Pivot education for school education | పాఠశాల విద్యకు ఇరుసు విద్యాపాలన
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టబోయే వారికి బోధనాభ్యసన ప్రక్రియలోని పాఠ్యాంశాలు ఎంత ముఖ్యమో.. బోధనాభ్యసన ప్రక్రియకు సహకరించే, పాఠశాలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. పాఠశాల పరిపాలన, నిర్వహణ లాంటి అంశాలను తెలుసుకోవడం ద్వారా విద్యాపాలనలో నిరంతరం జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పాఠశాల కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించవచ్చు.
పరిపాలన
-సామాన్య లక్ష్యసాధనకు ఒక వ్యవస్థలోని వ్యక్తుల కృషిని సమన్వయపర్చి, నియంత్రించి, నాయకత్వం వహించడమే పరిపాలన
-లక్ష్య సాధనకు అవసరమైన కార్యక్రమాలను చేయించడం.
-లక్ష్య సాధన నిర్వహణలో మానవ సంబంధాలను అవగాహన చేసుకుని, ఫలితాలను ఊహించి వాటిని ప్రభావితం చేసే శాస్త్రీయ జ్ఞానం.
విద్యాపాలన
-విద్యాపాలన అనేది విద్యార్థుల అభివృద్ధికి తగిన మానవ, భౌతిక వనరులను సమన్వయపర్చి సత్ఫలితాలు సాధించే వ్యవస్థ.
-ఇది ad, ministrative అనే రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది.
-ఆడ్ మినిస్ట్రార్… అంటే ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించే సేవ.
-పాలన అంటే వ్యాపారాన్ని, వ్యవహారాన్ని, ప్రభుత్వ, ప్రజాపరమైన విషయాలను నిర్వహించడం – ఆక్స్ఫర్డ్ డిక్షనరీ.
-నిర్ణీతమైన విధానాలను ఆధారం చేసుకుని విద్యావ్యవస్థాపనలో వినియోగించే మెళకువలు, పద్ధతులే విద్యాపాలన – కార్టర్.వి.గుడ్ – డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్.
విద్యాపాలన ఉద్దేశాలు
-తగిన విధానాలను, కార్యక్రమాలను రచించడం ద్వారా బోధనాభ్యసనకు అనువైన పరిస్థితులను కల్పించడం, తద్వారా మానవుడి వికాసం అభివృద్ధికి తోడ్పడటం.
-మానవుల్లో మంచి లక్షణాలను అభివృద్ధి చేయడానికి దోహదపడే వనరులను ఉపయోగించడం.
-విద్యావ్యవస్థల కార్యక్రమాలను, విధులను పాటించడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించడం.
పాఠశాల నిర్వహణ
-మనం ఏం చేయాలనుకుంటున్నామో ముందుగా తెలుసుకుని, అందుకు తగినట్లుగా ఆ పనిని పొదుపుగా చక్కగా చేసేటట్లు చూడగలిగేదే నిర్వహణ – ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ (1911)
-ముందుగా నిర్ణయించిన గమ్యాలను నెరవేర్చే ఉద్దేశంతో మానవకృత్యాల పట్ల నిర్ణయాలను, నియంత్రణను కొనసాగించే ప్రక్రియే నిర్వహణ – స్టాన్లీ వాన్స్ (1959)
-ఇతర వ్యక్తుల ప్రయత్నాల ద్వారా ఫలితాలను పొందగలిగే నిర్వహణ – లారెన్స్ ఎ ఎప్లి
నిర్వహణ
-ఉత్పాదన/సమర్థ ఆధారం ఆధారంగా నిర్వచించినవారు – ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్
-నిర్ణయాధార నిర్వచనం ఇచ్చిన వారు – పీటర్ ఎఫ్. డ్రకర్, స్టాన్లీ వాన్సు
-మానవ సంబంధ ఆధార నిర్వచనం ఇచ్చిన వారు – లారెన్స్ ఎ ఎప్లి, కూనట్టు
-విధుల ఆధారంగా నిర్వచనం – ప్రణాళిక రచన, వ్యవస్థీకరణ, సిబ్బంది నియామకం, నిర్దేశించడం, నియంత్రించడం లాంటి మానవ ప్రయత్నాల ద్వారా ఒక వ్యవస్థ వాటి లక్ష్యాల సాధన కోసం చేసే ప్రక్రియే నిర్వహణ.
నిర్వహణ – ఒక శాస్త్రం
-వ్యక్తుల సమూహం.. ఒక వ్యవస్థలోని అనేక మంది వ్యక్తులు, వివిధ స్థాయిల్లో వారికి కేటాయించిన పనులను వ్యవస్థ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా చేస్తూ ఉంటారు.
నిర్వహణ – ఒక ప్రక్రియ
-ఒక వ్యవస్థ తన ఆశయ సాధనకు వివిధ రకాల వ్యక్తుల కృత్యాలను, వనరులను ఎన్నుకున్న లక్ష్యాలకు తగ్గట్లు ఒక క్రమ పద్ధతిలో కొన్ని సూత్రాలకు, నియమాలకు లోబడి నిరంతరాయంగా, సరళంగా ఉత్సాహంగా పనిచేసేటట్లు చూసేది నిర్వహణ.
-విద్యాపాలన-విద్యానిర్వహణ ఒకే నాణేనికి ఉండే బొమ్మ, బొరుసులాంటివి.
-ప్రముఖ శాస్త్రవేత్త హెన్రీఫాయల్ ప్రకారం – నిర్వహణ ఒక మానసిక ప్రక్రియ.
-షెల్డన్ ప్రకారం.. పాలనకు, నిర్వహణకు మధ్య ఏ రకమైన సంబంధం లేదు. పాలన- విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది. నిర్వహణ- అమలుపర్చేది. పాలన – ఒక ఆలోచనా క్రమం. నిర్వహణ – పనిచేసే పద్ధతి.
విద్యానిర్వహణ సూత్రాలు
-బాధ్యతలను పంచుకునే సూత్రం
-ఏ కార్యక్రమాన్నైనా సరే సమష్టిగా నడపడం.
-అధికారాన్ని విభజించుకోవడం, పనిని సమానంగా పంచుకోవడం.
స్వేచ్ఛాసూత్రం
-ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ వెన్నెముక లాంటిది.
-స్వేచ్ఛతోనే సంస్థలోని వ్యక్తులు వారి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగలరు.
-విమర్శనాత్మక శక్తి, వివేచనలు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.
-స్వేచ్ఛ (విమర్శనాత్మక శక్తి, వివేచనలు)- సంస్థాగత ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడటానికి దోహదపడుతుంది.
ఉదా: విద్యాసంస్థలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ప్రధానోపాధ్యాయులు ముందుగా బోధన, బోధనేతర సిబ్బందిని, విద్యార్థులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా ప్రజాస్వామ్య వాతావరణం నెలకొంటుంది.
న్యాయ సూత్రం
-ప్రజాస్వామ్యంలో జాతి, మత, కుల, లింగ విచక్షణ లేకుండా చట్టం ముందు అందరూ సమానులే.
-ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల అభివృద్ధి కోసం, పాఠశాల సిబ్బంది సంక్షేమం కోసం పని చేయడం.
-పనిని బట్టి, స్థాయిని బట్టి వ్యక్తుల హెచ్చు తగ్గులను ప్రవేశపెట్టకపోవడం.
విద్యానిర్వహణ-రకాలు
-అధికారం ఉన్న స్థానాన్నిబట్టి లేదా కేంద్రాన్ని బట్టి…
i. కేంద్రీయ విద్యానిర్వహణ
ii. వికేంద్రీకరణ విద్యానిర్వహణ
-అధికారం ఎవరి చేతిలో ఉందో దాన్నిబట్టి రెండో వర్గీకరణ ఉంటుంది. అవి..
i. అధికారయుత విద్యానిర్వహణ
ii. ప్రజాస్వామ్య విద్యానిర్వహణ
కేంద్రీకృత/కేంద్రీయ విద్యానిర్వహణ
-ఇది బ్రిటిష్‌కాలంలో కొనసాగిన పద్ధతి. ఇస్లామిక్ విద్యావిధానంలో, రాజుల పాలనలో కొనసాగిన పద్ధతి.
-విద్యావిధానాలు, విద్యాప్రణాళికలు, విద్యా కార్యక్రమాల నిర్ణయం, వాటి అమలు కేంద్రస్థాయి నుంచి కింది స్థాయిలోని విద్యాసంస్థలకు జారీ అవుతుంది.
-విద్యాసంబంధిత అధికారం మొత్తం కేంద్రస్థాయిలోని ప్రభుత్వాల చేతిలో ఉంటుంది.
-దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానం అమలుకు వీలు కలిగిస్తుంది.
-ఇది జాతీయ సమైక్యతకు, సమగ్రతకు దోహదపడుతుంది.
-విద్యావిధానాలను, ప్రణాళికలను రచించేటప్పుడు దేశ విద్యావసరాలను దృష్టిలో పెట్టుకుని చేస్తారు.
-నిధుల కొరతను సులభంగా అధిగమించవచ్చు.
-ప్రజలకు ఉపయోగపడే విద్యాపథకాలను, ప్రయోగాలను చేపట్టడానికి.. వాటి అమలుకు వీలు పడుతుంది.
-విద్యాపాలకుల మధ్య సమన్వయం సులభమవుతుంది.
కేంద్రీకృత విద్యానిర్వహణ – నష్టాలు
-స్థానిక అవసరాలకు తగినట్టుగా విద్యావిధానం ఉండకపోవచ్చు.
-అమలు తీరులో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలుంటాయి.
-పై స్థాయి అధికారులపై పనిభారం ఎక్కువగా ఉంటుంది.
-ఇది మనోవైజ్ఞానికపరంగా మంచి నిర్వహణ పద్ధతి కాదు.
వికేంద్రీకరణ విద్యా నిర్వహణ
-ప్రస్తుతం అమెరికా, భారత్‌లాంటి ప్రజాస్వామ్యదేశాలు ఈ పద్ధతిలో విద్యా నిర్వహణను కొనసాగిస్తున్నాయి.
-ఈ పద్ధతిలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవడానికి వీలుంటుంది.
-పూర్తిగా ప్రజాస్వామ్య స్వభావంతో కూడి ఉంటుంది.
-విద్యను ప్రజాస్వామ్యీకరిస్తాకి ప్రయత్నం చేస్తుంది.
-విద్యావిధానం, ప్రణాళిక అమలులో స్థానిక అవసరాలకు తగ్గట్లు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తుంది.
-విద్యా నిర్వహణ సరళ స్వభావాన్ని కలిగి, గతిశీలంగా ఉంటుంది.
వికేంద్రీకరణ విద్యానిర్వహణ – నష్టాలు
-నిర్ణయాల్లో అందరిపాత్ర ఎక్కువైనప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాదు.
-అన్ని విభాగాలు ఒకేతీరుగా పనిచేయకపోవచ్చు.
-క్షేత్రస్థాయిలో సరైన సామర్థ్యాలులేని వ్యక్తులు, సరైన వనరులు లేనప్పుడు విద్యానిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుంది.
అధికారయుత విద్యానిర్వహణ
-దీన్ని నిరంకుశ, కేంద్రీకృత, ఏకస్వామ్య /ఏకపక్ష విధానం అంటారు.
-అధికారి నిరంకుశంగా, అధికారయుతంగా ఉంటాడు.
-విద్యానిర్వహణలో తోటి సిబ్బందిని సంప్రదించకుండానే నిర్ణయాలు చేస్తారు.
-అధికారి తన సొంత అభిప్రాయాలను సహ ఉద్యోగులపై రుద్దుతాడు.
-విద్యానిర్వహణలో ఇంగితజ్ఞానంతోగాని, సామాజిక చింతనతోగాని వ్యవహరించడు.
-ఇందులో విశేష అధికారాలు ఒక వ్యక్తికిగాని, కొద్దిమంది వ్యక్తుల సమూహానికిగాని ఉంటాయి.
-పాఠశాల ప్రణాళిక నిర్మాణం, కమిటీల ఏర్పాటు ప్రధానోపాధ్యాయుడు లేక ప్రిన్సిపాల్ చేస్తారు.
-ప్రణాళిక ప్రకారం పనిచేయడానికి ఉపాధ్యాయులను నిర్దేశిస్తాడు.
-పాఠశాల విజయాలకు అతడే ఘనత పొందుతాడు.
-ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గుర్తింపు ఉండదు.
-పాఠశాలయందలి బోధనావిషయ సమావేశాలను ప్రధానోపాధ్యాయుడే నిర్ణయిస్తాడు.
-విద్యాలక్ష్యాలు విద్యార్థులందరికీ ఒకేరకంగా ఉంటాయి.
-ఈ పద్ధతిలో పాఠశాల వాతావరణం విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది.
అధికారయుత విద్యానిర్వహణ – ప్రత్యేక లక్షణాలు
రాజ్యస్వామ్యం
-అన్ని విద్యాసంస్థలు కేంద్ర అజమాయిషీ కిందే నడుస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?