ఎస్సీ, ఓబీసీలకు ఫ్రీ కోచింగ్
- కాంపిటీటివ్, అకడమిక్ కోచింగ్‌లకు ఆర్థిక సహాయం
దేశంలో లక్షలాది మంది ప్రతిభ గల విద్యార్థులు ఉన్నా వారికి తగిన ప్రోత్సాహం లేక అర్ధాంతరంగా విద్యను మానేస్తున్నారు. కోర్సులు పూర్తిచేసి పోటీ ప్రపంచంలో సరైన ర్యాంకులు సాధించలేక ఉద్యోగాలు/సీట్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇటువంటి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి వారి లక్ష్యాలను చేరుకోవడానికి కావల్సిన ఉచిత కోచింగ్‌ను అందించే పథకమే ‘స్కీం ఫర్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్’.
ఫ్రీ కోచింగ్ లక్ష్యం
ప్రతిభ ఉన్నా తగు ఆర్థిక వనరులు లేక పోటీప్రపంచంలో అనేక కాంపిటీటివ్/అకడమిక్ పరీక్షల్లో ఎస్సీ, ఓబీసీ విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఇటువంటి వారికి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కీంకు ఎంపికైన విద్యార్థులకు వారు ప్రిపేరవుతున్న ఆయా పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణకు కావల్సిన ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ సంస్థ.
ఎవరు అర్హులు?
కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులు
అభ్యర్థి రాయబోయే పరీక్షలకు సంబంధించిన ఇంటర్, డిగ్రీ, బీఈ/బీటెక్‌లలో కనీస మార్కులు సాధించాలి.
స్కీం ప్రయోజనాలు
స్కీం కింద అభ్యర్థులు ప్రిపేరవుతున్న ఆయా కోచింగ్‌లకు సంబంధించిన ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది.
అదేవిధంగా శిక్షణ సమయంలో స్టయిఫండ్ కింద స్థానికంగా ఉన్నవారికి నెలకు రూ.3,000, దూరప్రాంతాల వారికి రూ.6,000 చెల్లిస్తారు. అదేవిధంగా పీహెచ్సీ అభ్యర్థులు ఉంటే వారికి అదనంగా మరో రెండు వేలు ఇస్తారు.
ఫ్రీ కోచింగ్ వీటికే..
యూపీఎస్సీ నిర్వహించే గ్రూప్ ఏ, బీ ఉద్యోగాలకు, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ చేపట్టే నియామకాలకు సంబంధించిన పరీక్షలకు, రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలకు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ నిర్వహించే ఆఫీసర్ స్థాయి కొలువులకు సంబంధించిన కోచింగ్‌కు ఫీజు చెల్లిస్తారు.
ఉన్నత చదువులకు సంబంధించి ఐఐటీ జేఈఈ, నీట్, క్లాట్, క్యాట్, ఎన్డీఏ, సీడీఎస్ తదితర పరీక్షలకు, జీఆర్ఈ, శాట్, జీమ్యాట్, టోఫెల్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారికి శిక్షణకు ఫీజు
చెల్లిస్తారు.
స్కీం అమలు ఇలా
ఈ స్కీం రెండు పద్ధతుల్లో అమలు చేస్తారు. విద్యార్థులు ఏదైనా ఒకదానిని ఎంచుకోవచ్చు.
మొదటి పద్ధతిలో మొత్తం సీట్లను గుర్తింపు పొందిన కోచింగ్ ఇన్స్టిట్యూట్కు అప్పగిస్తారు. విద్యార్థుల ఎంపిక ఆయా ఇన్స్టిట్యూట్లే చేపడుతాయి. ఎంపికైన వారికి ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. దీనికి సంబంధించిన ఫీజును కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ చెల్లిస్తుంది.
రెండో పద్ధతిలో మొత్తం సీట్లకుగాను సంబంధిత మంత్రిత్వశాఖ విద్యార్థులను ఎంపిక చేస్తుంది. విద్యార్థులు వారికి ఇష్టమైన కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందవచ్చు. కోచింగ్‌కు సంబంధించి చెల్లించాల్సిన ఫీజును రెండు విడుతల్లో అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం వేస్తుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 10
వెబ్సైట్: http://coaching.dosje.gov.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు