నేషనల్ టాలెంట్ హంట్2022
- బీఈ/బీటెక్ ఫ్రెషర్స్‌కు అవకాశం
- ఎంపికయితే ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగం
కొన్నేండ్లుగా సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ ట్రెండ్ మారుతుంది. దేశంలో ఏ ప్రాంతంలోని వారైనా, ఏ కాలేజీలో చదువుకున్నా ప్రతిభ ఉంటే చాలు ఉద్యోగాన్నిస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. దీనికోసం ఆయా కంపెనీలు జాతీయస్థాయిలో పరీక్షలను నిర్వహించుకుంటున్నాయి. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిస్తే చాలు ఉద్యోగం మీ సొంతం. అలాంటి జాతీయస్థాయి పరీక్షకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా..
ఎలైట్ ఎన్‌టీహెచ్-2022
ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్-2022ను విప్రో దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. బీఈ/బీటెక్ ఫ్రెషర్స్ కోసం ఈ ప్రతిభాన్వేషణ పరీక్షను విప్రో నిర్వహిస్తుంది.
ఎన్టీహెచ్లో ప్రతిభ చూపించిన వారికి ప్రాజెక్ట్ ఇంజినీర్ హోదాతో విప్రో ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది.
వార్షిక వేతనం కింద రూ.3.5 లక్షలు ఇస్తారు. ఎంపికయిన వారు తప్పనిసరిగా ఏడాది పనిచేయాలి. దీనికోసం రూ.75 వేల అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాలి.
ఎవరు రాయవచ్చు?
పదోతరగతి, ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు బీఈ/బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు పూర్తిచేసుకోబోతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్‌లో అన్ని బ్రాంచీల వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదివిన వారు మాత్రం అర్హులు కారు.
నోట్: గత ఆరు నెలల్లోపు విప్రో సెలక్షన్ ప్రాసెస్‌లో పాల్గొన్నవారికి అవకాశం లేదు.
ఎంపిక విధానం?
రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అసెస్మెంట్, బిజినెస్ డిస్కషన్- ఎల్ఓఐ- ఆఫర్ లెటర్ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ అసెస్మెంట్
ఈ పరీక్షను 128 నిమిషాల్లో నిర్వహిస్తారు. దీనిలో మూడు సెక్షన్లు ఉంటాయి.
ఆప్టిట్యూడ్ టెస్ట్- లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ (వెర్బల్) ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 48 నిమిషాలు.
రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్- ఎస్సే రైటింగ్ ఉంటుంది. దీనికి 20 నిమిషాలు.
ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్- కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్‌లు రాయాలి. దీనికోసం జావా, సీ, సీ++, పైథాన్ వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జనవరి 31
వెబ్సైట్: https://careers.wipro.com/elite
.-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు