TSPSC Group 4 Model Paper | జీ-8 కూటమి నుంచి రష్యాను ఎందుకు బహిష్కరించారు?
గ్రూప్-4 మోడల్ పేపర్ Paper -I
1. కింది ఏ అంతర్జాతీయ సంస్థ/సంస్థల్లో భారతదేశానికి సభ్యత్వం లేదు?
1. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఏపీఈసీ)
2. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యూఎన్వో)
3. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
4. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)
ఎ) 1, 4 బి) 2, 3
సి) 3, 4 డి) ఏదీకాదు
2. నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి.
1. నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే దాన్ని తమందరి పై దాడిగా పరిగణించడం జరుగుతుందని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నాటో ఒప్పందం స్పష్టం చేస్తుంది
2. 2022 నాటో-మాడ్రిడ్ శిఖరాగ్ర సమావేశం రష్యాను యూరో అట్లాంటిక్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని ప్రకటించింది
3. ఇటీవల (ఏప్రిల్‌లో) నాటో కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది
4. ఆస్ట్రియా పశ్చిమ ఐరోపా దేశం అయినప్పటికీ నాటోలో సభ్యత్వం లేదు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 4 డి) 1, 2, 3, 4
3. కింది అంతర్జాతీయ సరిహద్దు రేఖలను జతపర్చండి.
1. డ్యురాండ్ రేఖ ఎ. భారత్- పాకిస్థాన్ మధ్య
2. హిడెన్‌బర్గ్ రేఖ బి. భారత్- చైనా మధ్య
3. మెక్‌మోహన్ రేఖ సి. జర్మనీ- పోలెండ్ మధ్య
4. రాడ్‌క్లిఫ్ రేఖ డి. పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం?
ఎ) అమెరికా బి) బ్రిటన్
సి) భారత్ డి) ఆస్ట్రేలియా
5. కింది వాటిలో నార్డిక్ గ్రూప్ దేశాలను గుర్తించండి.
ఎ) డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్
బి) బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఉక్రెయిన్
సి) అమెరికా, కెనడా, మెక్సికో, బ్రెజిల్
డి) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, ఇండోనేషియా
6. జీ-8 కూటమి నుంచి రష్యాను ఎందుకు బహిష్కరించారు?
ఎ) కమ్యూనిస్టు దేశం కావడం వల్ల
బి) చైనాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నందుకు
సి) కమ్యూనిస్టు దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నందుకు
డి) ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య తీసుకున్నందుకు నిరసనగా
7. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి పరస్పర సహకారం కోసం ఏర్పడిన కూటమి?
ఎ) జీ-20 బి) జీ-8
సి) బ్రిక్స్ డి) నార్డిక్ గ్రూప్
8. ప్రతిపాదన (ఎ): యూరోపియన్ యూనియన్ భారత మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
కారణం (ఆర్): యూరోపియన్ యూనియన్, భారత్‌ల మధ్య 2021లో జరిగిన వాణిజ్య వ్యాపారం విలువ 88 బిలియన్ యూరోలు. ఇది మొత్తం భారతీయ వాణిజ్యంలో 10.8 శాతం వాటాను కలిగి ఉంది
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ విడి విడిగా సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
9. ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) వైట్ ఆర్మీ బి) బ్లూ ఆర్మీ
సి) గ్రీన్ ఆర్మీ డి) రెడ్ ఆర్మీ
10. భారత సైన్యం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై సర్జికల్ దాడి ఎప్పుడు జరిపింది?
ఎ) 2017, ఫిబ్రవరి 26
బి) 2018, ఫిబ్రవరి 26
సి) 2019, ఫిబ్రవరి 26
డి) 2020, ఫిబ్రవరి 26
11. కింది వాటిని సరిగా జతపర్చండి.
1. మత స్వేచ్ఛ హక్కు ఎ. ప్రకరణ 25
2. సమానత్వపు హక్కు బి. ప్రకరణ 22
3. ఖైదీ హక్కు సి. ప్రకరణ 14
4. రాజ్యాంగ పరిహార హక్కు
డి. ప్రకరణ 32
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
12. భారత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్)ను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు?
ఎ) ఒకసారి బి) రెండు సార్లు
సి) మూడు సార్లు డి) అసలు సవరించలేదు
13. ప్రతిపాదన (ఎ): ప్రాతినిథ్య ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిథ్య సమస్యను కొంతమేరకు పరిష్కరించవచ్చు
కారణం (ఆర్): ప్రాతినిథ్య ప్రజాస్వామ్యం జాతి, లింగ భేదం, భావజాలం, ప్రత్యేక ప్రయోజనాల ప్రాతిపదికన ఏర్పడే అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే వీలు కల్పిస్తుంది
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
14. ఎటువంటి ప్రభుత్వంలో రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ఒక్కరే ఉంటారు?
ఎ) మంత్రివర్గ పద్ధతి
బి) అధ్యక్ష తరహా పద్ధతి
సి) సమన్యాయ పాలన
డి) పౌర భాగస్వామ్యం
15. కింది వాటిలో ‘సుపరిపాలన’ లక్షణం కానిది?
ఎ) ఉద్యోగస్వామ్యీకరణం బి) పారదర్శకత
సి) సమన్యాయ పాలన
డి) పౌర భాగస్వామ్యం
16. సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1. రాష్ట్రపతి అడిగిన ఏదైనా విషయంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయాలి
2. సుప్రీంకోర్టు రాష్ట్రపతి విజ్ఞప్తిని తిరస్కరించవచ్చు
3. సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు
4. సలహా పూర్వక అధికార పరిధిలో సుప్రీంకోర్టుకు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రిఫరెన్సులు చేయరాదు
ఎ) 1, 2 బి) 1, 3 సి) 2, 3 డి) 2, 4
17. భారత రాజ్యాంగం కింది అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించిందో జతపర్చండి.
1. ఆదేశ సూత్రాలు ఎ. ఐర్లాండ్
2. ప్రాథమిక హక్కులు బి. యూఎస్ఏ
3. ఉమ్మడి జాబితా సి. ఆస్ట్రేలియా
4. బలమైన కేంద్రంతో కూడిన రాష్ర్టాల యూనియన్ డి. కెనడా
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
18. రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను తెలిపింది?
ఎ) రెండు బి) మూడు
సి) నాలుగు డి) ఒకటి
19. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి అనుకూలంగా సీనియారిటీని పరిరక్షిస్తూ పదోన్నతిలో ప్రత్యేక రక్షణ సదుపాయం కల్పించారు?
ఎ) 81వ సవరణ చట్టం- 2000
బి) 83వ సవరణ చట్టం- 2000
సి) 84వ సవరణ చట్టం- 2001
డి) 85వ సవరణ చట్టం- 2001
20. ప్రతిపాదన (ఎ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ‘నూతన పంచాయతీ రాజ్ చట్టం’ను ఆమోదించి 2018, ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు
కారణం (ఆర్): పంచాయతీ రాజ్ చట్టం-2018లో మొత్తం 9 భాగాలు, 10 చాప్టర్లు, 297 సెక్షన్లు పొందుపరిచారు.
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
21. సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరికాని వాటిని గుర్తించండి.
1. సుప్రీంకోర్టు 1950, జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చింది
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం లేదా కుదించే అధికారం పార్లమెంటుకు లేదు
3. సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు
4. భారత ప్రభుత్వ చట్టం-1935 కింద బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు స్థానాన్ని సుప్రీంకోర్టు ఆక్రమించింది
ఎ) 1, 3 బి) 3 సి) 2 డి) 1, 4
22. ప్రతిపాదన (ఎ): ప్రభుత్వంపై అభిశంసన తీర్మానాన్ని ప్రతిపక్షాలు లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతాయి
కారణం (ఆర్): లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వ విధానంపై నిరసనను లేదా తిరస్కారాన్ని తెలియజేయడానికి ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
23. కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
1. రాజ్యాంగంలోని 250 అధికరణ ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అన్ని అంశాలపై దేశం మొత్తం లేదా కొంత భాగానికి వర్తించే విధంగా పార్లమెంట్ చట్టాలను చేయవచ్చు
2. కేంద్ర జాబితాలో జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలుంటాయి
3. రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న ప్రకరణలు శాసనపరంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలను వివరిస్తాయి
4. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేసే అధికారాన్ని గవర్నర్‌కు ప్రకరణ-200 సంక్రమింపజేస్తుంది
ఎ) 1 బి) 2 సి) 1, 4 డి) 1, 2, 3, 4
24. ప్రతిపాదన (ఎ): భారత న్యాయ వ్యవస్థ న్యాయ క్రియాశీలత (జ్యుడీషియల్ యాక్టివిజమ్) ద్వారా ప్రజలకు ఇచ్చిన అధికారమే ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ (పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్-పిల్)
కారణం (ఆర్): భారత రాజ్యాంగంలో పిల్ ప్రస్తావన లేదు
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
25. కింది ఏ మూడు రాష్ర్టాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు?
ఎ) గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్
బి) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా
సి) రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్
26. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
ఎ) టీబీ రాధాకృష్ణన్
బి) ఉజ్జల్ భుయాన్
సి) హిమాకోహ్లీ
డి) రాఘవేంద్ర సింగ్ చౌహాన్
27. ప్రతిపాదన (ఎ): రాజ్యాంగంలోని ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా మొదటిసారి సవరించారు. తర్వాత సవరించలేదు. ఇక ముందు సవరించవచ్చు. సవరించకపోవచ్చు.
కారణం (ఆర్): ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పిన తీర్పు నేపథ్యంలో స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసు మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం, లౌకికత్వం, సమగ్రత’ అనే మూడు పదాలను ప్రవేశికలో చేర్చారు
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
28. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులను జతపర్చండి.
1. జాతీయ పతాక తాత్కాలిక కమిటీ ఎ. వల్లభాయ్ పటేల్
2. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ బి. హెచ్‌సీ ముఖర్జీ
3. రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ సి. డా. రాజేంద్ర ప్రసాద్
4. అల్పసంఖ్యాకుల ఉప కమిటీ డి. జేబీ కృపలాని
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
29. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వ్యక్తికి ఉండాల్సిన కనీస వయస్సు?
ఎ) 21 బి) 25 సి) 30 డి) 35
30. రాష్ట్రపతికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైనవి?
1. రాజ్యాంగ ప్రకరణ-57 ప్రకారం రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎన్ని సార్లయినా ఉండవచ్చు. పరిమితులు లేవు
2. రాజ్యాంగ ప్రకరణ-360 కింద రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించవచ్చు
3. భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం
4. అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాకముందే ‘భారతరత్న’ పొందారు
ఎ) 1, 2, 4 బి) 1, 2
సి) 3 4) 1, 4
31. ప్రతిపాదన (ఎ): భారతదేశంలో ఆధిపత్యం కోసం ఐరోపా ఈస్టిండియా కంపెనీల మధ్య తీవ్రమైన పోరు సాగింది. ఈ పోరులో చివరికి బ్రిటన్ గెలిచింది
కారణం (ఆర్): బ్రిటిష్ వారికి, ఫ్రెంచి వారికి మధ్య ఆధిపత్య పోరు కర్ణాటక యుద్ధాల ద్వారా ప్రారంభమయ్యింది
ఎ) ఎ, ఆర్ సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ సరైనవే. కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది, ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనది
32. వాస్కోడిగామా కాలికట్ చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికిన అక్కడి హిందూ పాలకుడు ఎవరు?
ఎ) జామోరిన్/రాజా మను విక్రమవర్మ
బి) సికిందర్ షా
సి) ఇమ్మడి నరసింహరాయలు
డి) కులీ కుతుబ్ షా
ANS :-
1-ఎ, 2-డి, 3-బి, 4-సి,
5-ఎ, 6-డి, 7-ఎ, 8-ఎ, 9-బి, 10-సి, 11-డి, 12-ఎ, 13-ఎ, 14-బి, 15-ఎ, 16-బి, 17-ఎ, 18-బి, 19-సి, 20-బి, 21-సి, 22-బి, 23-డి, 24-ఎ, 25-సి, 26-ఎ, 27-ఎ, 28-ఎ, 29-డి, 30-ఎ, 31-బి, 32-ఎ,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు