ఖానాపూర్ అటవీ డివిజన్ ఉన్న జిల్లా ఏది?
- ప్రపంచ ఆహార సంస్థ, రాజస్థాన్ రాష్ర్టాలు ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని లక్ష్యం? (బి)
ఎ) వ్యవసాయ సంస్కరణల అమలు
బి) ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చడం
సి) మెరుగైన ఆహార ఉత్పత్తి విధానాల అమలు
డి) కరోనా కట్టడి
వివరణ: లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ (టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)ను మెరుగుపర్చుకొనేందుకు రాజస్థాన్ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పథకం అమలుకు సంబంధించి డిజిటలీకరణ, పర్యవేక్షణకు సంబంధించిన సహాయం రాష్ర్టానికి అందుతుంది. రాజస్థాన్‌లో సుమారు 45 మిలియన్ ప్రజలు జాతీయ ఆహార భద్రతా పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. - 2026లో బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? (డి)
ఎ) జపాన్ బి) మలేషియా
సి) ఇండోనేషియా డి) భారత్
వివరణ: 2026లో బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ మన దేశంలో నిర్వహించడం ఇది రెండోసారి. 2009లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ నిర్వహించే అతిపెద్ద క్రీడా చాంపియన్‌షిప్ ఇదే. గతంలో జరిగిన టోర్నీల్లో భారత్ 10 పతకాలు సాధించింది. సైనా నెహ్వాల్ 2015లో రజతం, 2017లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. - యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్రమాణాలను అంగీకరించిన తొలి దేశం? (సి)
ఎ) నేపాల్ బి) శ్రీలంక
సి) భూటాన్ డి) మాల్దీవులు
వివరణ: క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేస్ (యూపీఐ) ప్రమాణాలను భూటాన్ అంగీకరించింది. అలాగే రూపే కార్డులను ఆమోదించిన తొలి దేశం కూడా అదే. ఏటా దాదాపుగా రెండు లక్షల మంది పర్యాటకులు ఆ దేశానికి వెళతారు. వీరందరికీ ఇది సౌకర్యంగా ఉంటుంది. బీహెచ్ఐఎం (భీమ్)ను భూటాన్‌లో అందుబాటులోకి తెస్తారు. ఇందుకుగాను భారత్‌కు చెందిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాయల్ మానిటరీ అథారిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - ఇటీవల ఆర్బీఐ రిటెయిల్ డైరెక్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల ప్రయోజనం ఏంటి? (ఎ)
ఎ) వ్యక్తులు ప్రభుత్వ సెక్యూరిటీలను నేరుగా కొనొచ్చు
బి) ఆర్బీఐలో నేరుగా ఖాతాలను తెరిచేందుకు అవకాశం
సి) ఒక ఖాతా ద్వారా అన్ని బ్యాంక్‌లతో లావాదేవీలు జరపొచ్చు
డి) ఏదీకాదు
వివరణ: వ్యక్తులు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనేందుకు వీలుగా ఆర్బీఐ రిటెయిల్ ప్రత్యక్ష సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు ఎలాంటి రుసుం లేకుండా నేరుగా పోర్టల్ ద్వారా రిటెయిల్ డైరెక్ట్ గిల్ట్ ఖాతాను తెరవచ్చు. 1999 విదేశీ మారక నిర్వహణ చట్టం ద్వారా భారత్‌లో లేని వాళ్లు కూడా జీ-సెక్లను కొనుగోలు చేయవచ్చు. గతంలో ఏదైనా మ్యూచువల్ ఫండ్ ద్వారా లేదా ఎల్ఐసీకి చెందిన ఫండ్ల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయాల్సి వచ్చేది. తాజాగా ప్రత్యక్షంగా కొనేందుకు వీలు కల్పించింది ఆర్బీఐ. - కింది వాటిలో సరైనవి (డి)
- భారత దేశపు తొలి ప్రైవేట్ ఎల్ఎన్జీ స్టేషన్‌ను గుజరాత్లో ప్రారంభించారు
- భారత దేశపు తొలి ప్రైవేట్ ఎల్ఎన్జీ స్టేషన్‌ను మహారాష్ట్రలో ప్రారంభించారు
- భారత దేశపు తొలి క్రిప్టోగమిక్ గార్డెన్‌ను ఉత్తరాఖండ్‌లో ప్రారంభించారు
ఎ) 1, 3 బి) 3 సి) 2 డి) 2, 3
వివరణ: భారత దేశంలో తొలిసారిగా ప్రైవేట్ ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ప్లాంట్‌ను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. బైద్యనాథ్ ఆయుర్వేదిక్ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. ఇథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగానే దీనిని ప్రారంభించింది. అలాగే భారత దేశంలో తొలి క్రిప్టోగమిక్ గార్డెన్‌ను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ప్రారంభించారు. క్రిప్టోగాములు అంటే బీజరహిత మొక్కలు అని అర్థం. ఇవి విత్తనాల ద్వారా పునరుత్పత్తి కావు. ఈ గార్డెన్ 9000 అడుగుల ఎత్తులో మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది.
- కింది వాటిలో సరైనవి? (సి)
- భారత దేశంలో తొలి డాల్ఫిన్ రిసెర్చ్ సెంటర్‌ను బీహార్‌లో ప్రారంభించారు
- భారత దేశంలో తొలి డాల్ఫిన్ రిసెర్చ్ సెంటర్‌ను ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించారు
- ఇటీవల వార్తల్లో నిలిచిన కేసరియా స్థూపం బీహార్‌లో ఉంది
ఎ) 1 బి) 2, 3 సి) 1, 3 డి) 3
వివరణ: భారత దేశంలో తొలి డాల్ఫిన్ రిసెర్చ్ సెంటర్ (పరిశోధన కేంద్రం)ను బీహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటు చేయనున్నారు. డాల్ఫిన్ల పరిరక్షణకు కృషి చేయడం దీని ప్రధాన విధి. భారత దేశపు తొలి గంగా డాల్ఫిన్ అభయారణ్యాన్ని కూడా గతంలో బీహార్లోనే ప్రారంభించారు. అలాగే ఇటీవల వరదలకు గురైన కేసరియా స్థూపం కూడా బీహార్లోనే ఉంది. తవ్వకాల్లో బయటపడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద స్థూపంగా దీనిని పరిగణిస్తారు.
- ప్రస్తుతం ఎన్ని దేశాల్లో కేవీఐసీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉంది? ( డి)
ఎ) 6 బి) 7 సి) 8 డి) 9
వివరణ: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌కు ప్రస్తుతం తొమ్మిది దేశాల్లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్‌ను పొందింది. ట్రేడ్‌మార్క్ అనేది ఒక పదం లేదా ఒక పదబంధం లేదా గుర్తు లేదా డిజైన్ కావచ్చు లేదా ఇవన్నీ కలిసి ఉండవచ్చు. దీని ద్వారా ఒక ఉత్పత్తిని లేదా ఒక సేవను ఇతర పోటీదారుల నుంచి తేలికగా గుర్తించేందుకు వీలుంటుంది. గతంలో ఈ సంస్థకు ఆరు దేశాల్లో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది. జూలై రెండో వారంలో భూటాన్, యూఏఈ, మెక్సికో దేశాల్లో కూడా దీనిని పొందింది. దీంతో మొత్తం దేశాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. - తెలంగాణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర భద్రతా కమిషన్‌కు ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా ఎవరు ఉంటారు? (డి)
ఎ) ముఖ్యమంత్రి బి) డీజీపీ
సి) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
డి) రాష్ట్ర హోంమంత్రి
వివరణ: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్ర భద్రతా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా హోంమంత్రి ఉంటారు. సభ్యులుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ఆనందరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా డీజీపీ, ప్యానల్ సభ్యులుగా ఓయూ మాజీ ఉప కులపతి తిరుపతిరావు, పాత్రికేయుడు కే శ్రీనివాస్‌రెడ్డిలను నియమించారు. - ఖానాపూర్ అటవీ డివిజన్ ఉన్న జిల్లా ఏది? (సి)
ఎ) ఆదిలాబాద్ బి) నిజామాబాద్
సి) నిర్మల్ డి) కరీంనగర్
వివరణ: ఖానాపూర్ అటవీ డివిజన్‌కు ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ప్రశంస లభించింది. హరితహారంలో భాగంగా స్థానికంగా ఉన్న దేవుని గూడెంలో 160 ఎకరాల్లో అడవిని అభివృద్ధి చేశారు. గతంలో ఇక్కడ అడవి ఉన్నప్పటికీ 160 ఎకరాల భూమిని పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహాయంతో హరితహారం చేపట్టి ఒక రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వాటిని పరిరక్షించి, అడవిని అభివృద్ధి చేశారు. - ఏ రాష్ట్రంలో లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది? (డి)
ఎ) కేరళ బి) తమిళనాడు
సి) ఒడిశా డి) ఛత్తీస్‌గఢ్
వివరణ: లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది. దీని వైశాల్యం తగ్గింపు అంశం మూలంగా ఇది వార్తల్లో నిలిచింది. దీని ఏర్పాటుకు 2005లో ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఆమోదం తెలిపింది. 2007లో కేంద్రం కూడా ఆంగీకరించింది. 1995 చదరపు కిలోమీటర్లతో కోర్బా జిల్లాలో మార్క్ చేశారు. అయితే తాజాగా 450 చదరపు కిలోమీటర్లకు తగ్గించారు. ఈ ప్రాంతంలో బొగ్గు గనులు కూడా ఉన్నాయి. - పీ-8ఐ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? ( బి)
ఎ) కరోనాలో కొత్త వేరియంట్
బి) నిఘా విమానం
సి) కరోనా కట్టడికి కొత్త ఔషధం
డి) అనుమతులు లేని డ్రోన్లను అడ్డుకొనే ఆపరేషన్
వివరణ: పీ8ఐ అనేది సముద్రాల్లో శత్రు జలాంతర్గాములపై నిఘా వేసేందుకు ఉద్దేశించిన విమానం. అమెరికా నుంచి భారత్ దీనిని కొనుగోలు చేసింది. నిజానికి 2009లో ఎనిమిది పీ-8ఐలను కొనేందుకు ఒప్పందం కుదిరింది. అయితే 2016లో మరో నాలుగు అదనంగా కొనాలని నిర్ణయించారు. జూలై 13న యుద్ధ విమానం భారత్‌కు చేరుకుంది. - ఏ రోజున వరల్డ్ యూత్ స్కిల్స్ డే గా నిర్వహిస్తారు? (సి)
ఎ) జూలై 11 బి) జూలై 12
సి) జూలై 15 డి) జూలై 10
వివరణ: ఏటా జూలై 15న ప్రపంచ నైపుణ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగో అంశాన్ని సాధించేందుకు ఇది ఉద్దేశించింది. అలాగే ఏటా జూలై 10న భారత దేశంలో జాతీయ మత్స్యకారుల రోజును నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న జరుపుతారు. 1987, జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. 1989లో చేసిన తీర్మానం మేరకు 1990, జూలై 11న జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందింది యూసఫ్‌జాయ్ మలాలా. జూలై 12న ఆమె జన్మించిన రోజు. 2012లో ఇదే రోజున ఆమె ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. ఈ నేపథ్యంలో జూలై 12న మలాలా దినోత్సవంగా నిర్వహిస్తారు. - తెలంగాణలో సాంస్కృతిక వారథి చైర్మన్‌గా ఎవరు నియామకమయ్యారు? (ఎ)
ఎ) రసమయి బాలకిషన్
బి) ఏబీ రాములు
సి) రమణ గౌడ్
డి) మిద్దె శ్రీనివాస్
వివరణ: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూర్ శాసనసభ సభ్యుడు రసమయి బాలకిషన్ నియామకమయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టడం ఇది రెండోసారి. 2015, డిసెంబర్ 6న తొలిసారి ఆయన ఈ పదవిని చేపట్టారు. మూడేళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత వివిధ కేసుల కారణంగా సంస్థ కార్యకలాపాలు నిలిచాయి. తాజాగా పరిష్కారం కావడంతో మరోసారి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేసే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. - కింది వాటిలో సరైనవి? (డి)
- కోపా అమెరికా టైటిల్‌ను అర్జెంటీనా గెలిచింది
- యూరో కప్‌ను ఇంగ్లండ్ గెలిచింది
- యూరో కప్‌ను ఇటలీ సొంతం చేసుకుంది
ఎ) 1, 2 బి) 3
సి) 2 డి) 1, 3
వివరణ: కోపా అమెరికా అనేది ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన టోర్నీలో అర్జెంటీనా విజయం సాధించింది. తుదిపోరులో బ్రెజిల్‌ను ఓడించింది. అలాగే యూరో కప్ ఫుట్‌బాల్‌లో తుదిపోరులో ఇంగ్లండ్‌ను ఓడించి ఇటలీ విజేతగా ఆవిర్భవించింది.
- రాజ్యసభ నాయకుడిగా ఎవరు నియామకమయ్యారు? (సి)
ఎ) నిర్మలా సీతారామన్
బి) అశోక్ బాజ్‌పేయి
సి) పీయూష్ గోయల్ డి) జైశంకర్
వివరణ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ నాయకుడిగా నియామకమయ్యారు. జూలై 6, 2021 నుంచి ఆయన నియామకం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు రాజ్యసభ నాయకుడిగా థావర్‌చంద్ గెహ్లాట్ ఉన్నారు. ఆయన ఇటీవల కర్నాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం పీయూష్ గోయల్ వాణిజ్యం, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ ,9849212411
- Tags
- Education News
Previous article
సాగుభూమి అత్యధికంగా ఉన్న జిల్లా ?
Next article
వాణిజ్య బ్యాంకుల్లో 5830 క్లరికల్ ఖాళీలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు