వాణిజ్య బ్యాంకుల్లో 5830 క్లరికల్ ఖాళీలు
IBPS క్లర్క్-2021
ప్రిపరేషన్ ప్లాన్
బ్యాంకు ఉద్యోగాల పర్వం మొదలైంది. ఇక వచ్చే 6 నెలలు వివిధ బ్యాంకు పరీక్షలు ఉండనున్నాయి. ఈ సమయంలో సరైన ప్రణాళిక వేసుకుని పరీక్షలకు సిద్ధమైతే తప్పకుండా బ్యాంకు ఉద్యోగం పొందాలనుకునేవారి కల నెరవేరుతుంది.
కరోనా కారణంగా ప్రిపరేషన్ ఇంటివద్దనే ఉండి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు, కోచింగ్ వంటివి పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఆన్లైన్ కోచింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో బోధన పొందుతున్నారా లేదా అని తెలుసుకోవాలి. సిలబస్, పరీక్ష విధానంతో పాటు చాప్టర్వైజ్ ప్రిపరేషన్, మోడల్ ప్రశ్నపత్రాలు సాల్వ్ చేయడం ఉందా లేదా అని గమనించాలి.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారుతుంది. ఆన్లైన్ నేపథ్యంలో కొనసాగితే కొత్త పద్ధతులను అవలంబించుకోవాలి. తాజాగా వెలువడిన క్లరికల్ నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్ట్ 28 లేదా 29, సెప్టెంబర్ 4వ తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు ఇంకా 45 రోజుల సమయం ఉంది. మెయిన్ పరీక్ష అక్టోబర్ 31న ఉంటుంది. ఈ పరీక్షకు మూడున్నర నెలల సమయం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ మాత్రం ఉమ్మడిగానే చేయాలి. ప్రతి విభాగంలో ముఖ్యమైన టాపిక్స్‌ను ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం విభజించుకోవాలి. ప్రిలిమ్స్‌లో బేసిక్స్, క్యాలిక్యులేషన్స్ పార్ట్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో హెచ్చుస్థాయి ప్రశ్నలు అధికం. కాబట్టి అభ్యర్థులు బేసిక్స్ నుంచి హెచ్చుస్థాయి ప్రశ్నలపై దృష్టిపెట్టాలి.
బ్యాంకింగ్ పరీక్షలకు సమయం చాలా కీలకం. నిర్ణీత సమయాల్లో విభాగాలను పూర్తిచేయాలి. మెరిట్ మార్కులు సాధించేవారు ప్రతి ప్రశ్నకు కేవలం 20 సెకన్లు కేటాయిస్తారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వేగంగా సమాధానాలు గుర్తించే పద్ధతులను అలవర్చుకోవాలి.తేలిక ప్రశ్నలు, హైలెవల్ ప్రశ్నలను గుర్తించి సాధన చేయాలి.
ఇవి పాటించండి
- ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉండే కామన్ సబ్జెక్టులైన అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లలో ముఖ్యమైన టాపిక్స్‌ను ఎంచుకుని బాగా ప్రాక్టీస్ చేయాలి.
- జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ సబ్జెక్టులు కేవలం మెయిన్స్‌లో మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటిపై ప్రిలిమ్స్ వరకు అవగాహన కోసం మాత్రమే చదవాలి. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- సిలబస్‌కు అనుగుణంగా చాప్టర్వైజ్, మోడల్ సైజ్ ప్రశ్నలు సాధన చేయాలి.
- పూర్వ ప్రశ్నపత్రాలు, మోడల్ ప్రశ్నపత్రాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. రోజుకు 1 నమూనా ప్రశ్నపత్రం ఆన్లైన్లో సాల్వ్ చేయాలి.
- ప్రిపరేషన్ స్థాయిని బట్టి మార్కులు ఆధారపడి ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. ఇందుకోసం నిత్యం బాగా సాల్వ్ చేయగల మోడల్స్ మాత్రమే ఎంచుకోవాలి. 60-70% మార్కులు పొందే టాపిక్స్‌పై ఫోకస్ పెట్టి ప్రిపేర్ కావాలి.
- ప్లాన్ ప్రకారం ప్రిపేరైతే క్లర్క్ జాబ్ సులువుగా సాధించవచ్చు.
కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 11 ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుల్లో 5,830 క్లర్క్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ వెలువడింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశం. డిగ్రీ ఉత్తీర్ణతతో బ్యాంకింగ్ కెరీర్ ఎంచుకోవచ్చు. ఉన్నతస్థాయి వరకు వెళ్లవచ్చు. ఇదివరకే IBPS ద్వారా గ్రామీణ బ్యాంక్ పీవో/క్లర్క్ పోస్టులు వెలువడగా, తాజాగా IBPS కర్ల్ నోటిఫికేషన్ వెలువడింది. IBPS పీవోస్-2021 నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఉద్యోగం పొందాలనుకునేవారి కోసం సిలబస్, పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్ గురించి వివరిస్తున్నాం.
క్లరికల్ పోస్టులు/ఉద్యోగం అన్నది రాష్ట్ర పరిధిలోనే నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థి ఎంపిక చేసుకునే రాష్ట్రభాషపై పట్టు ఉండాలి. స్కూల్, ఇంటర్ లెవల్లో రాష్ట్రభాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
నోట్: పరీక్ష తెలుగులో కూడా రాసుకునే వెసులుబాటు, అవకాశం ఉంది.
ఈ ఏడాది నుంచి IBPS క్లరికల్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కమిటీని నియమించారు. ఇదివరకే వెలువడిన IBPS RRB గ్రామీణ బ్యాంకు పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు.తెలుగు రాష్ర్టాల్లో మొత్తం 789 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ-526, ఆంధ్రప్రదేశ్-263 ఉన్నాయి. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు www.ibps.in వెబ్సైట్ లాగిన్ కావాలి.
పరీక్ష విధానం: క్లరికల్.. రెండంచెల రాత పరీక్ష. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు. ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులు తుది జాబితాకు కౌంట్ చేయరు. మెయిన్ ప్రధాన పరీక్ష. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. క్లరికల్ పరీక్షకు ఇంటర్వూ లేదు.
విభాగాలవారీగా ప్లాన్
న్యూమరికల్ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగం నుంచి ప్రిలిమ్స్‌లో 35, మెయిన్స్‌లో 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్ కోసం క్యాలిక్యులేషన్స్ టాపిక్స్ పై దృష్టి సారించాలి. ఇందుకోసం నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్ వంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. షార్ట్‌కట్ మెథడ్స్, బోడ్మాస్ రూల్స్ వంటివి బాగా అవపోసన పట్టాలి. ఆప్టిట్యూడ్ కోసం పర్సంటేజీ, యూవరేజెస్ & ఏజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, మెన్ అండ్ వర్క్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రస్ట్/ కాంపౌండ్ ఇంట్రస్ట్‌తో పాటు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వంటి టాపిక్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మెయిన్స్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ భాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. హెచ్చుస్థాయి మోడల్స్, డాటా ఇంటర్ప్రిటేషన్స్లపై ఎక్కువ సాధన చేయాలి.
రీజనింగ్: ఈ విభాగం అధిక మార్కులు పొందడానికి వెసులుబాటు ఇస్తుంది. 5, 6 టాపిక్స్‌పై పట్టు సాధిస్తే 60 నుంచి 90 శాతం మార్కులు పొందినట్లే. ఈ విభాగం కూడా ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కామన్‌గా ఉండే అంశం. ప్రిలిమ్స్‌లో 35, మెయిన్స్‌లో కూడా 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో కంప్యూటర్ విభాగంతో కలిపి 50 ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్-డికోడింగ్ ఇనిక్వాలిటీస్, ర్యాంకింగ్, బ్లడ్‌రిలేషన్స్, డైరెక్షన్ టెస్ట్, సిలాజిసమ్స్ వంటి అంశాలు ప్రిలిమ్స్‌లో దాదాపు 60 శాతం ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్ పై అంశాలతో పాటు స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, ఇన్పుట్ అవుట్‌పుట్ ముఖ్యంగా సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచి 50 శాతం ప్రశ్నలు వస్తాయి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్
ఇది కేవలం మెయిన్స్‌లో మాత్రమే ఉండే అంశం. ఇందులో కంప్యూటర్ బేసిక్స్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, ఇన్పుట్, అవుట్‌పుట్ డివైజెస్లతో పాటు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ లాంగ్వేజెస్, బ్యాంకింగ్ యాజర్స్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, యాప్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ విశేషాలు, నూతన ఆవిష్కరణలు వంటి వాటిపై దృష్టిసారించాలి.
ఇంగ్లిస్ లాంగ్వేజ్
బ్యాంకింగ్ పరీక్షల్లో ఇంగ్లిష్ విభాగం చాలా కీలకం. ఇందులో గ్రామర్-నాన్గ్రామర్ పార్ట్‌ను గుర్తించే విషయంలో చాలామంది విఫలమవుతుంటారు. ఫలితంగా కటాఫ్ మార్కులతో సరిపెట్టుకుంటారు. ఇంగ్లిష్ మీడియం వారు కూడా ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎగ్జామ్‌లో విఫలమవుతున్నారు. కాబట్టి ఈ విభాగం నుంచి వచ్చే అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇందుకు రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రిపోజిషన్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఇడియం అండ్ ఫ్రేజెస్, క్లోస్డ్ టెస్ట్, సెంటెన్స్ కరెక్షన్స్, ఎర్రర్ డిటెక్షన్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్ వంటి వాటిపై దృష్టిసారించాలి. అధిక శాతం ప్రశ్నలు ఆర్సీ ప్యాసెజెస్, సెంటెన్స్ కరెక్షన్స్ నుంచి వస్తాయి.
జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్
ఇది కేవలం మెయిన్స్‌లో ఉండే విభాగం. 50 ప్రశ్నలు, 50 మార్కులు కేటాయించారు. ఈ విభాగం నుంచి మంచి మార్కులు పొందడానికి ఉపయోగపడతాయి. ఇందులో కరెంట్ అఫైర్స్‌తో పాటు బ్యాంకింగ్ టెర్మినాలజీ, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఆర్బీఐ త్రైమాసిక అంశాలు, వార్షిక మానిటరీ పాలసీ రివ్యూ, కీ పాలసీ రేట్లు, నూతన బ్యాకింగ్ విధి విధానాలు, కొత్త బ్యాంకుల నిర్వహణ, బ్యాంకుల విలీనాలు.
ఆర్థిక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆత్మనిర్భర్ భారత్‌తో భారత ఆర్థిక విధి, కేంద్ర, రాష్ర్టాల వాటా, వాణిజ్యరంగం అభివృద్ధి, స్టాక్‌మార్కెట్ అంశాలు, ఫారెక్స్ రిజర్వ్ అంశాలు, అంతర్జాతీయ ఆర్థిక అంశాలు వంటివి కీలకం.
కరెంట్ అఫైర్స్: గత 6 నెలల అంశాలపై దృష్టిపెట్టాలి. ఇందులో వార్తల్లోని వ్యక్తులు, నూతనంగా ఎంపికైన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జాతీయసంస్థల చైర్మన్లు, అంతర్జాతీయ సంస్థలు, సదస్సులు ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు, రచయితలు, క్రీడలు, జపాన్ ఒలింపిక్స్, ఫుట్‌బాల్ వరల్డ్‌కప్, వింబుల్డన్, క్రికెట్ వంటివి కీలకం. ఈ విభాగంలో మంచి మార్కులు పొందడానికి వార్తాపత్రికలు, మాససంచికలు బాగా చదవాలి.
నోటిఫికేషన్ వివరాలు
ఐబీపీఎస్ క్లర్క్: 5830 పోస్టులు
మొత్తం బ్యాంకులు: 11
చివరి తేదీ: ఆగస్ట్ 7 (గడువు పెంచే అవకాశం ఉంది)
తెలుగు రాష్ర్టాల్లో పోస్టులు: తెలంగాణ 526, ఏపీ 263
పరీక్ష కేంద్రాలు: తెలంగాణ
ప్రిలిమ్స్: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
మెయిన్స్: హైదరాబాద్
ఏపీ: అన్ని జిల్లా కేంద్రాల్లో
వయస్సు: 18 నుంచి 28 ఏండ్ల వారై ఉండాలి
అర్హత: ఏదేని డిగ్రీ
మీడియం: ఇంగ్లిష్ (ప్రాం తీయ భాషలో పరీక్ష రాయడం కోసం కమిటీని నియమించారు. తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది)
ప్రిలిమ్స్: ఆగస్ట్ 28, 29
మెయిన్స్: అక్టోబర్ 31
S. Madhu kiran
Director
Focus Acadamy Hyderabad
9030496929
- Tags
- Education News
- IBPS
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు