ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 149 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 3 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
మొత్తం పోస్టులు: 149
ఇందులో డాటా అనలిస్ట్ 8, ఫార్మసిస్ట్ 67, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ 1, అడ్వైజర్ 4, డిప్యూటీ మేనేజర్ 10, మేనేజర్ 51, ఎగ్జిక్యూటివ్ 1, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 1, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 3, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 3 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
పరీక్ష ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 3
వెబ్సైట్: sbi.co.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






