ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ సీట్లే అధికం
# 1.11 లక్షల సీట్లకు ఏఐసీటీఈ అనుమతి
# సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లోనే అధిక సీట్లు
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఎగ్జామ్ రాసిన విద్యార్థుల నోట వినిపిస్తున్న ఒకే మాట కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ). హాట్‌టాపిక్‌గా మారిన ఈ కోర్సుకు ఏటా తీవ్ర డిమాండ్ ఉంటున్నది. ఈ విద్యాసంవత్సరం సీఎస్ఈ కోర్సులో 28,435 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐఏసీటీఈ) అనుమతినిచ్చింది. అనుబంధ కోర్సుల్లో మరో 25,890 సీట్లకు అనుమతులు మంజూరుచేసింది. మొత్తంగా సీఎస్ఈతోపాటు సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోనే 54,325 సీట్లు ఉన్నాయి. అనుబంధ కోర్సులు తీసుకొంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 13,740, సీఎస్ఈ డాటాసైన్స్‌లో 8,910, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో 3,240 సీట్లకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. 2022 -23 విద్యాసంవత్సరానికి మొత్తంగా 1,11,147 సీట్లకు ఐఏసీటీఈ ఆమోదం తెలిపింది. ఈ కోర్సులు, సీట్లకు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. ఆమోదం లభించిన సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. ఈ ఏడాది 168 కాలేజీలకు అనుమతి లభించింది. కొత్తగా వనపర్తిలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటైంది.
ఈ ఏడాది ఏఐసీటీఈ అనుమతినిచ్చిన సీట్ల వివరాలు
కోర్సులు 44
కాలేజీలు 168
మొత్తం సీట్లు 1,11,147
మూతబడ్డ సీట్లు 7,380
కోర్సుల్లో పెరిగిన సీట్లు 7,815
సీఎస్ఈ డిమాండ్ ఎందుకంటే..
ఇటీవల సాఫ్ట్ వేర్ అవసరం లేకుండా ఏ రంగం పనిచేయడం లేదు. మెడికల్, ఫార్మా, ఉత్పాదక రంగం ఏదీ తీసుకున్నా సాఫ్ట్వేర్ రంగం అత్యధికంగా ప్రభావితం చేస్తున్నది. దీంతో ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు పూర్తిచేసినా అత్యధికులు సాఫ్ట్వేర్ రంగం వైపే చూస్తున్నా రు. ఐటీ రంగం రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతుండటం, ద్వితీయ శ్రేణి నగరాల్లోను ఐటీ పార్క్‌లు ఏర్పాటవు తుండటంతో అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏ బ్రాంచి చదివినవారైనా ఐటీ రంగంలోనే స్థిరపడాల్సి ఉండటం, ఈ రంగంలోనే ప్లేస్‌మెంట్స్ అధికంగా ఉండటం, భారీ ప్యాకేజీలు లభిస్తుండటం, వేగంగా కెరీర్లో స్థిరపడే అవకాశాలుండటంతో విద్యార్థులు సీఎస్ఈ కోర్సు వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల స్టార్టప్ కల్చర్ వేగవంతమవుతుండటం సైతం సీఎస్ఈ కోర్సుకు డిమాండ్ పెరిగేందుకు కారణమవుతున్నది.
కోర్సులవారీగా సీట్లు
కోర్సు సీట్లు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 28,435
సీఎస్ఈ (ఏఐఎంఎల్) 13,740
ఈసీఈ 16,209
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 7,440
ఈఈఈ 7471
సివిల్ ఇంజినీరింగ్ 6,765
మెకానికల్ ఇంజినీరింగ్ 6,351
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అండ్ మెషిన్ లెర్నింగ్ 3,294
సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ 3,240
సీఎస్ఈ డేటాసైన్స్ 8,910
- Tags
- AICTE
- cse
- engineering
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు