TSPSC | ఐదు టీఎస్పీఎస్సీ పరీక్షలకు కొత్త తేదీలు.. మే 16 నుంచి రెండు సెషన్లల్లో ఎగ్జామ్స్
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధానంలో నిర్వహణ
TSPSC | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఐదు రకాల ఉద్యోగ నియామక పరీక్షల కొత్త తేదీలను ప్రకటించింది. పేపర్ లీకేజీల నేపథ్యంలో ఈ ఐదు పరీక్షలను రద్దుచేయగా, కొత్త తేదీలను వెల్లడించింది. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన కమిషన్ ఆయా పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 16 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ (ఓఎమ్మార్) పరీక్ష విధానానికి ముగింపు పలికిన కమిషన్ మొత్తం పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు భర్తీ రాత పరీక్షను ఇది వరకు ఓఎమ్మార్ ద్వారా నిర్వహిస్తామని ప్రకటించగా, తాజాగా సీబీఆర్టీలోకి మార్చింది.
తొలుత అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష
వ్యవసాయ సహకారశాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ఎగ్జామ్ను మే 16న రెండు సెషన్లల్లో నిర్వహిస్తారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు మే 19 రెండు సెషన్లల్లో పరీక్ష ఉంటుంది. రవాణాశాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ పరీక్షను జూన్ 28న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో నిర్వహించనున్నారు. భూగర్బజలశాఖలో గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జూలై 18, 19 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లల్లో జరుపుతారు. భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను జూలై 20, 21 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లల్లో నిర్వహిస్తారు. వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు.
కొత్త పరీక్ష తేదీలు
- అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ 16-5-2023 (ఉదయం, మధ్యాహ్నం)
- డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 19-5-2023 (ఉదయం, మధ్యాహ్నం)
- రవాణాశాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ 28-6-2023 (ఉదయం, మధ్యాహ్నం)
- భూగర్భ జలశాఖలో గెజిటెడ్ ఆఫీసర్ 18, 19 -7-2023 (ఉదయం, మధ్యాహ్నం)
- భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్ 20, 21-7-2023 (ఉదయం, మధ్యాహ్నం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు