Social Progress Index | దివ్యాంగుల హక్కుల పరిరక్షణ – బాలల సంరక్షణ
సామాజిక పురోగతి సూచిక ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. లేదా సామాజిక పురోగతి సూచిక గురించి రాయండి?
- సామాజిక పురోగతి సూచిక (Social Progress Index-SPI) అనేది 2012లో స్థాపించిన అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ. ఇది సామాజిక, పర్యావరణ పనితీరును అంచనా వేసే బహుళ సూచిక. దీనిలో కింది మూడు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.
1) ప్రాథమిక మానవ అవసరాలు/ కనీస అవసరాలు
2) శ్రేయస్సు పునాదులు
3) అవకాశం - అమర్త్యసేన్, డగ్లస్ నార్త్, జోసెఫ్ స్టిగ్లిట్జ్ ఆధారంగా సామాజిక పురోగతులను అంచనా వేస్తున్నారు. సామాజిక పర్యావరణ ప్రభావాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. అంతేకాని ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోరు. సంక్షేమం, ఆరోగ్యం, నివాసం, పారిశుద్ధ్యం అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
1) సంక్షేమం, 2) సమానత్వం,
3) సమ్మిళితం, 4) సుస్థిరత,
5) వ్యక్తిగత స్వేచ్ఛ, 6) భద్రత అనే ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. - ఆర్థిక అసమానతలను నిర్ధారించే కారకాలు, పురోగతిని ఏ విధంగా సాధించవచ్చనే అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. వీరు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని పరిశోధకులతో చర్చించి ఈ సూచికను రూపొందిస్తున్నారు.
గమనిక: 2022లో భారతదేశం 110వ ర్యాంకు (169 దేశాలకు)లో ఉంది.
ప్రపంచ బ్యాంక్ ప్రకారం భారతదేశంలోని ప్రతి 12 కుటుంబాల్లో ఒక వ్యక్తి వైకల్యంతో జీవిస్తున్నాడు. భారతదేశంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? - ప్రపంచ జనాభాలో ఒక బిలియన్ (15 శాతం) మంది వైకల్యంతో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దివ్యాంగుల సమస్యల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది (2.21 శాతం) దివ్యాంగులు ఉన్నారు.
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చర్యలు
1) ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వికలాంగుల పూర్తి భాగస్వామ్యం, సమానత్వం ప్రకటన-2000
2) వికలాంగుల హక్కులపై యూఎన్ కన్వెన్షన్-2008 లపై భారతదేశం సంతకం చేసింది
3) ది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్-1992
4) ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ యాక్ట్-1999
5) మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం- 2017
6) ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్-2016 చట్టం అదనంగా 14 రకాల వైకల్యాలను గుర్తించింది. ప్రస్తుతం మొత్తం 21 రకాల వైకల్యాలు గల వారికి రక్షణలు కల్పిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్, విద్యాసంస్థల్లో ప్రవేశానికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది.
7. 2022 నాటికి 2.5 మిలియన్ల మంది వికలాంగులకు నైపుణ్యాభివృద్ధి కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక
8. దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస్ పథకం
- ఒకవేళ 2016 పీడబ్ల్యూడీ చట్టం లోపాల గురించి అడిగితే కింది అంశాలు రాయాలి.
1) ప్రైవేటు సంస్థల్లో ఉపాధిలో వివక్ష నిబంధనలు లేవు.
2) కమిటీల్లో వికలాంగులు ఉండాలని తప్పనిసరి లేదు.
3) మానసిక ఆరోగ్యం- వైద్య విధానాల గురించి అంతగా సదుపాయాలు లేవు.
4) యూనివర్సిటీల్లో దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లలో 84 శాతం ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సమాన శ్రద్ధ, గౌరవ హక్కును కలిగిన ఉండేలా చర్యలు తీసుకుని సీట్లను భర్తీ చేయాలి.
నూతన జువైనల్ చట్టాన్ని 2015 చట్టంతో పోలుస్తూ, పరిశీలించడి? సూచనలు చేయండి? - సలహాలు
- 1) పారదర్శకత కోసం రికార్డులు సరిగా నిర్వహించాలి.
- 2) అధికారులకు సరైన శిక్షణ ఇవ్వాలి.
- 3) అనుభవజ్ఞులను, ఎన్జీవోలను అనుసంధానం చేసుకుంటూ ఉండాలి.
- 4) అంతర్జాతీయ బాలల హక్కులు, నిబంధనలు అమలు చేసే విధంగా చట్టాల్లో మార్పులు తేవాలి.
- విమర్శలు
- 1) డీఎంలకు అధికారాలు కేంద్రీకృతం కావడం వల్ల, అధిక పనిభారం వల్ల తీసుకునే చర్యలు ఆలస్యం కావచ్చు.
- 2) డీఎంలకు సరైన అవగాహన ఈ చట్టంలోని అంశాలపై న్యాయమూర్తులు ఉన్నతంగా ఉండకపోవచ్చు.
- ముగింపు
- ఈ విధంగా నాన్ కాగ్నిజబుల్ ఉండటం వల్ల వీరిని అనవసర కేసులు, మోసపూరిత నేరారోపణల నుంచి రక్షించవచ్చు. నూతన చట్టం సమస్యల పరిష్కారాలను సులభం చేసింది, జిల్లా కలెక్టర్ల పరిధిని, అధికారాలను విస్తృతం చేసింది. వారికి స్పష్టతను కలిగించి వారి నిర్ణయాధికారాలను పెంచింది.
ప్రస్తుతం బాలల దత్తత (సీఏఆర్ఏ), అనాథ బాలల స్థితి ఏ విధంగా ఉంది? వారి సంరక్షణ కోసం తీసుకున్న పథకాలు తెలియజేయండి?
ప్రస్తుత పరిస్థితి
1) 2020, 2021లలో చాలా తక్కువ మంది దత్తత తీసుకోబడినవారు
2) 2013 నుంచి 2021 వరకు 3,559 మంది బాలలు దత్తత తీసుకోబడినవారు
3) కొవిడ్-19 సమయంలో 1.53 లక్షల మంది అనాథలయ్యారు.
4) అంతర్జాతీయ దత్తతలు 417 (2020-21), 628 (2010-11)
5) కొవిడ్-19 వల్ల దత్తత తీసుకునే వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది.
6) 1956 హిందూ దత్తత, నిర్వహణ చట్టం ప్రకారం దత్తత ఇచ్చే సంస్థలతో సంబంధం లేకుండా తీసుకోవచ్చు.
7) ఎక్కువ వయస్సు, వికలాంగత్వం గల వారిని తీసుకోవడం లేదు.
8) ఆడపిల్లలను ఎల్జీబీటీ లకు, ఒంటరి పురుషులకు దత్తత ఇవ్వడం లేదు.
9) 2021 చట్టం ప్రకారం డీఎంలు/ జిల్లా కలెక్టర్లకు దత్తత చట్టం బాధ్యతలను అప్పగించింది. 2021 చట్టంలో ఎన్వోసీ (నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్), దత్తత హెచ్ఏఎంఏ (హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్)- 1956 ప్రకారం ఇవ్వాలి. ఇది సీఏఆర్ఏ ఇస్తుంది. - పథకాలు
1) మిషన్ వాత్సల్య: తప్పిపోయిన, అనాథ, దొంగిలించిన, సరెండర్ అయిన పిల్లలను రక్షించడం (మహిళా శిశు శాఖ).
2) సీఏఆర్ఐఎన్జీఎస్ (చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్) దత్తత విధానాలు, నిర్వహణ కోసం నూతన పథకం వచ్చింది.
3) చైల్డ్ కేర్ సెంటర్ (సీసీసీ)లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
బి. పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ,
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ, కనిష్క, ఏకేఎస్,
ప్రభుత్వ స్టడీ సర్కిల్
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు