అంతరిక్ష కోర్సులకు అరుదైన వేదిక … ఐఐఎస్టీ
అంతరిక్ష రంగంలో దూసుకు పోవాలనుకుంటున్నారా? ఏవియానిక్స్, స్పేస్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ వంటి విలక్షణమైన కోర్సులు చదువాలనుకుంటున్నారా? ఇస్రో, దీని అనుబంధ, సంబంధ సంస్థల్లో కొలువులు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన కోర్సులకు వేదికైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాలజీ (ఐఐఎస్టీ)
మీ డిస్టినేషన్. కేవలం ఇంటర్ ఉత్తీర్ణత, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్‌లో తగిన స్కోర్ సాధించినవారికి ఇదొక
సువర్ణావకాశం. బీటెక్ ప్రవేశాల ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా ఐఐఎస్టీ గురించి …
ఐఐఎస్టీ
-దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఐఐఎస్టీ ఒకటి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్ బాడీ కలిగిన విద్యా సంస్థ. కేరళలోని వలిమల (తిరువనంతపురం దగ్గర)లో 100 ఎకరాల్లో క్యాంపస్‌ను 2007లో ప్రారంభించారు. ఈ సంస్థ బీటెక్, ఎంటెక్/ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌ను అఫర్ చేస్తుంది. ముఖ్యంగా ఏరోస్పేస్, ఏవియానిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ సిస్టం సైన్సెస్, ్యమానిటీస్, మ్యాథ్స్, ఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్ విభాగాల్లో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌గా కోర్సులను అందిస్తుంది.
-98 మంది హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో, సకల సౌకర్యాలతో ఈ సంస్థ విద్యను అందిస్తుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌ల ప్రకారం దేశంలోని టాప్-50లో ఐఐఎస్టీ నిలిచింది.
అందించే కోర్సులు: అండర్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ
బీటెక్ ప్రోగ్రామ్
– ఏరోస్పేస్ ఇంజినీరింగ్ – ఇది నాలుగేండ్ల కోర్సు. సీట్ల సంఖ్య – 75
– ఈసీఈ (ఏవియానిక్స్) – ఇది నాలుగేండ్ల కోర్సు. సీట్ల సంఖ్య – 75
-డ్యూయల్ డిగ్రీ (బీటెక్‌తోపాటు ఎంటెక్/ఎంఎస్) – ఇది ఐదేండ్ల కోర్సు. సీట్ల సంఖ్య – 24
– మొత్తం సీట్ల సంఖ్య – 174
– డ్యూయల్ డిగ్రీ చేసినవారికి బీటెక్ ఇంజినీరింగ్ ఫిజిక్స్‌తో పాటు ఎంఎస్/ఎంటెక్(ఎంచుకున్న సబ్జెక్టులో) డిగ్రీలను ప్రదానం చేస్తారు.
-ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీలో బీటెక్ (ఇంజినీరింగ్ ఫిజిక్స్) తర్వాత పీజీలో ఎంఎస్ ఇన్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎంఎస్ ఇన్ ఆస్ట్రానమి అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఎస్ ఇన్ ఎర్త్ సిస్టం సైన్స్, ఎంటెక్ ఇన్ ఆప్టికల్ ఇంజినీరింగ్‌లో ఒకదాన్ని చదవచ్చు.
ఎంపిక ఎలా
– ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ 2022 స్కోర్ ద్వారా
నోట్: ఐఐఎస్‌టీకి దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు.
ఎవరు అర్హులు:
– జనరల్/ఓబీసీ అభ్యర్థులు 1997, అక్టోబర్ 1 లేదా తర్వాత, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు 1992, అక్టోబర్ 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి.
-ఇంటర్ (ఎంపీసీ) 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 65 శాతం మార్కులు సాధించి ఉండాలి.
-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐఐఎస్టీ నిర్దేశించిన మార్కులు సాధించాలి.
– తప్పనిసరిగా ఐఐఎస్‌టీకి దరఖాస్తు చేసుకొన్నవారు మాత్రమే అర్హులు.
ఆర్థిక సహాయం:
– ఆల్ ఇండియా ర్యాంకుల్లో టాప్-5 ర్యాంకర్లు మొదటి సెమిస్టర్ పూర్తి ఫీజును కట్టనవసరం లేదు. ప్రతి సెమిస్టర్లో నిర్దేశిత సీజీపీఏను (సీజీపీఏ 9) సాధిస్తే సెమిస్టర్ ఫీజు ఇతర ఖర్చులను సంస్థ భరిస్తుంది.
ఉద్యోగావకాశాలు
– నాలుగేండ్ల బీటెక్ లేదా ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీని పూర్తిచేసుకొన్న అభ్యర్థులు 6 లేదా 8వ సెమిస్టర్లో కనీసం 7 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధిస్తే ఇస్రో హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించే జాబ్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. వీరికి ఇస్రో లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కేంద్రాల్లో ఉద్యోగావకాశం కల్పించే అవకాశం ఉంది.
– వీటితోపాటు అడోబ్ సిస్టమ్స్, అగ్నికుల్ ఏరోస్పెస్, యాంత్రిక్స్, ఎయిర్‌బస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనలాగ్ డివైసెస్, సీడాక్, జీఈ, హెచ్‌సీఎల్, ఇన్పోసిస్, ఐఐటీ మద్రాస్, ఖరగ్‌పూర్, ఇంటెల్, ఇండియన్ నేవీ, ఎల్ అండ్ టీ, టీసీఎస్ వంటి సుమారు 120 కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చాయి.
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ -డీమ్డ్ యూనివర్సిటీ
– చాన్స్‌లర్: డా. బి.ఎన్.సురేష్
– ఐఐఎస్టీ గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్: ఎస్.సోమనాథ్ (ఇస్రో చైర్మన్)
-డైరెక్టర్: డా. డి.శ్యామ్ దయాల్ దేవ్
-క్యాంపస్ తిరువనంతపురానికి 20 కి.మీ. దూరంలో ఉంది
– డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్స్ అఫిలియేషన్ ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు