TS Govt Policies and Schemes | ‘ఇన్నోవేట్-ఇంక్యుబేట్-ఇన్కార్పొరేట్’ దేని నినాదం?
(మే 30 తరువాయి)
47. తెలంగాణలో ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
1) మూడుచింతలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి
2) మల్కాపూర్, మెదక్
3) శాలపల్లి, కరీంనగర్
4) వాసాలమర్రి, భువనగిరి
48. 2023-24 బడ్జెట్లో బీసీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించడానికి ఎన్ని రూ.కోట్ల నిధులను కేటాయించింది?
1) 6299 2) 6199
3) 5299 4) 4299
49. మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధరణతో పాటు కింది ఏ అంశాలు ఇమిడి ఉన్నాయి?
ఎ. చెరువు పూడికతీత, పూడికను తరలించడం
బి. చెరువులకు ఫీడర్ ఛానళ్లను పునరుద్ధరించడం
సి. చెరువు కట్టలు, తూముల మరమ్మతులు
డి. అవసరమైన చోట, సాధ్యమైన చోట ఎఫ్టీఐను పెంచడం
1) ఎ, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
50. టీ యాప్ ఫోలియోను ప్రభుత్వం ఏ రోజున ప్రారంభించింది?
1) 2018 మే 10
2) 2018 ఏప్రిల్ 25
3) 2018 జనవరి 2
4) 2018 మార్చి 13
51. కేసీఆర్ కిట్ పథకం ముఖ్య ఉద్దేశం?
1) తల్లీబిడ్డల క్షేమం, నవజాత శిశువుల మరణాల శాతాన్ని తగ్గించడం
2) గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో సకాలంలో వైద్యం అందించడం
3) గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం
4) చిన్న పిల్లలకు టీకా మందు వేయడం
52. తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకొని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే పథకం?
1) హృదయ్ 2) అమ్మ ఒడి
3) లైఫ్ పథకం
4) ఆపరేషన్ ముస్కాన్
53. మా భూమి – మా పంట మొబైల్ యాప్‌ను ఏ రోజున ప్రారంభించారు?
1) 2017 మే 22
2) 2017 ఏప్రిల్ 14
3) 2017 డిసెంబర్ 28
4) 2017 నవంబర్ 17
54. కింది వాటిలో ప్రభుత్వం అనుసరిస్తున్న బాలల సంరక్షణ నిధి మార్గనిర్దేశకాలు?
1) చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు, న్యాయ మండళ్లు, సంరక్షణ కమిటీల ఏర్పాటు
2) తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై అవగాహన
3) క్యాన్సర్ బాధిత బాలలకు, తల్లిదండ్రులకు పాలియేటివ్ కేర్
4) పైవన్నీ
55. తెలంగాణలోని ఏ ప్రాంతంలో ‘ఆసియా రుమాల్’ తయారవుతుంది?
1) కొత్తకోట 2) గద్వాల్
3) సిరిసిల్ల 4) పోచంపల్లి
56. కింది వాటిలో కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి సరైనది గుర్తించండి.
1) ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ. 12 వేల ఆర్థిక సహాయం
2) దీన్ని సీఎం కేసీఆర్ 2017 జూన్ 3న హైదరాబాద్‌లో ప్రారంభించారు
3) రూ.2 వేల విలువ చేసే 15 వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తున్నారు
4) పైవన్నీ
57. కేసీఆర్ కిట్ పథకం అమలు తీరు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1) వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
2) కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
3) కలెక్టర్
4) డీఎంహెచ్ఓ
58. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి ఎంతకు పెంచారు?
1) రూ. 75 వేలు 2) రూ. లక్ష
3) రూ. 1.5 లక్షలు
4) రూ. 2 లక్షలు
59. దివ్యాంగుల నూతన హక్కుల చట్టం-2016 ప్రకారం ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ కార్యక్రమాల్లో, పథకాల్లో రిజర్వేషన్ ఎంత శాతం పెంచారు?
1) 6 2) 7
3) 5 4) 10
60. బీసీ, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకం ప్రస్తుతం ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది?
1) రూ. 75,116
2) రూ. 1,00,116
3) రూ. 1,50,116
4) రూ.95,116
61. ధరణి పోర్టల్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2020 అక్టోబర్ 28
2) 2020 అక్టోబర్ 25
3) 2020 అక్టోబర్ 29
4) 2020 అక్టోబర్ 30
62. తెలంగాణ నూతన పంచాయతీరాజ్‌లోని తొమ్మిది అంశాలు మినహా అన్నీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?
1) 2018 జనవరి 1 2) 2018 మార్చి 3
3) 2018 జూన్ 2 4) 2018 ఏప్రిల్ 18
63. తెలంగాణలో బోదకాలు బాధితులకు రూ.1000 పెన్షన్ ఎప్పుడు ప్రారంభించారు?
1) 2018 ఏప్రిల్ 2) 2018 మార్చి
3) 2018 జూన్ 4) 2018 జనవరి
64. దేశంలో భూముల విషయంలో సమాచార సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కింది ఏ రాష్ట్రం ఆవిర్భవించింది?
1) గోవా 2) మహారాష్ట్ర
3) తెలంగాణ 4) కర్ణాటక
65. టీఎస్-బి-పాస్ ద్వారా పెట్టుబడులు ఎక్కువగా వచ్చి, తద్వారా ఎక్కువ ఉపాధి కల్పన పొందిన జిల్లా?
1) హైదరాబాద్
2) వరంగల్ రూరల్
3) భద్రాద్రి కొత్తగూడెం
4) మేడ్చల్-మల్కాజిగిరి
66. టీకా బండి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 68 శాతంగా ఉన్న టీకాల శాతాన్ని ఎంతకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు?
1) 70 శాతం 2) 95 శాతం
3) 85 శాతం 4) 80 శాతం
67. కేసీఆర్ కిట్ పథకం అమలు కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపై ఎంతశాతం పెరిగింది? (గతంలో 2015-16లో 30.5 శాతం)
1) 61 శాతం 2) 55 శాతం
3) 70 శాతం 4) 60 శాతం
68. గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కిల్ సమ్మిట్-2021 సమావేశంలో గ్లోబల్ ఇగ్నైట్ ఎక్సలెన్స్ అవార్డు-2021 కింది ఏ ఆర్గనైజేషన్ ప్రకటించారు?
1) WE-Hub 2) TASK
3) T-Hub 4) T-IDEA
69. తెలంగాణలో 2015 నుంచి 2022 జనవరి వరకు ఎన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు పని చేస్తున్నాయి?
1) సుమారు 20,365
2) సుమారు 16,365
3) సుమారు 18,365
4) సుమారు 19,365
70. తెలంగాణలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాలనే బిల్లును శాసనసభ ఎప్పుడు ఆమోదించింది?
1) 2018 అక్టోబర్ 20
2) 2018 జనవరి 21
3) 2018 ఏప్రిల్ 1
4) 2018 మార్చి 24
71. దక్షిణ తెలంగాణ వ్యవసాయ-వాతావరణ మండల ప్రధాన కేంద్రం గల ప్రాంతం?
1) పాలెం 2) సూర్యాపేట
3) షాద్‌నగర్ 4) గద్వాల్
72. లైఫ్ పథకం ఉద్దేశం?
1) కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు బోధనా రుసుం, ఉపకార వేతనాలు అందజేయడం
2) గ్రామీణ కూలీల కుటుంబాల యువతకు సుస్థిర ఉపాధి కల్పన
3) యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ
4) 1, 2
73. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది దేని నినాదం?
1) తెలంగాణ వ్యవసాయ విధానం
2) తెలంగాణ పారిశ్రామిక విధానం
3) తెలంగాణ అటవీ విధానం
4) తెలంగాణ ఐటీ విధానం
74. పల్లె ప్రగతి లక్ష్యాలు?
1) ఎంపిక చేసిన 2.5 లక్షల కుటుంబాల వ్యవసాయదారుల జీవనోపాధి పెంచడం
2) ఎంపిక చేసిన 2.5 లక్షల కుటుంబాలకు సరైన ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత అంశాల్లో మానవ వనరుల అభివృద్ధి
3) ఎంపిక చేసిన 2.5 లక్షల కుటుంబాల ఆదాయాన్ని పెంచడం
4) పైవన్నీ
75. దేశంలో టీ-యాప్ ఫోలియో ద్వారా 150 రకాల సేవలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఏ స్థానంలో ఉంది?
1) 1 2) 2 3) 3 4) 4
76. టీ-యాప్ ఫోలియో ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న సేవలు ?
ఎ. ఆదాయ, కుల, జనన, మరణ, నివాస ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
బి. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను చెల్లించవచ్చు
సి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన పహాణి, రిజిస్ట్రేషన్ దస్తావేజు పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
డి. మొబైల్, ల్యాండ్‌ఫోన్స్ బిల్లుల చెల్లింపులు, ఇంటర్నెట్, డీటీహెచ్ చెల్లింపులు చేయవచ్చు
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి
77. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం అందించింది?
1) రూ.15 లక్షలు
2) రూ.10 లక్షలు
3) రూ.20 లక్షలు
4) రూ.5 లక్షలు
78. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకానికి ప్రభుత్వం ఎంత నిధిని కేటాయించింది?
1) రూ. 3,210 కోట్లు
2) రూ. 1,150 కోట్లు
3) రూ. 1,350 కోట్లు
4) రూ. 1,450 కోట్లు
79. షాదీముబారక్ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి 1,00,116 కు పెంచుతూ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది?
1) 2018 జూన్ 2
2) 2018 జనవరి 26
3) 2018 ఫిబ్రవరి 23
4) 2018 మార్చి 19
80. టీ-ప్రైడ్కి సంబంధించి కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. పరిశ్రమలు నెలకొల్పేందుకు కొనుగోలు చేసే స్థలాలపై, హైపోతికేషన్లపై 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు
బి. మూలధనం పెట్టుబడికి మరో 10 శాతం అదనంగా పెట్టుబడి సబ్సిడీని ఇవ్వడం
సి. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం
డి. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సహాయం అందించడానికి రూ.2000 కోట్లతో నిధిని ఏర్పాటు చేశారు
1) ఎ, బి, సి 2) బి, సి, బి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి
81. దేశంలో సౌర విద్యుత్ అధికంగా ఉత్పత్తి చేసే రాష్ర్టాల్లో రెండోది?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) కర్ణాటక 4) తెలంగాణ
82. గడిచిన నాలుగేళ్లలో వ్యవసాయానికి ఎన్ని లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు?
1) 1,95,831 2) 3,00,125
3) 3,95,872 4) 2,95,872
83. వార్థా-డిచ్పల్లి-మహాశ్వరం లైన్ ద్వారా ఎన్ని మెగావాట్ల విద్యుత్ రాష్ర్టానికి తెచ్చుకునేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది?
1) 1500 మెగావాట్లు
2) 2000 మెగావాట్లు
3) 1000 మెగావాట్లు
4) 1750 మెగావాట్లు
84. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా సొంత స్థలం ఉండే గృహ నిర్మాణానికి ఎంత సహాయం చేస్తుంది?
1) రూ. 3 లక్షలు 2) రూ. 10 లక్షలు
3) రూ. 8 లక్షలు 4) రూ. 6 లక్షలు
85. టీఎస్-ఐపాస్ ద్వారా జిల్లా పరిధిలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులను స్వీకరించిన ఎన్ని రోజుల్లో అనుమతి జారీ చేస్తుంది?
1) 20 రోజులు 2) 15 రోజులు
3) 10 రోజులు 4) 30 రోజులు
జవాబులు
47.1 48.1 49.3 50.2
51.1 52.4 53.1 54.4
55.4 56.4 57.1 58.2
59.3 60.2 61.3 62.4
63.1 64.3 65.2 66.4
67.1 68.2 69.2 70.4
71.1 72.4 73.2 74.4
75.2 76.3 77.2 78.1
79.1 80.3 81.4 82.3
83.2 84.1 85.4
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
మీకు తెలుసా
టి.ఎస్. బి-పాస్
భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ శాసనసభలో ఆమోదించిన టీఎస్ బి-పాస్ బిల్లు దేశంలోనే అత్యంత విప్లవాత్మకమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల-స్వీయ ధ్రువీకరణ వ్యవస్థను 2020 నవంబర్ 16న మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టీఎస్ బి-పాస్‌తో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని, ఈ విధానంలో భవన నిర్మాణ అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని లేదంటే 22వ రోజు ‘డీమ్డ్ అప్రూవల్’గా భావించాల్సి ఉంటుంది. ఈ విధానంలో 75 గజాలలోపు స్థలాల్లో నిర్మాణాలకు ఏ విధమైన అనుమతులు అవసరం లేదు, నిబంధనల మేరకు ఉన్న ఈ నిర్మాణాలను దరఖాస్తు చేసుకోగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు