టెర్రస్ గార్డెన్ పుస్తకావిష్కరణ
తెలంగాణ
టెర్రస్ గార్డెన్ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో జూలై 10న ఆవిష్కరించారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి తెలుగులో రాసిన మిద్దెతోట పుస్తకాన్ని టెర్రస్ గార్డెన్ పేరుతో కోడూరు సీతారామ ప్రసాద్ ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
మహిళా సైబర్ ల్యాబ్
సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్ (సీఆర్‌సీఐడీఎఫ్)తో తెలంగాణ పోలీస్ శాఖ జూలై 16న హైదరాబాద్‌లో నిర్మించనున్న దేశంలో తొలి మహిళా సైబర్ ల్యాబ్‌కు సంబంధించిన ఒప్పందం కుదిరింది. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకుగాను దీనిని ప్రారంభించనున్నారు.
టెస్కాబ్‌కు అవార్డు
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు జాతీయస్థాయి ఉత్తమ ప్రథమ అవార్డును నాబార్డు అందజేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 33 సహకార అపెక్స్ బ్యాంకుల పనితీరును మదింపు చేసి తెలంగాణకు ప్రథమ, గుజరాత్‌కు ద్వితీయ స్థానం ప్రకటించింది. నాబార్డు 40వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 12న ఈ అవార్డులను ఆన్లైన్ ద్వారా అందజేసింది.
బంగ బంధు చైర్
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బంగ బంధు చైర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఐసీసీఆర్, ఢాకా యూనివర్సిటీల మధ్య ఒక ఒప్పందం జూలై 12న కుదిరింది.
సేంద్రీయంపై ఒప్పందం
లఢక్ సేంద్రీయ పరిపాలన, సిక్కిం సేంద్రీయ సర్టిషికేషన్ ఏజెన్సీ (సొక్క)లు సేంద్రీయంపై ఒప్పందాన్ని జూలై 14న కుదుర్చుకున్నాయి. కృషి సించయ్ యోజన, మిషన్ సేంద్రీయ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద్వారా సేంద్రీయ లఢక్‌గా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం జరిగింది. 2025 నాటికి లఢక్‌ను సంపూర్ణ సేంద్రీయ ప్రాంతంగా మార్చాలనేది లక్ష్యం.
రేషన్ ఏటీఎం
హర్యానా ప్రభుత్వం దేశంలోనే తొలి ‘రేషన్ ఏటీఎం’ను గురుగ్రామ్‌లో జూలై 15న ప్రారంభించింది. టచ్‌స్క్రీన్ ద్వారా లబ్ధిదారుడు ఆధార్ లేదా రేషన్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయాలి. బయోమెట్రిక్ ఓకే కాగానే ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమేటిక్‌గా సంచుల్లో ఆ ధాన్యాన్ని నింపుతుంది. దీని నుంచి 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదలవుతాయి. రేషన్ దుకాణాల్లో తూనికలు, కొలతల అక్రమాలను నిరోధించడానికి పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర సీఎం దుష్యంత్ చౌతాలా వెల్లడించారు.
సిరోస్కి హెలికాప్టర్
లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారుచేసిన బహుళ ప్రయోజన సిరోస్కి ఎంహెచ్-60 ఆర్ (రోమియో) హెలికాప్టర్లను అమెరికా భారత నావికాదళానికి జూలై 16న అప్పగించింది. ఈ కార్యక్రమానికి భారత రాయబారి తరుణ్‌జిత్ సింగ్ సంధు హాజరయ్యారు.
అంతర్జాతీయం
లింగ్ లాంగ్ వన్ అణురియాక్టర్
ప్రపంచంలో తొలి వాణిజ్య అణురియాక్టర్ లింగ్ లాంగ్ వన్ నిర్మాణ పనులను జూలై 13న చైనా ప్రారంభించింది. హైనాన్ ప్రావిన్స్‌లోని చాంగ్జియాంగ్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో దీనిని నిర్మించనున్నారు. దీనిని చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. దీనికి 1,25,000 కిలోవాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్
తజకిస్థాన్ రాజధాని దుషాంబేలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జూలై 14న నిర్వహించారు. ఈ సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తూర్పు లద్దాఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న పరిస్థితిపై చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి సరిహద్దుల వద్ద శాంతి నెలకొనడం ముఖ్యమని జైశంకర్ వివరించారు.
ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడితో భేటీ
భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో జూలై 15న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి, శాంతి, సుస్థిరతలపై చర్చించారు.
బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయులు
భారత సంతతికి చెందిన రాహుల్ గుప్తా, అతుల్ గవాండేలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన యంత్రాంగంలో జూలై 14న స్థానం కల్పించారు. మాజీ ఆరోగ్య కమిషనర్ అయిన రాహుల్‌ను నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్‌గా, సర్జన్, రచయిత అయిన అతుల్‌ను బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్ చేశారు.
వార్తల్లో వ్యక్తులు
శిరీష
అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ జూలై 11న చేపట్టిన అంతరిక్ష యాత్రలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల పాల్గొన్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి మూడో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. వీరికంటే ముందే రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. నావీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక ఆరుగురు వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది.
డైసీ
టెక్ దిగ్గజం సిస్కో.. భారత్, సార్క్ దేశాల ప్రెసిడెంట్‌గా డైసీ చిట్టిలపిల్లిని జూలై 13న నియమించింది. ప్రస్తుత ప్రెసిడెంట్ సమీర్ గర్డే స్థానంలో ఆమెను ఎంపిక చేశారు. ఆగస్ట్ 1 నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్, సార్క్ దేశాల్లో కంపెనీ వ్యూహాలు, అమ్మకాలు, కార్యకలాపాలు, దీర్ఘకాలంలో వృద్ధికి పెట్టుబడులు వంటి వాటిని ఆమె పర్యవేక్షిస్తారు.
అశోక్ చక్రవర్తి
ప్రముఖ ఆర్థికవేత్త అయిన అశోక్ చక్రవర్తి రాసిన ‘ది స్ట్రగుల్ వితిన్: ఏ మెమోయిర్ ఆఫ్ ది ఎమర్జెన్సీ’ పుస్తకం జూలై 13న విడుదలైంది. 1975-77 ఎమర్జెన్సీపై ఈ పుస్తకాన్ని రాశారు. ఈయన ప్రస్తుతం జింబాబ్వే దేశ ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు.
షేర్ బహదూర్ దేవోబా
నేపాల్ ప్రధానమంత్రిగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవోబా జూలై 13న ప్రమాణం చేశారు. ఆయన ప్రధాని పీఠమెక్కడం ఇది ఐదోసారి. నేపాల్ పార్లమెంటులో ప్రతినిధుల సభను పునరుద్ధరించి ప్రధానిగా దేవోబాను నియమించాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఆ దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారి దేవోబాను ప్రధానిగా నియమించారు.
ఒలివర్ డెమెన్
జెఫ్ బెజోస్‌తోపాటు అంతరిక్షంలోకి వెళ్లేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన, 18 ఏండ్ల విద్యార్థి ఒలివర్ డెమెన్కు అవకాశం దక్కింది. జూలై 13న నిర్వహించిన వేలంలో 28 మిలియన్ డాలర్లతో ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. జెఫ్ బెజోస్‌కు చెందిన అమెరికా అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజన్ నుంచి న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
సీమా నంద
అమెరికా కార్మిక శాఖలో సొలిసిటర్గా సీమా నంద జూలై 16న నియమితులయ్యారు. ఈమె భారత సంతతికి చెందిన పౌరహక్కుల న్యాయవాదిగా పనిచేశారు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీకి సీఈవో, ఒబామా హయాంలో కార్మిక శాఖలో ప్రత్యేక అధికారిగా పనిచేశారు.
క్రీడలు
ఆష్లే బార్టీ
టెన్నిస్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆస్ట్రేలియా క్రీడాకారిణి, ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ సాధించింది. జూలై 10న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కరోలినా ప్లిస్కోవాను ఓడించింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఆష్లేకి ఇది రెండో గ్రాండ్‌స్లామ్.
నొవాక్ జకోవిచ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ సాధించాడు. జూలై 11న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెరిటిని (ఇటలీ)ని ఓడించాడు. జకోవిచ్‌కు ఇది వరుసగా మూడో వింబుల్డన్ టైటిల్.
ఫుట్‌బాల్ టోర్నీ విజేత అర్జెంటీనా
కోపా అమెరికా-2021 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. బ్రెజిల్‌లోని మారకానా స్టేడియంలో జూలై 11న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఓడించింది. విజేత జట్టుకు రూ.48 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. కోపా అమెరికాలో అర్జెంటీనాకు ఇది 15వ టైటిల్. అత్యధిక టైటిళ్ల రికార్డులో అర్జెంటీనా ఉరుగ్వేతో సమానంగా అగ్రస్థానంలో ఉంది.
ఇటలీదే యూరో కప్
మినీ సాకర్ ప్రపంచకప్‌గా భావించే యూరో కప్‌ను ఇటలీ జట్టు సాధించింది. జూలై 12న జరిగిన ఫైనల్ పోటీలో పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఇటలీకి ఇది రెండో యూరో కప్. 1968లో గెలిచింది. విజేత జట్టు సుమారు రూ.88 కోట్ల నగదు బహుమతిని అందుకుంది. ఉత్తమ ఆటగాడికి ఇచ్చే బంగారు బంతి ఇటలీ గోల్‌కీపర్ జాన్లూగికి దక్కింది.
షిర్లీ ఇర్విన్
మహిళా టెన్నిస్ దిగ్గజం మాజీ వరల్డ్ నంబర్‌వన్ షిర్లీ ఇర్విన్ అమెరికాలోని ఫ్లోరిడాలో జూలై 13న మరణించింది. ఆమె 1951951లో ఫ్రెంచ్, 1956లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 1957లో ఆస్ట్రేలియన్ టైటిల్‌ను సాధించింది. డబుల్స్‌లో 13 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను గెలుచుకుంది. 1970లో టెన్నిస్‌లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.
యశ్పాల్ శర్మ
భారత మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ గుండెపోటుతో జూలై 13న మరణించాడు. ఈయన 1983 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో అర్ధసెంచరీ చేశాడు. శర్మ 37 టెస్టుల్లో 1606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు.
దీపక్ కాబ్రా
జూలై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు టోక్యోలో నిర్వహించనున్న 32వ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ జడ్జిగా దీపక్ కాబ్రా జూలై 13న నియమితులయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఆయన 2014, 2018 ఆసియా క్రీడలు, 2014, 2018, కామన్వెల్త్ క్రీడల్లో జడ్జిగా పనిచేశారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు