సెల్ఫీతో ‘దోస్త్ ’ దరఖాస్తు
# డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
#మూడు విడుతల్లో కాలేజీల్లో ప్రవేశాలు
# జులై 1 నుంచి మొదటి విడత దరఖాస్తులు
# తొలిసారిగా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి బుధవారం విడుదల చేశారు. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా వర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 1,080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,68,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సులభంగా, ఇంట్లో నుంచే మొబైల్ ద్వారా దరఖాస్తు చేసేందుకు ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. కేవలం సెల్ఫీ తీసి, ఫొటోను అప్‌లోడ్‌చేస్తే, విద్యార్థి వివరాలు ప్రత్యక్షమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌బోర్డు ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. టీ యాప్ ఫొలియో రియల్ టైం ఫేస్ రికగ్నిషన్ ద్వారా విద్యార్థి వివరాలు దోస్త్ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతాయి. ఇదేకాకుండా ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, తల్లిదండ్రుల మొబైల్ నంబర్, మీసేవా కేంద్రాల ద్వారా సైతం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లింబాద్రి వెల్లడించారు.
అక్టోబర్ 1 నుంచి ఫస్టియర్ తరగతులు
దోస్త్ లో మూడు విడుతల్లో సీట్లు పొంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా 16-9-22 నుంచి 22 -9-22 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. 23 -9-22 నుంచి 30-9-22 వరకు కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటే షన్ను నిర్వహిస్తారు. అక్టోబర్ 1 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్‌రావు, కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ జీ యాదగిరి, కళాశాల విద్య అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ డీ తిరువెంగళాచారి, టెక్నికల్ కో ఆర్డినేటర్ గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
దోస్త్ 2022 ప్రత్యేకతలు
– కాలేజీలు ఎక్కడున్నాయో ముందుగానే విద్యార్థులు తెలుసుకొనేందుకు కాలేజీల జీపీఎస్ మ్యాపింగ్‌ను దోస్త్ వెబ్‌సైట్‌తో అనుసంధానించారు. దీని ద్వారా దూరంగా ఉన్న కాలేజీలను ముందుగానే తెలుసుకోవచ్చు. న్యాక్ గుర్తింపు గల కాలేజీల వివరాలను సైతం వెబ్సైట్లో పొందుపరిచారు.
-విద్యార్థుల సౌకర్యార్థం 40 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాట్సప్‌లో 79010 02200 నంబర్లో సంప్రదించి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చు.
-దోస్త్ సంబంధిత వివరాల కోసం దోస్త్ యూట్యూబ్ చానల్, ఫేస్బుక్, ట్విట్వర్లో దోస్త్ ఖాతాను సంప్రదించవచ్చు.
– ఈ విద్యాసంవత్సరంలో తొలిసారి డిగ్రీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలుచేస్తున్నారు. ఈ కోటా కోసం 10 శాతం సూపర్‌న్యూమరరీ కోటా ఇచ్చారు.
-సీబీఎస్ఈ, సాంకేతిక విద్యామండలి, ఓపెన్ స్కూల్ నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ సంవత్సరం సర్టిఫికెట్ల పరిశీలనను ఆన్లైన్లో చేయించుకోవవచ్చు. గతంలో మాన్యువల్‌గా పరిశీలన చేపట్టగా ఈ ఏడాది ఆన్‌లైన్‌లోకి మార్చారు.
-రెండు దశల కౌన్సిలింగ్ తర్వాత ఒక కోర్సులో 15 మందికి కంటే తక్కువ విద్యార్థులు చేరితే ఆయా కోర్సును మూసివేస్తారు. మూడో దశలో కోర్సును మార్చుకోవాలని విద్యార్థులకు సూచిస్తారు.
దోస్త్ షెడ్యూల్ మొదటి విడత రెండో విడత మూడో విడత
రిజిస్ట్రేషన్ 1-7-22 నుంచి 30-7-22 7-8-22 నుంచి 21-8-22 29-8-22 నుంచి 12-9-22
వెబ్ ఆప్షన్లు 6-7-22 నుంచి 30-7-22 7-8-22 నుంచి 22-8-22 29-8-22 నుంచి 12-9-22
పీహెచ్, క్యాప్ వెరిఫికేషన్ 28-7-22 18-8-22 9-9-22
ఎన్సీసీ, ఇతర సర్టిఫికెట్ల పరిశీలన 29-7-22 18-8-22 9-9-22
సీట్ల కేటాయింపు 6-8-22 27-8-22 16-9-22
ఆన్లైన్-
సెల్ఫ్ రిపోర్టింగ్ 7-8-22 నుంచి 22-8-22 27-8-22 నుంచి 10-9-22 16-9-22 నుంచి 22- 9-22
- Tags
- DOST
- Notification
- selfie
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు