దివ్యమైన ఆహారం.. సంపూర్ణ ప్రొటీన్లు
జంతువులు- ఆర్థికాంశాలు
మానవుడు జంతువులను ఆహారం కోసమే కాకుండా వ్యవసాయం, రవాణా కోసం ఉపయోగపడతాయని గుర్తించాడు. దీంతో అడవి జంతువులను పెంచడం ప్రారంభించాడు. సాధారణంగా మనకు ఉపయోగపడే జంతువులను మాత్రమే పెంచుతాం. బర్రెలను, ఆవులను పాల కోసం పెంచుతాం. కోడి, గొర్రె, మేకలను మాంసం కోసం, ఎద్దులు, దున్నపోతులు, గుర్రం, గాడిదలను వ్యవసాయం, రవాణా కోసం పెంచుతాం. జంతువుల పెంపకంలో ఆహార ఉత్పత్తి, ఆర్థికంగా ఉపయోగపడే వాటికి ప్రాముఖ్యం ఉంటుంది.
పాలు
- భారత ప్రభుత్వం పాల ఉత్పత్తిని కూడా ఒక పరిశ్రమగా గుర్తించింది.
- ఆవులు, బర్రెల నుంచి మనకు ఎక్కువగా పాలు లభిస్తాయి.
- దేశీయ జాతులు ప్రతిరోజు 2-5 లీటర్ల పాలిస్తాయి.
- మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముర్రా జాతి పశువులను ఎక్కువగా పెంచుతున్నారు. ఇది ప్రతిరోజు 8 లీటర్లకు పైగా పాలిస్తాయి.
- మనదేశంలో హర్యానా, జాఫ్రాబాడీ, నాగపూరికి చెందిన ఆవులు ఎక్కువ పాలిచ్చే జాతులు.
- జెర్సీ (ఇంగ్లండ్), హాల్స్టీన్ (డెన్మార్క్) వంటి విదేశీ జాతులు ప్రతిరోజు 25 లీటర్ల పాలు ఇస్తాయి.
- విదేశీ జాతులను దేశీయ జాతులతో సంకరణం చేసి ఎక్కువ పాలనిచ్చే సంకర జాతులను ఉత్పత్తి చేస్తున్నారు.
- దేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో 60 శాతం పాలను జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి ఇతర ఉత్పత్తులను తయారుచేయడానికి వాడతారు.
- పాలను పాల సేకరణ కేంద్రాల ద్వారా సేకరించి పాశ్చరైజేషన్ చేసి నిల్వచేస్తారు.
- పాలలోని రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు.
- ఈ పద్ధతిలో పాలను 630C లేదా 1450F వద్ద 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. తర్వాత పాలను 100C కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లారుస్తారు.
- భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం- ఉత్తరప్రదేశ్
- శ్వేత విప్లవం (ఆపరేషన్ ఫ్లడ్) అనే పథకం ద్వారా పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించినవారు- ప్రొఫెసర్ వర్గీస్ కురియన్
- భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు- వర్గీస్ కురియన్
- ఏటా కురియన్ జన్మదినమైన నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం నిర్వహిస్తారు.
- క్షీరదాల్లో క్షీర గ్రంథులు పాలను స్రవిస్తాయి. పాలు తెల్లని కొల్లాయిడ్ పదార్థం.
- పశువులు ఈనినప్పుడు 2-3 రోజులు వచ్చే పాలను జున్ను పాలు అంటారు.
- పశువులు ఈనిన 72 గంటల తర్వాత అది ఇచ్చే పాలలో కొలస్ట్రమ్ లేకుండా ఉండి తెల్లగా, చిక్కగా ఉంటాయి.
- పాలలో ప్రొటీన్, ఇతర ఖనిజ లవణాలు ఎ, డి, ఈ విటమిన్లు ఉంటాయి. అదేవి
కోళ్లు- కోళ్ల పరిశ్రమ
- ధంగా 80-90శాతం నీరుంటుంది.
- అధిక మొత్తంలో కోళ్లను ఉత్పత్తి చేసి పెంచడాన్ని కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ) అంటారు.
- కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానాన్ని, మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానాన్ని ఆక్రమిస్తుంది.
- మన దేశంలో సంవత్సరానికి 90 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 3 నుంచి 5 మిలియన్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది.
- మాంసం కోసం పెంచే కోళ్లను ‘బ్రాయిలర్స్’ అంటారు.
- గుడ్ల కోసం పెంచే కోళ్లను ‘లేయర్స్’ అంటారు.
- సాధారణంగా దేశీయ రకాలు పూర్తిగా పెరగడానికి 5-6 నెలలు పడుతుంది. కానీ బ్రాయిలర్లు 6-8 వారాల్లో పెరుగుతాయి.
- న్యూ హాంప్షైర్, ప్లేమౌత్, రోడ్ వెలాండ్రెడ్, వైట్లెగ్ హార్న్, అనోకా మాంసాన్నిచ్చే విదేశీ రకాలు.
- సాధారణంగా కోళ్లు వాటి జీవితకాలంలో 300-350 వరకు గుడ్లను పెడతాయి.
- దేశవాళీ రకాలు పొదగడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అసీల్, కడక్నాథ్, చిత్తాగాంగ్, లాంగ్ష్రాన్, బ్రూసా మొదలైనవి స్వచ్ఛమైన దేశీయ రకాలు. కానీ గుడ్లను పెట్టే శక్తి వీటికి తక్కువ.
- పౌల్ట్రీ పరిశ్రమలో వెలువడే వ్యర్థ పదార్థాలను లిట్టర్ అంటారు.
- NECC (National Egg Coor dination Committee) జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ 1982 నుంచి మార్కెట్లో గుడ్డు ధరలను ప్రకటించడం ప్రారంభించింది.
- ‘మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి’ అనేది NECC నినాదం.
- బండ వాసుదేవరావు (బీవీ రావు)ను భారతదేశ పౌల్ట్రీ పితామహుడిగా పిలుస్తారు. ఈయన NECC వ్యవస్థాపక చైర్మన్గా పనిచేశారు.
గుడ్డు-పోషక విలువలు
- గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్లు లోపించి ఉంటాయి.
- తెల్లసొనలో అల్బుమిన్ అనే ప్రొటీన్, పచ్చసొనలో కొలెస్టిరాల్ అనే కొవ్వు ఉంటుంది.
- గుడ్ల ఉత్పత్తిని పెంచేది సిల్వర్ విప్లవం.
- విటమిన్-సి తప్ప అన్ని విటమిన్లు గుడ్డులో ఉంటాయి.
- కోడి గుడ్డు పెంకులో కాల్షియం కార్బోనేట్ కూడా ఉంటుంది.
- ప్రతి భారతీయుడు సగటున ఏడాదికి 43 గుడ్లు తింటున్నాడు. జపనీయులు 346, మెక్సికన్లు 306, చైనీస్ 312 గుడ్లు తింటున్నారు.
- ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారాన్ని ప్రపంచ గుడ్డు దినోత్సవంగా నిర్వహిస్తారు.
గుడ్డులోని పోషక పదార్థాలు: నీరు-38.8 గ్రా., శక్తి-78 కి.కాలరీలు, ప్రొటీన్లు- 6.5 గ్రా., కొవ్వు-5.8గ్రా., సోడియం-7.2మి.గ్రా., పొటా తేనెటీగలు షియం-6.7 మి.గ్రా., కాల్షియం-29 మి.గ్రా., పాస్ఫరస్-103 మి.గ్రా., ఐరన్-10మి.గ్రా., జింక్-0.7మి.గ్రా., విటమిన్-ఇ-0.5 మి.గ్రా.
తేనెటీగలు
- తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని ఎపికల్చర్ అంటారు.
- భారతదేశంలో ప్రధానంగా మొత్తం ఆరు రకాల ప్రధాన తేనెటీగల జాతులను గుర్తించారు. అవి ఎపిస్ డార్సేటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిఫెరా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ సెరానా.
- ఎపిస్ సెరానా అనే తేనెటీగ తుట్టె నుంచి ఒక సంవత్సరంలో 3-10 కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది.
- ఎపిస్ మెలిఫెరా అనే యూరోపియన్ తేనెటీగ తుట్టె నుంచి సంవత్సరానికి 25-30 కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది.
- 4000 సంవత్సరాల క్రితమే ఈజిప్టు దేశస్థులు తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి తెలుసుకున్నారు.
- క్రీ.పూ. 3000-2000 కాలంలో రాసిన రుగ్వేదంలో తేనెటీగలు, తేనె ప్రస్తావన ఉంది. తేనెను దివ్యమైన ఆహారంగా భావిస్తారు.
- తేనెటీగలు చీమలలాగే సంఘజీవనం గడుపుతాయి. ఇవి గుంపులు గుంపులుగా నివశిస్తాయి.
- తేనెపట్టులో 3 రకాల ఈగలుంటాయి. అవి ఒక రాణి ఈగ, కొన్ని వేల సంఖ్యలో కూలీ ఈగలు, కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లు అనే మగ ఈగలు.
- రాణి ఈగ జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని ప్రధాన విధి గుడ్లు పెట్టడం.
- కూలీ ఈగల జీవిత కాలం 5-6 వారాలు.
- డ్రోన్ల జీవిత కాలం 57 రోజులు ఉంటుంది.
- తేనెపట్టులో వంధ్య ఆడ ఈగలుంటాయి. వీటిని కూలీ ఈగలు అంటారు.
- కూలీ ఈగలు మకరందాన్ని, పరాగరేణువులను సేకరించే పనులు చేస్తాయి.
- తేనెపట్టులో డ్రోన్లు లేదా మగ ఈగలు సోమరులుగా ఉంటాయి. ఏ పనులు చేయవు. కేవలం సంపర్కంలో
పాల్గొనటమే వీటి ప్రధాన విధి. - రాణి ఈగ గాలిలో ఎగురుతున్నప్పుడు సంపర్కం జరుగుతుంది. సంపర్కం తర్వాత డ్రోన్లు చనిపోతాయి.
- తేనెటీగల విషాన్ని హోమియో వైద్యంలో ఎపిటింక్చర్ తయారు చేయడానికి వాడుతారు.
చేపలు (మత్స్య సంవర్థనం)
- తేనెటీగల మైనంతో అలంకరణ సామగ్రి, గోళ్లు, చెప్పుల పాలిష్ మొదలైనవి తయారు చేస్తాయి.
- చేపలు అధిక మొత్తంలో జంతు ప్రొటీన్లు కలిగిన ముఖ్యమైన ఆహారం.
- భారతదేశంలో దాదాపుగా 7,500 కి.మీలు సముద్ర తీరం ఉంది.
- సార్స్డైన్, బాంబేడక్, మ్యాకరిల్స్, క్యాట్ఫిష్, ట్యూనా మొదలైనవి సముద్ర చేపల జాతులు.
- కొర్రమీను, జెల్ల, బొచ్చెలు, మోసు, తాటాకు చేపలు మొదలైనవి మంచినీటి చేపల జాతులు.
- సముద్ర జలాల్లో ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన ఎన్నోరకాల జాతులున్నాయి. ఇందులో
ముఖ్యమైనవి ముల్లెట్లు, భేట్కీ, పెరల్స్ఫాట్.
పట్టు పురుగులు
- ఆల్చిప్పలు, గువ్వపురుగులు, పీతలు, రొయ్యలు ఉంటాయి.
- వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒక ప్రదేశంలో పెంచడాన్ని ‘సమ్మిళిత చేపల పెంపకం’ అంటారు.
- పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు.
- పట్టుపురుగుల ఆహారం- మల్బరీ ఆకులు
- పట్టుపురుగు శాస్త్రీయనామం- బాంబిక్స్ మోరి
- పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు.
- పట్టుపురుగులను అమ్మే కేంద్రాలను గ్రెనేజస్ అంటారు.
- పట్టుపురుగుల డింభకాలను కొకూన్ అంటారు.
- పట్టుపురుగులు ఓక్ చెట్లపైన పెరుగుతాయి.
- పట్టు పట్టణంగా యాదాద్రి జిల్లాలోని పోచంపల్లిని పిలుస్తారు.
- పోచంపల్లి పట్టును టై అండ్ డై లేదా జిమ్దాని పట్టు అని కూడా పిలుస్తారు.
- పట్టుపురుగు దారాల్లో సిరిసిన్, ఫైబ్రోయిన్ అనే ప్రొటీన్లు ఉంటాయి.
- పట్టు కాయల నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు.
- పట్టు పురుగు జీవిత చరిత్రలో గుడ్డు/ డింభకం/లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి/ ఇమాగో అనే దశలు ఉంటాయి.
Previous article
తెలంగాణ వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్బాక్స్
Next article
CHAIR ను HAIRCగా రాస్తే BRIDE ను ఏవిధంగా రాస్తారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు