డిపాజిట్ల స్వీకర్త.. పరపతి సృష్టికర్త
వాణిజ్య బ్యాంకులు- ప్రాథమిక విధులు
బ్యాంకింగ్ అనేది ఒక వ్యాపారం
- బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి. పరపతిని సమకూరుస్తాయి. ఖాతాదార్లకు కొన్ని ఇతర బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. పరపతి సృష్టిస్తాయి. ద్రవ్య సప్లయ్‌ని ప్రభావితం చేస్తాయి. ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.
- బ్యాంకులు రెండు విధాలుగా ఉంటాయి.
1) షెడ్యూల్ బ్యాంకులు
2) నాన్ షెడ్యూల్ బ్యాంక్‌లు - షెడ్యూల్ బ్యాంకుల్లో వాణిజ్య బ్యాంకులు ఒకటి, ముఖ్యమైనవి. దేశ ఆర్థికాభివృద్ధిలో ద్రవ్య మార్కెట్లో వాణిజ్య బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తాయి.
నిర్వచనం : వాణిజ్య దృక్పథంతో ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి వాటిని రుణాలుగా ఇచ్చి లాభాలను ఆర్జించే బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అంటారు. - షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల విధులను రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ) ప్రాథమిక విధులు
బి) అనుషంగిక విధులు
1) ప్రాథమిక విధులు
- వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధులను తిరిగి నాలుగు విధాలుగా వివరించవచ్చు. డిపాజిట్లు స్వీకరించడం
- వాణిజ్య బ్యాంకులు రెండు రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి.
డిమాండ్ డిపాజిట్లు
- డిపాజిట్‌దారుడు ఖాతాదారుడు ఎటువంటి ముందస్త్తు సమాచారం లేకుండా అడిగిన వెంటనే బ్యాంకులు తిరిగి చెల్లించవలసిన డిపాజిట్లను ‘డిమాండ్ డిపాజిట్లు’ అంటారు.
- ఇవి చెక్కుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు.
- ఇవి వినిమయ మాద్యంగా పని చేస్తాయి.
- డిమాండ్ డిపాజిట్లపై వడ్డీ ఉండదు.
- అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ డిపాజిట్స్ అధికంగా (80 శాతం) ఉంటాయి. డిమాండ్ డిపాజిట్లు రెండు రకాలుగా ఉంటాయి.
పొదుపు డిపాజిట్లు (Saving deposits)
- చిన్న, మధ్య తరగతి ఆదాయ వర్గాలవారు, ఉద్యోగులు, చిన్న, చిన్న వ్యాపారస్తులకు ఇవి సౌకర్యంగా ఉంటాయి.
- ప్రజల్లో పొదుపును పోత్సహించడం కోసం ఉపయోగపడతాయి.
- పొదుపు డిపాజిట్లపై వడ్డీరేటు అతిస్వల్పంగా అంటే 4 శాతం చెల్లిస్తుంది.
- ఈ డిపాజిట్లను ఎప్పడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కాని నెలసరి కాల పరిమితులు ఉంటాయి.
కరెంటు డిపాజిట్లు Current deposits
- కరెంట్ ఖాతాల ద్వారా స్వీకరించే డిపాజిట్లను కరెంట్ ‘డిపాజిట్లు’ అంటారు.
- ఖాతాదారుడు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అడిగిన వెంటనే రోజుకు ఎన్ని సార్లు అయినా తిరిగి చెల్లించవలసిన డిపాజిట్లను కరెంట్ డిపాజిట్లు అంటారు.
- సాధారణంగా వ్యాపారస్థులకు, సంస్థలకు వేగవంతమైన సులభ వ్యవహారాలకు ఉపయోగపడతాయి.
- కరెంటు ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది.
- ఈ ఖాతాపై బ్యాంకు వడ్డీరేటు చెల్లించదు.
- నిర్ణీత కాల పరిమితి వరకు తిరిగి తీసుకోవడానికి వీలులేని డిపాజిట్లను కాలపరిమితి డిపాజిట్లు అంటారు. టైం డిపాజిట్లు రెండు రకాలుగా ఉంటాయి.
1) ఫిక్స్డ్ డిపాజిట్లు : (Fixed deposit)
- ఒక నిర్ణీత కాలవ్యవధికి ఒకే మొత్తంలో డిపాజిట్ చేస్తే వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. వీటినే స్థిర డిపాజిట్లు అని కూడా అంటారు. వీటిని నిర్ణిత కాల వ్యవధి లోపల తిరిగి తీసుకోవడానికి వీలు ఉండదు.
- వీటిపై వడ్డీరేటు 6 నుంచి 12 శాతం వరకు ఉంటుంది. కాల వ్యవధి పెరిగే కొద్ది వడ్డీరేటు పెరుగుతుంది.
- బ్యాంకు డిపాజిట్లలో అత్యధిక వడ్డీని ఈ డిపాజిట్లపైన బ్యాంకులు చెల్లిస్తాయి.
- భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఈ డిపాజిట్లు ఉంటాయి.
2) పునరావృత డిపాజిట్లు / రికరింగ్ డిపాజిట్లు - వీటిని సంచిత డిపాజిట్లు అని కూడా అంటారు.
- ఇందులో సొమ్మును ఒకేసారి, ఒకే మొత్తంలో డిపాజిట్ చేయకుండా ప్రతినెలా, ప్రతీ సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాలు సమాన వాయిదా పద్ధతిలో పొదుపు చేయడాన్ని రికరింగ్ డిపాజిట్లు అంటారు.
- ఈ డిపాజిట్లపై బ్యాంకు చక్రవడ్డీ చెల్లిస్తుంది.
- సాధారణంగా నెలసరి ఆదాయం పొందేవారు, అల్ప ఆదాయవర్గాల వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది.
- స్థిర ఆదాయ వర్గాల వారిలో పొదుపును ప్రోత్సహించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
- రుణాలు, అడ్వాన్సులు ఇవ్వడం
- పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, రైతులు, చేతివృత్తుల వారు మొదలైన అనేక వర్గాల వారికి రుణాలు, అడ్వాన్సులు ఇవ్వడం వాణిజ్య బ్యాంకుల మరొక విధి.
- వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లను రుణాలుగా మంజూరు చేయడం ఈ రుణాలు, అడ్వాన్సులు వివిధ రకాలుగా ఉంటాయి.
- బ్యాంక్ కోరిన వెంటనే తిరిగి చెల్లించవలసిన రుణాలను డిమాండ్ రుణాలు అంటారు. దీనినే కాల్ రుణాలు, పిలుపు రుణాలు అని కూడా అంటారు.
- రుణ గ్రహిత ఖాతాలోకి రుణ మొత్తం ఒకేసారి జమ చేయబడుతుంది.
- బాండ్లు, షేర్లు, సెక్యూరిటీలను హామీతో గాని, లేకుండా గాని రుణాలను చెల్లిస్తుంది.
- సాధారణంగా ఇతర వాణిజ్య బ్యాంకులకు, విత్త సంస్థలకు కాల్ రుణాలు ఇస్తుంది.
స్వల్పకాలిక రుణాలు
- వ్యాపారస్థులకు, వ్యవసాయ దారులకు, ఇతర సంస్థలకు ఒక నిర్ణీత కాలపరిమితికి రుణాలను మంజూరు చేస్తుంది.
- రుణ గ్రహిత ఖాతాలోనికి రుణమొత్తం ఒకేసారి జమ చేస్తుంది.
- సెక్యూరిటీలను హామీగా ఉంచుకునే రుణం చెల్లిస్తుంది.
- ఈ రుణాన్ని నిర్ణీత కాల వ్యవధిలో ఒకే సారిగాని, వాయిదాలుగా గానీ తిరిగి చెల్లించవచ్చు.
నగదు జమలు (Cash Credit )
- ఖాతాదారుడు (రుణగ్రహిత) తమ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని ఒకే మారుకాకుండా తమ అవసరాన్ని బట్టి వివిధ వాయిదాలుగా తీసుకోవడానికి వీలున్న రుణాన్ని నగదు జమలు అంటారు. దీన్ని ద్రవ్యపరపతి అంటారు.
- ఖాతాదారుడు వాడుకున్న సొమ్ముమేరకే వడ్డీ చెల్లిస్తారు.
- బాండ్లు, షేర్లు, సెక్యూరిటీలను హామీగా ఉంచుకొని రుణం ఇస్తుంది.
ఓవర్‌డ్రాఫ్ట్
- ఖాతాదారులు తమ ఖాతాలో ఉన్న సొమ్ముకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతిస్తే దాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ అంటారు.
- ఈ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కేవలం కరెంటు ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది.
- దీని ద్వారా తీసుకున్న సొమ్ముకు వడ్డీ చెల్లించాలి. దీనికి నిర్ధిష్ట పరిమితి ఉంటుంది. వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం
- పరపతి ప్రాతిపదికన విక్రయం జరిగినప్పుడు కొనుగోలుదారుడు, అమ్మకం దారునికి రాత పూర్వకంగా (అరువు రూపంలో) ఇచ్చిన హామీని ‘వినిమయ బిల్లు’ అంటారు.
- ఈ బిల్లు కలిగిన వ్యాపారులు తమకు ద్రవ్యం అవసరమైనప్పుడు బ్యాంకుకు ఈ బిల్లులు సమర్పించి కొంత మొత్తాన్ని తగ్గించుకొని అడ్వాన్స్‌గా తీసుకుంటారు. దీనిని బిల్లుల డిస్కౌంట్ అంటారు.
- క్రెడిట్ కార్డు పద్ధతిని వాణిజ్య బ్యాంకులు ప్రవేశ పెట్టాయి. క్రెడిట్ కార్డ్‌లు కలిగి ఉన్న ఖాతాదారుడు బ్యాంకు ఆమోదం పొందిన వ్యాపార సంస్థల నుంచి నగదు చెల్లించకుండా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేయవచ్చు.
- వ్యాపార సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంకు నుంచి తమ బిల్లు మొత్తం వసూలు చేసుకుంటాయి.
చెక్కుల పద్ధతిని ఏర్పాటు చేయడం - ఖాతాదారులు తమ డిపాజిట్లను వాపసు తీసుకోవడానికి వీలుగా బ్యాంకులు చెక్కుల పద్ధతిని ప్రవేశ పెట్టెను.
చెక్కు
- అడిగిన తక్షణమే డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్టమైన బ్యాంకరును ఆజ్ఞాపించే వినిమయ పత్రాన్నే చెక్కు అంటారు. చెక్కులు రెండు రకాలుగా ఉంటాయి.
ఎ) బేరర్ చెక్ : ఈ చెక్‌ను కలిగి ఉన్న వ్యక్తి ఆ చెక్‌ను బ్యాంకుకు ఇచ్చిన వెంటనే డబ్బు చెల్లించబడును.
బి) క్రాస్డ్ చెక్ : ఈ చెక్‌ను బ్యాంకుకు ఇస్తే ఆచెక్ మొత్తాన్ని చెక్దారు పేర జమ చేస్తారు. - వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి చేస్తాయి.
- వాణిజ్య బ్యాంకులు, ఖాతాదారునికి రుణం మంజూరు చేసినప్పుడు వారికి నగదు చెల్లించకుండా వారిఖాతాలో జమ చేస్తుంది. ఈ విధంగా సెకండరీ డిపాజిట్లు లేదా ఉత్పన్న డిపాజిట్లు సృష్టించబడతాయి. దీనినే పరపతి సృష్టి అంటారు.
- వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్ల నుంచి సెకండరీ డిపాజిట్లు సృష్టించే ప్రక్రియనే పరపతి సృష్టి అంటారు.
- ప్రజలు / సంస్థలు నుంచి బ్యాంకులకు నేరుగా వచ్చే నగదు డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు అంటారు.
- బ్యాంకులు, రుణాలు, అడ్వాన్స్‌లను ఇచ్చేటప్పుడు సృష్టించే డిపాజిట్లను సెకండరీ డిపాజిట్లు/ ఉత్పన్న డిపాజిట్లు అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. బ్యాంకులు డిపాజిట్లను?
ఎ) సృష్టిస్తాయి బి) స్వీకరిస్తాయి
సి) భద్రపరుస్తాయి డి) పైవన్నీ
2. వాణిజ్యబ్యాంకు
ఎ) షెడ్యూల్ వాణిజ్య బ్యాంకు
బి) నాన్ షెడ్యూల్ వాణిజ్యబ్యాంకు
సి) ఎ, బి డి) పైవేవీకావు
3. వాణిజ్య బ్యాంకుల ప్రధాన విధులు ఏవి?
ఎ) డిపాజిట్లు స్వీకరించడానికి, చెక్కులు జారీ చేయడం
బి) ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు
సి) డిపాజిట్లను స్వీకరించడం, భద్రత కల్పించడం
డి) అనుషంగిక విధులు, గౌణ విధులు
4. ఈ కింది వాటిలో వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధి?
ఎ) డిపాజిట్లను స్వీకరించడం
బి) రుణాలు ఇవ్వడం
సి) పరపతి సృష్టి, చెక్కుల పద్ధతి
డి) పైవన్నీ
5. ఖాతాదారుడు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అడిగిన వెంటనే బ్యాంకులు తిరిగి చెల్లించే డిపాజిట్ల్లు ఏవి?
ఎ) డిమాండ్ డిపాజిట్
బి) పొదుపు డిపాజిట్
సి) కాలపరిమితి డిపాజిట్లు
డి) ఫిక్స్డ్ డిపాజిట్లు
6. చిన్న, మధ్య తరగతి స్థిర ఆదాయ వర్గాల వారికి సౌకర్యవంతమైన డిపాజిట్లు ఏవి?
ఎ) డిమాండ్, డిపాజిట్లు
బి) పొదుపు డిపాజిట్లు
సి) కాలపరిమితి డిపాజిట్లు
డి) రికరింగ్ డిపాజిట్లు
7. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఏ ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది?
ఎ) సేవింగ్ ఖాతా బి) కరెంట్‌ఖాతా
సి) రికరింగ్ ఖాతా డి) పైవన్నీ
8. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ రకమైన డిపాజిట్లు అధికంగా ఉంటాయి.
ఎ) టైం డిపాజిట్లు
బి) స్థిర డిపాజిట్లు
సి) రికరింగ్ డిపాజిట్లు
డి) పైవన్నీ
9. ఏ రకమైన డిపాజిట్లపై బ్యాంకులు చక్రవడ్డీ కూడా చెల్లిస్తాయి?
ఎ) ఫిక్స్డ్ డిపాజిట్లు
బి) కరెంట్ డిపాజిట్లు
సి) రికరింగ్ డిపాజిట్లు
డి) పొదుపు, డిపాజిట్లు
10. డిమాండ్ రుణాలకు మరొక పేరు?
ఎ) కాల్ రుణాలు
బి) పిలుపు రుణాలు
సి) స్వల్పకాలిక రుణాలు డి) ఎ, బి
11. పరపతి ద్రవ్యాన్ని సృష్టించే బ్యాంకులు ఏవి?
ఎ) రిజర్వుబ్యాంకు
బి) వాణిజ్య బ్యాంకు
సి) యూనియన్ బ్యాంక్
డి) పైవన్నీ
పానుగంటి కేశవ రెడ్డి: రచయిత వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని 9949562008
సవరణ: డిసెంబర్ 17న ప్రచురితమైన నిపుణ Iవ పేజీ(ఎకానమీ)లో 24వ ప్రశ్నకు సమాధానం 1956, ఫిబ్రవరి 20గా చదువుకోగలరు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు