Telangana History | భాగ్యనగర్ రేడియోను ఎవరి నాయకత్వంలో నిర్వహించారు?
ఆగస్టు 2వ తేదీ తరువాయి..
522. కాకతీయుల రాజ లాంఛనం ఏది?
a) సింహం b) వరాహం
c) మీనం d) పర్వతం
జవాబు: (b)
వివరణ: దీన్ని కల్యాణి (పశ్చిమ) చాళుక్యుల నుంచి స్వీకరించారు.
523. కాకతీయులు దుర్జయ వంశం వారని, వెన్న భూపతి వీరి మూలపురుషుడని పేర్కొన్న శాసనం ఏది?
a) మాగల్లు శాసనం
b) చందుపట్ల శాసనం
c) మోటుపల్లి అభయ శాసనం
d) బయ్యారం చెరువు శాసనం
జవాబు: (d)
వివరణ: ఈ శాసనం గణపతిదేవుడి సోదరి మైలమ వేయించింది.
524. కాకతి పురాధినాథ, చోడక్ష్మాపాల చమూవార్ధి ప్రమదన అనే బిరుదులు ఎవరివి?
a) మొదటి బేతరాజు
b) మొదటి ప్రోలరాజు
c) రెండో బేతరాజు
d) రెండో ప్రోలరాజు జవాబు: (a)
525. సమధిగత పంచమహాశబ్ద, అరిగజ కేసరి అనేవి ఎవరి బిరుదులు?
a) మొదటి ప్రోలరాజు b) రెండో బేతరాజు
c) మొదటి రుద్రదేవుడు d) మహాదేవుడు
జవాబు: (a)
526. చలమర్తిగండ అనే బిరుదు ధరించిన మొదటి కాకతీయ పాలకుడు ఎవరు?
a) మొదటి బేతరాజు b) రెండో ప్రోలరాజు
c) రెండో బేతరాజు
d) మొదటి రుద్రదేవుడు జవాబు: (c)
527. కింది వాటిలో ఏది రెండో ప్రోలరాజు నిర్మాణం కాదు?
a) ముప్పిరినాథ దేవాలయం
b) వేయిస్తంభాల గుడి
c) సిద్ధేశ్వర దేవాలయం
d) పద్మాక్షి దేవాలయం జవాబు: (b)
వివరణ: వేయిస్తంభాల గుడిని రుద్రేశ్వరాలయం అని పిలుస్తారు. దీన్ని రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు) నిర్మించాడు.
528. కాకతీయుల కాలంలో గొప్ప రాజనీతి విశారదుడైన వైజ దండనాథుడు ఎవరి ఆస్థానంలో మంత్రిగా ఉన్నాడు?
a) రెండో బేతరాజు b) రెండో ప్రోలరాజు
c) గణపతిదేవుడు
d) మొదటి ప్రతాపరుద్రుడు
జవాబు: (a)
529. అనుమకొండలో జైన మునుల కోసం 1118 లో ‘కడలాలయ బసది’ని ఎవరు నిర్మించారు?
a) వైజ దండనాథుడు b) రుద్రమదేవి
c) మైలమ d) గణపాంబ
జవాబు: (c)
వివరణ: మైలమ రెండో ప్రోలరాజు దగ్గర మంత్రిగా ఉన్న బేతన భార్య.
530. రుద్రదేవుడి (మొదటి ప్రతాపరుద్రుడు) విజయాలను పేర్కొనే హనుమకొండ శాసన రచయిత ఎవరు?
a) శ్రీనాథుడు
b) ఇందులూరి అన్నయమంత్రి
c) తిక్కన d) అచితేంద్రుడు
జవాబు: (d)
వివరణ: 1163లో కల్యాణి చాళుక్యుల నుంచి రుద్రదేవుడు స్వతంత్రం ప్రకటించికున్నట్లు హనుమకొండ శాసనం వెల్లడిస్తుంది.
531. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో రుద్రదేవుడు ఎవరికి సైనిక సాయం చేశాడు?
a) నలగామరాజు b) మలిదేవరాజు
c) చాళుక్య వీరభద్రుడు
d) అయ్యవంశానికి చెందిన పినచోడుడు
జవాబు: (a)
532. రుద్రదేవుడు యాదవ జైత్రపాలుడి (జైతుగి)తో జరిగిన యుద్ధంలో మరణించాడని వివరించే గ్రంథం ఏది?
a) తిక్కన నిర్వచనోత్తర రామాయణం
b) గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం
c) హేమాద్రి చతుర్వర్గ చింతామణి
d) రుద్రదేవుడి నీతిసారం
జవాబు: (c)
వివరణ: చతుర్వర్గ చింతామణిలోని వ్రతఖండంలో ఈ వివరాలు ఉన్నాయి. హేమాద్రి పండితుడు యాదవుల ప్రధానమంత్రిగా పనిచేశాడు.
533. ఏ కాకతీయ పాలకుడికి ‘విద్యాభూషణ’ అనే బిరుదు ఉంది?
a) మొదటి ప్రతాపరుద్రుడు
b) గణపతిదేవుడు
c) రెండో ప్రోలరాజు
d) మొదటి బేతరాజు జవాబు: (a)
534. ఏ కాకతీయ పాలకుడి కాలంలో జైన, శైవ మత సంఘర్షణలు మొదలయ్యాయి?
a) రెండో ప్రోలరాజు b) రుద్రదేవుడు
c) మహాదేవుడు d) గణపతిదేవుడు
జవాబు: (b)
535. గణపతిదేవుడి తండ్రి మహాదేవుడికి శైవ మతదీక్షను ఇచ్చిన గురువు ఎవరు?
a) విశ్వేశ్వర శంభు
b) రామేశ్వర పండితుడు
c) పాల్కురికి సోమనాథుడు
d) ధ్రువేశ్వర పండితుడు జవాబు: (d)
536. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘భాగ్యనగర్ రేడియో’ పేరుతో రహస్య రేడియోను ఎవరి నాయకత్వంలో నిర్వహించారు?
a) స్వామి రామానందతీర్థ
b) పీవీ నరసింహారావు
c) పాగా పుల్లారెడ్డి d) మర్రి చెన్నారెడ్డి
జవాబు: (c)
వివరణ: ఈ రేడియోను కర్నూలు శిబిరం స్వాతంత్య్ర సమర యోధులు నిర్వహించారు. ఈ యంత్రాన్ని పాగా పుల్లారెడ్డి బొంబాయి నుంచి తీసుకువచ్చాడు. ప్రజల్లో వస్తున్న చైతన్యాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోయిన నిజాం ప్రభుత్వం ఈ రేడియో ప్రసారాలను నిలిపివేసింది. అయినా ప్రజలు రహస్యంగా వినేవాళ్లు.
537. భాగ్యనగర్ రేడియోను సమకూర్చి పెట్టిన ప్రముఖ సోషలిస్టు నాయకుడు ఎవరు?
a) జయప్రకాశ్ నారాయణ్
b) రాంమనోహర్ లోహియా
c) ఆచార్య నరేంద్రదేవ్
d) అచ్యుత్ పట్వర్ధన్ జవాబు: (d)
538. భాగ్యనగర్ రేడియో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రసారాలు చేసేది. వీటికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. తెలుగు ప్రసారాలు: సురవరం ప్రతాపరెడ్డి
2. ఉర్దూ ప్రసారాలు: నాగప్ప వకీలు
3. ఇంగ్లిష్ ప్రసారాలు: బుక్కపట్నం రామానుజాచార్యులు
4. వార్తా రచన: గొట్టిముక్కల కృష్ణమూర్తి
పై జతల్లో సరైనవాటిని గుర్తించండి?
a) 1 b) 2, 4 c) 1, 2, 3
d) 1, 2, 3, 4
జవాబు: (b)
వివరణ: తెలుగు ప్రసారాల నిర్వహణ గడియారం రామకృష్ణ శర్మ చూసుకోగా, ఉర్దూ ప్రసారాలను గద్వాలకు చెందిన టి.నాగప్ప వకీలు చూసుకునేవారు. ఇంగ్లిష్ ప్రసారాల బాధ్యత కమతం వెంకటరెడ్డి, వార్తల రచనను గొట్టిముక్కల కృష్ణమూర్తి చూసుకున్నారు.
539. బ్రిటిష్ వారిపై తిరుగుబాటులో రాంజీ గోండుకు సహకరించిన రోహిల్లా నాయకుడు ఎవరు?
a) హాజీ b) తుర్రేబాజ్ ఖాన్
c) జమేదార్ చిదాఖాన్
d) మీర్ ఫిదా అలీ జవాబు: (a)
540. నిజాం సైనికులతో జరిగిన పోరాటంలో గోండు వీరుడు కుమ్రం భీం ఎక్కడ మరణించాడు?
a) ఆదిలాబాద్ b) ఆసిఫాబాద్
c) జోడెఘాట్ d) మంచిర్యాల
జవాబు: (c)
541. నిజాం వ్యతిరేక పోరాటంలో గోండులకు అండగా నిలిచి, ప్రభుత్వ శిక్షకు గురైన తెలంగాణ కమ్యూనిస్టు నాయకుడు ఎవరు?
a) ఆరుట్ల రాంచంద్రారెడ్డి
b) రావి నారాయణరెడ్డి
c) వట్టికోట ఆళ్వారుస్వామి
d) బద్దం ఎల్లారెడ్డి జవాబు: (d)
వివరణ: సిరిసిల్ల మున్సిఫ్ కోర్టు ఎల్లారెడ్డికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.200 జరిమానా విధించింది.
542. హైదరాబాద్ రాజ్యంలో ఆదివాసుల స్థితిగతులను వివరిస్తూ ‘ట్రైబల్ హైదరాబాద్’ గ్రంథాన్ని రచించింది ఎవరు?
a) గులాం యాజ్దానీ
b) ప్రొఫెసర్ హైమన్డార్ఫ్
c) ఫాదర్ వొరియర్ ఎల్విన్
d) హుమాయూన్ కబీర్ జవాబు: (b)
543. హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించింది ఎవరు?
a) రుద్రదేవుడు b) గణపతిదేవుడు
c) మంత్రి గంగాధరుడు d) మైలమ
జవాబు: (c)
వివరణ: రుద్రదేవుడి దగ్గర గంగాధరుడు మంత్రిగా ఉన్నాడు. ఇతను బుద్ధ దేవాలయాన్ని నిర్మించినట్లు కూడా తెలుస్తుంది.
544. గణపతిదేవుడికి సంబంధించిన తొలి శాసనం ఏది?
a) మంథెన శాసనం
b) మోటుపల్లి శాసనం
c) కాంచీపురం శాసనం
d) బీదర్ శాసనం జవాబు: (a)
వివరణ: ఈ శాసనం క్రీ.శ. 1199 నాటిది. ఇందులో గణపతిదేవుడిని ‘సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య’ అని కీర్తించారు.
545. గణపతిదేవుడు యాదవుల దగ్గర బందీగా ఉన్నప్పుడు కాకతీయ రాజ్యాన్ని రక్షించింది ఎవరు?
a) కాయస్థ అంబదేవుడు
b) రేచర్ల రుద్రుడు
c) రేచర్ల ప్రసాదిత్యుడు
d) కాయస్థ జన్నిగదేవుడు
జవాబు: (b)
వివరణ: యాదవుల దగ్గరి నుంచి గణపతిదేవుడు విడుదలయ్యాక రేచర్ల రుద్రుడు ఆయనకే రాజ్యాన్ని అప్పగించాడు. దీంతో ఆయనకు ‘కాకతీయ రాజ్యభార ధౌరేయుడు’ అనే బిరుదు వచ్చింది.
546. గణపతిదేవుడి తీరాంధ్ర దండయాత్రలో కాకతీయ సేనలకు నాయకత్వం వహించింది ఎవరు?
a) రుద్రమదేవి b) రేచర్ల రుద్రుడు
c) గోన గన్నారెడ్డి
d) మల్యాల చౌండరాయలు
జవాబు: (d)
వివరణ: దివిసీమను జయించినందుకు గణపతిదేవుడు ముత్యాల చౌండరాయలకు ‘ద్వీపలుంటాక’, ‘దివిచూరకార’ అనే బిరుదులు ఇచ్చాడు. ఈ వివరాలు పెండేకల్లు శాసనంలో ఉన్నాయి.
547. కాకతీయ సైన్యాలు దివిసీమ మీద దండయాత్ర చేసినప్పుడు అక్కడి పాలకుడు ఎవరు?
a) అయ్యవంశపు పిన్నచోడుడు
b) జాయప సేనాని
c) చాళుక్య వీరభద్రుడు d) మలిదేవరాజు
జవాబు: (a)
వివరణ: పిన్నచోడుడి కుమార్తెలు నారమ, పేరమలను గణపతిదేవుడు వివాహం చేసుకున్నాడు.
548. విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ గణపతిదేవుడు 1244లో వేయించిన శాసనం ఏది?
a) ఘనపురం శాసనం
b) మచిలీపట్నం శాసనం
c) మోటుపల్లి శాసనం
d) ద్రాక్షారామం శాసనం జవాబు: (c)
వివరణ: ఈ శాసనంలో మోటుపల్లిని దేశీయక్కొండపట్టణం అని పేర్కొన్నారు.
549. మోటుపల్లి అభయ శాసనాన్ని అమలుపర్చడానికి గణపతిదేవుడు ఎవరిని నియమించాడు?
a) రేచర్ల ప్రసాదిత్యుడు b) గోన గన్నారెడ్డి
c) ముత్యాల చౌండరాయలు
d) సిద్ధయదేవుడు జవాబు: (d)
550. హనుమకొండ నుంచి కాకతీయ రాజధానిని ఓరుగల్లు (వరంగల్లు)కు ఎవరు మార్చారు?
a) రుద్రదేవుడు b) గణపతిదేవుడు
c) మహాదేవుడు d) రెండో ప్రోలరాజు
జవాబు: (b)
వివరణ: ఇది 1254లో జరిగింది.
551. గణపతిదేవుడి కాలంలో బాహత్తర నియోగాధిపతి (72 ప్రభుత్వ శాఖలమీద)గా ఎవరిని నియమించారు?
a) జాయప సేనాని b) గంగయ సాహిణి
c) సాహిణి మారన d) రేచర్ల రుద్రుడు
జవాబు: (b)
వివరణ: ఈ వివరాలను 1250 నాటి
త్రిపురాంతకం శాసనంలో నమోదు చేశారు.
552. గణపతిదేవుడి కాలం నాటి పాలనకు సంబంధించి కింది వివరాలను పరిశీలించండి.
1. గంగయ సాహిణి: గజదళం మీద పర్యవేక్షణ
2. జాయప సేనాని: అశ్వదళం మీద పర్యవేక్షణ
3. రేచర్ల రుద్రుడు: సైన్యాధిపతి
పై వాటిలో సరైనవి ఏవి?
a) 3 b) 1, 2
c) 2, 3 d) పైవన్నీ
జవాబు: (a)
వివరణ: గణపతిదేవుడి కాలంలో రేచర్ల రుద్రుడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. జాయప సేనాని గజసాహిణిగా, గంగయ సాహిణి
అశ్వసాహిణిగా సేవలందించారు.
553. తన శివదీక్షా గురువు విశ్వేశ్వర శంభుకు గణపతిదేవుడు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు?
a) కసింకోట b) ధరణికోట
c) గీసుకొండ d) కాండ్రకోట
జవాబు: (d)
554. 1262లో నెల్లూరు దగ్గర ముత్తుకూరు యుద్ధంలో గణపతిదేవుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు?
a) మనుమసిద్ధి
b) ప్రోలయ వేమారెడ్డి
c) జటావర్మ సుందరపాండ్యుడు
d) కులోత్తుంగ చోడుడు జవాబు: (c)
555. రుద్రమదేవికి వ్యతిరేకంగా ఆమె సవతి సోదరులు హరిహర, మురారిదేవులు తిరుగుబాటు చేసినట్లు పేర్కొంటున్న ఆధారం ఏది?
a) సిద్ధేశ్వర చరిత్ర
b) ఘనపురం శాసనం
c) పాలంపేట శాసనం d) ప్రతాపచరిత్ర
జవాబు: (d)
వివరణ: ప్రతాపచరిత్రను ఏకామ్రనాథుడు రచించాడు.
556. హరిహర, మురారిదేవుల తిరుగుబాటును రుద్రమదేవి ఎవరి సాయంతో అణచివేసింది?
a) రెండో ప్రతాపరుద్రుడు
b) రేచర్ల రుద్రుడు
c) రేచర్ల ప్రసాదిత్యుడు
d) ఇందులూరి అన్నయ జవాబు: (c)
వివరణ: ప్రసాదిత్యుడికి ‘కాకతీయ రాజ్య స్థాపనాచార్య’ అనే బిరుదు ఉంది.
557. రుద్రమదేవి చేతిలో ఓడిపోయిన యాదవ (శేవుణ) రాజు ఎవరు?
a) మురారిదేవుడు b) మహాదేవుడు
c) రామచంద్రదేవుడు d) శంకరదేవుడు
జవాబు: (b)
వివరణ: మహాదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమ బీదర్ కోటను ఆక్రమించుకుంది. అక్కడ ఒక శాసనం కూడా వేయించింది.
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు