న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష ఉండడానికి కారణం?
- జనవరి 11 తరువాయి
పాలిటీ
1. భారత సుప్రీంకోర్టు స్వయంప్రతిపత్తిని కాపాడే నిబంధన/నిబంధనలు ఏది/వి?
1. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తొలగించగలడు
3. న్యాయమూర్తుల వేతనాలను, శాసన వ్యవస్థ ఆమోదం అవసరం లేని భారత ఏకీకృత నిధి ద్వారా చెల్లిస్తారు
4. సుప్రీంకోర్టు అధికారులు, సిబ్బంది నియామకాలన్నింటినీ భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన మీదటే ప్రభుత్వం చేపడుతుంది
1) 1, 3 2) 3, 4
3) 1, 3, 4 4) 1, 2, 3
2. కింది వాటిలో ‘రూల్ ఆఫ్ లా’తో సంబంధం కలిగి ఉన్నవి ఏవి?
1. సమాజంలో అందరూ చట్టం ముందు సమానులే
2. భూ హక్కు చట్టం ఎలా ఉపయోగపడుతుందో పౌరులకు వివరించాలి
3. ప్రత్యేక తరగతికి చెందిన ప్రజలకు ప్రత్యేక న్యాయవ్యవస్థ లేకపోవడం
1) 1, 2 2) 2, 3
3) 1 4) 1, 2 ,3
3. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. న్యాయ సమీక్ష అనగా?
1. రాష్ట్ర హైకోర్టుల తీర్పులను సమీక్షించడం
2. మంత్రిమండలి విధులను సమీక్షించడం
3. రాష్ట్రపతికి సలహా ఇవ్వడం
4. శాసనశాఖ ఆమోదించిన చట్టాలు, కార్యనిర్వాహక శాఖ ఆదేశాల రాజ్యాంగబద్ధతను నిర్ణయించుట
1) 1, 2 2) 2, 3
3) 4 4) 3, 4
4. న్యాయశాఖ సామర్థ్యాన్ని బట్టి ప్రజాస్వామ్యం మనుగడ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నవారెవరు?
1) లార్డ్ రిప్పన్ 2) లార్డ్ బ్రైస్
3) గెటిల్ 4) ఏవీ డైసీ
5. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి కావాల్సిన అర్హత?
1) హైకోర్టులో 5 ఏళ్లు న్యాయమూర్తిగా లేదా హైకోర్టులో 10 సం.లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి
2) హైకోర్టులో 5 ఏళ్లు న్యాయవాదిగా పని చేసి ఉండాలి
3) సుప్రీంకోర్టులో 10 ఏళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి
4) న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా కలిగి ఉండాలి
6. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1) ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు
2) ప్రధాన న్యాయమూర్తి, 8 మంది ఇతర న్యాయమూర్తులు
3) ప్రధాన న్యాయమూర్తి, 9 మంది ఇతర న్యాయమూర్తులు
4) ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు
7. కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి?
1. ప్రోస్పెక్టివ్ ఓవర్ రూలింగ్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు భీన్నమైన తీర్పు ఇవ్వడం
2. రెట్రాస్పెక్టివ్: ప్రస్తుత తీర్పులను
గత కాలానికి కూడా వర్తింపజేసే తీర్పు
1) 1 2) 2
3) 1, 2 4) ఏవీ కావు
8. బ్రిటిష్ ఇండియాలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1773 2) 1774
3) 1775 4) 1772
9. కింది వాటిలో సరైంది?
1.ఇంట్రావైరస్: శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగ పరిధికి లోబడి
రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడం
2. అల్ట్రావైరస్: శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా
చెల్లకుండా రాజ్యాంగ విరుద్ధంగా న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడం
1) 1 2) 2
3) 1, 2 4) పైవేవీ కావు
10. కొత్తగా సుప్రీంకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది?
1) రాష్ట్రపతి 2) భారత పార్లమెంట్
3) సుప్రీంకోర్టు 4) కేంద్ర కేబినెట్
11. ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన జరిగితే పౌరుడు సుప్రీంకోర్టుకు (లేదా) హైకోర్టుకు వెళ్లే అధికారం రాజ్యాంగంలోని ఏ అధికరణలు వీలు కల్పిస్తాయి?
1) అనుచ్ఛేదములు 32, 226
2) అనుచ్ఛేదములు 33, 227
3) అనుచ్ఛేదములు 34, 228
4) అనుచ్ఛేదములు 35, 229
12. కింది స్టేట్మెంట్లలో సరైనది ఏది?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు న్యామూర్తులను నియమించే విషయంలో రాష్ట్రపతికి సలహా ఇస్తాడు
1. కేవలం రాష్ట్రపతి పరిశీలన కోసమైతేనే
2. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని
రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తి నియామక విషయంలో సలహా కోరతాడు
3. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేవలం
సలహా మాత్రమే ఇస్తాడు
4. పైవేవీ కావు
13. ఎపిస్టోలరీ జురీస్డిక్షన్ అనగా?
1) పిటిషన్ లేకుండా సుమోటో పద్ధతిలో చర్య జరిపే అధికారం
2) న్యాయస్థాన విధానంలో సడలింపు
3) రిట్ పిటిషన్ల పరిధి పెంపు
4) రాజ్యాంగ ధర్మాసనానికి కేసు
బదిలీ చేయడం
14. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలకు సంబంధించి సరికాని అంశం ఏది?
1) ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా 5 ఏళ్ల అనుభవం ఉండాలి
2) ఏదైనా హైకోర్టులో పదేళ్లు న్యాయవాదిగా పని చేసిన అనుభవం ఉండాలి
3) రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయవాద శాస్త్ర కోవిదుడై ఉండాలి
4) ఐదేళ్లు జిల్లా జడ్జిగా పనిచేసిన అనుభవం ఉండాలి
15. సుప్రీంకోర్టు మౌలిక అధికార పరిధిలో ఉన్నది/వి?
1. భారత ప్రభుత్వానికి ఒకటి (లేదా) అంతకుమించి రాష్ర్టాలకు మధ్య వివాదం
2. పార్లమెంటు ఉభయ సభల్లో ఏ ఎన్నికలైనా (లేదా) శాసన వ్యవస్థ ఎన్నికలకు సంబంధించిన వివాదం
3. భారత ప్రభుత్వానికి కేంద్రపాలిత ప్రాంతానికి మధ్య వివాదం
4. రెండు (లేదా) అంతకుమించిన రాష్ర్టాల మధ్య వివాదం
1) 1, 2 2) 3 3) 1, 4 4) 3, 4
16. న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష ఉండడానికి కారణం?
1) రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం
2) సమాఖ్య వ్యవస్థ సమతుల్యాన్ని
కాపాడటం కోసం
3) పౌరుల ప్రాథమిక హక్కులను
రక్షించడం కోసం 4) పైవన్నీ
17. దేశంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి
1. కొన్ని రాష్ర్టాల్లో పంచాయతీ న్యాయస్థానాలు పని చేస్తున్నాయి
2. భారత ప్రధాన న్యాయమూర్తితో
సహా సుప్రీంకోర్టులో 26 మంది
న్యాయమూర్తులు ఉంటారు
3. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ,
చండీగఢ్‌లో హైకోర్టులు ఉన్నాయి
4. భారత ప్రభుత్వం, జాతీయ జుడీషియల్ అకాడమీని ఏర్పాటు చేసింది
1) 1, 2, 3, 4 2) 3, 4
3) 1 4) 1, 2, 4
18. ఏ కేసు ఇప్పటి నుంచి చెల్లదనే సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు అవలంబించింది?
1) చంపకం దొరైరాజన్ vs మద్రాసు రాష్ట్రం
2) గోలక్‌నాథ్ vs పంజాబ్ రాష్ట్రం
3) కేశవానంద భారతి vs కేరళ
4) కేహల్సింగ్ vs భారత యూనియన్
19. సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వివరణల్లో సరికానిది?
1) దీన్ని 1950లో స్థాపించారు
2) ఇది దేశంలో అత్యున్నత అప్పీల్ గల న్యాయస్థానం
3) ఇది ఏదైనా కోర్టు (లేదా) ట్రిబ్యునల్స్ అలాగే కోర్టు నుంచి వాదనలు వినొచ్చు
4) కోర్టు మార్షల్ మినహాయించి ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్స్ నుంచి వాదనలు వినొచ్చు
20. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) వీరి జీతభత్యాల గురించి రెండో షెడ్యూల్లో పేర్కొన్నారు
2) ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో వారి
జీత భత్యాలు తగ్గించవచ్చు
3) వీరి జీత భత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తాడు
4) వీరి జీత భత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు
21. 1969లో సప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నవారు తాత్కాలిక భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. వారిని గుర్తించండి.
1) జస్టిస్ ఎస్ఎం సిక్రి
2) జస్టిస్ కే సుబ్బారావు
3) జస్టిస్ ఎం హిదయతుల్లా
4) జస్టిస్ పీఎన్ భగవతి
22. సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు-ఆర్టికల్ 130
2) ప్రత్యేక సెలవుతో కూడిన వివాదం – ఆర్టికల్ 136
3) తీర్పుల పునఃపరిశీలన – ఆర్టికల్ 137
4) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం
– ఆర్టికల్ 145
23. కింది స్టేట్మెంట్లు పరిశీలించండి
1. సుప్రీంకోర్టు అధికార పరిధి, రాజ్యాంగం ప్రసాదించిన పరిధికి పరిమితమై ఉంటుంది. కాబట్టి పార్లమెంటు, భారత సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తరించలేదు
2. సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారులను ఉద్యోగులను సంబంధిత కోర్టుల ప్రధాన న్యాయమూర్తులే నియమిస్తారు. పరిపాలనా వ్యయాలను భారత ఏకీకృత నిధి నుంచి చెల్లిస్తారు
1) 1 2) 2 3) 1, 2
4) పైవేవీ కావు
24. కింది ఏ అంశంలో సంస్కరణలు చేపట్టాలని జస్టిస్ మలిమత్ కమిటీ సూచించింది?
1) క్రిమినల్ న్యాయ విధానం
2) సివిల్ న్యాయ విధానం
3) న్యాయమూర్తుల సేవా విధానం
4) పాలనా చట్టం
25. ఇండియాకు సంబంధించిన కింది వాక్యాలను గమనించండి
1. ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల అధికారులు ఒకే అధికారాలు కలిగి
ఉన్నప్పటికి హోదాలో వ్యత్యాసం ఉంటుంది.
2. సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా ప్రధాన ఎన్నికల అధికారి వేతనం ఉంటుంది
3. సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుంచి
తొలగించిన తరహాలో ప్రధాన ఎన్నికల
అధికారిని పదవి నుంచి తొలగించరు
4. ప్రధాన ఎన్నికల అధికారి పదవి చేపట్టిన సమయం నుంచి ఆరేళ్లు కాని లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పదవిలో ఉంటారు
1) 1, 2 2) 2, 3
3) 1, 4 4) 2, 4
26. జాతీయ న్యాయ కమిషన్ ఏర్పాటుకు ముఖ్య వాదనాంశాలు ఏవి?
1) పై స్థాయిలో న్యాయమూర్తుల నియామకంలో స్వార్థం లేకుండా స్పష్టత ఉండాలి
2) హైకోర్టు న్యాయమూర్తుల కార్యకలాపాలను పరిశీలించడానికి
3) న్యాయమూర్తుల శిక్షణ
4) న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం
27. రాష్ట్ర గవర్నర్చే నియమించబడనివారు?
1) హైకోర్టు న్యాయమూర్తి
2) అడ్వకేట్ జనరల్
3) ముఖ్యమంత్రి
4) చైర్పర్సన్ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్)
28. సుప్రీంకోర్టు సలహా పరిధికి సంబంధించి కింది వాటిలో సరైంది?
1. రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఏ అంశంపైనైనా సలహా పంపితే తప్పనిసరిగా తమ
అభిప్రాయాన్ని తెలియజేయాలి
2. సుప్రీంకోర్టుకు పంపిన సలహా
అంశంపై కోర్టు చర్చించి సలహా ఇస్తుంది
3. సుప్రీంకోర్టు సలహా పరిధిలోని అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు
4. సుప్రీంకోర్టు సలహాకు ఒక్కసారి
ఒక అంశం కంటే ఎక్కువ పంపొద్దు
1) 1, 2 2) 1, 3
3) 2, 3 4) 2, 4
29. సుప్రీంకోర్టు, హైకోర్టులకు సంబంధించి కింది వాటిలో సరైంది?
1. హైకోర్టులకు ప్రాథమిక హక్కులను
పరిరక్షించే అధికార పరిధి లేదు
2. అన్ని రకాల అంతర్రాష్ట్ర వివాదాల
పరిష్కారానికి సుప్రీంకోర్టు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది
3. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అధికార పరిధి, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు పరిధి కంటే విశాలమైంది
4. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అధికార పరిధి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుల పరిధి కంటే విశాలమైంది
1) 1, 2 2) 2, 3
3) 3 4) 4
30. సుప్రీంకోర్టు ఏ అధికారంలో అంతర్భాగంగా తాను ఇచ్చిన తీర్పులు భవిష్యత్ తీర్పులకు సలహాగా, మార్గదర్శిగా ఉంటాయి?
1) ప్రారంభ విచారణాధికారం
2) కోర్ట్ ఆఫ్ రికార్డ్
3) న్యాయ సలహా అధికారం
4) న్యాయ సమీక్ష
31. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కింది సందర్భాల్లో సలహా ఇస్తుంది?
1) తనంతట తానుగా
2) రాష్ట్రపతి సలహా కోరినప్పుడు
3) పౌరులకు ప్రాథమిక హక్కులకు
సంబంధించి
4) దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగినప్పుడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు