ఎన్డీఏలో మెరిసిన స్వరూప్రావు
# డిఫెన్స్ అకాడమీ పరీక్షలో 213వ ర్యాంకు
# జాతీయ స్థాయిలో సత్తా చాటిన జగిత్యాలవాసి
యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో జగిత్యాల జిల్లావాసి మెరిశాడు. జగిత్యాలలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన బోయినపల్లి ప్రసాద్రావు – మనోజ దంపతుల కుమారుడు స్వరూప్రావు ఎన్డీఏ-2021 పోటీ పరీక్షకు హాజరయ్యాడు. ఐదులక్షల మందికిపైగా హాజరైన పరీక్షలో ఎనిమిది వేల మంది మౌఖిక పరీక్షకు అర్హత సాధించగా అందులో ఇతడు ఉన్నాడు. వీరికి 12 బోర్డుల ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి 466 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి పది రోజులపాటు మెడికల్ టెస్ట్ నిర్వహించి బుధవారం మెరిట్ జాబితా విడుదల చేశారు. ఇందులో స్వరూప్రావు 213వ ర్యాంకు సాధించాడు. శిక్షణ అనంతరం అధికారులు ఇతడిని నేవీ అధికారిగా నియమించనున్నారు. స్వరూప్రావు ఎంపికపై తల్లిదండ్రులు, కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Previous article
ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంపు
Next article
పీజీ చదవకుండానే పీహెచ్డీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు