శరీరానికి ఆకారం.. దేహానికి పటుత్వం
- కండర, అస్థిపంజర వ్యవస్థ
అస్థిపంజర వ్యవస్థ ఎముకలు, మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. అస్థిపంజర వ్యవస్థ దేహభాగాలకు ఆధారాన్ని, అంతరాంగాలకు రక్షణను, కండరాలు అంటి ఉండటానికి ఆధారాన్నిస్తుంది. ప్రౌఢ మానవుడి అస్థిపంజర వ్యవస్థలో 206 ఎముకలుంటాయి. (పిల్లల్లో 300) జీవుల్లో అస్థిపంజరం బాహ్యాస్థిపంజరం, అంతరాస్థిపంజరం అనే రెండు రకాలుగా ఉంటుంది. అంతరాస్థి పంజరంలో అక్షాస్థిపంజరం (80 ఎముకలు), అనుబంధాస్థిపంజరం (126 ఎముకలు) అనే రెండు విభాగాలుంటాయి. అక్షాస్థిపంజరంలో పుర్రె, వెన్నెముక, ఉరోస్థి, పర్శుకలు ఉంటాయి. అనుబంధాస్థిపంజరంలో గమనాంగాల ఎముకలు (కాళ్లు, చేతులు), మేఖలలు (కాళ్లు, చేతులకు ఆధారాన్నిచ్చేవి) ఉంటాయి.
అక్షాస్థిపంజరం
కపాలం-8 ; ముఖం-14
కాంఠిక ఎముక-1 ; చెవి-6
వెన్నెముక-26 ; ఉరోస్థి (రొమ్ము భాగం)-1
పర్శుకలు (పక్కటెముకలు)-24
(12 జతలు)
అనుబంధాస్థిపంజరం పూర్వాంగాలు
(చేతులు)-60 (30X2)
జత్రుక-2
అంసఫలకం-2
చరమాంగాలు (కాళ్లు)-60 (30X2)
తుంటి ఎముకలు-2
కీళ్లు- రకాలు
- రెండు ఎముకలను లేదా ఎముక మృదులాస్థిని సంధించే నిర్మాణం కీలు.
- నిర్మాణపరంగా కీళ్లను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి తంతుయుత కీళ్లు, మృదులాస్థి కీళ్లు, సైనోవియల్ కీళ్లు.
సైనోవియల్ కీళ్లు ఆరు రకాలు
l బంతిగిన్నె కీలు- తుంటి కీలు, భుజం కీలు
l మడతబందు కీలు- మోచేయి కీలు, మోకాలి కీలు
l బొంగరపు కీలు- మెడ (శీర్షదరం అక్ష కశేరుకం మధ్య కీలు)
l జారెడు కీలు- అంతర మణిబంధ కీళ్లు, చీల మండల కీళ్లు
l కాండైలాయిడ్ కీలు- మణిబంధం, కరబాస్థి మధ్య ఉండే కీలు, శీర్షదరం, అనుకపాలాస్థి మధ్య ఉండే కీలు
l శాడిల్ కీలు- బొటనవేలులోని కరబాస్థి, మణిబంధం మధ్య ఉండే కీలు
l ఎముకను ఎముకతో కలిపే పట్టీలాంటి నిర్మాణాన్ని లిగమెంట్/సంధి బంధనాలు అంటారు. ఎముకను కండరంతో కలిపే పట్టీని అంటారు.
కండర వ్యవస్థ
l కండరాల గురించిన అధ్యయనాన్ని మయాలజీ/సార్కాలజీ అని దేహ కదలికల అధ్యయనాన్ని కైనెసియాలజీ అంటారు.
l కండరాలు సంకోచ, సడలికలను జరిపి ఎముకలను కదల్చడానికి తోడ్పడతాయి.
l మానవ దేహంలో సుమారు 640 కండరాలు ఉంటాయి.
l గ్లుటియస్ మాక్సిమస్ (పిరుదు కండరం)ను అతిపెద్ద కండరం అని, స్టెపీడియస్ (చెవిలో ఉంటుంది)ను అతిచిన్న కండరం అని, సార్టోరియస్ (తొడ కండరం)ను అతిపొడవైన కండరం అని, మాసెటర్ (దవడ కండరం)ను అతి బలమైన కండరం అని అంటారు.
l కండరాల్లో మయోగ్లోబిన్ అనే వర్ణకం ఉంటుంది.
l కండరాలకు వచ్చే క్యాన్సర్ను సార్కోమా అంటారు.
l కండరాల సంకోచ సడలికలను గురించి వివరించే సిద్ధాంతం జారుడు తంతువుల సిద్ధాంతం (ైస్లెడింగ్ ఫిలమెంట్ తియరీ). దీన్ని ప్రతిపాదించినది జేన్ హన్సన్, హ్యూగ్ హక్సలె.
l కాల్షియం అయాన్లు కండర సంకోచానికి తోడ్పడతాయి.
l కండరం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం అని సార్కోమియర్/కండర ఖండితంను అంటారు.
l కండరాలు మూడు రకాలు అవి…
1. అస్థి కండరాలు/చాలక కండరాలు/నియంత్రిత కండరాలు
2. నునుపు/అరేఖిత/అనియంత్రిత కండరాలు
3. హృదయ కండరాలు
ముక్కు
l బాహ్యంగా కనిపించే ముక్కు రెండు నాసికా రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇవి నాసికా కుహరంలోకి తెరుచుకుంటాయి.
l నాసికా కుహరాన్ని నాసికా విభాజకం రెండుగా విభజిస్తుంది.
l నాసికా కుహరంలో ఉండే శ్లేస్మస్తరం, చిన్న వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, సూక్ష్మజీవులు, అవసరం లేని ఇతర పదార్థాలు పోకుండా కాపాడుతాయి.
l నాసికా కుహరం శ్లేష్మస్తరంలో ఘ్రాణ గ్రాహకాలు ఉంటాయి.
l బాహ్య ప్రపంచంలో ప్రత్యక్ష సంబంధం గల నాడీ కణాలు ముక్కులో ఉంటాయి.
l జంతువుల్లో పోలిస్తే మానవులకు ఘ్రాణశక్తి తక్కువ ఉంటుంది.
l శాస్త్రవేత్తలు ఇప్పటివరకు సుమారు 1500 రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు.
చెవి
- దీని గురించిన అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు. ఇది వినడంతోపాటు, శరీర సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
- చెవిలో మూడు భాగాలుంటాయి. అవి.. వెలుపలి చెవి, మధ్య చెవి, అంతర/లోపలి చెవి. వెలుపలి చెవిని పిన్నా అని కూడా అంటారు. ఇది మైనాన్ని స్రవించే సెరుమిసస్ గ్రంథుల్ని, తైలాన్ని స్రవించే తైల గ్రంథుల్ని కలిగి ఉంటుంది.
- మధ్య చెవిలో మూడు ఎముకల గొలుసు ఉంటుంది. అవి వరుసగా కూటకం( సుత్తి-Malleus), దాగిలి (పట్టెడ-Incus), కర్ణాంతరాస్థి (అంకవన్నె-Stapes).
- లోపలి చెవిలో త్వచాగహనంను ఆవరించి అస్థిగహనం ఉంటుంది. త్వచాగహనంలో పేటిక, అర్ధవర్తుల కుల్యలు, కర్ణావర్తం అనే భాగాలు ఉంటాయి.
- మానవుడి చెవి 16-40000 హెర్ట్ల వినగలిగే పౌనఃపున్య సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- చెవి శబ్ద ప్రకంపనాలను నాడీ ప్రేరణలుగా మార్చి మెదడుకు అందిస్తుంది.
- చెవి సమతాస్థితిని కాపాడుతుంది.
జీవ పరిణామం (Evolution)
l జీవ ఆవిర్భావం, కాలానుగుణంగా జీవుల్లో కలిగే వైవిధ్యాన్ని తెలిపేదే జీవ పరిణామం. Evolution అనే పదాన్ని హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించాడు. పరిణామం అంటే వికసించడం లేదా విచ్చుకోవడం అని అర్థం.
జీవుల ఆవిర్భావం (Origin of Life)
l జీవుల ఆవిర్భావం గురించి వివిధ రకాల జీవ పరిణామ శాస్త్రవేత్తలు వివిధ రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు.
ప్రత్యేక సృష్టి సిద్ధాంతం: సిద్ధాంత కర్త ఫాదర్ సారజ్. దైవశక్తి వల్ల జీవుల ఆవిర్భావం జరిగింది.
కాస్మోజాయిక్ సిద్ధాంతం/పాన్ స్పెర్మియా: సిద్ధాంత కర్త రిచ్టర్. జీవం నిరోధక శక్తి గల కాస్మోజువా/పాన్ స్పెర్మియా రూపంలో విశ్వంలో ఉండి అనుకోకుండా భూమిని చేరింది.
యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం: సిద్ధాంత కర్తలు అరిస్టాటిల్, థేల్స్, ప్లేటో, వాన్హెల్మెట్. జీవం నిర్జీవ పదార్థాల నుంచి ఏర్పడింది.
ప్రళయతత్వ సిద్ధాంతం/ప్రళయానంతర పునఃసృష్టి వాదం: సిద్ధాంత కర్త జార్జి క్యువియర్. ఆవర్తన ప్రళయాలు జీవులను నశింపజేశాయని, తిరిగి సృష్టించబడ్డాయని తెలుపుతుంది.
జీవ జనన సిద్ధాంతం/బయోజెనిసిస్ సిద్ధాంతం: సిద్ధాంత కర్త లూయీ పాశ్చర్. జీవులు అంతకుముందు ఉన్న జీవుల నుంచి ఏర్పడ్డాయి.
జీవ పరిణామ/కోసర్వేట్ సిద్ధాంతం: సిద్ధాంత కర్త ఏఐ ఒపారిన్, జేబీఎస్ హాల్డేన్. ప్రాథమిక జీవులు భౌతిక శక్తుల వల్ల అకర్బన పదార్థాల నుంచి రసాయన పరిణామం ద్వారా ఆవిర్భవించి జీవ పరిణామం చెందాయి.
జీవ పరిణామ సిద్ధాంతాలు
- జీవ పరిణామాన్ని వివరించడానికి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి.
- లామార్కిజం
- సిద్ధాంత కర్త- జీన్ బాప్టిస్ట్ లామార్క్.
- ఈ సిద్ధాంతం ప్రకారం జీవులపై పరిసరాల ప్రభావం ఉంటుంది.
- ఈ సిద్ధాంతం ప్రకారం ఉపయోగకరమైన అవయవాలు దినదినాభివృద్ధి చెంది, ఉపయోగం లేని అవయవాలు క్రమేపి క్షీణిస్తుంటాయి. ఈ లక్షణాలు అనువంశికంగా తర్వాతి తరాలకు సంక్రమించడాన్ని ఆర్జిత గుణాల అనువంశికత అంటారు.
ఉదా: జిరాఫీ మెడ (పూర్వాంగాలు సాగడం ఉపయుక్తం) పాములో అంగాలు లోపించడం (నిరుపయుక్తం)
డార్వినిజం
l సిద్ధాంత కర్త చార్లెస్ రాబర్ట్ డార్విన్.
l ఈ సిద్ధాంతాన్ని ప్రకృతి వరణ సిద్ధాంతం అని కూడా అంటారు.
l డార్విన్ హెచ్ఎంఎస్ బీగిల్ అనే నావలో ప్రయాణించి అనేక ఖండాలు, ద్వీపాలు జీవజాలాన్ని అధ్యయనం చేసి తర్వాత ప్రకృతివరణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
l ఈ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు జనాభా అధికోత్పత్తి, జనాభాలో స్థిరత్వం, మనుగడ కోసం పోరాటం, విశ్వవ్యాప్త వైవిధ్యాలు, ప్రకృతివరణం, నూతన జాతుల ఉత్పత్తి.
l డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతాన్ని పెప్పర్డ్ మాత్( బిస్టన్ బెట్యులేరియా) అనే కీటకంపై చేసిన పారిశ్రామిక శామలత్వం ఆధారంగా వివరించాడు.
ఉత్పరివర్తన సిద్ధాంతం
l సిద్ధాంత కర్త హ్యూగో డివ్రీస్.
l జీవుల్లో హఠాత్తుగా, యాదృచ్ఛికంగా జరిగే మార్పులను ఉత్పరివర్తనాలు అంటారు.
l డీవ్రిస్ ఈనోథీరా లామార్కియానా మొక్కల్లో T.H మోర్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ కీటకాల్లో ఉత్పరివర్తనాలను అధ్యయనం చేశారు.
ఆధునిక జీవపరిణామ సంశ్లేషణ సిద్ధాంతం
(నియో డార్వినిజం)
l సిద్ధాంతకర్తలు ఆర్ఏ ఫిషర్, సేవాల్రైట్, ఎర్నెస్ట్ మేయర్.
l ఈ సిద్ధాంతం ప్రకారం 5 ప్రాథమిక కారకాలు జీవ పరిణామంలో పాల్గొంటాయి. అవి..
1. జన్యు ఉత్పరివర్తనాలు
2. క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు
3. జన్యు పునఃసంయోజనాలు
4. ప్రకృతివరణం
5. ప్రత్యుత్పత్తి వివక్తత
జీవ పరిణామ ఇతర అంశాలు
l సుమారు 4.5 నుంచి 5 మిలియన్ సంవత్సరాల పూర్వం భూమి ఏర్పడింది. అప్పటి భూమి ఉష్ణోగ్రత 50000C నుంచి 60000C వరకు ఉండేది.
l మొట్టమొదట ఏర్పడిన జీవి- సయనో బ్యాక్టీరియా (నీలి ఆకుపచ్చ శైవలం)
l మొట్టమొదట ఏర్పడిన కేంద్రకామ్లం
– అడినిన్
l ఆవిర్భావం, మూల నిర్మాణంలో సామ్యముండి వేర్వేరు విధులను నిర్వహించే అవయవాలను నిర్మాణసామ్య అవయవాలు అంటారు.
ఉదా: గబ్బిలం రెక్కలు
గుర్రం పూర్వాంగం
మనిషి చేతులు
తిమింగలం తెడ్డు
- ఆవిర్భావం, మూల నిర్మాణంలో తేడాలున్నప్పటికీ క్రియల్లో సామ్యముండే అవయవాలను క్రియాసామ్య అవయవాలు అంటారు.
ఉదా: పక్షి రెక్క, కీటకం రెక్క - అభివృద్ధి చెందిన దశలో అవశేషావయవాలు ఆకస్మికంగా ఏర్పడే విధానాన్ని అటావిజం అంటారు. ఈ అవయవాలను అటావిస్టిక్ అవయవాలు అంటారు.
ఉదా: శిశువు తోకను కలిగి ఉండటం
- Tags
- evolution
- human body
- nipuna
- shape
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు