టిస్ నెట్-2022
దేశంలో నేటికి గ్రామీణ ప్రాంతాలే అధికం. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి మార్గాన పయనిస్తుందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగాల్సినంత అభివృద్ధి జరుగలేదు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రొఫెషనల్స్ కొరత. ఎక్కడ ఏం అవసరం. ఏం చేస్తే ఆయా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. పక్కా మైక్రోప్లాన్ తయారుచేసి అమలు చేసే వ్యవస్థ లేకపోవడం. సరిగ్గా ఇలాంటి నిపుణులను తయారుచేయడానికే ఏర్పాటైన సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్). దీనిలో సీటు దొరికిందంటే చాలు.. ఉద్యోగానికి భరోసా. ఈ సంస్థలో ప్రతి కోర్సుకు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉండటమే కాకుండా నిత్యనూతనంగా ఉంటాయి. అంతర్జాతీయస్థాయి కరికులం, ఫీల్డ్‌వర్క్‌లతో నిజమైన ప్రొఫెషనల్స్‌ను తయారుచేస్తున్న సంస్థ టిస్. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టిస్ నెట్-2022 విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటి. సోషల్ సైన్సెస్‌లో అత్యంత పేరుగాంచిన సంస్థ. సోషల్‌వర్క్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్త్, రూరల్ డెవలప్మెంట్ ఇలా పలు ప్రత్యేక కోర్సులను అందిస్తుంది ఈ సంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందిస్తున్న సంస్థ టిస్. పరిశోధనలతో.. సమాజానికి ఉపయోగపడే పలు ప్రత్యేక కోర్సులను అందిస్తుంది. ఇక్కడ చదివిన విద్యార్థులకు 100 శాతం ప్లేస్‌మెంట్స్ వస్తుండటం మరో విశేషం.
క్యాంపస్‌లు
ముంబై, తుల్జాపూర్, హైదరాబాద్, గువాహటి.
పీజీ ప్రోగ్రామ్స్: ఎంఏ, ఎంఎస్, బీఈడీ-ఎంఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు.
ఎంఏ (ఎడ్యుకేషన్-ఎలిమెంటరీ), డెవలప్మెంట్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, ైక్లెమెట్ చేంజ్ సస్టెయినబుల్ స్టడీస్, రెగ్యులేటరీ గవర్నెన్స్, అర్బన్ పాలసీ గవర్నెన్స్, వాటర్ పాలసీ అండ్ గవర్నెన్స్, అప్లయిడ్ సైకాలజీ (క్లినికల్ అండ్ కౌన్సెలింగ్ ప్రాక్టీస్), గ్లోబలైజేషన్ అండ్ లేబర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, చేంజ్ అండ్ లీడర్షిప్, సోషల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్, మీడియా అండ్ కల్చర్ స్టడీస్, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్, డెవలప్మెంట్ పాలసీ, సోషల్ వర్క్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, సస్టయినబుల్ లైవ్లీహుడ్ అండ్ నేచురల్ రిసోర్సెస్ గవర్నెన్స్, సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రపెన్యూర్‌షిప్, సోషల్ వర్క్ (చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్/కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్, క్రిమినాలజీ అండ్ జస్టిస్/ దళిత్, ట్రైబల్ స్టడీస్ అండ్ యాక్షన్ తదితరాలు), డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, నేచురల్ రిసోర్స్ అండ్ గవర్నెన్స్, రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్, లేబర్ స్టడీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, సోషియాలజీ అండ్ సోషల్ ఆంత్రోపాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, ఎల్ఎల్ఎం, ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ, ల్రైబరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్.
హైదరాబాద్ క్యాంపస్‌లో.. ఎంఏ- ఎడ్యుకేషన్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, డెవలప్మెంట్ స్టడీస్, నేచురల్ రిసోర్స్ అండ్ గవర్నెన్స్, రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్, ఉమెన్ స్టడీస్ కోర్సులు ఉన్నాయి.
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ/పీజీ కోర్సు ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 2022, అక్టోబర్ 31లోగా సర్టిఫికెట్లను దాఖలు చేయాలి.
ఎంపిక విధానం
పై పీజీ కోర్సుల్లో చేరాలంటే టిస్ నిర్వహించే నెట్ ఎగ్జామ్ రాయాలి. దీనిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో ప్రోగ్రామింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీఏటీ), ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ (ఓపీఐ) ఉంటాయి. నెట్, పీఏటీ, ఓపీఐలో వచ్చిన స్కోర్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
టిస్ నెట్
ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.దీనిలో 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు.
దీన్ని ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 2- 3.40 మధ్య నిర్వహించనున్నారు.అభ్యర్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకున్నా టిస్ నెట్ రాస్తే సరిపోతుంది.నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.పరీక్ష కాలవ్యవధి గంటా నలభై నిమిషాలు.పరీక్షలో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ నుంచి 30 ప్రశ్నలు- 30 మార్కులు. మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు- 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు- 40 మార్కులు.ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్ విభాగాల్లో ఇచ్చే ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి.ఇంగ్లిష్, మ్యాథ్స్‌కు సెక్షనల్ కటాఫ్ లేదు. జనరల్ అవేర్‌నెస్‌లో మాత్రం జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 శాతం, ఓబీసీ, పీహెచ్‌సీలకు 30 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ లేదు.
సబ్జెక్టుల వారీగా సిలబస్
ఇంగ్లిష్
ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, యూసేజ్లను పరీక్షిస్తారు.
వర్డ్ చాయిస్/సెంటెన్స్ కరెక్షన్, ఆడ్ వన్ అవుట్, అనాలజీస్, సినానిమ్స్, యాంటానిమ్స్, గ్రామర్, వెర్బల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
మ్యాథ్స్
బేసిక్ అర్థమెటిక్, బేసిక్ జామెట్రీ, బేసిక్ ట్రిగనోమెట్రీ, బేసిక్ స్టాటిస్టిక్స్, నంబర్ సిరీస్, డాటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జనరల్ అవేర్నెస్
పాలిటిక్స్, సోషల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ
ప్లేస్‌మెంట్స్
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 100 శాతం ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఏ ప్రోగ్రామ్స్‌లో చదివినవారికైనా మంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.
సదరన్ రీజియన్‌లో పరీక్ష కేంద్రాలు
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, మధురై, తిరువనంతపురం, కోజికోడ్
టిస్ ఏర్పాటు
దేశంలో సోషల్ వర్క్ ఎడ్యుకేషన్ కోసం సర్ దోరబ్జీ టాటా ట్రస్ట్ 1936లో టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌ను ప్రారంభించింది. 20 మంది విద్యార్థులతో ఈ సంస్థ ప్రారంభమైంది. 1944లో దీన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)గా పేరుమార్చారు. 1964లో డీమ్డ్ యూనివర్సిటీగా యూజీసీ గుర్తించింది. సుమారు 40 వరకు పీజీ ప్రోగ్రామ్స్, ఎంఫిల్, పీహెచ్డీ,డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 7
హాల్ టికెట్ డౌన్లోడింగ్:
ఫిబ్రవరి 14-21 మధ్య చేసుకోవచ్చు.
పరీక్షతేదీలు: ఫిబ్రవరి 26
వెబ్సైట్: https://admissions.tiss.edu/
నవోదయలో 1925 పోస్టులు
నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న నవదోయ విద్యాలయాల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 1925
పోస్టులు: అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జేఈ (సివిల్), స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్, స్టాఫ్ నర్స్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఉన్నాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 10
సీబీటీ తేదీలు: మార్చి 9-11 మధ్య నిర్వహిస్తారు.
వెబ్సైట్: https://cdn.digialm.com
గీతం గ్యాట్ -2022
గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం)లో 2022 విద్యాసంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గీతం అడ్మిషన్
టెస్ట్ (గ్యాట్)-2022 ప్రకటన విడుదలైంది.
గీతం అడ్మిషన్ టెస్ట్ (గ్యాట్)-2022
ప్రవేశాలు కల్పించే కోర్సులు:
బీటెక్, ఎంటెక్, బీఆర్క్, ఎంఆర్క్, బీఏ, ఎంఏ, బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్), బీబీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్), ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ (నర్సింగ్), ఎమ్మెస్సీ (నర్సింగ్), బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ, బీసీఏ, బీఈఎం, బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఎమ్మెస్సీ, ఎంసీఏ కోర్సులు.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/ డిప్లొమా లేదా డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
ఎంపిక: గ్యాట్-2022 ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 4
వెబ్సైట్: https://gat.gitam.edu
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు