General Studies | చీజ్ పరిశ్రమల్లో రెనిన్ ను ఏ విధంగా వాడతారు?
1. ఏ గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు?
1) జనుము గుజ్జు 2) కర్ర గుజ్జు
3) కొబ్బరి గుజ్జు 4) పత్తి గుజ్జు
2. బీటీ అంటే
1) బ్యాక్టీరియం థురంజియెన్సిస్
2) బాసిల్లస్ థురంజియెన్సిస్
3) బాసిల్లస్ ట్యూబర్ క్యూలోసిస్
4) బ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్
3. మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల అతి తక్కువ, ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా నివసించ గలిగేవి?
1) శిలీంధ్రాలు 2) వైరస్లు
3) బ్యాక్టీరియాలు 4) ప్రొటోజోవన్లు
4. నీటిలో పోషకాలు పెరిగి, మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గటాన్ని ఏమంటారు?
1) నైట్రిఫికేషన్ 2) నైట్రోజన్ ఫిక్సేషన్
3) యూట్రోఫికేషన్ 4) కార్బోనిఫికేషన్
5. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరైనది ఏది?
ఎ) 2 డిసెంబర్ 1984 నాడు సంభవించింది
బి) 3000 మంది మరణించారు
సి) మిథైల్ ఐసో సయనైడ్ వాయువు దీనికి కారణం
డి) ఈ ఫ్యాక్టరీకి యాజమాన్యం యూనియన్ కార్బడ్, జర్మనీ
1) ఎ 2) బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
6, మూలకేశాలు నేల నుంచి నీటిని గ్రహించే విధానంలో ఇమిడి ఉండే ప్రక్రియ?
1) ద్రవాభిసరణం
2) ప్రతిలోమ ద్రవాభిసరణం
3) నిర్జలీకరణం 4) వ్యాపనం
7. రెయిన్గేజ్కు గల మరోపేరు?
1) యూడో మీటరు 2) పల్వనోమీటరు
3) అంత్రోమీటరు 4) పైవన్నీ
8. ప్రపంచ జల దినోత్సవం?
1) మార్చి 11 2) మార్చి 22
3) ఏప్రిల్ 24 4) ఏప్రిల్ 11
9. కండరాల్లో గుండ్రంగా ఉండే దారాల్లాంటి నిర్మాణాలకు గలపేరు?
1) టెట్ జంక్షన్ 2) టెండాన్
3) ఫిలమెంట్ 4) లిగమెంట్
10. జత్రుక+ రెక్క ఎముక = ?
1) అంగుళ్యాస్థులు 2) పాదాస్థులు
3) భుజాస్థులు 4) వాతిలాస్థులు
11. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేసిన ఏ సూక్ష్మజీవి పంటలపై వాలిన శత్రు పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది?
1) టైకోగ్రామా 2) బబేసియా
3) బాసిల్లస్ థురంజియెన్సిస్
4) వానపాము
12. ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం?
1) కోలోస్ట్రమ్ 2) థయమిన్
3) రైబోఫ్లావిన్ 4) కెసిన్
13. శరీర కదలికల కోసం, చలనం కోసం జల విసర్జన వ్యవస్థను కలిగి ఉండే జీవులు?
1) అనెలిడ్‌లు 2) పొరిఫెరన్లు
3) ఇఖైనోడెర్మ్లు 4) సిలింటరేట్లు
14. దేన్ని సంకరపు క్లోనింగ్ వాహకం అంటారు?
1) ప్లాస్మిడ్ 2) కాస్మిడ్
3) బ్యాక్టీరియో ఫాజ్ 4) బీసీఏ, వైఏసీ
15. చీజ్ పరిశ్రమల్లో రెనిన్ ను ఏ విధంగా వాడతారు?
1) జీవ ఉత్ప్రేరకంగా
2) ద్వితీయ జీవ ఉత్ప్రేరకంగా
3) రిస్ట్రిక్షన్ ఎంజైమ్‌గా
4) జీవనాశకం యాంటీబయాటిక్‌గా
16. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం విధి?
1) ప్రొటీన్ల సంశ్లేషణ
2) కొవ్వుల సంశ్లేషణ
3) పై రెండూ 4) ఏదీకాదు
17. శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యం?
1) ఆక్సీకరణ చర్య 2) విచ్ఛిన్న క్రియ
3) నియంత్రిత చర్య 4) శక్తిమోచక చర్య
18. జన్యులోపం వల్ల రక్తం గడ్డకట్టకపోవడం ఏ వ్యాధి లక్షణం?
1) తలసేమియా 2) అల్బునిజం
3) వర్ణాంధత్వం 4) హీమోఫీలియా
19. కాలిలోని సిరలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త?
1) విలియం హార్వే
2) గైరోలామా ఫాబ్రిసి
3) మార్సెల్లో మాల్ఫీజీ
4) లూయీపాశ్చర్
20. ఆస్యకుహరంలో జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు?
1) కైమ్ 2) విల్లే
3) కైల్ 4) బోలస్
21. ఎ) క్లోమం ట్రిప్పిన్ ఎంజైమ్‌ను స్రవిస్తుంది
బి) ట్రిప్సిన్ పిండి పదార్థాలపై చర్య జరుపుతుంది.
1) ఎ నిజం, బి కాదు
2) ఎ నిజం కాదు, బి నిజం
3) ఎ నిజం, బి నిజం
4) ఎ, బి, నిజం కాదు
22. మూత్రం ఏర్పడే భాగం?
1) భౌమన్స్ గుళిక 2) హెన్లీశిక్యం
3) సమీపస్థ సంవళిత నాళం
4) దూరస్థ సంవళిత నాళం
23. ఆలోచనలు, తెలివితేటలకు కేంద్రం?
1) ద్వారగోర్థం 2) మజ్జాముఖం
3) మస్తిష్కం 4) అనుమస్తిష్కం
24. పిండానికి పోషక పదార్థాలను, ఆక్సిజన్‌ను అందించేవి?
1) పరాయువు 2) జరాయువు
3) ఉల్బం 4) అలిందం
25. తారక (Pupil) పరిమాణాన్ని సరిచేసే కండర నిర్మాణం?
1) కంటిలోని అన్ని కండరాలు
2) కంటిపాప
3) కనురెప్పలు 4) ఏదీకాదు
26. కుళ్లిన పదార్థాలపై పెరిగే మొక్కలు?
1) సహజీవులు 2) పరాన్న జీవులు
3) పూతికాహారులు
4) స్వయం పోషకాలు
27. పక్షుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాల లక్షణం?
1) విత్తనాలు జిగురుగా ఉండటం
2) లక్ష్యానికి చేరక ముందే దారిమధ్యలో పడటం
3) విత్తన కవచాలు మెత్తగా మారటం
4) పైవన్నీ
28. చికోరి ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది?
1) జీర్ణ వ్యవస్థ
2) రక్తప్రసరణ వ్యవస్థ
3) 1, 2 4) విసర్జక వ్యవస్థ
29. జీవిత కాలమంతా నీరు తాగకుండా నివసించే ఎడారి జీవి?
1) శాండ్గ్రౌజ్ 2) కంగారూ ఎలుక
3) గోల్డెన్ మోల 4) యాడర్ స్నేక్
30. ఆహారపు గొలుసులో స్థాయిల వరుస క్రమం?
1) వినియోగదారులు – ఉత్పత్తిదారులు – విచ్చిన్నకారులు
2) విచ్ఛిన్నకారులు – ఉత్పత్తిదారులు – వినియోగదారులు
3) ఉత్పత్తిదారులు- వినియోగదారులు- విచ్ఛిన్నకారులు-
4) ఉత్పత్తిదారులు -విచ్ఛిన్నకారులు – వినియోగదారులు
31. రైల్వే స్టేషన్లలో ఉపయోగించే గడియారం?
1. పరమాణు గడియారం
2) అనలాగ్ గడియారం
3) ఎలక్ట్రానిక్ గడియారం 4) సన్ డయల్
32. అధునాతన ప్యూజ్‌లు
1) రాగితీగ 2) జింక్ ముక్క
3) ఎంసీబీ 4) లోహపు రేకు
33. తిన్నగా ప్రయాణిస్తున్న కారు చలనం?
ఎ) వక్రరేఖీయ చలనం
బి) సరళరేఖీయ చలనం
సి) డోలన చలనం
డి) స్థానాంతర చలనం
1) సి, డి 2) బి, సి
3) బి, డి 4) బి మాత్రమే
34. ఒక కుంభాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం దర్పణానికి వెనుకవైపు గల నాభి వద్ద ఏర్పడితే వస్తువు స్థానం?
1) దర్పణ కేంద్రం వద్ద 2) నాభివద్ద
3) వక్రతా కేంద్రం వద్ద 4) అనంతం
35. టేప్ రికార్డర్ లోని ప్లాస్టిక్ టేపు పైన పూసే పూత?
1) ఫెర్రస్ ఆక్సైడ్ 2) ఫెర్రిక్ ఆక్సైడ్
3) మెర్క్యూరిక్ ఆక్సైడ్
4) కాపర్ ఆక్సైడ్
36. కింది వాటిలో సరైనది ఏది?
1) చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది
2) స్థిరవేగంతో కదులుతున్న వారు క్రమచలనంలో ఉంటారు
3) ఓడోమీటర్ రీడింగు తిరోగమనం కాదు
4) పైవన్నీ
37. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం?
1) పౌండ్ 2) గ్రామ్
3) టన్ను 4) క్వింటాలు
38. అయస్కాంత భ్రామకం ప్రమాణం?
1) ఆంపియర్ -మీటర్
2) న్యూటన్ -మీటర్/టెస్లా
3) వెబర్ 4) ఆంపియర్ -మీటర్2
39. వక్ర ఉపరితలాలు కలిగిన దర్పణాలు?
1) గోళాకార దర్పణాలు
2) సమతల దర్పణాలు
3) సమతల కుంభాకార దర్పణాలు
4) సమతల పుటాకార దర్పణాలు
40. వాహన వేగాన్ని లెక్కించే పరికరం?
1) స్పీడోమీటర్ 2) అల్టీమీటర్
3) ఓడోమీటర్ 4) ఏదీకాదు
41. కింది వాటిలో అధృవ ద్రావణి?
ఎ) నీరు బి) కిరోసిన్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
42. సున్నపురాయిపైన క్లోరిన్ వాయువు పంపినపుడు ఏర్పడేది?
1) బేకింగ్ పౌడరు 2) బ్లీచింగ్ పౌడరు
3) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 4) వాషింగ్‌సోడా
43. ఆమ్ల మాధ్యమంలో గులాబీరంగును ఇచ్చే సూచిక?
1) మిథైల్ ఆరెంజ్ సూచిక
2) ఫినాప్తలిన్ సూచిక
3) లిట్మస్
4) బ్రమోథయోల్ నీలి సూచిక
44. కాంతి కిరణం ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం లేదా కాంతి సంవత్సరం విలువ?
1) 1.51011మీ
2) 1.91015మీ
3) 9.31015మీ
4) 8.11011మీ
45. ఓజోన్ పొరను దెబ్బతీసేవి?
1) క్లోరో ఫ్లోరో కార్బన్లు
2) రిఫ్రిజిరేటర్ నుంచి వెలువడే వాయువులు
3) 1,2
4) ఏదీకాదు
46. కింది వాటిలో అజీర్తికి మందుగా వాడే పదార్థం?
1) యాంటీబయాటిక్ 2) అనాల్జేసిక్
3) యాంటాసిడ్ 4) యాంటీసెప్టిక్
47. జిప్సం రసాయనిక ఫార్ములా?
1) CaSO4
2) CaSO4 1/2 H2O
3) CaSO4, H2O
4) CaSO4.2H2O
48. కింది వాటిలో అత్యల్ప పీహెచ్ విలువ గల పదార్థం?
1) చక్కెర 2) టమాటా రసం
3) వెనిగర్ 4) వాషింగ్‌సోడా
49. హైడ్రోజన్ రంగులేని వాయువు గాలికన్నా?
1) బరువైనది 2) తేలికైనది
3) సమానం 4) ఏదీకాదు
50. కిందివాటిలో సరైనది?
ఎ) H2SO4 జలరహిత రూపం SO2
బి) H3PO4 జలరహిత రూపం P2O3
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
51. కింది వాటిలో కాంటూరు రేఖల లక్షణం కానిది?
1) వంకర టింకరగా ఉండవచ్చు
2) దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు
3) రెండు రేఖలు ఖండించుకొంటాయి
4) భూ స్వరూపాన్ని బట్టి ఆకారం
మారుతుంది
52. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రాంతంలోని పీఠభూమి ప్రాంతం ఎటువంటి లక్షణం కలిగి ఉంది?
1) వరదలకు గురయ్యే ప్రాంతం
2) కరువుకు గురయ్యే ప్రాంతం
3) తుఫాన్లకు గురయ్యే ప్రాంతం
4) భూకంపాలకు గురయ్యే ప్రాంతం
53. కూనవరం గ్రామం ఏ రెండు నదుల సంగమ ప్రదేశంలో ఉంది?
ఎ) శబరి, గోదావరి
2) సీలేరు, గోదావరి
3) మంజీరా, గోదావరి
4) ఇంద్రావతి, గోదావరి
54. కిందివాటిలో గరిష్ఠస్థాయిలో బాష్పీభవనం ఎక్కడ జరుగుతుంది?
1) మొక్కల ద్వారా 2) నదులు
3) మహాసముద్రాలు
4) మానవ శరీరాలు
55. గోదావరి నదిపై నిర్మించిన ఏ ఆనకట్ట నాసిక్, త్రయంబక్ పట్టణాలకు నీటిని సరఫరా చేస్తుంది?
1) గంగాపూర్ డ్యాం
2) జయక్వాడీ ప్రాజెక్ట్
3) శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్
4) బాబ్లీ ప్రాజెక్ట్
56. భూమిలో రెండు రాతిపొరల మధ్యగల నీటి పొరను ఇలా పిలుస్తారు?
1) జలస్తరం 2) భూజలం
3) సహజనీరు 4) వాటర్‌లైన్
57. ఇటీవల కాలంలో మత్స్యకారులు అధికంగా ఏ వలను ఉపయోగించటంతో వారిలో వలసలు తగ్గాయి?
1) పెద్ద పరీషా 2) రింగువల
3) విసిరే వల 4) విలావల
58. యూరప్‌లోని పశ్చిమతీర జలాలను చలికాలంలో గడ్డకట్టనీయకుండా చేసేవి?
1) ఈక్వేటర్ స్ట్రీమ్
2) ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్
3) బెంగ్యులా ప్రవాహం
4) లారెన్షియా డ్రిప్ట్
59. నైలు నది జన్మస్థానం?
1) అట్లాస్ పర్వతాలు
2) డ్రాకెన్బర్గ్ పర్వతాలు
3) కిలిమంజారో శిఖరం
4) విక్టోరియా సరస్సు
60. ఆఫ్రికాలో కర్కటరేఖకు ఉత్తరాన మరకరేఖకు దక్షిణాన గల శీతోష్ణస్థితి?
1) శీతల 2) ఉష్ణ
3) సమశీతోష్ణస్థితి
4) మధ్యధరా
సమాధానాలు
1-2 2-2 3-3 4-3
5-3 6-2 7-4 8-2
9-2 10-3 11-1 12-3
13-3 14-2 15-1 16-1
17-3 18-4 19-2 20-4
21-1 22-1 23-3 24-2
25-2 26-3 27-4 28-3
29-2 30-3 31-3 32-3
33-3 34-4 35-2 36-4
37-2 38-4 39-1 40-1
41-2 42-2 43-1 44-3
45-3 46-3 47-4 48-3
49-2 50-3 51-3 52-2
53-1 54-3 55-1 56-1
57-2 58-2 59-4 60-3
కృష్ణ
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు