పుష్పంలో రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు?
- మొక్కల్లో ప్రత్యుత్పత్తి
1. కింది ఏ ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల దేహభాగాల ద్వారా మాత్రమే జరుగుతుంది?
1) శాఖీయ ప్రత్యుత్పత్తి
2) లైంగిక ప్రత్యుత్పత్తి
3) అలైంగిక ప్రత్యుత్పత్తి
4) అంతర ప్రత్యుత్పత్తి
2. కాండంతో మాత్రమే వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ?
1) వేప 2) చెరకు
3) వరి 4) గోధుమ
3. ఏ భూగర్భ కాండంలో కన్నులు అనే నిర్మాణం ఉండి ఆ భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి?
1) క్యారెట్ 2) అరటి
3) బంగాళదుంప 4) పసుపు
4. కింది వాటిలో మార్పు చెందిన భూగర్భకాండం?
1) ముల్లంగి 2) బీట్రూట్
3) క్యారెట్ 4) పసుపు
5. ఆర్థికంగా ఉపయోగపడే అల్లం అనేది?
1) మార్పు చెందిన వేరు
2) మార్పుచెందిన భూగర్భకాండం
3) వాయుగత కాండం
4) రసయుత భూగర్భ భాగం
6. శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణం?
1) కొత్త లక్షణాలు ఏర్పడతాయి
2) ఉత్పరివర్తనాలు కలుగుతాయి
3) తల్లి మొక్కల లక్షణాలు ఉంటాయి
4) రెండు మొక్కల లక్షణాలు ఉంటాయి
7. ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కలు ఏర్పడతాయి?
1) అరటి 2) మందార
3) అల్లం 4) కరివేపాకు
8. రణపాల మొక్క కింది ఏవిధంగా ప్రత్యుత్పత్తి చూపిస్తుంది?
1) కాండపు మొగ్గల ద్వారా
2) వేరు మొగ్గల ద్వారా
3) పత్రపు మొగ్గల ద్వారా
4) కాండ ఛేదనాల ద్వారా
9. కింది ఏ మొక్కలో వాయుగతంగా ఉండే మిధ్యాకాండం ఉంటుంది?
1) మందార 2) అరటి
3) జామ 4) క్రోటాన్
10. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవించిన మొక్కలను ఏమని పిలుస్తారు?
1) క్లోన్లు
2) సిద్ధబీజ మొక్కలు
3) శాఖీయ మొక్కలు
4) అలైంగిక మొక్కలు
11. కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధం లేనిది?
1) విచ్ఛిత్తి 2) కోరకీభవనం
3) సిద్ధబీజం 4) సంయుక్త బీజం
12. కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే కణ జీవి?
1) క్లామిడోమోనాస్ 2) ఈస్ట్
3) వాచీరియా 4) బ్యాక్టీరియా
13. ఏ జీవులు సిద్ధబీజాలను ఎరుపు లేదా నలుపు రంగులో ఏర్పరిచి వేగంగా ప్రత్యుపత్తి జరుపుతాయి?
1) శిలీంధ్రాలు 2) శైవలాలు
3) డయాటమ్లు 4) వివృత బీజాలు
14. ఏ రకమైన మొక్కల జీవిత చక్రంలో సిద్ధబీజాలు మొలకెత్తి నేరుగా సంయోగ బీజాన్ని ఏర్పరుస్తాయి?
1) వివృత బీజాలు
2) టెరిడోఫైటా మొక్కలు
3) థాలోఫైటా మొక్కలు
4) ఏకదళ బీజ మొక్కలు
15. ఆపిల్లోని ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం?
1) అండాశయం 2) ఫలం
3) పుష్పాసనం 4) విత్తనం
16. పుష్పంలో రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు?
1) అనావశ్యక భాగాలు
2) శాఖీయ భాగాలు
3) ప్రాథమిక భాగాలు
4) ఆవశ్యక భాగాలు
17. సాధారణంగా రక్షకపత్రావళి ఫలదీకరణం జరిగిన తర్వాత రాలిపోతాయి. కింది ఏ మొక్కలో ఫలంతో పాటు పెరుగుతాయి?
1) మామిడి 2) అరటి
3) వంకాయ 4) కాకరకాయ
18. స్త్రీ, పురుష మొక్కలు పూర్తిగా వేర్వేరుగా పెరిగే మొక్కలకు ఉదాహరణ?
1) బొప్పాయి, తాటి
2) మామిడి, పనస 3) వేప, నిమ్మ
4) టమాటా, వంకాయ
19. పుష్పంలో ఏ భాగాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అంటారు?
1) కేసరావళి 2) పుష్పాసనం
3) పరాగకోశం 4) అండకోశం
20. పుష్పంలో ఫలదీకరణం జరిగే ప్రదేశం?
1) కీలం 2) కీలాగ్రం
3) అండకోశం 4) పిండకోశం
21. పురుష సంయోగబీజం, ద్వితీయ కేంద్రకంతో కలవడం వల్ల ఏర్పడేది?
1) అంకురచ్ఛదం 2) సంయుక్తబీజం
3) పిండం 4) అండం
22. ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది?
1) పిండం 2) విత్తనం
3) అండం 4) ఫలం
23. అంకురచ్ఛదయుత విత్తనాలకు ఉదాహరణ?
1) చిక్కుడు 2) వరి
3) బఠాణి 4) శనగ
24. ఆవృత బీజ మొక్కల్లో అంకురచ్ఛదం ఏ విధంగా ఉంటుంది?
1) ఏకస్థితికంగా
2) ద్వయస్థితికంగా
3) త్రయస్థితికంగా
4) పంచస్థితికంగా
25. పరపరాగసంపర్కం వల్ల కలిగే ఉపయోగం?
1) తల్లి మొక్క లక్షణాలు ఏర్పడతాయి
2) తండ్రి మొక్క లక్షణాలు ఏర్పడతాయి
3) వ్యాధులకు నిరోధకత పెరుగుతుంది
4) కొత్త లక్షణాలు ఏర్పడతాయి, దిగుబడి పెరుగుతుంది
మొక్కల వృద్ధి నియంత్రకాలు
1. మొక్కల్లో రసాయనిక సమన్వయానికి ఉపయోగపడేవి?
1) ఫైటో హార్మోనులు
2) ప్రొటీన్లు 3) విటమిన్లు
4) ఖనిజ లవణాలు
2. ఫైటో హార్మోన్లలో ఏ హార్మోన్ పెరుగుదల నిరోధకంగా ఉంటుంది?
1) ఆక్సిన్ 2) జిబ్బరెల్లిన్
3) సైటోకైనిన్ 4) అబ్సిసిక్ ఆమ్లం
3. మొక్కల్లో ఆక్సిన్లు కింది ఏ భాగాల్లో ఏర్పడతాయి?
1) కాండాగ్రం 2) ఫలాలు
3) విత్తనాలు 4) పిండాలు
4. ఖండించిన కాండం నుంచి వేర్లు ఏర్పడటానికి ఉపయోగపడే ఏ ఫైటోహార్మోన్ను వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో ఉపయోగిస్తారు?
1) జిబ్బరెల్లిక్ ఆమ్లం 2) కైనిటిన్
3) ఇండోల్ఎసిటిక్ ఆమ్లం
4) ఇథిలిన్
5. ఆక్సిన్లు కింది విధంగా ఉపయోగపడతాయి?
1) కణుపు మధ్యల పెరుగుదలకు
2) పండ్ల పక్వతకు
3) విత్తనాల అంకురణకు
4) గుల్మనాశకాలుగా
6. వ్యవసాయ రంగంలో జిబ్బరెల్లిన్లు కింది విధంగా ఉపయోగపడతాయి?
1) అగ్రాధిక్యతను పెంచడానికి
2) ద్రాక్షలో విత్తన రహిత ఫలాలు పొందడానికి
3) కలుపు మొక్కలను నిర్మూలించడానికి
4) విత్తనాల సుప్తావస్థ ప్రోత్సహించడానికి
7. కింది వాటిలో వాయురూపంలో ఉండే ఫలాల పరిపక్వతకు ఉనయోగపడే హోర్మోన్ను ఏమంటారు?
1) ఆక్సిన్ 2) సైటోకైనిన్
3) జిబ్బరెల్లిక్ ఆమ్లం 4) ఇథిలిన్
8. మొక్కల్లో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోన్ కింది భాగాల్లో ఎక్కువగా ఉంటుంది?
1) కాండాగ్రం
2) పరిపక్వం చెందిన ఫలాలు
3) సుప్తావస్థలో ఉన్న విత్తనాలు
4) వేరు అగ్రం
9. ఫలదీకరణం జరగకుండానే అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేకఫలనం అంటారు. దీన్ని ప్రేరేపించే హార్మోన్?
1) ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
2) జిబ్బరెల్లిక్ ఆమ్లం
3) నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం
4) ఇండోల్ బ్యుటరిక్ ఆమ్లం
10. కింది వాటిలో మొక్కల్లో ఏర్పడే హార్మోన్ కానిది?
1) సైటోకైనిన్ 2) కైనిటిన్
3) ఇథిలిన్ 4) ఫైకోఎరిథ్రిన్
11. మిరప పంటలో పూత రాలిపోకుండా ఉండటానికి ఉపయోగించే హార్మోన్?
1) కైనటిన్ 2) జియోటిన్
3) ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
4) ఫినాక్సి ఆమ్లం
బాష్పోత్సేకం
1. మొక్కలు నీటిని ఆవిరి రూపంలో వాయుగత భాగాల నుంచి కోల్పోవడాన్ని ఏమంటారు?
1) బాష్పోత్సేకం 2) ద్రవోద్గమం
3) బిందుస్రావం 4) బాష్పస్రావం
2. మొక్కల్లో బాష్పోత్సేకం ఏ భాగాల్లో ఎక్కువగా జరుగుతుంది?
1) కాండం 2) వేర్లు
3) పత్రాలు 4) ఫలాలు
3. ఆకురాల్చే మొక్కలు తమ పత్రాలను వేసవిలో రాల్చడానికి గల కారణం?
1) పుష్పాలను ఉత్పత్తి చేయడానికి
2) బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి
3) శ్వాసక్రియను నిలుపుకోవడానికి
4) కిరణజన్య సంయోగక్రియ పెంచుకోవడానికి
4. మొక్కల్లో జరిగే ఏ ప్రక్రియను చెడు అని పిలుస్తారు?
1) శ్వాసక్రియ
2) ప్రొటీన్ల సంశ్లేషణ
3) కిరణజన్య సంయోగక్రియ
4) బాష్పోత్సేకం
5. బాష్పోత్సేకం వల్ల మొక్కలకు జరిగే హాని?
1) నీటి కొరత ఏర్పడుతుంది
2) హార్మోన్లు తయారు కావు
3) మొక్క పెరగదు
4) పిండి పదార్థాలు ఏర్పడవు
6. బాష్పోత్సేకం జరగడం వల్ల మొక్కకు కలిగే ఉపయోగం?
1) ఆహారపదార్థాలు తయారవుతాయి
2) శ్వాసక్రియ జరుగుతుంది
3) ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది
4) నీటిని నిలుపుకొంటుంది
విత్తనాల వ్యాప్తి
1. మొక్కల్లో విత్తన వ్యాప్తి జరగడం వల్ల కలిగే ఉపయోగం?
1) శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి
2) ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు
3) కొత్త మొక్కలు ఏర్పడేందుకు
4) జీవులకు ఆహారంగా ఉపయోగపడేందుకు
2. గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందే మొక్కల విత్తనాలపై కింది ఏ నిర్మాణాలు ఉంటాయి?
1) ముళ్లు, కొక్కాలు
2) కేశాలు, రెక్కలు
3) గాలితో నిండిన గదులు
4) బరువైన పదార్థాలు
3. అతిచిన్నగా ఉండే కింది ఏ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి?
1) ఆర్కిడ్ 2) మామిడి
3) కొబ్బరి 4) బెండ
4. కింది ఏ మొక్క విత్తనంపై కోమా అనే కేశ సముదాయం ఉండి గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది?
1) పనస 2) అనాస
3) అరటి 4) జిల్లేడు
5. ఏ మొక్క ఫలం విత్తనంతో సహా నీటిలో చాలా దూరం ప్రయాణించి సముద్ర లేదా నదీతీర ప్రాంతాల్లో మొలకెత్తి వృక్షంగా పెరుగుతుంది?
1) మర్రి 2) రావి
3) కొబ్బరి 4) మామిడి
6. లొడీసియా, పాలిగోనమ్, చుక్కకూర వంటి విత్తనాలు ఏవిధంగా వ్యాప్తి చెందుతాయి?
1) నీటి ద్వారా 2) గాలి ద్వారా
3) పక్షుల ద్వారా 4) పిచ్చుకల ద్వారా
7. జంతువుల శరీరాల ద్వారా వేరొక ప్రాంతానికి వ్యాప్తి చెందడానికి విత్తనాల ప్రత్యేకత?
1) వీటికి కేశాలుంటాయి
2) ముళ్లు, కొక్కాలుంటాయి
3) వీటిలో గాలి గదులుంటాయి
4) ఇవి పెద్ద పరిమాణంలో ఉంటాయి
8. కింది ఏ విత్తనాలు సాధారణంగా కాకి విసర్జక పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతాయి?
1) క్యారెట్ 2) బంగాళదుంప
3) వంకాయ 4) వేప
9. పల్లేరు మొక్క విత్తనాలు ఏవిధంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి?
1) ఉన్నతస్థాయి జంతువుల శరీరాలకు అంటుకొని
2) పక్షుల విసర్జక పదార్థం ద్వారా
3) నీటిపై తేలియాడుతూ
4) గాలి ద్వారా
10. కింది ఏ మొక్క విత్తనాలు నీరు తగిలిన వెంటనే శబ్దం చేస్తూ వ్యాప్తి చెందుతాయి?
1) తోటకూర 2) కనకాంబరం
3) ముల్లంగి 4) క్యాబేజీ
11. ఏ మొక్కల ఫలాలు గుళికగా ఉండి పగిలి విత్తనాలు వెదజల్లబడతాయి?
1) వేప, చింత 2) అరటి, ద్రాక్ష
3) బెండ, ఆముదం
4) టమాటా, వంకాయ
- Tags
- Botany
- nipuna
- Study material
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు