నాణ్యమైన విద్యకు కేరాఫ్ జర్మనీ
జర్మనీ పేరు వినగానే రెండో ప్రపంచ యుద్ధం గుర్తుకువచ్చేది ఒకప్పుడు. జర్మనీ యూరప్ ఖండంలో అత్యధిక జనాభా గల దేశంగా రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు జర్మనీ భారతీయ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తుంది. 2020లో వెలువడిన ఫెడరల్ స్టాటిస్టిక్స్ ప్రకారం జర్మనీలో చదువు కోసం వెళ్లిన విద్యార్థుల సంఖ్య 20.8 శాతం ఉంది. మనవారే కాదు సుమారు 180 దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల శాతం 4.3 శాతం పెరిగింది. మన విద్యార్థులు ఇతర దేశ విద్యార్థులతో పోలిస్తే సుమారు 5 రెట్లు ఎక్కువగా జర్మనీకే వెళ్లారు. వీరిలో 67 % ఇంజినీరింగ్, ఇతరులు మేనేజ్మెంట్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, నేచురల్ సైన్సెస్ వంటి కోర్సుల కోసం వెళ్తున్నారు.
జర్మనీ ఎందుకు?
ఎడ్యుకేషన్ క్వాలిటీ: జర్మనీలో ఎడ్యుకేషన్, రీసెర్చ్‌కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అక్కడి పేరుగల ఉన్నత విద్యాసంస్థల్లో పట్టభద్రులైన విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు దొరికే చాన్స్ ఉంది. జర్మనీలోని ప్రముఖ నగరాల్లో గొప్ప విద్యాసంస్థలు ఉన్నాయి. తక్కువ ట్యూషన్ ఫీజు, క్వాలిటీ అఫ్ లైఫ్, స్కాలర్షిప్లు ఉండటం వల్ల ఆసక్తికరమైన డెస్టినేషన్‌గా మారింది. మొత్తం 13 జర్మన్ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని టాప్-250 విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. 30 ప్రపంచంలోని టాప్-500లో చేరాయి. ఇది ప్రపంచంలోని ఉన్నత విద్య స్థానాల్లో జర్మనీని ప్రముఖ స్థానంలోకి తీసుకువచ్చింది.
సేఫ్టీ: 2019 గ్లోబల్ పీస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోని 163 దేశాల్లో జర్మనీ 22వ స్థానంలో ఉంది. పగలు, రాత్రి సగటున మంచి సేఫ్టీ, పొలిటికల్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ గల దేశం.
ఖర్చు: జర్మనీలో విద్య అంటే ఒక యూరో సుమారు రూ.86కు సమానం అన్న విషయం మరువరాదు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా అధ్యాపకులు కావాలంటే అంతే కదా. కానీ జర్మనీ విషయానికి వస్తే ట్యూషన్ ఫీజు తక్కువగా ఉంటుంది. లేదా పబ్లిక్ యూనివర్సిటీ ల్లోని కొన్ని కోర్సులకు పూర్తిగా ఉండదు. యూనివర్సిటీలు ట్యూషన్ ఫీజులు వసూలు చేయని ఏకైక అగ్ర అధ్యయన గమ్య స్థానం జర్మనీ.
అక్టోబర్ 2014లో జర్మనీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలోని 16 రాష్ర్టాల్లోని పబ్లిక్ యూనివర్సిటీలకు హాజరయ్యే అంతర్జాతీయ విద్యార్థులు సాధారణ ట్యూషన్ ఫీజు చెల్లించకుండా ఉండవచ్చని పేర్కొంది. విదేశీ విద్యార్థులు.. విద్యార్థి సహకారం, విద్యార్థి సంఘాల రుసుం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టికెట్ వంటి కొన్ని వ్యయాలకు మాత్రమే చెల్లించాలి. ఇది ఒక్కో సెమిస్టర్‌కు దాదాపు 250 యూరోల వరకు ఉంటుంది. 2017లో నాన్ యూరోపియన్ యూనియన్ విద్యార్థులకు జర్మనీలోని ఒక రాష్ట్రంలో మళ్లీ ఫీజు చెల్లించాలని రూల్ తీసుకువచ్చారు. అది సంవత్సరానికి కనీసం 3000 యూరోలు అవుతుంది. ప్రస్తుతానికి తక్కువ ఫీజు వల్ల ఇది ప్రపంచ స్థాయిలో టాప్-5 స్టూడెంట్ డెస్టినేషన్స్‌లో ఉంది.
లివింగ్ ఎక్స్పెన్సెస్
DAAD నుంచి వచ్చిన డేటా ఆధారంగా జర్మనీలో విద్యార్థులకు అవసరమయ్యే ఇతర సగటు నెలవారీ ఖర్చులు కింది విధంగా ఉన్నాయి.
ఆహారం కోసం 168 యూరోలు
( US $ 205)
బట్టల కోసం 42 యూరోలు
( US $ 52)
రవాణా కోసం 94 యూరోలు
( US $ 115)
టెలిఫోన్, ఇంటర్నెట్, టీవీ లైసెన్స్ కోసం 31 యూరోలు ( US $ 38)
పని/అధ్యయన సామగ్రి కోసం 20 యూరోలు ( US $ 25)
విశ్రాంతి కార్యకలాపాల కోసం 61 యూరోలు ( US $ 75)
మ్యూనిచ్ వంటి పెద్ద నగరాల్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.
జర్మనీ స్టడీ వీసా పొందడానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఉన్నట్టు రుజువులు సమర్పించాలి. జర్మనీలో చదువుకోవడానికయ్యే ఖర్చును భరించగలరని అనడానికి ఇది హామీగా పనిచేస్తుంది. జనవరి 2021 లెక్కల ప్రకారం నెలకు 861 EUR / 10,332 EUR నిధులను సమకూర్చుగోలరని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రదర్శించాలి.
లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం సైడ్ జాబ్స్ చేయవచ్చు. కానీ ఇంటర్నేషనల్ విద్యార్థులకు పని గంటలు, పని లిమిటెడ్‌గా ఉంటుంది. కాబట్టి స్కాలర్‌షిప్‌ల కోసం ప్రయత్నించవచ్చు. ఫెడరల్ లేదా పార్టీ రిలేటెడ్ వ్యాపార-అనుబంధ సంస్థలు అంతర్జాతీయ విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాయి.
అడ్మిషన్ సైకిల్
చాలా ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్/అక్టోబర్‌లో ప్రారంభమయ్యే శీతాకాల సెమిస్టర్ కోసం దరఖాస్తులు మే నెల ప్రారంభంలో మొదలై జూలై 15న ముగుస్తాయి. మార్చి/ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే వేసవి సెమిస్టర్ కోసం దరఖాస్తు డిసెంబర్ నెల ప్రారంభం నుంచి జనవరి 15 వరకు ఉంటుంది. అడ్మిషన్ ఆఫర్ లెటర్లు ఆగస్టు/సెప్టెంబర్‌లో, ఫిబ్రవరి/మార్చిలో పంపుతారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఇతర డెడ్లైన్లు ఉండవచ్చు.
వివిధ ఉన్నత విద్యాసంస్థలకు మరిన్ని దరఖాస్తులు పంపడం వల్ల అడ్మిషన్ అవకాశాలు ఎక్కువవుతాయి. సాధారణంగా చాలామంది ప్రధాన నగరాలు లేదా సంప్రదాయ విశ్వవిద్యాలయ పట్టణాల్లో చదువుకోవాలనుకుంటున్నారు. తక్కువ జనాదరణ పొందిన ప్రదేశాల్లో ఉన్నత విద్యాసంస్థలకు దరఖాస్తు చేసుకుంటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి లిస్ట్ అఫ్ కాలేజీల్లో ఇలాంటివి కూడా ఉండాలి. అకడమిక్ గ్రేడ్స్‌తో పాటు ఇతర విషయాలు కూడా అడ్మిషన్ పై ప్రభావం చూపుతాయి. కావాల్సిన ఆప్టిట్యూడ్ పరీక్షల్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి.
ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు అడ్మిషన్స్ అప్రూవల్ ఉండి, జాబ్ మార్కెట్లో ఆ డిగ్రీకి వ్యాల్యూ ఉన్న యూనివర్సిటీల్లో చేరండి. కొన్ని యూనివర్సిటీలు థియరీ రీసెర్చ్, కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాయి.
కమ్యూనికేషన్ అనేది కాలేజీతో పాటు బయట కూడా ఉంటుంది. కాబట్టి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఆ లాంగ్వేజ్ సర్టిఫికెట్ కలిగి ఉండటం ఉపయోగపడుతుంది.
IELTS, TOEFL వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు, జర్మన్ లాంగ్వేజ్ కోసం TESTDaf, DSH వంటివి రాస్తారు. Testdaf జర్మనీకి వెళ్లకముందే ఈ పరీక్ష తీసుకోవచ్చు. ఒకవేళ మార్కులు తక్కువగా వస్తే అక్కడికి వెళ్లిన తరువాత జర్మన్ లాంగ్వేజ్ కోర్స్‌లో చేరాల్సి రావచ్చు. మీరు చేరాలనుకుంటున్న యూనివర్సిటీ రిక్వైర్మెంట్ బట్టి చూసుకోండి. DSH జర్మనీలోనే నిర్వహిస్తారు. అవసరమైన కోచింగ్ తీసుకోండి. బిగినింగ్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజీకి వెళ్లాలనుకుంటే కనీసం 8 వారాల నుంచి 6 నెలల వరకు పడుతుంది.
టాప్ డెస్టినేషన్స్
బెర్లిన్: జర్మనీ క్యాపిటల్ అయిన బెర్లిన్ మహానగరం విభిన్న సంస్కృతుల విద్యార్థులను ఆకర్షిస్తుంది. ఇది మంచి టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. ఈ నగరానికి ఎంతో చరిత్ర కూడా ఉంది. Freie Universitat (5వ స్థానం), Humboldt-Universitat Zu (6వ స్థానం), Technische Universitat (11వ స్థానం) ప్రముఖ విశ్వవిద్యాలయాలు.
హాంబర్గ్: ఇది జర్మనీలోని రెండో అతిపెద్ద నగరం. ఎల్బే నదిపై ఉన్న ఈ నగరం దేశంలోని అత్యంత రద్దీగా ఉండే పోర్టుతో రవాణా కేంద్రం. ఇక్కడి విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ హాంబర్గ్ జర్మనీలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటి (13వ స్థానంలో ఉంది).
మ్యూనిచ్: ఇది జర్మనీలోని మూడో పెద్ద నగరం. కొంచెం కాస్ట్ అఫ్ లివింగ్ ఎక్కువే. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రముఖమైనవి Technische Universitat మ్యూనిచ్, Ludwig-Maximilians-Universitat మ్యూనిచ్. ఇవి జర్మనీలోని మొదటి ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి.
డ్రెస్డెన్ ఒక సాంస్కృతిక, విద్య, రాజకీయ, ఆర్థిక కేంద్రం. ఇక్కడ జ్వింగర్ ప్యాలెస్ వంటి పర్యాటక ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడి విశ్వవిద్యాలయం Technische Universitat జర్మనీలో 14వ స్థానంలో ఉంది.
టాప్ యూనివర్సిటీలు
QS ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ యూనివర్సిటీ లిస్ట్‌ని బట్టి జర్మనీలోని సుమారు 46 విశ్వ విద్యాలయాలు టాప్-1029లో ఉన్నాయి.
- Technische Universitat Mnchen
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 యూనివర్సిటీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం జర్మనీ యూనివర్సిటీల్లో మొదటి స్థానంలో ఉంది. కాబట్టి విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. 1968లో ప్రారంభించిన ఈ యూనివర్సిటీలో టాప్ క్లాస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సుమారు 11,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. - Ludwig-Maximilians Universitat Mnchen
1472లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 15 శాతం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. సుమారు 42 నోబెల్ గ్రహీతలతో అనుబంధం ఉన్న ఈ కళాశాల ప్రపంచ స్థాయిలో అకడమిక్స్కి మంచి పేరుంది.
3.Ruprecht-Karls-Universitat Heidelberg
1386లో ప్రారంభించిన ఈ యూనివర్సిటీ జర్మనీలోని ప్రాచీనమైనది. అకడమిక్స్కి, ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇంట్రాక్షన్స్కి మంచి పేరుంది.
4.Humboldt-Universitat zu Berlin
1810లో బెర్లిన్‌లో ప్రారంభించిన ఈ యూనివర్సిటీకి మదర్ అఫ్ అల్ యూనివర్సిటీస్ అనే పేరు ఉంది. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి గొప్ప ప్రొఫెసర్లు ఇక్కడ ఎన్నో ఆవిష్కారాలు చేశారు. సుమారు 56 మంది నోబెల్ అవార్డు గ్రహీతలతో అనుబంధమున్న చోటు ఇది. - Freie Universitat Berlin
అకడమిక్ రెపుటేషన్ ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో ఎన్నో కోర్సులున్నాయి. అందులో సోషల్ సైన్స్, పొలిటికల్ కోర్సుకి ఎంతో పేరుంది.
ఇతర యూనివర్సిటీలు
- KIT, Karlsruher Institut fr Technologie
- Rheinisch-Westfalische Technische Hochschule Aachen
- Technische Universitat Berlin
- Technische Universitat Dresden
- Eberhard Karls Universitat Tbingen
- Georg-August-Universitat Gottingen
- Universitat Hamburg
- Rheinische Friedrich -Wilhelms-Universitat Bonn
- Technische Universitat Darmstadt
- Universitat Koln
- Universitat Mannheim
- Universitat Frankfurt am Main
- Universitat Erlangen-Nrnberg
- Universitat Jena
- Universitat Stuttgart
వీసా ప్రాసెస్
అడ్మిషన్ ఆఫర్ వచ్చిన తరువాత ఎంబసీలో వీసా అపాయిట్మెంట్ పనులు మొదలు పెట్టాలి. కావాల్సిన వీసా డాక్యుమెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అకడమిక్ రిక్వైర్మెంట్స్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. వీసా ప్రాసెస్ కోసం కనీసం 25 రోజులు పడుతుంది. జర్మన్ వీసా పర్మిట్ వచ్చిన తరువాత అవసరమైన దాన్ని బట్టి వీసాను ఎక్స్టెన్షన్ చేసుకోవాలి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు