయారు చేసుకొని, రివిజన్ చేస్తూ ఉండాలి.
– అన్ని విభాగాలను క్షుణ్ణంగా అవగాహన
చేసుకోవాలి.
– 50 శాతం గరిష్ఠ మార్కుల వెయిటేజీ ఉన్న- పార్ట్-సి (60 మార్కులు) పై ఎక్కువ దృష్టి సారించాలి.
– లా సెట్ పూర్వ ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే పరీక్ష పై అవగాహన ఏర్పడుతుంది.
-10-15 లాసెట్ మోడల్ ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి.
-కేస్ స్టడీస్, భారత దేశంలో చారిత్రక చట్టాలు, తీర్పులపై అవగాహన పెంచుకోవాలి.
– లా టెర్మినాలజీపై సొంత నోట్స్ తయారు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
– లా సెట్ కోసం పుస్తకాలతో పాటు కోచింగ్ సెంటర్ మెటీరియల్ చదవడం వల్ల పరీక్షపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
రిఫరెన్స్ బుక్స్
1. లీగల్ ఆప్టిట్యూడ్: పియర్సన్ లీగల్ అవేర్నెస్
2. రాజ్యాంగం: లక్ష్మీకాంత్
3. ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్: ఆర్ఎస్ అగర్వాల్
4. కరెంట్ అఫైర్స్: నిపుణ (నమస్తే తెలంగాణ బుధవారం అనుబంధం), మాస సంచికలు, గత 6 నెలల అంశాలపై నోట్స్.
కౌన్సెలింగ్
-మూడు లేదా ఐదు సంవత్సరాల లా డిగ్రీ కోసం లా సెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ లా సెట్ కోసం lawcetadmin.tsche.ac.in వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. దరఖాస్తు చేయడం నుంచి కాలేజీలో సీటు పొందే వరకు వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది.
– తెలంగాణలో మూడు సంవత్సరాల్లో బీఏ (ఎల్ఎల్బీ) కాలేజీలు, ఐదు సంవత్సరాల బీఏ (ఎల్ఎల్బీ) కాలేజీలతో పాటు ఎల్ఎల్ఎం కోర్స్ వారికి కూడా ఈ పద్ధతి అవలంబిస్తుంది.
వెబ్ కౌన్సెలింగ్ విధానం
– లా సెట్ పరీక్ష-> ర్యాంకు కేటాయింపు-> వెబ్ ఆప్షన్స్-> కాలేజీ ఎంపిక-> కాలేజీ కేటాయింపు-> అడ్మిషన్
– విద్యార్థులకు అనుకూలమైన కాలేజీలను, తమ ర్యాంకు అధారంగా ఎంపిక చేసుకోవచ్చు.
-ఫీ పేమెంట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాలేజీల్లో చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
– దరఖాస్తు ఆన్లైన్లో
– చివరితేదీ: 6 జూన్
– ఫీజు: రూ.800 (ఓసీ/బీసీలకు), రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్)
-రూ.500 ఫైన్‌తో చివరితేదీ: జూన్ 26
-రూ.1000తో: జూలై 5
పరీక్ష తేదీలు
– లా సెట్ (3 సంవత్సరాల కోర్సు): జూలై 21
– లాసెట్ (5 సంవత్సరాల కోర్సు): జూలై 22
– పీజీ లాసెట్: జూలై 22
– వెబ్సైట్: https://lawcet.tsche.ac.in
విభాగం సబ్జెక్టులు ప్రశ్నలు సమయం
1. Part – A జీకే, మెంటల్ ఎబిలిటీస్ 30
2. Part – B కరెంట్ అఫైర్స్ 30 90 నిమిషాలు
3. Part – C లీగల్ ఆప్టిట్యూడ్ 60 మొత్తం 120 మార్కులు
మధు కిరణ్
డైరెక్టర్, ఫోకస్ అకాడమీ
హైదరాబాద్
9030496929
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు