TSPSC Gurukula PD Special | శరీరం మొత్తం ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికి ఉపయోగపడే ఆసనం?
యోగా
1. హిందూ పురాణాల ప్రకారం యోగా విద్యను అందించిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) శివుడు బి) బ్రహ్మ
సి) శ్రీకృష్ణుడు డి) ఆంజనేయుడు
2. యుజ్ అంటే?
ఎ) టు జాయిన్ బి) టు ఎటాచ్
సి) టు బైండ్ డి) పైవన్నీ
3. Yoga is a Balance and Harmony of the Mind and Body అని చెప్పింది ఎవరు?
ఎ) మనుస్మృతి బి) భగవద్గీత
సి) సోక్రటీస్ డి) ఎవరూ కాదు
4. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడాన్ని ఏమంటారు?
ఎ) ప్రాణాయామం బి) ఆసనం
సి) ప్రత్యాహార డి) యోగా
5. త్వరగా విశ్రాంతి స్థితికి రావడానికి ఉపయోగపడే ఆసనం ఏది?
ఎ) వజ్రాసనం బి) పద్మాసనం
సి) భుజంగాసనం డి) శవాసనం
6. దేన్ని మొదటి యోగా అంటారు?
ఎ) కర్మయోగా బి) భక్తి యోగా
సి) రాజయోగా డి) హఠ యోగా
7. శరీరంలో మలినాలను తొలగించడానికి ఉపయోగపడే యోగా?
ఎ) భక్తి యోగా బి) రాజ యోగా
సి) హఠ యోగా డి) కర్మ యోగా
8. To Obtain Moderative State అనేది దేని ముఖ్య ఉద్దేశం?
ఎ) రాజ యోగా బి) జ్ఞాన యోగా
సి) కర్మ యోగా డి) భక్తి యోగా
9. ఇతరుల దగ్గర దొంగతనం చేయకుండా, ఏమీ ఆశించకుండా ఉండటాన్ని ఏమంటారు?
ఎ) బ్రహ్మచర్యం బి) అస్తేయం
సి) అహింస డి) సత్యం
10. ఆసనం అంటే?
ఎ) శ్వాస నియంత్రణ
బి) ఒక నిర్దిష్టమైన ఆకృతి
సి) ధ్యానం డి) పైవేవీ కావు
11. ప్రపంచ సుఖాలకు లోనుకాకుండా మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడాన్ని ఏమంటారు?
ఎ) ప్రాణాయామ బి) ప్రత్యాహార
సి) ఆసన డి) యమ
12. ధారణ అంటే?
ఎ) ఏకాగ్రత
బి) ఇంద్రియ నిగ్రహం
సి) శ్వాస నియంత్రణ డి) ధ్యానం
13. Soul of Yoga అని దేన్ని అంటారు?
ఎ) ప్రాణాయామ బి) ప్రత్యాహార
సి) ఆసన డి) యమ
14. శీతాకాలంలో ఏ ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి తగిన వేడి లభిస్తుంది?
ఎ) ఉజ్జయి బి) బస్తిక
సి) శీతలి డి) సూర్య ఛేదన
15. ఏ ప్రాణాయామం చేసేక్రమంలో గాలిని నోటి ద్వారా తీసుకుంటారు?
ఎ) బస్తిక బి) సూర్య ఛేదన
సి) శీతలి డి) ఉజ్జయి
16. Humming Bee Breath అని ఏ ప్రాణాయామాన్ని పిలుస్తారు?
ఎ) శీతలి బి) ఉజ్జయి
సి) బ్రామరి డి) కపాల బాతి
17. ఏ ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో నరాలు ఉత్తేజం అయ్యి బాగా పనిచేస్తాయి?
ఎ) బ్రామరి బి) కపాలబాతి
సి) ఉజ్జయి డి) శీతలి
18. కపాలంలోని మళినాలను తొలగించి, కపాల నాడులను ఉత్తేజ పరచడం ఏ ప్రాణాయామం ముఖ్య ఉద్దేశం?
ఎ) ఉజ్జయి బి) శీతలి
సి) కపాల బాతి డి) బ్రామరి
19. కుంభకం లేకుండా పూరకం, రేచకం మాత్రమే ఉండే ప్రాణాయామం ఏది?
ఎ) కపాల బాతి బి) బ్రామరి
సి) శీతలి డి) ఉజ్జయి
20. ఏ ప్రాణాయామాన్ని అనులోమ, విలోమ ప్రాణాయామం అంటారు?
ఎ) సమవృత్తి బి) నాడిశోధన
సి) ఉజ్జయి డి) కపాల బాతి
21. సమవృత్తి ప్రాణాయామంలో పూరకం, కుంభకం, రేచకం నిష్పత్తులు?
ఎ) 1:2:3 బి) 1:2:4
సి) 1:1:1 డి) 1:3:4
22. ఏ రకమైన ప్రాణాయామంలో పూరకం, రేచకం లేకుండా కుంభకం మాత్రమే ఉంటుంది?
ఎ) నాడీ శోధన బి) కపాల బాతి
సి) సమవృత్తి డి) ప్లవని
23. Purification of Body అనేది దేని ముఖ్య ఉద్దేశం?
ఎ) ధ్యానం బి) ప్రాణాయామం
సి) శుద్ధిక్రియ డి) ఆసన
24. శరీరంలో ఉన్న అధిక కొవ్వును తొలగించడం దేని ముఖ్య ఉద్దేశం?
ఎ) కఫ బి) వాత
సి) పిత్త డి) పైవేవీ కావు
25. నాసికా రంధ్రాలను శుద్ధిపరిచే ప్రక్రియను ఏమంటారు?
ఎ) కఫ బి) వాత
సి) నేతి డి) పిత్త
26. నౌలి అంటే?
ఎ) ఉదర అవయవాలను బలోపేతం చేయడం
బి) అంతర్గతంగా శుభ్రపరచడం
సి) నాసికా రంధ్రాలను శుభ్రపరచడం
డి) పైవేవీ కావు
27. దారాన్ని ఉపయోగించి ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడాన్ని ఏమంటారు?
ఎ) జలనేతి బి) సూత్రనేతి
సి) దౌతి డి) నౌలి
28. దౌతి ఎన్ని రకాలు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
29. వస్త్ర దౌతిలో వాడే గుడ్డ ఎంత పొడవు ఉండాలి?
ఎ) 1 మీటర్ బి) 2 మీటర్లు
సి) అర మీటర్ డి) 1.5 మీటర్లు
30. పెద్ద పేగును కడగటం లేదా శుభ్రపరచడం దేని ముఖ్య ఉద్దేశం?
ఎ) నౌతి బి) దౌతి
సి) బస్తి డి) నౌలి
31. ఏ రకమైన ప్రాణాయామంలో గాలిని నెమ్మదిగా తీసుకుని వేగంగా వదలాలి?
ఎ) బస్తిక బి) కపాల బాతి
సి) బ్రామరి డి) శీతలి
32. ఒక వస్తువు మీద మన మనస్సును లగ్నం చేసి ఏకాగ్రతను పెంచడాన్ని ఏమంటారు?
ఎ) దౌతి బి) ధ్యానం
సి) నౌలి డి) త్రాటక
33. A Sound Mind in a Sound Body అని చెప్పింది ఎవరు?
ఎ) సోక్రటీస్ బి) అరిస్టాటిల్
సి) ప్లేటో డి) వెబ్‌స్టర్
34. Yogic Relaxation Pose అని దేన్ని అంటారు?
ఎ) మకరాసనం బి) శవాసనం
సి) పద్మాసనం డి) వజ్రాసనం
35. భోజనం చేసిన వెంటనే చేయవలసిన ఒకేఒక ఆసనం?
ఎ) పద్మాసనం బి) శవాసనం
సి) మకరాసనం డి) వజ్రాసనం
36. సుఖాసనానికి మరోపేరు?
ఎ) ప్రేయర్ పోజ్ బి) టైలర్స్ సీట్
సి) లోటస్ పోజ్ డి) ప్లగ్ పోజ్
37. ఏ ఆసనం ఉదర కండరాలకు మంచి వ్యాయామంగా పనిచేస్తుంది?
ఎ) సర్వాంగాసనం బి) భుజంగాసనం
సి) ధనురాసనం డి) చక్రాసనం
38. ఏ ఆసనాన్ని అన్ని ఆసనాలకు తల్లి వంటిది ఆసనం అని పిలుస్తారు?
ఎ) సర్వాంగాసనం బి) ధనురాసనం
సి) భుజంగాసనం డి) చక్రాసనం
39. మహిళల రుతుస్రావం సమయంలో నొప్పిని నయం చేసే ఆసనం?
ఎ) భుజంగాసనం బి) శవాసనం
సి) సర్వాంగాసనం డి) శలబాసనం
40. శరీరం మొత్తం ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికి ఉపయోగపడే ఆసనం?
ఎ) చక్రాసనం బి) సర్వాంగాసనం
సి) శలబాసనం డి) పైవేవీ కావు
41. భుజంగాసనం, శలాబాసనం కలయిక అని ఏ ఆసనాన్ని అంటారు?
ఎ) కుక్కుటాసనం బి) శవాసనం
సి) చక్రాసనం డి) ధనురాసనం
42. ఏ ఆసనాన్ని రాబిట్ పోజ్ అని పిలుస్తారు?
ఎ) కుక్కుటాసనం బి) శశంకాసనం
సి) చక్రాసనం డి) ఉష్టాసనం
43. యోగాను SGFI పోటీల్లో ఎన్ని విభాగాల్లో నిర్వహిస్తారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
44. SGFI యోగా టీం చాంపియన్‌షిప్‌లో యోగా టీమ్‌కు ఉండవలసిన కనీస క్రీడాకారుల సంఖ్య?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
45. SGFI పోటీల్లో యోగాలో తప్పనిసరిగా చేయవలసిన ఆసనాలకు ఎన్ని ప్రయత్నాలు ఇస్తారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
46. SGFI పోటీల్లో ఒక క్రీడాకారుడు మొత్తం ఎన్ని ఆసనాలు వేయాలి?
ఎ) 1 బి) 3 సి) 5 డి) 6
47. SGFI బాలుర యోగా పోటీల్లో న్యాయ నిర్ణేతల ప్యానల్లో ఎంతమంది ఉంటారు?
ఎ) 5 బి) 7 సి) 8 డి) 10
48. నాగలి భంగిమలో ఉండే ఆసనం?
ఎ) ధనురాసనం బి) సుఖాసనం
సి) పద్మాసనం డి) హలాసనం
48. Shoulder Stand అని ఏ ఆసనాన్ని అంటారు?
ఎ) సర్వాంగాసనం బి) భుజంగాసనం
సి) ధనురాసనం డి) మండకాసనం
50. ‘బాధ, దుఃఖం నుంచి విముక్తి పొందడమే యోగా’ అని చెప్పిందెవరు?
ఎ) శ్రీకృష్ణ బి) శివుడు
సి) బ్రహ్మ డి) పై ఎవరూ కాదు
51. భక్తి యోగా ఎన్ని విధాలుగా ఉంటుంది?
ఎ) 7 బి) 8 సి) 9 డి) 6
52. నైతిక్రియ ఎన్ని రకాలు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
53. కొలిమితిత్తులు అనేది దేనికి అర్థం?
ఎ) బస్తిక బి) శీతలి
సి) ప్లావని డి) సత్కారి
54. ఉచ్ఛాస, నిశ్వాసాలు, నిరోధాన్ని ఏమంటారు?
ఎ) శవాసనం బి) పూరకం
సి) కుంభకం డి) ప్రాణాయామం
55. సంచిత, ప్రారబ్ద, అగామి అనేది దేని రకాలు?
ఎ) కర్మయోగ బి) రాజయోగ
సి) యమ డి) నియమ
56. రాయల్ యోగా అని దేన్ని అంటారు?
ఎ) కర్మయోగా బి) రాజయోగా
సి) ప్రాణాయామ డి) పైవన్నీ
57. The Mixture of Various Medicines is Called Yoga అని చెప్పింది?
ఎ) భగవద్గీత బి) వేదవ్యాస్
సి) ఆయుర్వేద డి) పైవేవీ కావు
58. అహింస, సత్యం, అసత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే విషయాలు దేనిలో భాగం?
ఎ) యమం బి) నియమం
సి) తపస్సు డి) పైవేవీ కావు
59. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు?
ఎ) జూన్ 21 బి) జూలై 21
సి) మార్చి 21 డి) అక్టోబర్ 21
60. యోగా గురించి పద్యాల్లో తెలియజేసినవారు?
ఎ) కబీర్, సూరదాస్ బి) తులసిదాస్
సి) నామ్‌దేవ్ డి) పై అందరు
జవాబులు
1. ఎ 2. డి 3. బి 4. సి
5. డి 6. డి 7. సి 8. బి
9. బి 10. బి 11. బి 12. ఎ
13. ఎ 14. డి 15. సి 16. సి
17. ఎ 18. సి 19. ఎ 20. బి
21. సి 22. డి 23. సి 24. సి
25. సి 26. ఎ 27. బి 28. సి
29. డి 30. సి 31. బి 32. డి
33. బి 34. బి 35. డి 36. బి
37. బి 38. ఎ 39. డి 40. ఎ
41. డి 42. బి 43. సి 44. డి
45. ఎ 46. సి 47. బి 48. డి
49. ఎ 50. ఎ 51. సి 52. బి
53. ఎ 54. డి 55. ఎ 56. బి
57. సి 58. ఎ 59. ఎ 60. డి
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
మీకు తెలుసా?
విలియం హార్వే
విలియం హార్వే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య శాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్త ప్రసరణ జరిగే పద్ధతిని వివరించిన శాస్త్రవేత్త. 1628లో హార్వే ప్రచురించిన ‘అనాటమికల్ ఎక్సర్సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్’ అనే పుస్తకం వైద్య శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది.
సర్ రొనాల్డ్ రాస్
రొనాల్డ్ రాస్ బ్రిటిష్ వైద్యుడు. మలేరియా వ్యాధిపై 16 సంవత్సరాల పాటు విస్తృతంగా పరిశోధనలు చేసిన మిలిటరీ డాక్టర్. 1897 ఆగస్టు 20న దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించాడు. కాబట్టి ఏటా ఆగస్టు 20న ప్రపంచ వ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మలేరియా సంక్రమించే విధానాన్ని సవివరంగా తెలిపినందుకు రాస్కు 1902లో నోబెల్ బహుమతి లభించింది.
వర్గీస్ కురియన్
కురియన్ను ‘మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. దేశంలో పాల ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడానికి విశేష కృషి చేసిన వారిలో అగ్రగణ్యుడు. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. భారత ప్రభుత్వం వర్గీస్ కురియన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు