విహారానికి, విద్యకు కేరాఫ్ కెనడా
ప్రపంచంలోనే రెండో పెద్ద దేశమైన కెనడా నార్త్ అమెరికాలో పసిఫిక్ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ మహాసముద్రం వరకు వ్యాపించి ఉంది. కానీ అక్కడ జనాభా చాలా తక్కువ. అక్కడి జన సాంద్రత 4/sqkm. ఎంతో ఖనిజ సంపద, ఆయిల్ నిల్వలు ఉన్న దేశం. కాబట్టి అక్కడి ఎకానమీ బాగుంది. కొండలు, అడవులు, గడ్డిభూములు, మైదానాలు ఉన్న అందమైన దేశం. అందుకేనేమో రెండు దశాబ్దాలుగా కెనడా వెళ్లి చదువుకుంటున్న వారి సంఖ్య సుమారు 6 రెట్లు పెరిగింది. నేటివ్ పాపులేషన్ గ్రోత్ తక్కువగా ఉండటం వల్ల విదేశీ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి.
చదువు ఒకప్పుడు ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం కెనడా వెళ్లేవారు ఎక్కువ. కానీ ఆ తరువాత బ్యాచిలర్స్ అండ్ గ్రాడ్యుయేట్ కోర్సులకు వెళ్లేవారు ఎక్కువయ్యారు. కెనడాలో మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల పట్ల విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కెనడియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఫస్ట్ వర్క్ పర్మిట్ వచ్చినప్పటి నుంచి 10 ఏండ్లు గడిచిన తరువాత సుమారు 47 నుంచి 55 శాతం భారతీయులు పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకున్నారు.
కెనడాలో చదువుకునే విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ వర్క్ వారానికి సుమారు 20 గంటలు చేయ వచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత కూడా కొంత కాలం పనిచేయవచ్చు. అది విద్యార్థి స్టడీ పీరియడ్‌ని బట్టి ఉంటుంది. సుమారు 8 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు పని చేయవచ్చు.
కెనడాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది. ప్రపంచంలో టాప్ 250 యూనివర్సిటీల్లో 10 కెనడాలో ఉన్నాయి. స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ఉన్నారు.
కెనడాలోని ప్రతి నగరం విదేశీయులను ఆహ్వానిస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ కెనడా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2017/2018 ప్రకారం డైరెక్ట్‌గా లేదా ఇన్‌డైరెక్ట్‌గా విదేశీ విద్యార్థులు కెనడియన్ ఎకానమీకి సుమారు 3.7 బిలియన్ డాలర్ల ట్యాక్స్ రెవెన్యూ సమకూరుస్తున్నారు.
నివసించడానికి, పనిచేయడానికి కెనడా చక్కని ప్రదేశం. ఇక్కడ చదివిన వారికి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి.
గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ సురక్షితమైన దేశాల్లో కెనడా 6వ స్థానంలో ఉంది. పక్కనే ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా కన్నా ఇది సేఫ్ దేశంగా తేలింది.
విద్యార్థులు ఫెడరల్ గవర్నమెంట్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ నుంచి కూడా ప్రయోజనం పొందుతున్నారు. ఇది స్టడీ పర్మిట్ అప్లికేషన్స్‌ని ఫాస్ట్‌ట్రాక్ చేస్తుంది. ఈ వెసులుబాటు భారతీయులతో పాటు చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, పాకిస్థాన్, సెనెగల్, మొరాకో వారికి కూడా ఉంది. ఇందుకు అర్హత పొందడానికి సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలి. 10,000 కెనడియన్ డాలర్లు ఉన్నట్టు సర్టిఫికెట్ చూపించాలి. https://www.canada.ca/లో ఇతర నిబంధనలు చూడవచ్చు.
దీంతో విదేశీ విద్యార్థులు చదువుకోడానికి ఇష్టపడే దేశాల్లో టాప్ 5 స్థానాల్లో కెనడా ఉంది.
టాప్ స్టూడెంట్ డెస్టినేషన్స్
జనాభా: కెనడా జనాభా కొన్ని ప్రదేశాలు, నగరాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ నగరాల్లో విదేశీ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తున్న నగరం ఒంటారియో. 2019లో విడుదలైన కెనడియన్ ఇమ్మిగ్రేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ నగరం అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో దాదాపు 48 శాతం, దాదాపు 3,07,000 మందికి ఆతిథ్యం ఇచ్చింది. బ్రిటిష్ కొలంబియా రెండో స్థానంలో ఉండి కెనడా అంతర్జాతీయ విద్యార్థుల్లో 23 శాతం.. దాదాపు 1,45,000 మందికి గమ్యస్థానమైంది. కెనడాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 14 శాతం.. 87,000 మందితో క్యూబెక్ మూడో స్థానంలో ఉంది. మానిటోబా, నోవాస్కాటియా వంటి ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ట్యూషన్ సంవత్సరానికి కనీసం 17,000 నుంచి 27,000 వరకు కెనడియన్ డాలర్లు అవసరం. ఎక్కువ మధ్య తరగతి కుటుంబం వారు ఉండటం వల్ల, ఆంగ్ల భాషా నైపుణ్యం వల్ల మన వారికి కెనడా అనుకూల ప్రదేశంగా కనిపిస్తుంది.
ఒట్టావా: ఒంటారియో ప్రావిన్స్‌లో ఉన్న ఈ నగరం కెనడా రాజధాని. ఎంతోమంది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తుంది. కాస్ట్ అఫ్ లివింగ్ సంవత్సరానికి కనీసం 10,000 నుంచి 12,000 కెనడియన్ డాలర్లు ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా, కార్ల్టన్ యూనివర్సిటీ ఇక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలు. సుమారు 150 దేశాల నుంచి విద్యార్థులు ఈ నగరానికి వస్తుంటారు. ఇక్కడి మ్యూజియంలు, ఏటా జరిగే ఫెస్టివల్స్ యాత్రికులను కూడా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి జనాభాలో 20 శాతం మంది ఇతర దేశాల్లో పుట్టినవారే. రాజధాని కావడం వల్ల ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు ఎక్కువే. అలాగే టెక్నాలజీ, బ్యాంకింగ్, టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
టొరంటో: ఎంతో చారిత్రక ప్రాముఖ్యం గల ఈ నగరంలో విభిన్న తెగలకు చెందిన వారు ఉండటం వల్ల ఆంగ్లంతో పాటు అనేక భాషలు మాట్లాడే వారు నివసిస్తున్నారు. కెనడాలో అధిక జనాభా గల నగరాల్లో ప్రథమ స్థానం ఈ నగరానిదే. టొరంటో స్టాక్ ఎక్స్చేంజీ, టెక్నాలజీ కంపెనీలు, బ్యాంకింగ్ సెక్టార్ వంటి అనేక కంపెనీలతోపాటు ఎన్నో మీడియా బ్రాడ్కాస్ట్ కంపెనీలు కూడా ఉన్నాయి. టొరంటో విద్యార్థుల్లో సుమారు 21% మంది 168 దేశాల నుంచి వచ్చినవారే. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, రైయర్సన్ యూనివర్సిటీ, యార్క్ యూనివర్సిటీ ప్రముఖ విశ్వవిద్యాలయాలు.
మాంట్రియల్: కెనడాలోని క్యూబెక్ ప్రాంతంలో ఉన్న నగరమిది. అధిక జనాభా గల నగరాల్లో రెండోది. టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గలవు. ఇక్కడ కల్చరల్, మ్యూజిక్ ఫెస్టివల్స్ ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్ నార్త్ అమెరికాలోని ఇతర మహానగరాలతో చూస్తే కొంచెం తక్కువే. ఇది నివసించడానికి సేఫ్ నగరమని కూడా పేరు తెచ్చుకుంది. యూనివర్సిటీ ఆఫ్ మెక్ గిల్, యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ ఇక్కడ ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాలు.
వాంకోవర్: బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఉన్న ఈ నగరం ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒకటి. సర్ఫింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్, హైకింగ్ వంటి యాక్టివిటీస్ పసిఫిక్ కోస్ట్ గుండా ఎక్కువగా ఉంటాయి. సినిమా షూటింగులకు చక్కటి ప్రదేశం. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ ఇక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలు.
కాల్గరీ: కెనడాలోని అల్బెర్టా ప్రావిన్సులో ఉన్న ఈ నగరం ఆ దేశంలోని ఎక్కువ జనాభా గల నగరాల్లో ఒకటి. ఇక్కడి ఆయిల్ ఇండస్ట్రీ వల్ల ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ ఇక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయం. కన్స్ట్రక్షన్, ఎనర్జీ సెక్టార్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో అనేక అవకాశాలు లభిస్తాయి.
ప్రసిద్ధమైన యూనివర్సిటీలు
2021 QS ర్యాంకింగ్ ఆధారంగా కెనడాలోని టాప్ యూనివర్సిటీలు..
యూనివర్సిటీ ఆఫ్ టొరంటో: 1827లో ప్రారంభమైన ఈ పబ్లిక్ యూనివర్సిటీలో మంచి రిసెర్చ్ సౌకర్యాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్, డాక్టరేట్ ఇలా అనేక ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఇంజినీరింగ్, టెక్నాలజీ, బిజినెస్, ఫైనాన్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లాంగ్వేజ్‌లు, ఎన్విరాన్మెంట్ ఇంకా ఇతర ఎన్నో కోర్సులు ఉన్నాయి.
మెక్ గిల్ యూనివర్సిటీ: మాంట్రియల్లో ఉన్న ఈ పబ్లిక్ యూనివర్సిటీని 1821లో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీజు సుమారు 29,500 కెనడియన్ డాలర్లు ఉంటుంది. 38% గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు, 49% డాక్టోరల్ స్టూడెంట్స్ విదేశీయులు ఉన్నారు. మెడికల్ హెల్త్ సైన్సెస్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, లా, మ్యూజిక్, డెంటిస్ట్రీ, అగ్రికల్చర్ స్టడీస్ వంటి అనేక కోర్సులున్నాయి. 3 క్యాంపస్‌లు ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా: ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఇది ఒకటి. ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీజు సుమారు 38,000 కెనడియన్ డాలర్లు. అనేక గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. 2 క్యాంపస్‌లు ఉన్నాయి.
యూనివర్సిటీ డి మాంట్రియల్: 1878లో ప్రారంభించిన ఈ పబ్లిక్ యూనివర్సిటీలో సుమారు 10,000 మంది విదేశీయులు వివిధ కోర్సులు చేస్తున్నారు. ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అయినప్పటికీ బైలింగ్వల్ కోర్సులు ఉన్నాయి. మీకు నచ్చిన ప్రోగ్రాం జాగ్రత్తగా తెలుసుకోవాలి.
యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా: ఈ యూనివర్సిటీకి 4 క్యాంపస్‌లు ఉన్నాయి. సుమారు 40,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీజు సుమారు 20,000 కెనడియన్ డాలర్లు. బిజినెస్, ఇంజినీరింగ్, మెడికల్ వంటి రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.
మెక్ మాస్టర్ యూనివర్సిటీ: ఒంటారియో ప్రావిన్స్‌లో ఉన్న ఈ పబ్లిక్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్‌కి ఫేమస్. 13.3% విద్యార్థులు విదేశీయులు. ఇంటర్నేషనల్ ఫీజు 22,000 కెనడియన్ డాలర్లు.
యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ: 1956లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీలో మంచి రిసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సుమారు 98 దేశాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కడికి వస్తుంటారు.
వెస్టర్న్ యూనివర్సిటీ: సుమారు 121 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోడానికి వస్తుంటారు. ఇక్కడి రిసెర్చ్ ఎకనామిక్, హెల్త్, సోషల్, కల్చరల్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది.
ఇతర యూనివర్సిటీలు
క్వీన్స్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ
యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా
డల్హౌసీ యూనివర్సిటీ
సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా
లావాలా యూనివర్సిటీ
అడ్మిషన్ ప్రాసెస్ కోసం ప్రధానంగా రాసే పరీక్ష ఐలట్స్. ఇది ఇంగ్లిష్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ ఆధారంగా ఉంటుంది. కనీసం 6.5 బ్యాండ్ స్కోర్ తెచ్చుకోవాలి. అకడమిక్ స్కోర్స్ కూడా బాగుండాలి. సరిగ్గా చదివి మాక్ ఎగ్జామ్స్ రాస్తే మంచి స్కోర్ తప్పక తెచ్చుకోవచ్చు.
చేరాలనుకునే ప్రోగ్రాం, కాలేజీకి అవసరమైన పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. ఇష్టమైన కాలేజీ వెబ్సైట్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూడండి.
కెనడియన్ అడ్మిషన్ 3 సైకిల్స్‌లో ఉంటుంది. మొదట ఫాల్ సైకిల్. భారతీయులు ఎక్కువ శాతం ఈ సీజన్లో జాయినవుతారు. ప్రోగ్రాం సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. తరువాత వింటర్ సైకిల్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఒకవేళ సెప్టెంబర్ మిస్ అయితే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. కొన్ని కోర్సుల్లో సమ్మర్ అడ్మిషన్స్ ఉంటాయి. ఏప్రిల్ మే నెలలో ప్రారంభమవుతాయి.
స్టడీ వీసాతో అక్కడ చదువుకొని ఆఫ్ క్యాంపస్ వర్క్ పర్మిట్ తో కో-ఆప్ లేదా ఇంటర్న్‌షిప్ చేసి, తరువాత గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంకు అనుగుణంగా వర్క్ పర్మిట్ తెచ్చుకొని, ఫైనల్‌గా ఇష్టమైతే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నించవచ్చు.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు