Sociology – Group 2,3 Special | రాష్ట్రీయ సమవికాస్ యోజన లక్ష్యం?
సామాజిక సమస్యలు
1. సామాజిక వెలి
ఎ. సామాజిక వెలి ప్రపంచ సమాజాలన్నింటిలో ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది
బి. సామాజిక అసమానతల ఫలితమే సామాజిక వెలి
సి. సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారి రినె లియోధిర్ ఉపయోగించాడు
డి. సామాజిక వెలి అనే భావన మొదట దక్షిణ అమెరికాలో వెలుగులోకి వచ్చింది
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
2. సాపేక్ష అసమానతల స్థాయిని దేని ఆధారంగా లెక్కిస్తారు?
1) ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్
2) గినీ ఇండెక్స్
3) గ్లోబల్ ఈక్వాలిటీ ఇండెక్స్
4) ఏదీకాదు
3. సామాజిక అసమానత రూపం కానిది?
1) జాతి, కులం 2) వివక్ష
3) ఆర్థిక సమానత్వం
4) సామాజిక, ఆర్థిక దోపిడీ
4. సామాజిక వెలి వ్యక్తమయ్యే రూపం?
ఎ. వ్యక్తిగత స్థాయి బి. కమ్యూనిటీ స్థాయి
సి. సమాజ స్థాయి డి. ప్రాంతాల స్థాయి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
5. సామాజిక వెలి సమస్యకు పరిష్కారం కానిది?
1) అందరికి విద్య 2) అందరికి ఆరోగ్యం
3) పేదలకు గృహనిర్మాణం
4) బాలలకు ఉపాధి కల్పన
6. కింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి.
ఎ. 11వ ప్రణాళిక లక్ష్యం సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి
బి. 12వ ప్రణాళిక లక్ష్యం సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి
సి. సమ్మిళిత విధానానికి ఉదాహరణ జన్‌ధన్ యోజన, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
7. కులతత్వం అంటే?
ఎ. తమ కులం పట్ల అంధ విశ్వాసాన్ని కలిగి ఉండటం
బి. తమ కులం పట్ల ఏకపక్ష విశ్వాసాన్ని కలిగి ఉండటంతో పాటు ఇతర కులాల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉండటం
సి. అగ్ర కులాలన్నీ నిమ్న కులాలను అణిచివేతకు గురిచేయడం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
8. సఫాయి కార్మికులకు ఉపాధి, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణ నిషేధ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం?
1) 1992 2) 1993
3) 1994 4) 1995
9. ఉన్నత కులాలకు కూడా రిజర్వేషన్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో గుజరాత్లో తలెత్తిన ఉద్యమం?
1) బజరంగ్ ఆందోళన్
2) అనామత్ ఆందోళన్
3) జాట్ రిజర్వేషన్ ఆందోళన్
4) గుజ్జర్ రిజర్వేషన్ ఆందోళన్
11. ఒక మతాన్ని ఆచరించేవారు ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ విభాగంగా పరిగణించబడటంతో పాటు ఇతర కులాల పట్ల వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించే మనస్తత్వం?
1) మత వ్యతిరేక భావజాలం
2) మతతత్వం
3) మతపరమైన భావుకత
4) మతపరమైన వ్యతిరేకత
12. మతతత్వానికి కారణం?
ఎ. బ్రిటిష్ వలస పాలకులు అవలంబించిన విభజించు పాలించు సిద్ధాంతం
బి. మతపరమైన పవిత్రత, అపవిత్రత
సి. మతపరమైన ఉద్యమాల ప్రభావం
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) బి, సి
13. మతతత్వానికి పూర్తి భిన్నమైన భావన?
1) మత మౌఢ్యం 2) లౌకికవాదం
3) అలౌకిక వాదం 4) మతవాదం
14. జతపర్చండి.
ఎ. ముస్లింలీగ్ స్థాపన 1. 1909
బి. మింటో మార్లే సంస్కరణలు 2. 1915
సి. హిందూ మహాసభ 3. 1906
డి. ద్విజాతి సిద్ధాంతం- లాహోర్ సమావేశం 4. 1940
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
15. జాతీయ సమగ్రత మండలిని ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1960 2) 1961
3) 1962 4) 1963
16. భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
1) 41 2) 42 3) 43 4) 44
17. ప్రాంతీయ తత్వానికి కారణం కానిది?
1) భూమిపుత్రుల సిద్ధాంతం
2) చారిత్రక నేపథ్యం
3) రాజకీయపరమైన వివక్ష
4) వయస్సుపరంగా వివక్ష
18. రాష్ట్రీయ సమవికాస్ యోజన లక్ష్యం?
ఎ. ప్రాంతీయ అసమానతల తొలగింపు
బి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
సి. పేదరికం, నిరుద్యోగం నిర్మూలన
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) బి, సి
19. ప్రపంచ ఆరోగ్య సంస్థ మహిళలపై హింస ఎన్ని దశల్లో జరుగుతుందని పేర్కొంది?
1) 4 2) 5 3) 6 4) 7
20. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మహిళలపై హింస పరిధిలోకి రాని అంశం?
1) అత్యాచారాలు
2) వరకట్నపు హత్యలు
3) లైంగికపరమైన వేధింపులు
4) మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం
21. దేశంలో వరకట్న నిషేధ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1961, జూలై 1
2) 1961, ఆగస్టు 1
3) 1961, సెప్టెంబర్ 1
4) 1961, అక్టోబర్ 1
22. జతపర్చండి.
చట్టం సంవత్సరం
ఎ. గృహ హింస నిరోధక చట్టం 1. 2021
బి. నేర న్యాయ సవరణ చట్టం 2. 2013
సి. లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టం 3. 2012
డి. సరోగసీ (నియంత్రణ) చట్టం 4. 2005
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-3, సి-2, డి-4
23. కింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి.
ఎ. ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా భారతదేశంలో నమోదవుతున్నాయి
బి. భారతదేశంలో అత్యాచారాలు ఎక్కువగా తెలంగాణలో నమోదవుతున్నాయి
సి. భారతదేశంలో కిడ్నాప్‌నకు గురవుతున్న వారిలో ఎక్కువగా 15 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సువారు ఉంటున్నారు
డి. వివాహితుల కంటే అవివాహిత యువతులు ఎక్కువగా కిడ్నాప్‌నకు గురవుతున్నారు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
24. మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని పేర్కొంటున్న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్
1) 320 2) 322 3) 325 4) 326
25. పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ర్టాలు?
1) హర్యానా, గుజరాత్
2) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
3) హర్యానా, ఉత్తరప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్, బీహార్
26. కులాంతర వివాహాలను నిషేధించిన జాట్ కుల పంచాయతీ వ్యవస్థ?
1) ఖాప్ పంచాయతీ
2) జాట్ పంచాయతీ వ్యవస్థ
3) కట్టా పంచాయతీ వ్యవస్థ
4) కర్నాల్ పంచాయతీ వ్యవస్థ
27. ప్రపంచ ఆరోగ్య సంస్థ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ సౌత్ ఆఫ్రికన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఎక్కువ మంది మహిళలు హింసకు గురికావడానికి కారకులు?
1) తల్లిదండ్రులు 2) సోదరులు
3) భర్త 4) అక్కాచెల్లెళ్లు
28. గృహ హింస నిరోధక చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2006, సెప్టెంబర్ 26
2) 2006, అక్టోబర్ 26
3) 2006, నవంబర్ 26
4) 2006, డిసెంబర్ 26
29. నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2013, ఏప్రిల్ 3 2) 2013, మే 3
3) 2013, జూన్ 3 4) 2013, జూలై 3
30. మహిళా నేర బాధితుల సహాయ నిధిని 2015లో ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు?
1) రూ.50 కోట్లు 2) రూ.100 కోట్లు
3) రూ.150 కోట్లు 4) రూ.200 కోట్లు
31. స్టేట్మెంట్స్.
ఎ. నిర్భయ నిధిని రూ.1000 కోట్లతో ఏర్పాటు చేశారు
బి. మహిళల రక్షణకు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్ 182
సి. మహిళలపై హింసను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను సమీక్షించి అవసరమైన మార్పులను సూచించడానికి 2012, డిసెంబర్ 23న జేఎస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) బి, సి
32. దేశంలో మొదటిసారి నిర్భయ చట్టం ప్రకారం అత్యాచార నిందితునికి 22 ఏండ్ల జైలు శిక్ష విధించిన కోర్టు?
1) వరంగల్ జిల్లా కోర్టు
2) రంగారెడ్డి జిల్లా కోర్టు
3) మెదక్ జిల్లా కోర్టు
4) హైదరాబాద్ జిల్లా కోర్టు
33. జతపర్చండి.
ఎ. అంతర్జాతీయ బాలల దినోత్సవం 1. నవంబర్ 20
బి. అంతర్జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం 2. జూన్ 1
సి. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం 3. జూన్ 12
డి. అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 4. నవంబర్ 7
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-2, బి-4, సి-1, డి-3
34. స్టేట్మెంట్స్
ఎ. ప్రపంచ బాలకార్మికుల సంఖ్యలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది
బి. ప్రపంచ బాలకార్మికుల్లో భారతదేశం వాటా 25 శాతం
సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
35. జతపర్చండి.
ఎ. బాలకార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం 1. సిక్కిం
బి. బాలకార్మికులు ఎక్కువగా ఉన్న
కేంద్రపాలిత ప్రాంతం 2. లక్షద్వీప్
సి. బాలకార్మికులు తక్కువగా ఉన్న రాష్ట్రం 3. ఉత్తరప్రదేశ్
డి. బాలకార్మికులు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం 4. మహారాష్ట్ర
5. ఢిల్లీ
6. మహారాష్ట్ర
1) ఎ-1, బి-6, సి-5, డి-3
2) ఎ-3, బి-5, సి-1, డి-2
3) ఎ-4, బి-6, సి-5, డి-3
4) ఎ-5, బి-6, సి-4, డి-2
36. జతపర్చండి.
ఎ. అగ్గిపెట్టెలు 1. అలీగఢ్
బి. తివాచీ 2. కాంచీపురం
సి. చేనేత 3. శివకాశి
డి. గనులు 4. జమ్మూకశ్మీర్
ఇ. తాళాలు 5. మేఘాలయ
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
3) ఎ-3, బి-4, సి-2, డి-5, ఇ-1
4) ఎ-4, బి-5, సి-3, డి-2, ఇ-1
10. జతపర్చండి?
శాస్త్రవేత్త కులతత్వ నిర్మూలన
ఎ. ఎంఎన్ శ్రీనివాస్ 1. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం
బి. ఐరావతి కార్వే 2. నిమ్న కులాలకు ఉచిత విద్య, ఓటు హక్కు కల్పన
సి. జీఎన్ ఘర్యే 3. కులాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సమానత్వాన్ని
కల్పించడం
డి. వీకేఆర్ రావు 4. వ్యక్తులు కులానికి వెలుపల తమ
అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని కల్పించడం
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
సమాధానాలు
1-1, 2-2, 3-3, 4-4, 5-4, 6-4, 7-2, 8-2, 9-2, 10-3, 11-2, 12-2, 13-2, 14-3, 15-3, 16-2, 17-4, 18-3, 19-2, 20-4, 21-1, 22-2, 23-4, 24-4, 25-3, 26-1, 27-3, 28-2, 29-1, 30-4, 31-2, 32-3, 33-4, 34-3, 35-2, 36-3.
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు