IBPS PO, SO Preparation Plan | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
IBPS PO, SO Preparation Plan | బ్యాంకుల్లో ఖాళీల భర్తీ కోసం ఐబీపీఎస్ ఏటా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. వీటి ద్వారా క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్వో) పోస్టులను భర్తీ చేస్తారు. ఇందుకు ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించి దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉద్యోగులను నియమిస్తుంది. ఇప్పటికే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వెలువడింది. తాజాగా పీవో, ఎస్‌వోలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అభ్యర్థులు ఒకే ప్రిపరేషన్‌తో ఈ మూడు పోస్టులకు పోటీ పడవచ్చు. ఈ నేపథ్యంలో మూడు పరీక్షలకు ప్రిపరేషన్ ప్లాన్, పరీక్ష స్వరూపం తెలుసుకుందాం.
- క్లరికల్ ఎగ్జామ్ ప్రాంతీయ భాషల్లో రాసుకొనే వెసులుబాటు కల్పించగా, పీవో, ఎస్వో పరీక్షలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు.
ప్రిపరేషన్ - ఈ ఏడాది బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు ఐబీపీఎస్ నిర్వహించే మూడు కొలువులకు ఉమ్మడిగా ప్రిపేర్ కావాలి. క్లర్క్ కోసం బేసిక్స్, సింప్లిఫికేషన్స్పై పట్టు సాధించాలి. పీవో, ఎస్‌వోలకు హెచ్చు స్థాయి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సిలబస్ ఆధారంగా ఆయా విభాగాలను ఎంచుకొని చదివితే మంచి ఫలితం ఉంటుంది.
- స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కోసం లా ఆఫీసర్స్/ రాజభాష అధికారి మినహాయించి ఇతర ప్రత్యేకాధికారులకు ప్రిలిమ్స్ సిలబస్ సరిపోతుంది. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు సిలబస్ ఆధారంగా కామన్ టాపిక్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలి.
సబ్జెక్టులు
1) ఇంగ్లిష్ లాంగ్వేజ్ - ఇది ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉంటుంది.
ప్రిలిమ్స్ మెయిన్స్
క్లర్క్- 30 ప్రశ్నలు/30 మార్కులు 40/40
పీవో- 30/30 35/40
ఎస్వో- 50/25 50/25 - ఈ సెక్షన్లో వచ్చే అంశాలు కాంపిటీటివ్ ఇంగ్లిష్ తరహాలో ఉంటాయి. దీనిలో ముఖ్యంగా గ్రామర్ ఆధార ప్రశ్నలు- సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ ఫార్మేషన్, రీ అరెంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, వొకాబులరీ, క్లోజ్డ్ టెస్ట్, ఇడియమ్స్-ఫ్రేజెస్, సినానిమ్స్-యాంటానిమ్స్లతో పాటు రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా కీలకమైనవి.
- ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే రోజూ అన్ని టాపిక్స్‌పై గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఇంగ్లిష్ దిన పత్రికల్లో వచ్చే వొకాబులరీ, ఆర్టికల్స్‌ను క్రమం తప్పకుండా చదవాలి. ముఖ్యమైన అంశాలపై సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
2) న్యూమరికల్ ఎబిలిటీస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఈ సెక్షన్ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో వచ్చే కీలకమైన విభాగం.
- క్లరికల్ పరీక్షలో ఈ విభాగం ప్రిలిమ్స్‌లో న్యూమరికల్ ఎబిలిటీస్ అని, మెయిన్స్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని ఉంటుంది. పీవోలో ప్రిలిమ్స్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మెయిన్స్‌లో డేటా అనాలసిస్, ఇంటర్‌ప్రిటేషన్స్ అంశాలతో ఉంటుంది.
- న్యూమరికల్ ఎబిలిటీస్ కోసం బోడ్మాస్ పద్ధతి, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్, నంబర్ సిరీస్, హెచ్‌సీఎఫ్, ఎల్సీఎం వంటి క్యాలిక్యులేషన్స్ చాప్టర్లతో పాటు శాతాలు-నిష్పత్తులు, సరాసరి, లాభనష్టాలు, రేషియో-ప్రపోర్షన్స్, నంబర్ సిస్టమ్స్, పార్ట్నర్షిప్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ వంటి వాటిని బాగా చదవాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/ డేటా అనాలసిస్ కోసం అర్థమెటిక్ అంశాలైన శాతాలు, యావరేజెస్, నిష్పత్తి, లాభనష్టాలు, భాగస్వామ్యం, గణాంకాలు, సంభావ్యత, బీజగణిత-మెన్సురేషన్, సమయం-దూరం-వేగాలతో పాటు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ కూడా చదవాలి.
- డేటా అనాలసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లోని అన్ని విధానాలపై అవగాహన సాధించాలి. మెయిన్స్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్స్ నుంచి 40 నుంచి 50 శాతం మార్కులు కేటాయించారు. పీవో మెయిన్స్ 35 శాతం ప్రశ్నలు దీని నుంచే వస్తాయి. కాబట్టి ఈ విభాగంపై ఎక్కువ ఫోకస్ చేయాలి.
- ఈ విభాగంలో అధిక మార్కులు పొందడానికి అన్ని చాప్టర్లపై సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి చాప్టర్ నుంచి కనీసం 200 ప్రశ్నల వరకు ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3) రీజనింగ్ ఎబిలిటీస్ - బ్యాంక్ పరీక్షలకు రీజనింగ్ చాలా కీలకం. అనలిటికల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ వంటి హెచ్చు స్థాయి ప్రశ్నలు అధికంగా ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కామన్‌గా ఉండే అంశం కాబట్టి రీజనింగ్ సబ్జెక్టు కూడా ఉమ్మడిగా చదవాలి.
- రీజనింగ్‌లో పట్టు సాధించాలంటే ముందుగా ఇంగ్లిష్‌పై అవగాహన పెంచుకోవాలి. బ్యాంక్ రీజనింగ్‌లో చాలా వరకు కంటెంట్, కాన్సెప్ట్ ఆధార ప్రశ్నలే అధికం. ఈ సెక్షన్లో వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలైన ఆల్ఫాబెట్, లెటర్ నంబర్ సిరీస్, రక్త సంబంధాలు, క్యాలెండర్, క్లాక్స్, దిశలు, వర్గీకరణ, సారూప్యత, కోడింగ్-డికోడింగ్, సిలాజిసం, వెన్ చిత్రాలు మొదలైన వాటితో పాటు ఇతర హెచ్చుస్థాయి విభాగాలైన సీటింగ్ అరెంజ్మెంట్స్, పజిల్ టెస్ట్, ఇన్పుట్-అవుట్‌పుట్, డేటా సమృద్ధి వంటి అంశాలపై అవగాహన సాధించాలి.
- ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే రోజూ ఇంగ్లిష్ దినపత్రికలో వచ్చే ఎడిటోరియల్స్ చదవాలి. స్పీడ్ రీడింగ్ అండ్ అనలైజింగ్ వల్ల రీజనింగ్ సులువవుతుంది. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్‌లు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
4) కంప్యూటర్ నాలెడ్జ్ - ఇది క్లర్క్, పీవోలకు మెయిన్స్‌లో మాత్రమే వచ్చే అంశం. రీజనింగ్ విభాగంతో కలిపి ఉంటుంది. 10-15 ప్రశ్నలు వరకు వచ్చే అవకాశం ఉంది.
- ఈ విభాగం నుంచి బేసిక్స్, యాప్, కంప్యూటర్స్, జనరేషన్స్, ఇన్పుట్-అవుట్‌పుట్, కంప్యూటర్ పరికరాలు, సాఫ్ట్వేర్-హార్డ్‌వేర్, లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌లు, ఇంటర్నెట్, ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీలు, బ్యాంకుల్లో కంప్యూటర్ల వాడకం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వివిధ బ్యాంకుల మొబైల్ యాప్‌ల వంటివి చాలా కీలకం.
- దీనిలో అధిక మార్కులు సాధించాలంటే గత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి.
- స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ విభాగాన్ని తేలికగా తీసుకోకూడదు.
5. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్
- ఈ విభాగం మెయిన్స్‌లో మాత్రమే వచ్చే అంశం. 50 ప్రశ్నలకు 50 మార్కులు కేటాయించారు. సమయం 35 నిమిషాలు. ఎస్వోలోని లా ఆఫీసర్లకు ఈ విభాగం ప్రిలిమ్స్‌లో ఉంటుంది.
- క్లర్క్ కోసం ఈ విభాగం నుంచి బ్యాంకింగ్ అవేర్నెస్తో పాటు ఆర్థిక, వాణిజ్య అంశాలు కూడా కలిపి చదవాలి. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులను పరిశీలించాలి. ప్రధాన ఆర్థిక అంశాలైన జీడీపీ, పీసీఐ (తలసరి ఆదాయం), ఉత్పత్తి-వినియోగం, ధరస్థిరత్వం, కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం-పేదరికం, విదేశీ మారకద్రవ్యం, లావాదేవీలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, బ్రిక్స్, జీ7, జీ20 వంటి అంతర్జాతీయ సంస్థలు, వాటి నివేదికలు, సూచీలు, భారత్‌లో జీ20 నిర్వహణ వంటివి చదవాలి.
- కరెంట్ అఫైర్స్ కోసం లేటెస్ట్ న్యూస్ ఈవెంట్స్, ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి-తాత్కాలిక సభ్యదేశాలు, నాటో, ఎస్సీవో, బ్రిక్స్, క్వాడ్, ఆసియాన్, ఈఏఎస్, సూడాన్‌లో అత్యవసర పరిస్థితి, పాకిస్థాన్, శ్రీలకంలో అనిశ్చితి, కాప్15-2022, యూఎన్ బయోడైవర్సిటీ సదస్సు, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం, జియో ట్యాగ్స్-2022-23 వంటివి తెలుసుకోవాలి.
- బ్యాంకింగ్ అవేర్నెస్ కోసం బ్యాంకింగ్ వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. బ్యాంకు వ్యవస్థ చరిత్ర, వివిధ బ్యాంకింగ్‌లు, షెడ్యూల్డ్, కమర్షియల్ బ్యాంకుల విధి విధానాలు, భారత రిజర్వ్ బ్యాంక్ స్వరూపం, రెగ్యులేటరీ అంశాలు, వడ్డీరేట్లు, మానిటరీ పాలసీ, బ్యాంకుల విలీనాలు, రూ.2000 నోటు ఉపసంహరణ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- ఇందుకు రోజూ దినపత్రికలను చదువుతూ సొంత నోట్స్ రాసుకోవాలి.
- పరీక్షకు ముందు ఆర్బీఐ, ఆర్థిక శాఖ, సెబీ వెబ్సైట్లలో అప్డేట్స్ చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రిఫరెన్స్ బుక్స్
1) న్యూమరికల్ ఎబిలిటీస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- ఆర్ఎస్ అగర్వాల్
2) ఫాస్ట్‌ట్రాక్ అర్థమెటిక్స్- రాజేశ్ వర్మ
3) క్వికర్ మ్యాథ్స్- ఎం టైరా
4) ఇంగ్లిష్ గ్రామర్, కాంపోజిషన్- రెన్ అండ్ మార్టిన్
5) ఇంగ్లిష్ మేడ్ ఈజీ- నార్మన్ లెవిస్
6) ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్- ఎస్పీ బక్షి, రిచా శర్మ
7) రీజనింగ్ (వెర్బల్, నాన్ వెర్బల్)- ఆర్ఎస్ అగర్వాల్
8) అనలిటికల్ రీజనింగ్- ఎంకే పాండే
9) బ్యాంకింగ్ అవేర్నెస్- అరిహంత్ పబ్లికేషన్స్
10) కంప్యూటర్స్- అరిహంత్ పబ్లికేషన్స్ - మొత్తం ఖాళీలు: 4451 (ప్రొబేషనరీ ఆఫీసర్-3049, స్పెషలిస్ట్ ఆఫీసర్- 1402)
- ఖాళీలున్న బ్యాంకులు: బీవోబీ, కెనరా, ఐఓబీ, యూకో, బీవోఐ, సీబీఐ, పీఎన్బీ, యూబీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- ఎంపికం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్,
ఇంటర్వ్యూ ద్వారా - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఆగస్టు 21
- వెబ్సైట్: https://www.ibps.in/common- written-exam-cwe
మధు కిరణ్
డైరెక్టర్
ఫోకస్ అకాడమీ
హైదరాబాద్
9030496929
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు