14 నుంచి ఎంసెట్
-10 సెషన్స్‌లో పరీక్షల నిర్వహణ
– నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
-వెల్లడించిన కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్
అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటించాలని ఎంసెట్-2022 కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సూచించారు. ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
రెండు గంటల ముందు నుంచే..
విద్యార్థులను 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోని అనుమతిస్తాం. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోని అనుమతిస్తారు. బయోమెట్రిక్ క్యాప్చరింగ్‌లో భాగంగా కుడి చేతి బొటనవేలి ముద్రను తీసుకుంటారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరవడం కుదరదు.
కొద్ది నిమిషాల ముందు పాస్వర్డ్..
పరీక్ష కేంద్రంలో విద్యార్థికి కేటాయించిన కంప్యూటర్‌పై అభ్యర్థి పేరు, ఫొటో మొదలైనవి ప్రదర్శితమవుతాయి. పరీక్షకు 10-15 నిమిషాల ముందు విద్యార్థి ఐడీ, పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సైన్ఇన్ (SIGN IN) బటన్ క్లిక్‌చేసి ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేయవచ్చు. నెగెటివ్ మార్కింగ్ లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వవచ్చు.
ఏ సబ్జెక్టు కావాలంటే అదే..
విద్యార్థి ముందుగా ఏ సబ్జెక్టు (సెక్షన్)తో పరీక్షను ప్రారంభించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టును ఎంపిచేసుకోవచ్చు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఏదీ కావాలంటే ఆయా సెక్షన్‌ను ఎంచుకోవచ్చు. కుడివైపున గల ప్యాలెట్‌లో ప్రశ్న నంబర్‌పై క్లిక్చేయగానే ప్రశ్నలు తెరపై కనిపిస్తాయి. వాటిని సమాధానాలిచ్చుకుంటూ వెళ్లాలి.
భిన్న కలర్స్‌లో..
విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలిచ్చేటప్పుడు ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని సేవ్ అండ్ నెక్ట్ బటన్‌ను నొక్కాలి. ఇలా చేయడంతో ప్రశ్న నంబర్ గ్రీన్కలర్లోని మారుతుంది. నిర్దేశిత సమయంలో ప్రశ్నల జవాబులను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. సమాధానం తొలగించాలనుకుంటే క్లియర్ రెస్పాన్స్ (CLEARE RESPONCE) బటన్‌పై క్లిక్ చేయాలి. సరైనది అనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. రెడ్కలర్లోని ఉన్నవాటికి సమాధానాలు రాయలేదని అర్ధం. పునరాలోచన కోసం మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్ట్ బటన్‌పై క్లిక్చేయాలి.
సమయాన్ని ఇలా తెసుకోవచ్చు..
వాచ్‌లు, సెల్‌ఫోన్స్‌ను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్‌పై భాగంగా కుడివైపున టైమర్ ఉంటుంది. మిగిలి ఉన్న సమయాన్ని ఈ టైమర్ ప్రదర్శిస్తుంది. కంప్యూటర్‌పై ఐయామ్ రెడీ టూ బిగిన్ బటన్ క్లిక్చేయగానే టైమర్ ప్రారంభమవుతుంది. ఆయా సమయాన్ని బట్టి విద్యార్థులు ప్రశ్నలకు అన్సర్లు చేస్తూ ముందుకెళ్లాలి. టైమర్ జీరోకు చేరగానే పరీక్ష దానంతటదే ముగుస్తుంది.
సాంకేతిక సమస్యలు తలెత్తితే..
పరీక్ష సమయంలో లేదా మధ్యలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే టెన్షన్ పడొద్దు. మీ చేతిని పైకి ఎత్తడం ద్వారా ఈ సమస్యను ఇన్విజిలెటర్‌కు చెప్పండి. మీకు అదే పరీక్ష కేంద్రంలోని మరొక సిస్టమ్ ఇస్తారు. ఇది వరకు సిస్టమ్ అగిపోయిన లేదా.. సమస్య ఉత్పన్నమైనా అదే పాయింట్ నుంచి టైమర్ తిరిగి కొనసాగుతుంది. మీరు ఆన్సర్ చేసిన ప్రశ్నలు అలాగే ఉంటాయి. మీ సమయం ఎట్టి పరిస్థితుల్లో వృథాకాదు.
2.51 లక్షల దరఖాస్తులు..
ఎంసెట్‌కు 2,51,606 దరఖాస్తులు రాగా, నిరుటి కంటే 14,722 అధికంగా వచ్చాయి. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల సీట్లను ఎంసెట్ ర్యాంక్‌ల ద్వారానే భర్తీచేయాలని నిర్ణయించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పరీక్షల నిర్వహణకు ఏపీ, తెలంగాణల్లో 109 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 4, ఇంజినీరింగ్‌కు 6 సెషన్లలో (మొత్తంగా 10) పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఏడాది సైతం ఎంసెట్‌ను 75 శాతం సిలబస్‌కే నిర్వహించనున్నారు. ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దుచేశారు. ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారు.
దరఖాస్తులు సంఖ్య
ఇంజినీరింగ్ 1,71,945
అగ్రికల్చర్ అండ్ మెడికల్ 94,150
రెండింటికి 350
మొత్తం 2,66,445
పరీక్ష తేదీలు
– జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విద్యార్థులకు
– జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు
పరీక్ష సమయం
– ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
– మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు