కారు చీకటిలోనూ గబ్బిలాలు ఎగురగలవు.. ఎందుకు? (ధ్వని)
1. కింది వాటిని జతపరచండి.
ఎ. భూకంపాలు 1. అల్ట్రాసోనిక్స్
బి. ఎకోరేంజింగ్ 2. శ్రావ్యతా ధ్వనులు
సి. సంగీత ధ్వనులు 3. 0.01 సెకన్లు
డి. వినికిడి స్థిరత 4. ఇన్ప్రాసోనిక్స్
5. ఎకోవేవ్స్
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-5, బి-2, సి-1, డి-3
4) ఎ-4, బి-5, సి-2, డి-3
2. కింది వాటిని జతపరచండి.
ఎ. మానవ కనీస శబ్ద తీవ్రతస్థాయి 1. 10 w/m2
బి. కర్ణభేరి చిల్లులు పడే తీవ్రత 2. 85 db
సి. హానికరమైన శబ్ద త్రీవత స్థాయి 3. 104 w/m2
డి. చెవి నొప్పిగా అనిపించే శబ్ద తీవ్రత 4. 0 db
5. 140 db
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-4, బి-5, సి-2, డి-1
3) ఎ-2, బి-5, సి-2, డి-1 4) ఎ-1, బి-5, సి-2, డి-3
3. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. ఒకే ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలు ఐసోబోరిక్ రేఖలు
బి. ఉష్ణోగ్రతతో పాటు ధ్వనివేగం 1 డిగ్రీసెంటీగ్రేడ్కు 0.6 m/sec పెరుగుతుంది.
సి. గాలిలో ధ్వనివేగం సాంద్రతతో తగ్గుతుంది
డి. శూన్యంలో ధ్వనివేగంలో మార్పులేదు (00c వద్ద)
1) బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) బి, డి
4. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. ధ్వని వేగంతో పీడనానికి సంబంధం లేదు
బి. వాతావరణంలో తేమను కొలిచేది హైడ్రోమీటర్
సి. 00C వద్ద గాలిలో ధ్వనివేగం 343 m/sec
డి. నీటిలో ధ్వనివేగం గాలిలో ధనివేగం కంటే 4.3 రెట్లు ఎక్కువ
1) ఎ, సి 2) ఎ, డి
3) బి, డి, సి 4) బి, డి
5. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. 200C వద్ద పొడిగాలిలో ధ్వనివేగం 1236 km/hour
బి. ధ్వని మూడు సెకన్లలో 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది
సి. 200C వద్ద ఇనుములో ధ్వనివేగం గాలిలో కంటే 15 రెట్లు అధికం
డి. 200C వద్ద సముద్రపు నీటిలో ధ్వనివేగం 1482 m/sec
1) ఎ, బి 2) బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
6. ప్రతిపాదన (ఎ) : ధ్వనిని టేప్రికార్డర్లో ప్లాస్టిక్ టేపులపై రికార్డు చేస్తారు
కారణం (ఆర్) : విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగా అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు
1) ఎ, ఆర్లు నిజం. అదేవిధంగా ఎ కి ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్లు నిజంకాదు. ఎ కి ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ నిజం ఆర్ తప్పు
4) ఎ తప్పు ఆర్ నిజం
7. జతపరచండి.
ఎ. ఈల వేయడం 1. డాప్లర్ ప్రభావం
బి. స్టెతస్కోప్ 2. ఎకో
సి. మార్ష్ వాయువు గుర్తించడం 3. ప్రతినాదం (బళ పరావర్తనం)
డి. గర్భస్థ శిశువు హృదయ స్పందన 4. విస్పందనలు
5. అనునాదం
1) ఎ-5, బి-3, సి-4, డి-1 2) ఎ-5, బి-2, సి-4, డి-1
3) ఎ-5, బి-5, సి-2, డి-4 (డౌట్) 4) ఎ-2, బి-5, సి-3, డి-1
8. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. సైనికులను వంతెనలపై స్టెప్అవుట్ చేయమనడానికి కారణం అనునాదం
బి. ఖాళీగా ఉన్న గదిలో ధ్వని పలుమార్లు వినబడుతుంది. దీనికి కారణం ప్రతినాదం
సి. ఆకాశంలో సోనిక్భూమ్కు కారణం జెట్ విమానాలు
డి. మేఘం ఒకసారి ఉరిమితే నాలుగైదుసార్లు వినబడటానికి కారణం ప్రతినాదం
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
9. ప్రతిపాదన (ఎ): మనిషి చెవి సెకనుకు గరిష్ఠంగా 10 విస్పందనాలను గుర్తించగలడు.
కారణం (ఆర్): పౌనఃపున్యంలో స్వల్ప తేడాలు గల రెండు ధ్వని తరంగాలు కలిసినప్పుడు ఏర్పడే వృద్ధి క్షయాలను విస్పందనాలు అంటారు.
1) ఎ, ఆర్లు నిజం. అదేవిధంగా ఎ కి ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్లు నిజం కాదు. అదేవిధంగా ఎ కి ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ నిజం, ఆర్ తప్పు
4) ఎ తప్పు, ఆర్ నిజం
10. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ. ఎకోకార్డియోగ్రామ్లో ఉపయోగించేవి అతిధ్వనులు
బి. మెరుపులు కనిపించిన తరువాత ఉరిమిన శబ్దం వినిపిస్తుంది
సి. రాడార్లో సూపర్సోనిక్స్ ఉపయోగిస్తారు
డి. ధ్వని తరంగాలు ఒక యానకం నుంచి మరొక యానకానికి ప్రయోగించినప్పుడు పౌనఃపున్యం మారదు
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
11. భారతీయ సంగీతంలోని ‘సరిగమపదనిస’లో రెండో డయటోనిక్ స్వరం ‘స’ పౌనఃపున్యం ఎంత?
1) 512Hz 2) 256Hz
3) 356Hz 4) 756Hz
12. సరైన వివరణ గుర్తించండి.
ఎ. ధ్వని తరంగాలు కనిపించే వస్తువు నుంచి వెలువడే తిర్యక్ తరంగాలు
బి. ధ్వని వేగం పదార్థ స్థితిస్థాపకతపై ఆధారపడుతుంది
సి. యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణిస్తాయి
డి. స్వరతంత్రుల పొడవు పురుషుల్లో కన్నా స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది
1) ఎ, బి 2) బి మాత్రమే
3) డి మాత్రమే 4) బి, డి
13. కింది వాటిని జతపరచండి.
ఎ. 200C వద్ద ధ్వనివేగం
బి. 200C వద్ద స్వచ్ఛమైన నీటిలో ధ్వని వేగం
సి. చెవినొ ప్పిగా అనిపించే ధ్వని స్థాయి
డి. కర్ణభేరి చిల్లులు పడే ధ్వని స్థాయి
1) ఎ-4, బి-2, సి-1, డి-3 1. 160 db
2) ఎ-4, బి-2, సి-3, డి-1 2. 1482 m/sec
3) ఎ-2, బి-4, సి-3, డి-1 3. 120 db
4) ఎ-4, బి-3, సి-2, డి-1 4. 343.2 m/sec
14. గబ్బిలాలు చీకట్లో దేన్నీ తగలకుండా సులభంగా ఎగరటానికి కారణం?
1) పరశ్రావ్యములు 2) ద్రవ్య ధ్వనులు
3) అతి ధ్వనులు
4) చీకట్లో చూసే దృష్టి అభివృద్ధి చెందడం
15. ధ్వని స్థాయి కింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది?
1) కంపన పరిమితి 2) ధ్వని పౌనఃపున్యం
3) తరంగ దైర్ఘ్యం 4) పైవన్నీ
16. కింది వ్యాఖ్యల్లో ఏది సరైనది?
ఎ. సముద్ర అంతార్భగంలో గల సబ్మెరైన్ (జలాంతర్గామి) ఉనికి, లోతు, వేగం, కదిలే దిశను కనుక్కోవడానికి తోడ్పడే SONAR (Sound Navigation and Ranging) డాప్లర్ ఫలితం మీద ఆధారపడి పనిచేస్తుంది
బి. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్ క్రాప్ట్ (విమానాలు), రాకెట్లు, క్షిపణుల ఉనికిని తెలుసుకోవడానికి RADAR (Radio Dete ction and Ranging) డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది.
1) ఎ సరైంది బి తప్పు
2) రెండు సరైనవే
3) ఎ సరికాదు బి సరైనది
4) ఏదీ సరికాదు
17. ధ్వని తరంగాల తీవ్రత దృష్ట్యా జతపరచండి.
ఎ. గుసగుసలు 1. 60 db
బి. టెలిఫోన్ 2. 15-20 db
సి. ట్రాపిక్ 3. 80-90 db
డి. జెట్ విమానం 4. 100- 200 db
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-2, సి-1, డి-3
18. సినిమా హాళ్ల గోడలు, పైకప్పును రంపపు పొట్టుతో కప్పడానికి కారణం?
1) హాల్కు మరింత సౌందర్యం ఇవ్వడానికి
2) ప్రతివాదాన్ని తగ్గించడానికి
3) అధిక పౌనఃపున్యం గల ధ్వనిని శోషించడానికి
4) అనునాద నివారణ
19. జతపరచండి.
ఎ. సోనార్ 1. క్రిస్టియన్ డాప్లర్
బి. డాప్లర్ ప్రభావం 2. వాట్సన్ వాట్
సి. ధ్వని రికార్డ్, 3. నిక్సన్ పునరుత్పత్తి
డి. రాడార్ 4. పౌల్సన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-1, సి-3, డి-2
20. ఆడవారి గొంతు మగవారి కన్నా ‘కీచు’గా ఉండటానికి కారణం?
1) తక్కువ తరచుదనం
2) తక్కువ పౌనఃపున్యం
3) ఎక్కువ పౌనఃపున్యం
4) ఎక్కువ కంపన పరిమితి
21. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు?
ఎ. ఘన పదార్థం బి. ద్రవ పదార్థం
సి. వాయు పదార్థం డి. శూన్య ప్రదేశం
1) ఎ మాత్రమే 2) డి మాత్రమే
3) సి, డి 4) బి, డి
22. (1) కుక్కలు 50,000Hz వరకు, గబ్బిలాలు 1,00,000Hz వరకు ధ్వనిని వింటాయి
(2) డాల్ఫిన్ 1,00,000Hz పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి చేసి గుర్తిస్తాయి
1) పై రెండూ సరైనవి
2) 2 సరైనది, 1 తప్పు
3) 1 సరైనది, 2 తప్పు
4) పై రెండూ తప్పు
23. ‘ధ్వని బళ పరావర్తనం’ అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం?
1) రాడార్ 2) ఈసీజీ
3) అల్ట్రాసోనోగ్రఫీ 4) స్టెతస్కోప్
24. సైనికులు కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం?
1) అనునాదం 2) ధ్వని వక్రీభవనం
3) ధ్వని పరావర్తనం 4) ధ్వని రుజువర్తనం
25. కింది వాటిలో అతిధ్వనుల వల్ల కలిగే ఉపయోగం కానిది ఏది?
ఎ. పాల నుంచి కొవ్వును వేరు చేయడం
బి. పాత్రల్లోని పగుళ్లను గుర్తించడం
సి. దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడం
డి. సోనోగ్రఫీలో వాడటం
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) పైవన్నీ
26. గబ్బిలాలు కారు చీకటిలో కూడా ఎగురగలవు ఎందుకు?
1) చీకటిలో కూడా చూడగలిగే దృష్టి ఉంటుంది
2) వాటి కంటి భాగాల్లో పుపిల్స్ చాలా పెద్దవి
3) అన్ని పక్షులకు ఉండే లక్షణాలే ఉంటాయి
4) రాత్రి సమయంలో అతిధ్వనులను ఉత్పత్తి చేస్తూ వాటిని అనుసరిస్తాయి
27. ప్రతి ధ్వనుల ఉత్పత్తికి కారణం?
1) ధ్వని దృవత్వం 2) ధ్వని ప్రతివర్తనం
3) ధ్వని వివర్తనం 4) ధ్వని పరావర్తనం
28. శబ్ద తరంగాలు ఏ మాధ్యమంలో అధిక వేగం తో ప్రయాణిస్తాయి?
1) గాలి 2) శూన్యం 3) నీరు 4) ఉక్కు
29. ఉరుము శబ్దం కంటే మెరుపు కాంతి తొందరగా కనిపిస్తుంది ఎందుకు?
1) శబ్దం కంటే కాంతి వేగంగా ప్రయాణిస్తుంది
2) కాంతి శూన్యం గుండా ప్రయాణిస్తుంది కానీ శబ్దం ప్రయాణించదు
3) మేఘాలు ఉరుము శబ్దాన్ని అడ్డుకుంటాయి
4) ఉరుము తర్వాత వెలువడుతుంది
30. ఒక శబ్దం తీవత్ర గరిష్ఠ విలువను కింది భౌతిక అంశాలు నిర్ణయిస్తాయి.
1) వేగం 2) తరంగ దైర్ఘ్యం
3) కంపన పరిమితి 4) పౌనఃపున్యం
31. సాంకేతిక విధానం ద్వారా త్రిమితీయ దృశ్యాల/వస్తువుల ఉత్పత్తిని శబ్ద రికార్డులు చేయగలిగితే దాన్ని ఏమంటారు?
1) ఫ్రొటోగ్రఫీ 2) లెక్సికోగ్రఫీ
3) మోలో గ్రఫీ 4) ఆడియోగ్రఫీ
32. ఒక శబ్దం తీవ్రతను నిర్ణయించడం దేనిపై ఆధారపడుతుంది?
1) ధ్వని 2) వేగం
3) పౌనఃపున్యం 4) కంపన పరిమితి
33. పరిశీలనలో ఉన్న వ్యక్తిని దాటుతూపోతున్న పోలీసు వ్యాను సైరన్ శబ్ద త్రీవతను సాధారణ శబ్ద తీవ్రతతో పోల్చినప్పుడు?
1) అధికంగా ఉంటుంది
2) తక్కువగా ఉంటుంది
3) సమానంగా ఉంటుంది
4) అధికం లేదా తక్కువ అనేది వ్యాను వేగాన్ని బట్టి ఉంటుంది
34. దేని అధ్యయనాన్ని అకౌస్టిక్స్ అంటారు?
1) కాంతి 2) ఉష్ణం
3) ధ్వని 4) అంతరిక్ష ప్రయాణం
35. ధ్వని అతినెమ్మదిగా ప్రయాణించే మాధ్యమం ఏది?
1) చెక్క 2) నీరు 3) గ్లాస్ 4) గాలి
36. డెసిబుల్ దేనికి ప్రమాణం?
ఎ) విద్యుచ్ఛక్తి బి) కాంతి
సి) శబ్దం డి) ఉష్ణం
37. టెలిఫోన్ను కనుగొన్నవారు?
ఎ) ఆల్ఫ్రెడ్ నోబెల్ బి) డార్విన్
సి) అలెగ్జాండర్ గ్రహంబెల్
డి) థామస్ ఆల్వా ఎడిసన్
38. ధ్వని నాణ్యత ఆధారపడి ఉండేది?
ఎ) అతిస్వరం బి) పౌనఃపున్యం
సి) డోలన పరిమితి డి) తరంగ దైర్ఘ్యం
39. రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దిశలో ఉంటే అది దాని?
ఎ) తరంగ దైర్ఘ్యం బి) పౌనఃపున్యం
సి) కాంతి తీవ్రత డి) కంపన పరిమితి
40. ధ్వని కింది వాటిలో దేని ద్వారా ప్రయాణించలేదు?
ఎ) ఉదజని బి) ఉక్కు
సి) నీరు డి) శూన్యం
సమాధానాలు
1. 4 2. 2 3. 1 4. 2 5. 4 6. 1 7. 1 8. 4 9. 1 10. 3 11. 1 12. 2 13. 1 14. 3 15. 2 16. 2
17. 2 18. 2 19. 3 20. 3 21. 2 22. 3 23. 4 24. 1 25. 3 26. 4 27. 4 28. 4 29. 1 30. 3 31. 3 32. 4
33. 1 34. 3 35. 4 36. 3 37. 3 38. 1 39. 1 40. 4
పీ ఢిల్లీ బాబు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు