ఇండియన్ రైల్వేలో ఇంజినీర్ పోస్టులు
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్లే కన్స్ట్రక్షన్ కంపెనీ (ఇర్కాన్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇర్కాన్ సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 18 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీరింగ్ విభాగంలో 74 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ఛత్తీస్‌గఢ్, జర్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, బీహార్, సిక్కిం, మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 74
ఇందులో సివిల్ వర్క్స్ ఇంజినీర్ 60, ఎస్ అండ్ టీ వర్క్స్ ఇంజినీర్ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీటెక్‌లో సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ క్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. 30 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
వెబ్సైట్: www.ircon.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
పుష్పపై కాపీ ఆరోపణలు..!
రాహుల్ ద్రవిడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తున్న జాన్వీ కపూర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు