డిప్లొమాలోనూ కంప్యూటర్ సైన్స్ హవా
-ఈ కోర్సులో 100% సీట్లు భర్తీ
– పాలిసెట్‌లో 72.50% సీట్లు ఫుల్
– 17 నుంచి ఫస్టియర్ తరగతులు
బీటెక్‌లోనే కాకుండా డిప్లొమాలోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సు హవా కొనసాగుతున్నది. ఈ కోర్సులో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 4,228 సీట్లు ఉంటే అన్ని హాట్‌కేకుల్లా నిండిపోయాయి. పాలిసెట్ తుది విడత సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 72.51 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండు విడతల కౌన్సెలింగ్ ముగిశాక 118 కాలేజీల్లో 28,562 సీట్లుంటే, 20,709 సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. 7,853 సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 10లోపు ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. 8 నుంచి 16 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహించి, 17 నుంచి ఫస్టియర్ క్లాసులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
కోర్సుల వారీగా సీట్ల భర్తీ..
కోర్సు మొత్తం సీట్లు నిండినవి
డిప్లొమా ఇన్ కంప్యూటర్ 4,228 4,228
డిప్లొమా ఇన్ ఈసీఈ 5,308 5,082
డిప్లొమా ఇన్ ఈఈఈ 6,348 4,475
డిప్లొమా ఇన్ సివిల్ 5,048 3,244
డిప్లొమా ఇన్ మెకానికల్ 4,800 2,028
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు