నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ లక్ష్యమేంటి?
- ఆపరేషన్ దేవ్ శక్తి దేనికి సంబంధించింది? (డి)
ఎ) దేశ వ్యాప్తంగా దేవాలయాలను కలుపుతూ చేపట్టే ప్రాజెక్ట్
బి) సాంస్కృతిక, కళా విశిష్ట ప్రాజెక్టుల అనుసంధానం
సి) ఆధ్యాత్మిక పర్యాటక ప్రాజెక్ట్
డి) అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం
వివరణ: యుద్ధంలో సతమతమవుతున్న అఫ్గానిస్థాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చేపట్టిందే ఆపరేషన్ దేవ్ శక్తి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ దీనిని ఆగస్ట్ 24న ప్రకటించారు. అమెరికా నిష్క్రమణతో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో పాలన చేపట్టారు. గతంలోనూ వారి పాలనలో మహిళల హక్కులు, మానవ హక్కులను ఏ మాత్రం గౌరవించలేదు. ప్రస్తుతం కూడా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో భారీ ఎత్తున అఫ్గాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు. భారత్ కూడా తమ దేశవాసులను సురక్షితంగా వెనక్కు తీసుకొని వస్తుంది. - ప్రియ, ఎన్ఐపీయూఎన్ (నిపుణ్) దేనికి సంబంధించినవి? (బి)
ఎ) సాఫ్ట్వేర్ ఎగుమతులు
బి) నూతన విద్యా విధానం
సి) సూక్ష్మ, లఘు సంస్థల అభివృద్ధి
డి) ఉద్యోగుల నైపుణ్యం పెంచేందుకు ఉద్దేశించిన విధానాలు
వివరణ: గతేడాది కేంద్రం నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విధానానికి సంబంధించిన ఒక నివేదికను బుక్లెట్ రూపంలో విడుదల చేశారు. ఇందులో ప్రియ, వర్చువల్ స్కూల్, నిపుణ్ భారత్ మిషన్, విద్యా ప్రవేశ్ తదితర అంశాలను ప్రస్తావించారు. ‘ప్రియా-ది యాక్సెసిబుల్ వారియర్’ అనేది ఒక కార్యాచరణ పుస్తకం (యాక్టివిటీ బుక్). దివ్యాంగులు తమ సౌకర్యాలు ఎలా పొందాలనే అంశానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఎన్ఐపీయూఎన్ (నిపుణ్) అనేది ప్రతి విద్యార్థి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ప్రారంభించారు. కచ్చితంగా చదవడం, రాయడం, ప్రాథమిక గణాంక స్థాయి గ్రేడ్-3 చేరే నాటికి వచ్చి ఉండాలి. ఈ లక్ష్యాన్ని 2026-27 నాటికి సాధించాలి. - ‘హెచ్వైబీఆర్ఐటీ’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించిన సంస్థ? (సి)
ఎ) వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించే సంస్థ
బి) ప్రపంచంలో హైబ్రిడ్ పద్ధతిలో తయారైన తొలి రోబో తయారీకి ఏర్పడిన సంస్థ
సి) ప్రపంచంలో తొలి శిలాజ రహిత ఉక్కును రూపొందించిన సంస్థ
డి) ఏదీకాదు
వివరణ: ప్రపంచంలోనే తొలిసారిగా శిలాజ రహిత ఉక్కును తయారు చేసిన సంస్థ హెచ్వైబీఆర్ఐటీ (హైబ్రిట్). స్వీడన్‌కు చెందిన ఉక్కు సంస్థ ఎస్‌ఎస్‌ఏబీ, యూరప్‌కు చెందిన అతిపెద్ద ఉక్కు సంస్థ ఎల్‌కేఏబీ, యూరప్‌లో అతిపెద్ద విద్యుత్ సంస్థల్లో ఒకటైన వాటెన్ఫాల్ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిందే హైబ్రిట్. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి శిలాజ రహిత బొగ్గు, విద్యుత్‌ను ఉపయోగించి ఉక్కును తయారు చేసింది. దీనిని తొలిసారిగా ట్రక్‌లను తయారు చేసే వోల్వో ఏబీ అనే సంస్థకు విక్రయించింది. పర్యావరణ పరిరక్షణకే దీనిని అభివృద్ధి చేశారు. - ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తయారు చేసిన ప్రపంచంలో సురక్షిత నగరాల జాబితాలో భారత్ తరఫున స్థానం పొందిన నగరాలు? (ఎ)
- ఢిల్లీ 2. బెంగళూర్ 3. ముంబై
ఎ) 1, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
వివరణ: ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూపొందించిన సురక్షిత నగరాల జాబితా-2021లో న్యూఢిల్లీ, ముంబై చోటు సంపాదించాయి. ఢిల్లీ 48వ స్థానంలో, ముంబై 50వ స్థానంలో ఉన్నాయి. ఈ సూచీలో డెన్మార్క్‌కు చెందిన కోపెన్‌హెగెన్ అగ్రస్థానంలో ఉంది. 76 అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 2021లో కొత్తగా పర్యావరణ భద్రతను కూడా ఇందులో చేర్చారు.
- ఢిల్లీ 2. బెంగళూర్ 3. ముంబై
- కేంద్రం ఇటీవల యుక్త్‌ధార అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది దేనికి సంబంధించింది? (బి)
ఎ) దేశంలో జలవనరులకు సంబంధించిన సమాచార నిల్వ కేంద్రం
బి) వివిధ గ్రామీణ పథకాల ద్వారా సృష్టించిన ఆస్తుల సమాచార నిల్వ కేంద్రం
సి) సరిహద్దుల వద్ద భద్రతకు సంబంధించిన పోర్టల్
డి) యువతకు శిక్షణ ఇచ్చిన అంశాలకు సంబంధించిన పోర్టల్
వివరణ: ఉపాధి హామీ పథకం, సమీకృత నీటి నిర్వహణ కార్యక్రమం తదితర గ్రామీణాభివృద్ధికి ఉద్దేశించిన పథకాల్లో భాగంగా పూర్తి చేసిన పనులను రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ఆధారిత సమాచారాలను పొందుపరుస్తూ యుక్త్‌ధార పేరుతో కేంద్రం ఆగస్ట్ 23న ఒక పోర్టల్‌ను తయారు చేసింది. ఇస్రో, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశాయి. - దేశంలో తొలిసారిగా స్మాగ్ టవర్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? (సి)
ఎ) ముంబై బి) కొచ్చిన్
సి) న్యూఢిల్లీ డి) అమృత్సర్
వివరణ: దేశంలో తొలి స్మాగ్ టవర్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించింది ఇది. ప్రతి నిమిషానికి 1000 క్యూబిక్ మీటర్ల గాలిని ఇది స్వచ్ఛంగా మారుస్తుంది. ఢిల్లీలోని కన్నాట్‌లో దీనిని ఏర్పాటు చేశారు. చుట్టూ కిలోమీటర్ పరిధిలో ఉన్న గాలిని ఇది స్వచ్ఛంగా చేస్తుంది. 24 మీటర్ల ఎత్తున, రూ.20 కోట్లతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీలో 213 స్మాగ్ టవర్లు ఉండాలని నిపుణుల బృందం సూచించింది. దశల వారీగా ఏర్పాటుకు ఢిల్లీ ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. - సంగీతా సర్దానా, సోనియా, నవనీత్ దుగ్గల్, రీను ఖన్నా, రిచాసాగర్లు ఇటీవల వార్తల్లో నిలిచారు. కారణం? (బి)
ఎ) యుద్ధ విమానాలకు పైలట్లుగా నియామకమయిన మహిళలు
బి) సిగ్నల్స్, ఇంజినీర్ కోర్ విభాగంలో కర్నల్ హోదా పొందిన మహిళలు
సి) ఆర్మీ వైద్య విభాగంలో కర్నల్ హోదా పొందిన తొలి మహిళలు
డి) ఏదీకాదు
వివరణ: తొలిసారిగా సిగ్నల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్, ఇంజినీర్స్ కోర్ విభాగాలకు చెందిన అయిదుగురు మహిళా అధికారులకు కర్నల్ హోదాను కల్పించారు. ఆర్మీ వైద్య, విద్యా విభాగాల్లో మహిళా అధికారులకు గతంలో కర్నల్ హోదా ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ పరిధిని పెంచారు. ఇలా హోదాను పొందిన మహిళలు సంగీతా సర్దానా (సిగ్నల్ కోర్), సోనియా ఆనంద్, నవనీత్ దుగ్గల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్), రీను ఖన్నా, రిచాసాగర్ (ఇంజినీర్స్ కోర్) - నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ లక్ష్యమేంటి? (డి)
- ఆస్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం
- మౌలిక సదుపాయాలను కల్పించడం
ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
వివరణ: ఆస్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను కేంద్రం ప్రకటించింది. దీని ద్వారా రూ.6 లక్షల కోట్లు సమీకరించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా వృథాగా పడిఉన్న, పూర్తి స్థాయిలో వినియోగించని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. నిర్ణీత గడువు వరకు ఇది కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వానికే అప్పగించాలి. ఇందులో భూ విక్రయం ఉండదు. అలాగే యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. బ్రౌన్‌ఫీల్డ్ ఆస్తులను మరింత సమర్థంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు.
- తెలంగాణ బీసీ కమిషన్ కొత్త చైర్మన్ ఎవరు? (సి)
ఎ) బీఎస్ రాములు బి) కిశోర్ గౌడ్
సి) కృష్ణమోహన్ రావు డి) సీహెచ్ ఉపేంద్ర
వివరణ: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌కు చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్ రావు నియమితులయ్యారు. సభ్యులుగా కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి నియామకమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియమించిన రెండో కమిషన్ ఇది. తొలి విడతలో బీఎస్ రాములు అధ్యక్షతన బీసీ కమిషన్ ఏర్పాటయ్యింది. - నియోబోల్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (ఎ)
ఎ) వీల్ చైర్ వాహనం
బి) సామగ్రి భద్రతకు సంబంధించిన పరిజ్ఞానం
సి) పైరసీ జరగకుండా నిరోధించే సాఫ్ట్వేర్
డి) ఏదీకాదు
వివరణ: నియోబోల్ట్ పేరుతో ఐఐటీ మద్రాస్ ఒక కొత్త వీల్ చైర్ వాహనాన్ని తయారు చేసింది. దేశీయ పరిజ్ఞానాన్ని ఇందుకు వినియోగించింది. రహదారులపైనే కాకుండా ఎత్తు, పల్లాల్లో కూడా దీని సేవలను వినియోగించుకోవచ్చు. ఈ తరహా వాహనం దేశంలో తయారు కావడం ఇదే ప్రథమం. గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీని ఇందులో వినియోగించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 25 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుంది. - ఎస్ఏఎంఆర్ఐడీహెచ్ (సమృద్ధ్) అనే కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది దేనికి సంబంధించింది? (ఎ)
ఎ) స్టార్టప్ సంస్థల అభివృద్ధి
బి) ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశోధన
సి) విద్యావ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ ప్రవేశపెట్టడం
డి) ఏదీకాదు
వివరణ: భారత సాఫ్ట్వేర్ ఉత్పత్తుల స్టార్టప్ సంస్థల అభివృద్ధికి సమృద్ధ్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్ఏఎంఆర్ఐడీహెచ్, దీని పూర్తి రూపం స్టార్టప్ యాగ్జిలరేటర్స్ ఆఫ్ మీటి ఫర్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. ఉత్పత్తుల పెంపుతో పాటు పెట్టుబడులను కూడా ఇది ప్రోత్సహిస్తుంది. ప్రతి స్టార్టప్ సంస్థకు రూ.40 లక్షల మేర పెట్టుబడి సాయం అందుతుంది. - భారత దేశపు తొలి హరిత హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌ను ఏ నగరంలో ప్రారంభించారు? (సి)
ఎ) భువనేశ్వర్ బి) ఇండోర్
సి) బెంగళూర్ డి) న్యూఢిల్లీ
వివరణ: భారత దేశపు తొలి గ్రీన్ హైడ్రోజన్ ఎలెక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను కర్నాటకలోని బెంగళూర్‌లో ప్రారంభించారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఒహ్మియం దీనిని అందుబాటులోకి తెచ్చింది. గ్రీన్ లేదా హరిత హైడ్రోజన్‌ను శిలాజేతర వనరుల ద్వారా తయారు చేస్తారు. శిలాజాలతో తయారు చేసే హైడ్రోజన్‌ను నీలి హైడ్రోజన్‌గా వ్యవహరిస్తారు. ఏటా 0.5 గిగా వాట్లను తయారు చేసే సామర్థ్యం బెంగళూర్‌లో ఏర్పాటు చేసిన యూనిట్‌కు ఉంటుంది. - కింద పేర్కొన్న ఏ సంస్థ/సంస్థలు 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అందుకున్నాయి? (డి)
- రిలయన్స్ 2. టీసీఎస్ 3.విప్రో
- హెచ్డీఎఫ్సీ 5. ఇన్ఫోసిస్
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4, 5
వివరణ: ఆగస్ట్ 24, 2021న ఇన్ఫోసిస్ సంస్థ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అందుకుంది. ఈ ఘనత సాధించిన నాలుగో సంస్థ ఇది. 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన సంస్థ టీసీఎస్. ఆ తర్వాత వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు కూడా ఈ మైలురాయిని అందుకున్నాయి.
- కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి? (బి)
- దేశంలో తొలి తేలియాడే సోలార్ పీవీ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు
- దేశంలో తొలి ‘ఈ-వెహికిల్ ఫ్రెండ్లీ హైవే’ ఢిల్లీ-చండీగఢ్ మధ్య ఉంది
ఎ) 1 బి) 1, 2 సి) 2 డి) ఏదీకాదు
వివరణ: దేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పీవీ ప్రాజెక్ట్‌ను ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రారంభించింది. సింహాద్రి థర్మల్ స్టేషన్లో 250 మెగావాట్ల విద్యుత్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆధార సూక్ష్మ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటుకు ఎన్టీపీసీ ప్రణాళిక రచిస్తుంది. అలాగే ఢిల్లీ-చండీగఢ్ హైవే దేశంలో తొలి ‘ఈ-వెహికిల్ ఫ్రెండ్లీ’గా నిలిచింది. అదేవిధంగా దేశపు తొలి సౌర ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్‌ను కర్నల్ లేక్ రిసార్ట్‌లో ఆగస్ట్ 19న ప్రారంభించారు.
- ఉర్జా (యూఆర్జేఏ) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) చేతి వృత్తుల వారికి కొత్త పథకం
బి) బాలలు పాఠశాలకు రావడానికి కొత్త విధానం
సి) చాట్‌బోట్ డి) ఏదీకాదు
వివరణ: కృత్రిమే మేధ ఆధారిత చాట్‌బోట్‌ను ఉర్జా పేరుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభించింది. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. దేశంలో చమురు-గ్యాస్ పరిశ్రమల్లో అందుబాటులోకి వచ్చిన తొలి చాట్‌బోట్ ఇదే. బీపీసీఎల్ ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ అనుభవ్’లో భాగంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇది 13 భాషల్లో సేవలు అందిస్తుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
- Tags
Previous article
ఎస్సీ, ఓబీసీలకు ఫ్రీ కోచింగ్
Next article
సెంట్రల్ టూల్ రూంలో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు