Luxury motorcycles | భారత మార్కెట్లోకి రానున్న ట్రైయంప్ న్యూ మోడల్ బైక్స్
హైదరాబాద్ : బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్ బైక్ లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. న్యూ ఫీచర్స్ తో స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేయనున్నది. ట్రైయంప్ ఇటీవల విడుదల చేసిన స్ట్రీట్ ట్విన్ గోల్డ్ లైన్ ఎడిషన్ తర్వాత, ట్రైయంప్ సంస్థ ఇటీవల తమ బోన్‌విల్ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ లైన్ ఎడిషన్లను ఆవిష్కరించింది.
కొత్త ట్రైయంప్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్స్ లో బోన్‌విల్ టి100, స్ట్రీట్ స్క్రాంబ్లర్, బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్, బోన్‌విల్ బాబర్, బోన్‌విల్ టి120 మోడళ్లు ఉన్నాయి. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు కొత్త గోల్డ్ ఎడిషన్ పెయింట్ స్కీమ్ తో అందిస్తోంది. ఈ మోడళ్లు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. డెలివరీలు వచ్చే ఏడాదిలో ప్రారంభ మవుతాయట. స్టాండర్డ్ ట్రైయంప్ బోన్‌విల్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్ మోడళ్ల ధరలు సుమారు రూ. 30వేల నుంచి రూ. 40వేల మేర పెరిగే అవకాశం ఉంది. గోల్డ్ లైన్ ఎడిషన్ డిజైన్స్ టూ కలర్స్ కాంబినేషన్ తో రూపొందించనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు