UPSC Prelims Question Paper 2023 | 44వ చెస్ ఒలింపియాడ్ అధికారిక మస్కట్ పేరు?
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం విశ్లేషణ
56. 44వ చెస్ ఒలింపియాడ్ 2022కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి.
1. భారతదేశంలో చెస్ ఒలింపియాడ్ నిర్వహించడం ఇదే తొలిసారి
2. అధికారిక చిహ్నం పేరు తంబి
3. ఓపెన్ విభాగంలో గెలిచిన జట్టుకు ట్రోఫీ – వెరా మెంచిక్ కప్
4. మహిళల విభాగంలో విజేత జట్టుకు ట్రోఫీ హామిల్టన్ – రస్సెల్ కప్
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి?
ఎ) ఒకటి బి) రెండు
సి) మూడు డి) నాలుగు
సమాధానం : బి
l 44వ చెస్ ఒలింపియాడ్ భారతదేశంలోని చెన్నైలో 28 జూలై నుంచి 10 ఆగస్టు 2022 వరకు జరిగింది.’
- భారతదేశంలో చెస్ ఒలింపియాడ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
- 44వ చెస్ ఒలింపియాడ్ అధికారిక మసట్ పేరు తంబి. తంబి అనేది తమిళ పదానికి అర్థం ‘తమ్ముడు’.
- మహిళల విభాగంలో గెలిచిన జట్టు ‘వెరా మెంచిక్ కప్’ అందుకుంటుంది.
- ఓపెన్ విభాగంలో గెలిచిన జట్టు ‘హామిల్టన్-రస్సెల్ కప్’ అందుకుంటుంది.
57. కింది జతలను పరిగణించండి.
వార్తల్లో పేరొన్న సంఘర్షణ ప్రాంతం – అది ఉన్న దేశం
1. డాన్బాస్ : సిరియా
2. కచిన్ : ఇథియోపియా
3. టిగ్రే : ఉత్తర యెమెన్
పై జతల్లో ఎన్ని సరిగ్గా సరిపోలాయి?
ఎ) ఒకటి బి) రెండు
సి) మూడు డి) ఏదీ కాదు
సమాధానం : డి
వివరణ:
1. డాన్బాస్ : డాన్బాస్ సిరియాలో లేదు. డాన్ బాస్ అనేది తూర్పు ఉక్రెయిన్‌లోని ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇకడ ఉక్రెనియన్ ప్రభుత్వ దళాలు, వేర్పాటువాద సమూహాల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. అందువల్ల ఈ జంట సరిపోలలేదు.
2. కచిన్ : ఇథియోపియా-కచిన్ అనేది ఇథియోపియాలో లేదు. మయన్మార్(బర్మా)లో ఉన్న ప్రాంతం. కచిన్ రాష్ట్రం మయన్మార్ ఉత్తర భాగంలో ఉంది. అకడి జాతి కచిన్ జనాభాకు ప్రసిద్ధి చెందింది. కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ, మయన్మార్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు ఉన్నాయి. అందువల్ల, ఈ జంట కూడా సరిపోలలేదు.
3. టిగ్రే : టిగ్రే , ఉత్తర యెమెన్‌లో లేదు. ఇథియోపియాలో ఉంది. ఉత్తర ఇథియోపియా ప్రాంతంలో టిగ్రే ఉంటుంది. 2020 చివరిలో టిగ్రే ప్రాంతీయ ప్రభుత్వం, ఇథియోపియన్ ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య వివాదం కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచింది. అందువల్ల ఈ జంట సరిపోలలేదు.
58. ఇటీవలి సంవత్సరాల్లో చాద్, గినియా, మాలి, సూడాన్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. వీటన్నింటికీ కింది కారణాల్లో ఏది సాధారణమైనది?
ఎ) అరుదైన భూమి మూలకాల గొప్ప నిక్షేపాల ఆవిషరణ
బి) చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం
సి) సహారా ఎడారి దక్షిణ దిశగా విస్తరణ
డి) విజయవంతమైన తిరుగుబాట్లు
సమాధానం : డి
వివరణ:
చాద్: ఏప్రిల్ 2021లో ప్రెసిడెంట్ ఇద్రిస్ డెబీ దేశంలోని ఉత్తరాన తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా దళాలకు నాయకత్వం వహిస్తుండగా చంపబడ్డాడు. అతడి కుమారుడు మహమత్ ఇద్రిస్ డెబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి తన సైనిక మండలిని ప్రకటించారు.
గినియా: సెప్టెంబరు 2021లో కల్నల్ మమడి డౌంబౌయా నేతృత్వంలో జరిగిన తిరుగుబాటులో ప్రెసిడెంట్ ఆల్ఫా కాండే పదవీచ్యుతుడయ్యాడు. డౌంబౌయా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
మాలి: ఆగస్టు 2020లో కల్నల్ అస్సిమి గోయిటా నేతృత్వంలోని తిరుగుబాటులో అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా పదవీచ్యుతుడయ్యాడు. గోయిటా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
సూడాన్: ఏప్రిల్ 2019లో జనరల్ అబ్దెల్ ఫతి అల్-బుర్హాన్ నేతృత్వంలోని తిరుగుబాటులో అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ పదవీచ్యుతుడయ్యాడు. అల్-బుర్హాన్ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
- చాద్, గినియా, మాలి, సూడాన్‌లలో జరిగిన తిరుగుబాట్లు అంతర్జాతీయంగా ఖండనలను ఎదురొన్నాయి. ఆఫ్రికన్ యూనియన్, నాలుగు దేశాలను సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. తిరుగుబాటు నాయకులలో కొందరిపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు కూడా విధించింది.
59. కింది భారీ పరిశ్రమలను పరిగణించండి.
1. ఎరువుల మొకలు
2. చమురు శుద్ధి కర్మాగారాలు
3. స్టీల్ ప్లాంట్లు - పైన పేరొన్న ఎన్ని పరిశ్రమలను డీకార్బనైజ్ చేయడంలో గ్రీన్ హైడ్రోజన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు?
ఎ) ఒకటి బి) రెండు
సి) మూడూ డి) ఏదీ కాదు
సమాధానం: సి
వివరణ: - నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడానికి పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియ ఎలాంటి గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయదు. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించవచ్చు. అందువల్ల పేరొన్న భారీ పరిశ్రమలన్నింటినీ డీకార్బనైజ్ చేయడంలో గ్రీన్ హైడ్రోజన్ పాత్ర పోషిస్తుంది.
- G-20 గురించి కింది ప్రకటనలను పరిగణించండి.
1. G-20 గ్రూప్ వాస్తవానికి అంతర్జాతీయ ఆర్థిక, ఆర్థిక సమస్యలపై చర్చించడానికి ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల వేదికగా స్థాపించబడింది
2. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం G-20 ప్రాధాన్యతల్లో ఒకటి
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది?
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2 సరైనవి కావు
సమాధానం: సి
వివరణ: - అంతర్జాతీయ ఆర్థిక, ఆర్థిక సమస్యలపై చర్చించడానికి ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల వేదికగా 1999లో G20 స్థాపించబడింది. G20 సభ్యత్వంలో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.
- భారతదేశం డిసెంబర్ 1, 2022న G20 అధ్యక్ష పదవిని చేపట్టింది.
భారతదేశం G20 ప్రాధాన్యతలు: - డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
- స్థిరమైన శక్తి పరివర్తనలు
- ప్రపంచ ఆరోగ్య నిర్మాణం
- డిజిటల్ పరివర్తనలు
- స్థిరమైన ఆహార వ్యవస్థలు
- సమ్మిళిత వృద్ధి
- వాతావరణ మార్పుల తగ్గింపు
- అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణం
- అవినీతి నిరోధకం
- ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు
- వలసలు, శరణార్థులు
61. భారతీయ చరిత్రకు సంబంధించి అలెగ్జాండ్రిరియా, ఎ.హెచ్. లాంగ్ హర్ట్స్, రాబర్ట్ సెవెల్, జేమ్స్ బర్గెస్, వాల్టర్ ఇలియట్‌లు వేటితో సంబంధం కలిగి ఉన్నారు?
ఎ) పురావస్తు తవ్వకాలు బి) వలస భారతదేశంలో ఇంగ్ల్లిష్ ప్రెస్ స్థాపన సి) రాచరిక రాష్ట్రాల్లో చర్చిల స్థాపన డి) వలస భారతదేశంలో రైల్వేల నిర్మాణం
సమాధానం : ఎ
వివరణ:
ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధ వాస్తుశిల్పం, రాతి గుహలు, ఇటుక, రాతితో నిర్మించిన స్థూపాలు, చైత్యాలు, విహారాలు, శిలా మండపాల ద్వారా ప్రాతినిథ్యం వహిస్తుంది. గుంటుపల్లి, కాపవరం, ఎర్రవరం, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో రాతి గుహలు కనిపిస్తాయి. ఎ.హెచ్. లాంగ్ హర్ట్స్, వాల్టర్ ఇలియట్, అలెగ్జాండ్రిరియా, జేమ్స్. బర్గెస్, రాబర్ట్ సెవెల్ అనేక మంది భట్టిప్రోలు, ఘంటసాల, అమరావతి మొదలైన ప్రదేశాల్లో క్రమపద్ధతిలో తవ్వకాలు జరిపారు. ఈ విలువైన అవశేషాల వివిధ అంశాల గురించి భారతీయ పండితుల్లో చాలా ఉత్సుకతను సృష్టించిన అవశేష పేటికలను
బహిర్గతం చేశారు.
62. కింది జతలను పరిగణించండి.
1. బేస్ నగర్ : శైవ గుహ క్షేత్రం
2. భజ : బౌద్ధ గుహ మందిరం
3. సిత్తనవాసల్ : జైన గుహ మందిరం
పైన పేరొన్న జతల్లో ఎన్ని సరిపోలాయి?
ఎ) ఒకటి బి) రెండు
సి) మూడు డి) ఏదీ కాదు
సమాధానం : సి
వివరణ: - బేస్ నగర్ ముఖ్యమైన పురాతన దేవాలయం, పుణ్యక్షేత్రం. 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రధాన పురావస్తు తవ్వకాల్లో ఈ స్తంభం పురాతన వాసుదేవ ఆలయ స్థలంలో భాగమని వెల్లడైంది.
- భజ గుహలు భారతదేశంలోని పుణె నగరంలో ఉన్న 2వ శతాబ్దపు BC నాటి 22 రాతి గుహల సమూహం. భజ గుహలు భారతదేశంలోని బౌద్ధ గుహ నిర్మాణానికి ఉత్తమ ఉదాహరణ.
- సిత్తనవాసల్ గుహ (అరివర్ కోయిల్) 2వ శతాబ్దానికి చెందిన తమిళనాడులోని పుదుకోటె్టై జిల్లా సిత్తనవాసల్ గ్రామంలోని గుహల సముదాయం. సిత్తనవాసల్ గుహను అరివర్ కోవిల్ అని కూడా పిలుస్తారు. ఇది 7వ శతాబ్దానికి చెందిన జైన మఠం.
63. కింది ప్రకటనలను పరిగణించండి.
ప్రకటన-I: ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు.
ప్రకటన-II: 1905లో అదే రోజు స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది.
పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) స్టేట్మెంట్-I, స్టేట్మెంట్-II రెండూ సరైనవి. స్టేట్మెంట్-II స్టేట్మెంట్-Iకి సరైన వివరణ
బి) స్టేట్మెంట్-I, స్టేట్మెంట్-II రెండూ సరైనవి. స్టేట్మెంట్-II స్టేట్మెంట్-Iకి సరైన వివరణ కాదు
సి) స్టేట్మెంట్-I సరైనది కాని స్టేట్మెంట్-II తప్పు
డి) స్టేట్మెంట్-I తప్పు కానీ స్టేట్మెంట్-II సరైనది సమాధానం: ఎ
వివరణ: - 2015లో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని 7 ఆగస్టు 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో ప్రారంభించారు. కాబట్టి, స్టేట్మెంట్ 1 సరైనది.
- స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకోవడానికి జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆగస్టు 7ని నిర్ణయించారు. కలకత్తా టౌన్హాల్లో 1905 ఆగస్ట్ 7న భారతీయ నిర్మిత వస్తువులకు అనుకూలంగా విదేశీ వస్తువులను బహిషరించాలని అధికారిక ప్రకటన ప్రారంభమైంది. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది.
64. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం భారతదేశ జాతీయ పతాకానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి.
ప్రకటన-I : భారతదేశ జాతీయ జెండా ప్రామాణిక పరిమాణాల్లో ఒకటి 600 మి.మీ x 400 మి.మీ.
ప్రకటన-II: జెండా ఎత్తు (వెడల్పు)కి పొడవు నిష్పత్తి 3:2 ఉండాలి.
పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) స్టేట్మెంట్-I, స్టేట్మెంట్-II రెండూ సరైనవి. స్టేట్మెంట్-II స్టేట్మెంట్-Iకి సరైన వివరణ
బి) స్టేట్మెంట్-I, స్టేట్మెంట్-II రెండూ సరైనవి. స్టేట్మెంట్-II స్టేట్మెంట్-Iకి సరైన వివరణ కాదు
సి) స్టేట్మెంట్-I సరైనది. స్టేట్మెంట్-II తప్పు
డి) స్టేట్మెంట్-I తప్పు. స్టేట్మెంట్-II సరైనది
సమాధానం: డి
వివరణ: - ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా జనవరి 26, 2002న అమల్లోకి వచ్చింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని క్లాజ్ 2.1 ప్రకారం జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించకుండా సాధారణ ప్రజానీకం, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు మొదలైనవారు జాతీయ జెండాను ప్రదర్శించడంపై ఎలాంటి పరిమితి ఉండదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002ను ఇటీవల సవరించారు. పాలిస్టర్ లేదా మెషిన్ మేడ్ ఫ్లాగ్‌తో చేసిన జాతీయ జెండా కూడా ప్రదర్శించొచ్చని అనుమతించారు. సవరించిన ఫ్లాగ్ కోడ్ ప్రకారం జాతీయ జెండాను చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి/పాలిస్టర్/ఉన్ని/సిల్/ఖాదీతో తయారు చేయవచ్చు.
జాతీయ పతాకం ప్రామాణిక పరిమాణాలు కింది విధంగా ఉండాలి:
i. ఫ్లాగ్ సైజు నెంబర్:1 = 6300 మి.మీ x 4200 మి.మీ
ii. ఫ్లాగ్ సైజు నెంబర్:2 = 3600 మి.మీ x 2400 మి.మీ
iii. ఫ్లాగ్ సైజు నెంబర్:3 = 2700 మి.మీ x 1800 మి.మీ
iv. ఫ్లాగ్ సైజు నెంబర్:4 = 1800\ మి.మీ x 1200 మి.మీ
v. ఫ్లాగ్ సైజు నెంబర్:5 = 1350 మి.మీ x 900 మి.మీ
vi. ఫ్లాగ్ సైజు నెంబర్:6 = 900 మి.మీ x 600 మి.మీ
vii. ఫ్లాగ్ సైజు నెంబర్:7 = 450 మి.మీ x 300 మి.మీ
viii. ఫ్లాగ్ సైజు నెంబర్:8 = 225 మి.మీ x 150 మి.మీ
viii. ఫ్లాగ్ సైజు నెంబర్:9 = 150 మి.మీ x 100 మి.మీ - స్టేట్మెంట్ 1 లో పైన పేరొన్న ప్రామాణిక పరిమాణం లేదు కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది కాదు.
- జాతీయ జెండా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. జెండా ఎత్తు (వెడల్పు)కి పొడవు నిష్పత్తి 3:2 ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది.
కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు