మూల్యాంకన ప్రక్రియలో మొట్టమొదటి అంశం?
మూల్యాంకనం
- పాఠశాలలో నిర్వహించే వివిధ అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలు నేర్చుకొనే క్రమాన్ని తద్వారా వారిలో కలిగే చైతన్యాన్ని పరిశీలించే ప్రక్రియ?
1) మాపనం 2) మదింపు
3) మూల్యాంకనం 4) పరీక్ష - ప్రస్తుతమున్న పరీక్ష విధానాల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన ప్రశ్నావిధానం బహుళైచ్ఛిక విధానమని అభిప్రాయపడినవారు?
1) జేఎం లీ 2) జాన్ డ్యూయీ
3) హెర్బర్ట్ థాయిర్
4) సెకండరీ విద్యాకమిషన్ - ‘పిల్లల భాగస్వామ్యం-ప్రతిస్పందనలు’ అనే అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు పరిగణనలోకి తీసుకోని అంశం?
1) పాఠ్యాంశంపై జరిగే చర్యలు
2) వ్యక్తిగత, జట్టు కృత్యాలు చేస్తున్నప్పుడు
3) ప్రాజెక్టు పనుల్లో పాల్గొన్నప్పుడు
4) అభిప్రాయాలు సొంతంగా రాస్తున్నప్పుడు - కింది వాటిలో సాదృశ్యరకపు ప్రశ్న?
1) నిమ్మకాయలో ఉండే విటమిన్
2) కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి
3) ఆకు ఆకుపచ్చగా ఉండటానికి కారణం పత్రహరితం (అవును/కాదు)
4) పిల్లల్ని కనేవి:శిశూత్పాదకాలు :: గుడ్లు పెట్టేవి: - మౌఖిక పరీక్ష ప్రయోజనం కానిది?
1) స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తాయి
2) తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు
పరీక్షించవచ్చు
3) మాపనం చేయడంలో వైవిధ్యం ఉంటుంది
4) భాషా స్పష్టత పెంపొందుతుంది - ఒక పరీక్షను ఒక విద్యార్థి సోమవారం రాసినప్పుడు 84 మార్కులు వచ్చాయి. అదే పరీక్షను తిరిగి శుక్రవారం రాసినప్పుడు 48 మార్కులు వచ్చాయి. అయినా దీనిలోని దోషం?
1) సప్రమాణత 2) విశ్వసనీయత
3) విషయ నిష్టత 4) ఆచరణాత్మకత - విద్యార్థి బలం, బలహీనత అంచనావేయడానికి, పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి చేసే మూల్యాంకనం?
1) లోపనిర్ధారణ మూల్యాంకనం
2) రూపణ మూల్యాంకనం
3) సంగ్రహ మూల్యాంకనం
4) ప్రాగుక్తీక మూల్యాంకనం - గణితంలోని ‘కారణాలు చెప్పడం-నిరూపణలు చేయడం’ అనే విద్యాప్రమాణాన్ని సూచించే సరైన అంశం?
1) సజాతి భిన్నాలను కూడిక చేస్తాడు
2) భిన్నాలను ఆరోహణ-అవరోహణ క్రమంలో రాస్తాడు
3) భిన్నాలను దైనందిన జీవితానికి
అనుసంధానిస్తాడు
4) భిన్నాలను సంఖ్యారేఖపై సూచిస్తాడు - పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ‘విషయావగాహన, పటనైపుణ్యాలు’ అనే విద్యాప్రమాణాలకు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో కేటాయించిన మార్కులు వరుసగా
1) 20, 10 2) 10, 10
3) 20, 5 4) 5, 10 - కింది వాటిలో ఏ పరీక్షలు వయస్సు, లింగం, తరగతి మొదలైన ప్రమాణాలను అనుసరించి వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ, విద్యాప్రమాణాలను కచ్చితంగా నిర్ణయించడానికి విద్యార్థి జనాభాపై ప్రయోగించి శాస్త్రీయంగా, విశ్లేషణాత్మక విధానంలో రూపొందించినవి?
1) రాత పరీక్షలు 2) మౌఖిక పరీక్షలు
3) ప్రామాణిక పరీక్షలు
4) ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు - బహుళైచ్ఛిక ప్రశ్నల్లో 5 ప్రత్యామ్నాయాలుంటే అందులో విద్యార్థులు ఊహించే శాతం?
1) 5 శాతం 2) 10 శాతం
3) 15 శాతం 4) 20 శాతం - మూల్యాంకన ప్రక్రియలో మొట్టమొదటి అంశం?
1) అభ్యసన అనుభవాలను రూపొందించడం
2) విద్యా ఉద్దేశాలను రూపొందించడం
3) బోధనా లక్ష్యాలను రూపొందించడం
4) ప్రవర్తనా మార్పులను అంచనావేయడం - కింది వాటిలో వ్యక్తి నిష్టతకు అవకాశం లేని ప్రశ్న
1) భారతదేశంలో జనాభా పెరుగుదలకు కారణాలేవి?
2) భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిని వివరించండి?
3) భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్రను విశదీకరించండి?
4) భారతదేశ రాజధాని ఏది? - విద్యాకార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మూల్యాంకనం అని చెప్పినవారు?
1) రాల్ఫ్ టేలర్
2) బెంజిమన్ బ్లూమ్స్
3) నార్మన్ గ్రీన్లాండ్
4) జాన్ డ్యూయీ - ఒక విద్యార్థి ఒక విషయంలో ఒక ప్రత్యేకమైన పొరపాటు ప్రతిసారి ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోడానికి ఏ విధమైన మూల్యాంకనం వాడుతారు?
1) లోపనిర్ధారణ మూల్యాంకనం
2) నిర్మాణాత్మక మూల్యాంకనం
3) సంగ్రహ మూల్యాంకనం
4) ప్రాగుక్తీక మూల్యాంకనం - SAT లో కష్టతరమైన అంశం?
1) ప్రశ్నలు విశ్లేషణ చేయడం
2) బ్లూ ప్రింట్ తయారుచేయడం
3) ప్రశ్నలు తయారు చేయడం
4) లక్ష్యాలు ఎన్నుకోవడం - ‘మొక్కలు, చెట్లను మనం ఎందుకు పరిరక్షించుకోవాలి? దాని కోసం కొన్ని నినాదాలు రాయండి’. దీనిని అనుసరించిన విద్యార్థిలో నెరవేరే విద్యాప్రమాణం?
1) సమాచార సేకరణ-ప్రాజెక్టు
2) ప్రయోగాలు-క్షేత్ర పరిశీలనలు
3) ప్రశ్నించడం-పరికల్పన చేయడం
4) ప్రశంస-విలువలు-జీవవైవిధ్యం పట్ల స్పృహ - కింది వాటిలో ‘ప్రయోగాలు-క్షేత్ర పరిశీలనలకు’ సంబంధించిన అంశం?
1) ప్రభుత్వ సంస్థలు అని వేటిని అంటారు?
2) మీ మండలంలో ఉండే ప్రభుత్వ సంస్థలను పటంలో గుర్తించండి?
3) విత్తనం మొక్కగా మారే క్రమంలో వివిధ దశలను రాయండి?
4) మీకు నచ్చిన పక్షి గూడు నమూనాను తయారు చేయండి? - జతచేయండి.
- నామ మాత్రం ఎ. 41-50
- పర్వాలేదు బి. 0-40
- బాగుంది సి. 71-90
- చాలా బాగుంది డి. 91-100
- అత్యున్నత ప్రతిభ ఇ. 51-70
1) 1-బి, 2-ఎ, 3-ఇ, 4-సి, 5-డి
2) 1-బి, 2-ఇ, 3-ఎ, 4-సి, 5-డి
3) 1-బి, 2-ఇ, 3-డి, 4-సి, 5-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
- రాజు అనే విద్యార్థి నిర్మాణాత్మక మూల్యాంకనం (F2)లో పొందిన మార్కులు వరుసగా 6, 5, 7, 13 అయిన ఆ విద్యార్థి పొందిన గ్రేడు?
1) A 2) A+ 3) B 4) B+
- Tags
- nipuna
Previous article
గీతికా పాదంలోని శ్లోకాల సంఖ్య?
Next article
కరెంట్ అఫైర్స్-28-07-2021
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు