ఉన్నత విద్యకు ఉత్తమమైన అమెరికా
2020 నుంచి పాండమిక్ వల్ల విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి అంతరాయం కలిగింది. వ్యాక్సినేషన్ మొదలైన తరువాత పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ఫాల్ అకడమిక్ సైకిల్ కోసం ఎందరో విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. సాధారణంగా మే నెలలో మొదలయ్యే వీసా అప్లికేషన్స్‌కు కొవిడ్ సెకండ్ వేవ్, తాత్కాలిక లాక్డౌన్ వల్ల ప్రారంభంలో కొంత అంతరాయం కలిగినా జూలై నుంచి వీసా అప్లికేషన్లు పుంజుకున్నాయి. ఎంబసీ అంచనా ప్రకారం ఆగస్ట్టు వరకు ఇచ్చిన వీసాలతో సుమారు 55,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్సేంజ్ సందర్శకులు అమెరికా ప్రయాణం చేస్తున్నారు. సాధారణ సంఖ్య కన్నా ఇది ఎక్కువే. పరిస్థితులు సాధారణ స్థితికి రావడం ఎంతో ఆశాజనకమనే చెప్పవచ్చు.
భారతీయ విద్యార్థులకు యూఎస్ఏలో చదవడం ఒక ప్రత్యేకమైన అనుభవం. అలాగే ఇది వారి ప్రొఫెషనల్ జీవితాన్ని మార్చే అనుభవం కూడా. వారికి ఒక కొత్త అకడమిక్ అనుభవం కలుగుతుంది. దీనివల్ల వారికి ఎన్నో అవకాశాలు భవిష్యత్తులో కలుగవచ్చు.
అమెరికానే ఎందుకు?
ప్రపంచంలోనే ఉన్నతమైన విశ్వవిద్యాలయాలు ఎన్నో అమెరికాలో ఉన్నాయి. చాలా విశ్వవిద్యాలయాలు పరిశోధన ఆధారితమైనవి. సైన్స్, ఇంజినీరింగ్ కోసం పారిశ్రామిక పరిశోధన నిధులను కలిగి ఉన్నాయి. యూఎస్‌లోని మొబైల్ డెవలప్మెంట్, ఫార్మా, మెడిసిన్, సాఫ్ట్వేర్ లేదా ఆటోమొబైల్స్ ఏదైనా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లతో పాటు నోబెల్ బహుమతుల విషయంలో కూడా అమెరికా ముందుంది.
‘ఆంగ్ల భాష వాడుకలో ఉండటం వల్ల ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజ్వారికి కూడా భాషాపరమైన ఇబ్బంది లేదు.
‘అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇతర స్టూడెంట్ యాక్టివిటీస్ వల్ల ఎంతో మంది విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. యూఎస్ ఉన్నత విద్యావ్యవస్థ విద్యార్థులకు వారి జిజ్ఞాస, ఆసక్తులకు అనుగుణంగా ఎన్నో ఆప్షన్స్ అందిస్తుంది.
అమెరికాలో స్టడీ ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంటుందన్నది వాస్తవం. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ ట్యూషన్ ఫీజు కనీసం $20,000 నుంచి $40,000 వరకు ఉంటుంది. అదే గ్రాడ్యుయేషన్ ఫీజు $20,000 నుంచి $45,000 వరకు, డాక్టోరల్ డిగ్రీ $28,000 నుంచి $55,000 వరకు ఉండవచ్చు. ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ $10,000 నుంచి $25,000 వరకు నగరం, వసతులను బట్టి ఉంటుంది. ఇన్సూరెన్స్, ట్రావెలిగ్ వంటి ఖర్చులు కూడా ఉంటాయి. సోర్స్: ఐడీపీ
అంతర్జాతీయ విద్యార్థుల కోసం అనేక స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ వంటి ఆర్థిక సహాయ ప్యాకేజీలు ఉన్నాయి. అంతేకాకుండా వారు చదివే సమయంలో టీచింగ్ అసిస్టెంట్‌గా మారవచ్చు. ఖర్చుల కోసం (పార్ట్ టైం జాబ్స్) సంపాదించుకోవచ్చు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను తెలుసుకోవడానికి అమెరికా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ’కల్చర్ షాక్’ తగిలే అవకాశం ఉన్నా కొంచెం తక్కువే.
టాప్ స్టూడెంట్ డెస్టినేషన్ సిటీస్ ఏవి?
అమెరికాలో ఎన్నో ముఖ్య నగరాలు ఉన్నాయి. అందులో విద్యార్థులకు సౌకర్యవంతంగా వారి ఎడ్యుకేషన్‌కు అనుగుణంగా ఉన్నవి మాత్రం QS ర్యాంకింగ్స్ ప్రకారం కొన్ని ఎన్నుకున్నవి. ఈ పట్టణాల్లోఉండటానికి విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇక్కడి జీవన వ్యయాలు వారికి వీలుగా ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడ ఉద్యోగవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అవి..
- బోస్టన్
అమెరికాలోని ప్రాచీనమైన నగరాల్లో ఒకటి. దీనికి అమెరికన్ రెవల్యూషన్లో ఎంతో ప్రాముఖ్యత కలదు. ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కూడా.
విశ్వవిద్యాలయాలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయం
బోస్టన్ విశ్వవిద్యాలయం
నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం
టఫట్స్ విశ్వవిద్యాలయం
మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం
సిమన్స్ విశ్వవిద్యాలయం
- న్యూయార్క్
విభిన్నమైన ప్రపంచ సంస్కృతుల సంగమం ఈ నగరం. బ్రాడ్వే, వాల్‌స్ట్రీట్, ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్న నగరం. ఈ నగరంలో ఉన్న ఎన్నో యూనివర్సిటీలు టాప్ ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. అందుకే ఇది మంచి స్టడీ డెస్టినేషన్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన ఈ నగరంలో నివసించ డం, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేయడం వల్ల జీవితకాల అనుభవం లభిస్తుంది. పాఠ్యేతర ఈవెంట్లకు ఇక్కడ అవకాశాలు అపారమైనవి, సాటిలేనివి.
యూనివర్సిటీలు
కొలంబియా యూనివర్సిటీ
న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ
కార్నెల్ యూనివర్సిటీ - శాన్ ఫ్రాన్సిస్కో
శాన్ ఫ్రాన్సిస్కో విద్యార్థులకు ఎంతో అనువైన నగరం. ఇది ప్రపంచంలోని టాప్ 10 ఫైనాన్షియల్ సెంటర్లలో ఒకటి. ఇక్కడ ఎన్నో ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడి ప్రశాంతమైన బీచ్‌లు ఎంతో మంది టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఆపిల్, ఫేస్బుక్, ఐబీఎం వంటి పేరున్న కంపెనీలు ఉండటం వల్ల సిలికాన్ వ్యాలీ దగ్గరగా ఉన్నందున విద్యార్థులు ఈ నగరానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు.
విశ్వవిద్యాలయాలు
స్టాన్ఫర్డ్విశ్వవిద్యాలయం
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ)
శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ
- లాస్ ఏంజెల్స్
ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరం. లోకల్, నేషనల్ రిక్రూటర్లు ఈ నగరానికి టాలెంట్ ఉన్నవారిని ఎన్నుకోవడానికి వస్తారు. హాలీవుడ్ ఇండస్ట్రీ, గ్యాలరీస్, మ్యూజీయాలకు ఇది నెలవు. ఇంకా ఇక్కడి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. దీనిని ‘ది ఏంజెల్స్ సిటీ’, ‘క్రియేటివ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు.
విశ్వవిద్యాలయాలు
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా
కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ
- చికాగో
‘ది విండీ సిటీ’ అనే మారుపేరు గల ఈ నగరం మ్యూజియాలు, థియేటర్లు, రెస్టారెంట్స్, వార్షిక పరేడ్స్, పబ్లిక్ జూ, ప్రపంచంలోని మూడు ఎత్తయిన భవనాలకు నిలయం. సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత గల నగరం. ఇంకా ఎన్నో ఇన్నోవేషన్స్‌కు కూడా నిలయం. ఇక్కడ ఉద్యోగ, ఇంటర్న్‌షిప్‌కు అవకాశాలు ఎన్నో ఉన్నాయి.
విశ్వవిద్యాలయాలు
యూనివర్సిటీ ఆఫ్ చికాగో
నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ
- అట్లాంటా
సిటీ ఇన్ ఆఫ్ ఫారెస్ట్, సిటీ టు బిజీ టు హేట్ పేరుగల అట్లాంటా జార్జియాలో ఉంది. పట్టణీకరణ ఉన్నప్పటికీ ఈ నగరం విస్తారమైన వృక్షజాలం, జంతుజాలంతో నిండి ఉంది.
విశ్వవిద్యాలయాలు
జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జార్జియా టెక్)
ఎమోరీ యూనివర్సిటీ
- ఫిలడెల్ఫియా
ఫిలడెల్ఫియా పురాతనమైన అమెరికన్ నగరాల్లో ఒకటి. ఇది న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ నగరాలకు సమీపంలో ఉంటుంది. అయితే ఇక్కడ న్యూయార్క్ నగరంలో కంటే కాస్ట్ అఫ్ లివింగ్ తక్కువ.
విశ్వవిద్యాలయాలు
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం
టెంపుల్ విశ్వవిద్యాలయం
డ్రెక్సెల్ విశ్వవిద్యాలయం
- వాషింగ్టన్ డీసీ
అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్‌కు కేంద్రంగా ఉన్న ఈ నగరం ఎప్పుడూ పొలిటికల్ యాక్టివిటీతో ఉంటుంది. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, టూరిజం రంగంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
విశ్వవిద్యాలయాలు
జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం
జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం
అమెరికన్ విశ్వవిద్యాలయం
హోవార్డ్ విశ్వవిద్యాలయం.
- పిట్స్బర్గ్
స్టీల్ ఇండస్ట్రీ అభివృద్ధిలో ఉండటం వల్ల స్టీల్ సిటీగా పేరు గడించింది పిట్స్బర్గ్. విశ్వవిద్యాలయాలు
కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయం
పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం - శాన్ డియాగో
చక్కటి వాతావరణం, ఉన్నతమైన విద్యా వ్యవస్థ గల నగరం శాన్‌డియాగో.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCS) (టాప్ ర్యాంకింగ్స్ లో ఉన్న విశ్వవిద్యాలయం)
వీటితో పాటు సియాటెల్, బాల్టిమోర్, హూస్టన్, మియామి వంటి ఇతర ప్రముఖ నగరాల్లో కూడా చదవడానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు.
అడ్మిషన్స్ కోసం రాసే పరీక్షలు
అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, ఎంబీఏ వంటి కోర్సులు చేయడానికి కొన్ని పరీక్షలు రాయాలి. శాట్, యాక్ట్ పరీక్షలు సాధారణంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోసం రాస్తారు. గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేవారు ఎంబీఏ కోసం ప్రధానంగా జీమ్యాట్ రాసేవారు. జీఆర్ఈ పరీక్ష ప్రస్తుతం మాస్టర్స్‌తో పాటు బిజినెస్ స్కూల్స్ అడ్మిషన్స్ కోసం కూడా పరిగణనలోకి తీసుకొంటున్నారు. ielts, toefl, pte వంటి పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి కూడా అడ్మిషన్స్ ఉంటాయి. కొన్ని కళాశాలలు పరీక్షలు లేకున్నా అడ్మిషన్స్ చేపడుతున్నాయి. పరీక్షలు రాసి ఆ స్కోర్స్ కాలేజీలకు పంపి, అప్లికేషన్ పూర్తి చేయాలి. కావలసిన ఇతర ట్రాన్స్‌స్క్రిప్ట్స్ రికమండేషన్, స్టేట్మెంట్ అఫ్ పర్పస్ వంటివి కూడా పంపాలి.
వీసాకు కావాల్సినవి
- అమెరికాలో విదేశీ విద్యార్థులకు అనుమతి ఉన్న కళాశాలలకు మాత్రమే అప్లయ్ చేయాలి. అడ్మిషన్ వచ్చాక.. కాలేజీ నుంచి ఐ-20 ఫారాన్ని పంపిస్తారు. అమెరికన్ కాలేజీల్లో చదవడానికి అప్లయ్ చేసేది ఎఫ్-1 వీసా.
- యునైటెడ్ స్టేట్స్లో ఒక SEVP- ఆమోదించిన పాఠశాలకు దరఖాస్తు చేయడం మొదటి దశ. SEVP- ఆమోదించిన పాఠశాల నమోదును అంగీకరించిన తర్వాత విద్యార్థి ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) కోసం నమోదు చేస్తారు. తర్వాత SEVIS I-901 ఫీజు చెల్లించాలి.
- SEVP- ఆమోదించిన పాఠశాల ఫారం I-20ని జారీ చేస్తుంది. ఫారం I-20 ని స్వీకరించి, SEVISలో నమోదు చేసుకున్న తర్వాత, విద్యార్థి (F లేదా M) వీసా కోసం US ఎంబసీ లేదా కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు ఫారం I-20 ని తీసుకెళ్లాలి.
- ఆన్లైన్ వీసా దరఖాస్తు చేసుకొని DS 160 ఫారం పూర్తి చేయాలి.
- అప్లికేషన్ రుసుం చెల్లించి అమెరికన్ కాన్సులేట్ ఆఫీసులో వీసా ఇంటర్వ్యూ, తేదీ షెడ్యూల్ చూసుకోవాలి. వీసా ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్, బ్యాంకు స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ప్రూఫ్, అకడమిక్ రికార్డ్స్ ఇతర ఫారాలు తీసుకెళ్లాలి.
- కొత్త విద్యార్థుల కోసం స్టూడెంట్ (F, M) వీసాలు ఒక కోర్సు కోసం ప్రారంభ తేదీకి 120 రోజుల ముందుగానే జారీ చేస్తారు. అయితే ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు వీసాపై యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించడానికి అనుమతించరు. అమెరికన్ కాన్సులేట్ వెబ్సైట్లో పూర్తి వివరాలు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూడాలి. సరైన ప్లానింగ్‌తో మీకు అనుకూలమైన పరిస్థితులు గల సిటీ, నచ్చిన కాలేజీలో సీటు తెచ్చుకొని విదేశీవిద్య కలను సాధించండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు