మస్తిష్కంలోని ఎత్తుపల్లాలను ఏమంటారు?
అస్థిపంజర వ్యవస్థ
- అస్థిపంజరం అనేది మానవుని శరీరానికి ఆకృతిని ఇస్తుంది.
- అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన డాక్టర్‌ను ‘ఆర్థోపెడీషియన్’ అని అంటారు.
- అస్థిపంజర వ్యవస్థలో 3 భాగాలు ఉంటాయి. అవి.. 1) ఎముకలు 2) కండరాలు 3) కీళ్లు
- ఎముకలు: ఎముకల గురించి చదివే శాస్ర్తాన్ని ‘అస్టియాలజీ’ అని అంటారు.
- ఎముకల్లో ఉండే కణాలను ‘అస్టియోసైట్స్’ అని అంటారు.
- ఎముకల్లో ఉండే ప్రొటీన్ ‘అస్టిన్’
- ఎముకలు కాల్షియం, పాస్ఫరస్లతో నిర్మితమవుతాయి.
- కాల్షియం ఎముకకు గట్టిదనాన్ని ఇస్తుంది.
- పాస్ఫరస్ ఎముకకు మండే స్వభావాన్ని ఇస్తుంది.
- అస్థిపంజరాన్ని 2 రకాలుగా విభజించారు. అవి.. 1) అక్షాస్థిపంజరం- 80, 2) అనుబంధాస్థిపంజరం- 126. మొత్తం 206.
- మానవుని శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య- 206
- అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య- 300
- ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్- డి
- ఎముకల మధ్యలో ‘అస్థిమజ్జ’ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది.
- పక్షుల ఎముకల మధ్యలో ‘అస్థిమజ్జ’ ఉండదు. వాటి ఎముకలు గాలితో నిండి ఉంటాయి. గాలితో నిండి ఉండిన ఈ ఎముకలను ‘వాతులాస్థులు’ అంటారు.
ఎముకలకు వచ్చే వ్యాధులు
ఫ్లోరోసిస్
రికెట్స్
అస్టియోమలేషియా
అస్టియో పోరోసిస్
కండరాలు
ఎముకలకు అంటిపెట్టుకుని ఉండే వాటిని ‘కండరాలు’ అంటారు.
కండరాల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ‘మయోలజీ’ అంటారు.
కండరాల్లో ఉండే ప్రొటీన్ ‘మయోసిన్’
మానవ శరీరంలో ఉండే మొత్తం కండరాల సంఖ్య- 639
మానవ శరీరంలో ఉండే అతిపెద్ద కండరం- గ్లూటియస్-మాక్సమస్
మానవ శరీరంలో ఉండే అతి చిన్న కండరం- స్టేపిడియస్
కండరాలు 3 రకాలు. అవి.. 1) నియంత్రిత కండరాలు 2) అనియంత్రిత కండరాలు 3) హృదయ కండరాలు నియంత్రిత కండరాలు: ఇవి శరీరం ఆధీనంలో ఉంటాయి.
ఇవి కాళ్లు, చేతుల్లో ఉంటాయి.
అనియంత్రిత కండరాలు: ఇవి శరీరం ఆధీనంలో ఉండవు
ఇవి పేగుల్లో, గర్భాశయాల్లో, మూత్రాశయంలో ఉంటాయి.
హృదయ కండరాలు: ఇవి గుండెలో ఉంటాయి.
ఇవి రక్తాన్ని పంప్ చేయడంలో సహాయపడుతాయి.
కీళ్లు
ఎముకను మరో ఎముకను కలుపుతూ ఉండే దానిని కీలు అని అంటారు.
కీళ్ల గురించి చదివే శాస్ర్తాన్ని ‘అర్థ్రాలజీ’ అని అంటారు.
కీళ్లకు చేసే చికిత్సను ‘అర్థరైటిస్’ అంటారు.
శరీరంలో ఉండే మొత్తం కీళ్ల సంఖ్య- 230
కీళ్లు 2 రకాలు. అవి.. 1) కదలని కీళ్లు 2) కదిలే కీళ్లు
కదలని కీళ్లు: ఇవి పుర్రెలో ఉంటాయి.
ఈ కీళ్లలో కదిలే కీలుగా కింది దవడ ఎముకను పేర్కొంటారు.
కదిలే కీళ్లు: ఇవి 4 రకాలు
1) బంతిగిన్నె కీలు- భుజంలో ఉంటుంది
2) మడతబందు కీలు- మోచేయి,
మోకాలిలో ఉంటుంది
3) బొంగరపు కీలు- మెడ భాగంలో ఉంటుంది
4) జారుడు కీలు- మణికట్టు, వెన్నుపూసల్లో ఉంటుంది
కీళ్లకు సంబంధించిన వ్యాధులు
1) చికున్ గున్యా 2) అస్టియోఅర్థరైటిస్
3) రుమటాయిడ్ 4) గౌట్స్
5) స్టెనోవిటాస్ 6) స్పాండిలైటిస్
నాడీ వ్యవస్థ
మానవుని శరీరానికి సంబంధించి అన్ని రకాల జీవక్రియలను తన ఆధీనంలో ఉంచుకునే వ్యవస్థను ‘నాడీవ్యవస్థ’ అని అంటారు.
నాడీ వ్యవస్థ గురించి చదివే శాస్త్రం-
న్యూరాలజీ
నాడీ వ్యవస్థకు సంబంధించిన డాక్టర్- న్యూరాలజిస్ట్
మానవుని ప్రవర్తనను గురించి చదివే శాస్త్రం- సైకాలజీ
నాడీ వ్యవస్థలో 3 భాగాలు ఉన్నాయి. అవి.. 1) కేంద్రీయ నాడీ వ్యవస్థ 2) పరిధీయ నాడీ వ్యవస్థ 3) స్వయం చోదిత నాడీ వ్యవస్థ
కేంద్రీయ నాడీ వ్యవస్థ
దీనిలో 2 భాగాలు ఉన్నాయి. అవి.. 1) మెదడు 2) వెన్నుపాము
మెదడు: దీని గురించి చదివే శాస్ర్తాన్ని ఫ్రీనాలజీ అంటారు.
కపాలంలో మెదడు ఉంటుంది.
కపాలం గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని క్రైనాలజీ అంటారు.
పురుషుని మెదడు బరువు 1350-1400 గ్రాములు
స్త్రీ మెదడు బరువు 1250-1300 గ్రాములు
చిన్నపిల్లల్లో ఉండే మెదడు బరువు 300-400 గ్రాములు
అత్యధికంగా మెదడు బరువును కలిగి ఉన్న జీవి- నీలి తిమింగలం (4 కేజీలు)
మానవుని శరీర బరువులో మెదడు బరువు 2 శాతం ఉంటుంది
మానవుడు తీసుకున్న ఆక్సిజన్‌లో మెదడు వినియోగించుకునే శాతం- 20
మెదడుకి బయట వైపు భాగం ‘బూడిద రంగు పదార్థంతో, లోపలివైపు భాగం తెలుపు రంగు పదార్థంతో నిండి ఉంటుంది
మెదడుని చుట్టి 3 పొరలు ఉంటాయి. అవి. 1) బయటి పొర (వరాశిక) 2) మధ్య పొర (లౌతికళ) 3) లోపలి పొర (మృద్వి)
ఈ మూడు పొరలను కలిపి ‘మెనింజిస్’ అని అంటారు. ఇవి చేసే ముఖ్య పని మెదడుని ప్రమాదాల నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.
మెదడులో 3 భాగాలు ఉంటాయి. అవి.. 1) ముందు మెదడు 2) మధ్య మెదడు 3) వెనుక మెదడు
ముందు మెదడు: దీనిలో ‘మస్తిష్కం’ అనే భాగం ఉంటుంది.
మస్తిష్కం (సెరిబ్రం): దీనిని పెద్ద మెదడు అని పిలుస్తారు.
దీని బరువు- 995 గ్రాములు
మస్తిష్కంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎత్తులను గైరీలు అని, పల్లాలను సల్సీలు అని అంటారు.
గైరీలు, సల్సీలు చేసే ముఖ్య పని మానవుని తెలివితేటలకు మూలంగా పనిచేస్తాయి.
మస్తిష్కానికి కింది భాగాన ద్వారగోర్థం ఉంటుంది.
ద్వారగోర్థం: దీని ఆధీనంలో మానవుని శరీరానికి సంబంధించిన భావోద్వేగాలు (కోపం, బాధ, ఆనందం, ప్రేమ, సంతోషం, భయం, సుఖం, దుఃఖం) ఉంటాయి.
మస్తిష్కానికి కింది భాగాన బఠానీ గింజ ఆకారంలో గ్రంథి ఉంటుంది. దీనినే పీయూష గ్రంథి/పిట్యూటరీ గ్రంథి అంటారు.
పీయూష గ్రంథికి ఒక కాడ అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ కాడని హైపోథలామస్ అంటారు.
హైపోథలామస్: మానవుని శరీరానికి సంబంధించి ఉష్ణం, ఆకలి, దప్పిక వంటి వాటిని నియంత్రించే భాగాలు దీనిలో ఉంటాయి.
మస్తిష్కాన్ని రెండు సమాన అర్ధభాగాలుగా విభజిస్తూ కార్పస్కొల్లాజమ్ ఉంటుంది.
మస్తిష్కాన్ని రెండు సమాన అర్ధభాగాలుగా విభజించడాన్ని మస్తిష్కార్ధ గోళం అని అంటారు.
మస్తిష్కార్ధ గోళాలు రెండు రకాలు. అవి. కుడి, ఎడమ మస్తిష్కార్ధ గోళాలు
కుడి మస్తిష్కార్ధ గోళం: దీని ఆధీనంలో ఎడమవైపు ఉండే శరీర భాగాలు ఉంటాయి.
ఈ మస్తిష్కార్ధ గోళానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎడమవైపున ఉన్న భాగాలకు పక్షవాతం వస్తుంది.
ఎడమ మస్తిష్కార్ధ గోళం: ఈ మస్తిష్కార్ధ గోళం ఆధీనంలో కుడివైపున ఉండే శరీర భాగాలు ఉంటాయి. ఈ మస్తిష్కార్ధ గోళానికి ఏదైనా ప్రమాదం జరిగితే కుడివైపున ఉన్న భాగాలకు పక్షవాతం వస్తుంది.
మస్తిష్కం ఆధీనంలో జ్ఞాపక శక్తి, ఆలోచనలు, తెలివి తేటలు ఉంటాయి.
మధ్య మెదడు: దీనిలో నాడీ కణాలు అనేవి గుంపులు గుంపులుగా విస్తరించి ఉంటాయి.
దీనిలో ఉండే నాడీ కణాల సంఖ్య 10 బిలియన్లు (100 కోట్లు)
ప్రతి రోజూ మానవునిలో సుమారు 20,000 నాడీకణాలు నాశనం అవుతాయి.
ఒక్కసారి నాడీకణం నశిస్తే మళ్లీ తిరిగి ఏర్పడే శక్తి నాడీ కణానికి ఉండదు.
వెనుక మెదడు: దీనిలో 2 భాగాలు ఉన్నాయి. అవి.. 1) అనుమస్తిష్కం 2) మజ్జాముఖం
అనుమస్తిష్కం (సెరిబెల్లమ్): దీనిని చిన్నమెదడు అంటారు.
ఇది మానవుని శరీర సమతాస్థితిని
కాపాడుతుంది.
శరీరాన్ని అదుపులో ఉంచే ప్రక్రియను సమతాస్థితి అని అంటారు.
మజ్జాముఖం (మెడుల్లా-అబ్లాంగేటా): ఇది త్రికోణాకృతిలో ఉంటుంది.
దీని ఆధీనంలో శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడన వంటివి ఉంటాయి.
వెన్నుపాము: ఇది చేసే ముఖ్య పని మానవుని శరీరంలోని వివిధ భాగాల నుంచి సమాచారాన్ని గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. కాబట్టి దీనిని టెలిఫోన్ ఎక్సేంజ్ అని అంటారు.
పరిధీయ నాడీ వ్యవస్థ: పరిధీయ నాడీ వ్యవస్థలో ఉండే మొత్తం నాడుల సంఖ్య 43 జతలు.
పరిధీయ నాడీ వ్యవస్థలో 2 రకాల నాడులు ఉన్నాయి. అవి.. 1) కపాల నాడులు (12 జతలు) 2) వెన్ను నాడులు/కశేరు నాడులు (31జతలు). మొత్తం 43 జతలు.
కపాల నాడులు: కపాలం నుంచి పుట్టే నాడులనే ‘కపాల నాడులు’ అంటారు. ఇవి మొత్తం 12 జతలు.
వేసస్ నాడీ: ఇది మానవుని శరీరంలో ఉండే అతిపెద్ద నాడీ.
ఇది చేసే ముఖ్య పని హృదయ స్పందనను తన ఆధీనంలో ఉంచుకోవడంతో పాటు క్లోమ గ్రంథిలో క్లోమరసం ఉత్పత్తికి సహాయపడుతుంది.
వెన్ను నాడులు/కశేరు నాడులు: వెన్నుపాము నుంచి పుట్టే నాడులనే వెన్నునాడులు అని అంటారు. ఇవి మొత్తం 31 జతలు.
పరిధీయ నాడీ వ్యవస్థలో వివిధ రకాల నాడులు ఉన్నాయి.
1) జ్ఞాన నాడులు/అభివాహి నాడులు: ఈ నాడులు చేసే ముఖ్య పని మానవుని శరీరంలోని వివిధ భాగాల నుంచి సమాచారాన్ని గ్రహించి మెదడు, వెన్నుపాముకి చేరవేస్తాయి.
2) చాలక నాడులు/అపవాహిక నాడులు: ఈ నాడులు చేసే ముఖ్య పని మెదడు, వెన్నుపాము నుంచి సమాచారాన్ని గ్రహించి శరీరంలోని వివిధ భాగాలకు చేరవేస్తాయి.
3) మిశ్రమ నాడులు/సహసంబంధ నాడులు: జ్ఞాన నాడులు, చాలక నాడులను కలిపి ‘మిశ్రమ నాడులు’ అని అంటారు.
4) స్వయం చోదిత నాడీవ్యవస్థ: మెదడుతో సంబంధం లేకుండా తన పనిని తానే నిర్వర్తించుకునే వ్యవస్థను ‘స్వయం చోదిత నాడీవ్యవస్థ’ అని అంటారు.
స్వయం చోదిత నాడీవ్యవస్థను 2 రకాలుగా విభజించారు.
1) సహానుభూత నాడీవ్యవస్థ: ఈ వ్యవస్థ అవయవాల పని వేగాన్ని పెంచుతుంది.
2) సహానుభూత పరనాడీ వ్యవస్థ: ఈ వ్యవస్థ అవయవాల పని వేగాన్ని తగ్గిస్తుంది.
నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు
1) మెదడువాపు 2) పోలియో
3) పక్షవాతం 4) మెనింజటిస్
5) రేబిస్ 6) అతినిద్ర వ్యాధి
7) పార్కిన్సన్ 8) అల్జీమర్స్
9) స్క్రీజోఫోబియా
అక్షాస్థిపంజరం
పుర్రె- 22 పక్కటెముకలు- 24
వెన్నుపూసలు- 26 రొమ్ము ఎముక- 1
చెవులు- 6 నాలుక- 1
అనుబంధాస్థి పంజరం
భుజం- 4 కటివలయం- 2
రెండు చేతులు- 60 రెండు కాళ్లు- 60
రెండు చేతుల్లో ఉండే ఎముకలు
పై చేయి- 2 ముందు చేయి- 4
మణికట్టు- 16 అరచేయి- 10
చేతివేళ్లు- 28
రెండు కాళ్లల్లో ఉండే ఎముకలు
తొడ- 2 మోకాలు- 2
బహిర్జంఘిక- 2 అంతర్జంఘిక- 2
మడమ- 14 అరికాలు- 10
కాలివేళ్లు- 28
టీ కృష్ణ
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు