సాఫ్ట్ డ్రింక్ కాదు తమ్ముడు.. తుఫాను అంటూ చెలరేగిపోయిన విజయ్ దేవరకొండ
మీరు హాలీవుడ్ సినిమాలు చూస్తారా? ఆ సినిమాల్లో ఫైట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. హాలీవుడ్ రేంజ్ ఫైట్సే వేరు. అదే ఫైట్‌ను మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా.. రౌడీ హీరో కట్ ఔట్ చూస్తేనే హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది.. ఇక హాలీవుడ్ రేంజ్ ఫైట్ అంటే సాఫ్ట్‌గా ఉండదు కదా. ఫైట్ జరిగాక అక్కడ తుఫాన్ వచ్చి పోయినట్టుగా ఉంటుంది. విజయ్ దేవరకొండ కూడా తుఫాన్ లాంటి ఫైట్ చేశాడు. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. ఇంతకీ దేని కోసం అంటారా?
విజయ్ దేవరకొండ థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. దాని కోసమే విజయ్ తుఫాన్‌ను సృష్టించాడు. సాఫ్ట్ డ్రింక్‌గా పేరున్న థమ్స్ అప్ను తుఫాన్‌గా మార్చాడు. థమ్స్ అప్ సాఫ్ట్ డ్రింక్ కాదు తుఫాన్ అని చెప్పేందుకు ఓ యాడ్‌ను చేశారు. షిప్లో విజయ్‌ని కట్టేసి అతడికి కాపలాగా కొందరు ఉంటారు. వాళ్లకు చితకబాది షిప్ మీదకు వచ్చేస్తాడు విజయ్.
దాన్ని థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూస్తుండగా సాఫ్ట్ డ్రింక్ అంటూ థమ్స్ అప్ అమ్మే వ్యక్తి థియేటర్లోకి వస్తాడు. విజయ్‌ని చూసి షాక్ అవుతాడు. సాఫ్ట్ డ్రింక్ అనే పేరు విని.. తుఫాను లాంటి తన ఫైట్‌ను చూపిస్తాడు. ఆ తర్వాత థమ్స్ అప్ మొత్తం తాగేసి.. సాఫ్ట్ డ్రింక్ కాదు తమ్ముడు.. తుఫాన్ (Soft Drink Kaadu, idi Toofan) అని అతడికి చెబుతాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?