ఇంటర్‌తో కొలువులు
మొత్తం ఖాళీలు: 4500
కేవలం ఇంటర్ అర్హతతో కేంద్ర కొలువులు. పెద్ద చదువులు చదవలేని వారికి, ఆర్థిక లేదా ఇతరత్రా కారణాలతో తొందరగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి అపూర్వ అవకాశం. దేశవ్యాప్తంగా ఆయా మంత్రిత్వశాఖల్లో, డిపార్ట్మెంట్లలో, కార్యాలయాల్లో గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష వివరాలు సంక్షిప్తంగా….
పరీక్ష విధానం
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1, టైర్-2) ద్వారా ఎంపిక చేస్తారు.
టైర్-1
ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
మొత్తం 100 ప్రశ్నలు- 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్)-25 ప్రశ్నలు-50 మార్కులు.
జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్)- 25 ప్రశ్నలు-50 మార్కులు
జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోత విధిస్తారు.
టైర్-2
ఇది ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు (మాడ్యూల్-2లో తప్ప).
దీనిలో మూడు సెషన్లు ఉంటాయి. సెషన్ -1 పరీక్ష కాలవ్యవధి రెండు గంటల పదిహేను నిమిషాలు.
సెషన్-1లో సెక్షన్-1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 60 ప్రశ్నలు 180 మార్కులు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు.
సెక్షన్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (40 ప్రశ్నలు), జనరల్ అవేర్నెస్ (20 ప్రశ్నలు). మొత్తం 60 ప్రశ్నలు- 180 మార్కులు. సెక్షన్-3 మాడ్యూల్-1లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్‌పై 15 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు.
సెషన్- 2 సెక్షన్-3 మాడ్యూల్-2లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ ఇది.
దీనిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు స్కిల్‌టెస్ట్‌ను (15 నిమిషాలు), ఎల్డీసీ/జేఎస్ఏ పోస్టులకు టైపింగ్ టెస్ట్ (10 నిమిషాలు)ను నిర్వహిస్తారు.
టైర్-2లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
సెక్షన్-3లో మాడ్యూల్-1 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఇది తప్పనిసరి పరీక్ష. ఇది కేవలం క్వాలిఫయింగ్ నేచర్
పరీక్ష మాత్రమే.
స్కిల్‌టెస్ట్/టైపింగ్ టెస్ట్‌లు కేవలం క్వాలిఫయింగ్ నేచర్ పరీక్షలు మాత్రమే.
నోట్: టైర్-1లో అర్హత సాధించిన వారిని మాత్రమే టైర్-2కు అనుమతిస్తారు.
ఎవరు అర్హులు ?
విద్యార్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు. 2023, జనవరి 4లోపుగా ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2022, జనవరి 1 నాటికి 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1995, జనవరి 2 – 2004, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2023, జనవరి 4
టైర్-1 పరీక్ష: 2023, ఫిబ్రవరి- మార్చిలో నిర్వహిస్తారు
టైర్-2 పరీక్ష: తేదీలను తర్వాత ప్రకటిస్తారు
వెబ్సైట్: https://ssc.nic.in
– కేవీఎస్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు