పుస్తకాల కోసం కంగారు వద్దు
#తెలుగు అకాడమీ బుక్స్ మెయిన్స్‌కు కీలకం
#ఇతరత్రా మెటీరియల్ కూడా అందుబాటులో..
గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కావడంతో అభ్యర్థులు ఇప్పుడంతా పుస్తకాల కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలకు తీవ్ర డిమాండ్ ఉంటున్నది. ఈ క్రమంలో అభ్యర్థులు పుస్తకాలకోసం కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు గ్రూప్-1 మెయిన్స్‌కు కీలకంగా ఉపయోగపడుతాయని, ప్రిలిమ్స్ సమయంలో ఇతరత్రా స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నదని పేర్కొంటున్నారు.
ప్రిలిమ్స్ పేపర్లో జనరల్ స్టడీస్, వర్తమాన అంశాలు, కరెంట్ ఆఫైర్స్, జాగ్రఫీ, ఎకానమీ, జాతీయ అంతర్జాతీయ అంశాల నుంచే అధిక ప్రశ్నలు వస్తాయి. ఇందుకోసం అభ్యర్థులు పుస్తకాలు కాకుండా పత్రికలు, వాటిల్లోని వ్యాసాలు, ఆర్టికల్స్‌ను అవగాహన చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు. తెలుగు అకాడమీ పోటీ పరీక్షల పుస్తకాలు విరివిగానే ముద్రిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గ్రూప్-1కు రెండు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు.
సాధ్యమైనంతవరకు పుస్తకాలను వేగంగా అందించే ప్రయత్నం చేస్తున్నది. అయితే.. కేవలం అకాడమీ పుస్తకాలపైనే పూర్తిగా ఆధారపడకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించిన సిలబస్ ప్రకారం ఆయా సబ్జెక్టులను ఇతరత్రా పుస్తకాలు, పత్రికలు, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకోవాలని తెలుపుతున్నారు.
మరోవైపు పలు అసొసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు సైతం పుస్తకాలను ముద్రించి ఉచితంగా అందజేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విరివిగా పుస్తకాల వితరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనవసరంగా ఆందోళన చెందవద్దని ఓ ప్రొఫెసర్ సూచించారు.
# జాగ్రఫీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సరిహద్దు గల జిల్లా ఏది? అన్న ప్రశ్నకు ఆయా జిల్లా భౌగోళిక స్వరూపం ఆధారంగా సమాధానం రాయగలం.
#తెలంగాణలో లింగమంతుల జాతర ఏ జిల్లాలోజరుగుతుందన్న ప్రశ్నకు సైతం భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉంటేనే సమాధానం రాయగలం.
#తెలంగాణ జీడీపీ ఎంత? రాష్ట్రంలో ఎంత వరిధాన్యం పండుతుంది? అన్న ప్రశ్నలకు రోజువారీగా పత్రికల్లో వచ్చే అంశాలే ఆధారం.
# తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన చోటు ఏది? అన్న ప్రశ్నకు సైతం రాజకీయాలపై అవగాహన ఉంటేనే సమాధానమివ్వగలం.
# సిబ్బి.. అనే వస్తువును ఎందుకోసం వాడతాం, తనబ్బి అని దీనిని అంటాం అన్న ప్రశ్నలకు సైతం ఆయా పదజాలంపై అవగాహన ఉంటేనే సమాధానాలివ్వగలం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు