‘దక్షిణాది అశోకుడు’గా ప్రసిద్ధిగాంచింది?

ఇక్ష్వాకులు (క్రీ.శ.220-300)
శాతవాహనుల సామ్రాజ్య పతనానంతరం వారి సామంతుల్లో ఒకరైన ఇక్ష్వాకులు తెలంగాణ-కోస్తాంధ్ర ప్రాంతంలో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. చివరి శాతవాహన రాజైన నాలుగో పులోమావిని ఇక్ష్వాక రాజు శ్రీశాంతమూలుడు తొలగించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. వీరి శాసనాలు, నాణేలు దొరికిన ప్రదేశాలను బట్టి వారి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు, తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ వరకు విస్తరించిందని చెప్పవచ్చు. వీరు నాగార్జునకొండ లోయలోని విజయపురిని రాజధానిగా చేసుకున్నారు. ఇక్ష్వాకుల రాజ చిహ్నం సింహం.
ఆధారాలు
పురాణాల్లో ఈ వంశానికి చెందిన ఏడుగురు రాజులు పేర్కొన్నారు. కానీ శాసనాలను బట్టి నలుగురి పేర్లే తెలుస్తున్నాయి.
పురావస్తు ఆధారాలు: నాగార్జున కొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డి పల్లి, ఫణిగిరి మొదలైన చోట్ల దొరికిన శాసనాలు వీరి చరిత్రకు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి. ఈ శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో రాసి ఉన్నాయి. ఎహూవల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో లిఖించి ఉన్నాయి. ఇక్ష్వాకుల నాణేలు నాగార్జున కొండ, ఫణిగిరి, నేలకొండపల్లి, వడ్డమాను, ఏలేశ్వరం మొదలైన చోట్ల దొరికాయి. నాగార్జున కొండ తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి కోట, బౌద్ధ స్థూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవి ఎన్నో బయటపడ్డాయి.
- సాహిత్య ఆధారాల్లో మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు, భాగవత పురాణాలు ఇక్ష్వాక రాజుల పేర్లు, వారి పరిపాలనా కాలాన్ని వివరిస్తున్నాయి. పురాణాలు వీరిని ‘శ్రీపర్వతీయులు, ఆంధ్రభృత్యులు, శ్రీపర్వతీయాంధ్రులు’ అని పేర్కొన్నాయి. నాగార్జునకొండ నుంచి ప్రారంభమై శ్రీశైలం పర్వతం చుట్టూ ఉన్న నల్లమల కొండల వరకు గల పర్వతశ్రేణిని శ్రీపర్వతమని పురాణాలు, బౌద్ధ గ్రంథాలు వర్ణించాయి.
- పాలకులు
వీరికి సంబంధించిన శాసనాల ఆధారంగా నలుగురు రాజుల గురించి మాత్రమే సమాచారం లభిస్తుంది. వారు వాసిష్టీపుత్ర శాంతమూలుడు, మాఠరీపుత్ర వీరపురుష దత్తుడు, ఎహూవల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు.
ఇక్ష్వాక రాజులు తమ పేర్లకు ముందు తల్లిపేరును ధరించే సంప్రదాయాన్ని శాతవాహనుల నుంచి స్వీకరించారు. వీరు శాతవాహనుల దగ్గర మహాతలవరులుగా పనిచేశారు.
వాసిష్టీపుత్ర శాంతమూలుడు (క్రీ.శ.220-233)
ఇతడు స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు
హిరణ్యక, పూగియ వంశీయులతో కలిసి చివరి శాతవాహన రాజు నాలుగో పులోమావిని తొలగించి తెలంగాణ-కోస్తాంధ్ర ప్రాంతంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.
ఇతడి శాసనాలు రెంటాల, దాచేపల్లి, కేశానపల్లి వద్ద దొరికాయి.
శాంతమూలుడి గొప్పతనాన్ని గురించి అతడి కుమారుడైన వీరపురుషదత్తుడి నాగార్జునకొండ శాసనాల ద్వారా, శాంతమూలుడి సోదరీమణులైన హర్మ్యశ్రీ, శాంతిశ్రీలు వేయించిన శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు.
శాసనాల్లో ఇతడిని ‘అవేక గోహలశత సహస్ర వద యిశ’గా పేర్కొన్నారు. అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం శాంతమూలుడు ‘కోట్ల కొలది బంగారు నాణేలు, వేలకొలది గోవులు, ఎద్దులు, నాగళ్లు, భూమిని దానంగా ఇచ్చాడని అర్థం.
శాంతమూలుడు అశ్వమేధ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ యాగాలను చేశాడు.
ఇతడి బిరుదు ‘మహారాజు’. శాంతమూలుడు సమకాలీన రాజవంశాలైన ధనిక, పూగియ కుటుంబాలతో వివాహ సంబంధాలను ఏర్పర్చుకొని బలపడ్డాడు.
ఇతడు వైదిక మతావలంబికుడు. ఇతడు ఉజ్జయినీలోని స్కంద కార్తికేయుని (మహాసేనుడు) భక్తుడు.
శాంతమూలుడి ఇద్దరు సోదరీమణులు మాత్రం బౌద్ధ మతావలంబికులు.
మాఠరీపుత్ర శ్రీవీరపురుష దత్తుడు (233-253)
ఇతడు శాంతమూలుడి కుమారుడు. ఇక్ష్వాక వంశంలో గొప్పవాడు.
వీరపురుష దత్తుడి కాలం ఆంధ్ర దేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం.
అందువల్లనే ఇతడిని ‘దక్షిణాది అశోకుడు’ అంటారు.
ఇతడి శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, అల్లూరులలో దొరికాయి.
వీర పురుష దత్తుడు సమకాలీన రాజవంశాలతో వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకొని వారి మద్దతుతో సుస్థిరమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
నాగార్జున కొండ శాసనాన్ని అనుసరించి ఇతడికి ఐదుగురు భార్యలు ఉన్నారు.
ఇతడి మేనత్త హర్మ్యశ్రీ కూతుళ్లు బాపిశ్రీ, షష్టిశ్రీ, మరో మేనత్త శాంతిశ్రీ కూతురును వివాహం చేసుకున్నాడు.
ఈ విధంగా మేనత్త కూతుళ్లను వివాహం చేసుకునే సంప్రదాయాన్ని దక్షిణ భారతదేశంలో వీరపురుషదత్తుడు ప్రవేశపెట్టాడని చెప్పవచ్చు.
ఇతడి నాలుగో భార్య శక క్షాత్రప రాకుమారి ‘రుద్రభట్టారిక మహాదేవి’, ఐదో భార్య మహాదేవి భట్టిదేవి’.
ఇతడి ఏకైక కూతురు ‘కొడబలిశ్రీ’ని చుటు వంశానికి చెందిన బనవాసి రాజు ‘శివలానంద శాతకర్ణి’కి ఇచ్చి వివాహం చేశాడు.
వీరపురుష దత్తుడు మొదట శైవుడు. ఇతడి మేనత్త శాంతిశ్రీ ప్రభావంతో బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
ఇతడి కాలంలో ఇతడి మేనత్త శాంతిశ్రీ నాగార్జున కొండపై అనేక బౌద్ధ నిర్మాణాలను చేపట్టింది.
ఈమె వీరపురుషుని ఆరో రాజ్య సంవత్సరంలో బుద్ధుడి ధాతువుని నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించింది.
నాగార్జున కొండ శాసనం ప్రకారం శాంతిశ్రీ బ్రాహ్మణులు, పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండి వారి క్షేమాన్ని చూసేది.
శాంతిశ్రీ తన అల్లుడైన వీరపురుష దత్తుడి 18వ పాలనా సంవత్సరంలో అతడి విజయాన్ని, ఆయురారోగ్యాలను కోరుతూ మరో శాసనాన్ని వేయించింది.
అమరావతిలోని భాండారికుడి కుమార్తె ‘ఉపాసిక బోధిశ్రీ’ వీరుపురుషదత్తుడి కాలంలో చెప్పుకోదగ్గ మరో మహిళ.
ఇతడి కాలంలో ఉపాసిక బోధిశ్రీ బౌద్ధ మత వ్యాప్తికి తీవ్రంగా కృషిచేసి తన పేరుమీదుగా ఉపాసిక బోధిశ్రీ శాసనాన్ని వేయించింది. ఇందులో తను చేసిన పనులను వివరించింది.
ఈమె బౌద్ధ మత వ్యాప్తి కోసం బౌద్ధ సన్యాసులను శ్రీలంక, కశ్మీర్, టిబెట్ ప్రాంతాలకు పంపింది. అంతేకాకుండా ‘చూలధర్మగిరి’ కొండపై బౌద్ధ విహారం, చైత్యం నిర్మించింది.
ఎహూవల శాంతమూలుడు (253-277)
ఇతడినే వాసిష్టీపుత్ర బహుబల శాంతమూలుడు, రెండో శాంతమూలుడు అని అంటారు.
ఇతడు మహాదేవి వాసిష్టీభట్టిదేవి, వీరపురుష దత్తుల కుమారుడు.
తాత పేరు పెట్టుకునే సంప్రదాయం ఇతడి నుంచే ప్రారంభమైంది. తర్వాత ఈ సంప్రదాయాన్ని గుప్తులు, వాకాటకులు, పల్లవులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు అనుసరించారు.
ఇతడి కాలంలో వైదిక, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి.
ఇతడి కాలం నుంచే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది.
ఇతడు నాగార్జున కొండ వద్ద సంస్కృత శాసనం వేయించాడు.
ఎహూవల శాంతమూలుడి పదకొండో రాజ్య సంవత్సరంలో అతడి సేనాని ఎలిశ్రీ ఒక శాసనం వేయించాడు.
ఈ శాసనం ప్రకారం శాంతమూలుడు చేసిన ఒక ముఖ్యమైన యుద్ధంలో పాల్గొన్న అతడి సేనాని ఎలిశ్రీ కార్తికేయుని కృప వల్ల విజయం సాధించినట్లు తెలుస్తుంది.
ఈ విజయానికి గుర్తుగా ఎలిశ్రీ ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించి ‘సర్వదేవాలయం’ అనే పేరుమీద ఒక శివాలయాన్ని నిర్మించాడు.
ఎహూవల శాంతమూలుడు వైదిక మతాభిమాని. ‘స్వామి మహాసేనుని’ భక్తుడు.
ఇతడు విజయపురిలో కార్తికేయాలయం, పుష్పభద్రస్వామి ఆలయం, నొడిగిరీశ్వరాలయం, దేవీ ఆలయం మొదలైన ఆలయాలను నిర్మించాడు.
ఈ విధంగా దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజుగా ఎహూవల శాంతమూలుడిని పేర్కొంటారు.
రుద్రపురుష దత్తుడు (283-300)
గురజాల, నాగార్జున కొండ, ఫణిగిరిలో దొరికిన నాణేలపై గల లిపి ఆధారంగా, శాసనాలపై గల పేరును బట్టి రుద్రపురుష దత్తుడు చివరి ఇక్ష్వాక రాజు అని చరిత్రకారులు గుర్తించారు.
ఇతడు ఎహూవల శాంతమూలుడి కుమారుడు.
ఇతడి నాలుగో పరిపాలనా సంవత్సర కాలంలో ‘నోదుకశ్రీ’ అనే వ్యక్తి తన దైవమైన ‘హలంపుర స్వామి’కి కొంత భూమిని దానంగా ఇచ్చాడని శాసనంలో ఉంది.
రుద్రపురుష దత్తుడి కాలంలో పల్లవ రాజు సింహవర్మ ఇక్ష్వాకులపై దాడిచేశాడు.
దీని గురించి సింహవర్మ వేయించిన మంచికల్లు (గుంటూరు) శాసనంలో పేర్కొని ఉంది. ఇది ఆంధ్ర దేశంలో తొలి పల్లవ శాసనం.
తర్వాతి పల్లవ రాజైన శివస్కంధ వర్మ ఇక్ష్వాక రాజ్యంపై దండెత్తి కృష్ణానది దక్షిణాన ఉన్న ప్రాంతాలను ఆక్రమించి ఇక్ష్వాకులను అంతం చేశాడు. దీని గురించి శివస్కంధ వర్మ మైదవోలు శాసనం ద్వారా తెలుస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
- పురాణాల్లో ‘శ్రీపర్వతీయులు’గా పేర్కొన్నవారు?
1) శాతవాహనులు 2) ఇక్ష్వాకులు 3) విష్ణుకుండినులు 4) కాకతీయులు - ‘అవేక గోహల శత సహస్ర పదయిశ’ బిరుదు కలిగిన ఇక్ష్వాక రాజు?
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
2) వీరపురుష దత్తుడు
3) ఎహూవల శాంతమూలుడు
4) రుద్రపురుష దత్తుడు - ‘దక్షిణాది అశోకుడు’గా ప్రసిద్ధిగాంచింది?
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
2) ఎహూవల శాంతమూలుడు
3) వీరపురుష దత్తుడు
4) రుద్రపురుషదత్తుడు - ఎవరి ప్రభావంతో వీరపురుష దత్తుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు?
1) శాంతిశ్రీ 2) కొడబలిశ్రీ 3) షష్టిశ్రీ 4) బాపిశ్రీ - ఇక్ష్వాకుల కాలంలో ‘చూలధర్మగిరి’ కొండపై బౌద్ధ విహారం, చైత్యం నిర్మించింది?
1) శాంతిశ్రీ 2) ఉసాసిక బోధిశ్రీ
3) షష్టిశ్రీ 4) బాలశ్రీ
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
ఇవీ కూడా చదవండి…
- Tags
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






