బీసీ విద్యార్థులకు ‘హార్వర్డ్’ శిక్షణ
– విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలపై ట్రైనింగ్
– ప్రతిభ ఆధారంగా తొలుత 100 మందికి చాన్స్
-2023 జనవరి నుంచి ఓయూలో తరగతులు
బీసీ గురుకులాల్లో చదువుకొంటున్న విద్యార్థులకు విదేశీ విద్యపై ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. అత్యుత్తమ అంతర్జాతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలను పొందేందుకు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించనున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), హార్వర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హార్వర్డ్ వర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో, ఓయూ ప్రొఫెసర్ మల్లేశం శనివారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ప్రత్యేకంగా కలిశారు. బీసీ విద్యార్థులకు వచ్చే ఏడాది జనవరి నుంచి ఓయూ ఆవరణలో హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతిభ ఆధారంగా తొలుత 100 మంది బీసీ విద్యార్థులను గుర్తించి 10 రోజులపాటు తరగతులు నిర్వహిస్తామని, ఉన్నత విద్య కోసం హార్వర్డ్ యూనివర్సిటీలో చేరేందుకు ఆ తరగతులు ఎంతో ఉపకరిస్తాయని వివరించారు. దీనిపై బుర్రా వెంకటేశం స్పందిస్తూ.. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తున్నదని గుర్తుచేశారు. బీసీ విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహించేందుకు ఓయూతో కలిసి హార్వర్డ్ వర్సిటీ ముందుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ శిక్షణ ద్వారా బీసీ విద్యార్థులు హార్వర్డ్ లాంటి ప్రముఖ వర్సిటీల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. అనంతరం తాను రచించిన ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకాన్ని డొమినిక్ మావోకు బహూకరించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు