Science & Technology | వైపరీత్యాల సంసిద్ధత .. ఇస్రో మద్దతు
విపత్తు నిర్వహణ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థల పాత్ర
ఆగ్నేయాసియా ప్రాంతం అంతటిలో మనదేశంలోనే ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. మనదేశంలోని మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 85 శాతం ఏదో ఒక విధమైన ప్రకృతి వైపరీత్యానికి గురయ్యే అవకాశం ఉంది. మొత్తం పండించే భూమిలో 68 శాతం ప్రాంతంలో కరువులు, 58 శాతం భూకంపాలు, 8 శాతం భూభాగం తుఫానులు, 12 శాతం భూభాగంలో వరదలు, 15 శాతం భూభాగంలో భూపాతాలు వంటి దుర్బలత్వ ప్రాంతంలో ఉంది.
- ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాల విషయంలో ముందుగా తగిన హెచ్చరికలు చేయడానికి, నివారణ, సంసిద్ధత, ఉపశమన, పునరావాస, పునర్ నిర్మాణ చర్యలు తీసుకునేందుకు, వాటి ప్రభావాన్ని నష్టాన్ని అంచనా వేయడానికి త్వరగా సమాచార వ్యాప్తి బదిలీ చేయడానికి రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థలు అందించే సేవలు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి.
ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టింది. వాటిలో ముఖ్యమైనవి.
1) రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ మిషన్ ఫర్ అగ్రికల్చర్
2) డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మానిటరింగ్ సిస్టం
3) రియల్ టైమ్ ఫ్లడ్ మానిటరింగ్ పథకాలు - వీటిని1987-1997 మధ్యకాలంలో జరిగిన 7వ, 8వ పంచవర్ష ప్రణాళిక కాలం లో అమలుపరిచారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, మంచు పరిమాణం, మేఘాల అధ్యయనాలు, సముద్రపు గాలులు, ఉష్ణ, శీతలవాయు గమనాలు మొదలైన వాటిని గురించి సమాచారాన్ని అందివ్వటం ద్వారా మన దేశంలో వర్షపాతానికి ఆధారమైన రుతుపవనాల పోకడలను ముందుగానే ఊహించి కరువు ప్రాంతాలపై వాటి ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా కరువు నివారణాచర్యలు తీసుకొనవచ్చు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల్లో వాడుతున్న మల్టీపుల్ రిగ్రెషన్ మోడల్(ఎం.ఆర్.ఎం), ఆటో రిగ్రెషన్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ ఏవరేజ్ (ఎ.ఆర్.ఐ.ఎం.ఎ)లు కరువు ప్రమాద సూచనలను బాగా మెరుగ్గా అందిస్తున్నాయి. వరదల నివారణలో కూడా ఈ సమాచారం చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అగ్నిప్రమాదాలు, భూకంపాలు సంభవించిన ప్రదేశాల్లో గల్లంతైన నివాస ప్రాంతాలను తిరిగి గుర్తించడానికి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఉపయోగించవచ్చు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న లాతూర్‌లో జరిగిన భూకంప సమయంలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు చాలా ప్రయోజనాలను కలిగించాయి. అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను గుర్తించి నివారించడంలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.
విపత్తు నిర్వహణలో శాస్త్ర సాంకేతికత పాత్ర
- భారతదేశం బృహత్తరమైన భారీ అంతరిక్ష ఇంమేజింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. గడిచిన దశాబ్దంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) భూపాతాలు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల మ్యాపింగ్‌కు అనేక కార్యక్రమాలను ప్రాజెక్టులను ముందుకు తెచ్చింది. ఇందులో కీలకమైనవి.
- విపత్తు నిర్వహణ మద్దతు కార్యక్రమం
- జాతీయ వ్యవసాయ కరువు మదింపు, పర్యవేక్షణ వ్యవస్థ
- కార్చిచ్చుల మానిటరింగ్‌కు ఇన్ఫ్రాస్
- భూ వినియోగం మొదలైన వాటికి సంబంధించి భువన్, భూ సంపద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్
(ఐఐఆర్ఎస్) - దీన్ని డెహ్రడూన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కింద పనిచేస్తుంది. సహజ వనరులు, పర్యావరణ విపత్తు నిర్వహణకు సంబంధించి రిమోట్ సెన్సింగ్ జియో ఇన్ఫర్మాటిక్స్, జీపీఎస్ టెక్నాలజీలో సుశిక్షితులైన నిపుణులను రూపొందించేందుకు ఐఐఆర్ఎస్ను ఒక ప్రాథమిక శిక్షణ విద్యా సంస్థగా ఏర్పాటు చేశారు.
- ఇంతకు ముందు ఇండియన్ ఫొటో ఇంటర్ ప్రిటేషన్ ఇన్స్టిట్యూట్గా 1966లో నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏరోస్పేస్ సర్వే అండ్ ఎర్త్ సైన్స్ సహకారం తో దీన్ని స్థాపించారు. మొత్తం దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతంలో ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
- ఈ సంస్థ ప్రాంగణంలోనే ఐక్యరాజ్య సమితికి చెందిన సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఆసియా అండ్ ది పసిఫిక్ (సీఎస్ఎస్టీఈఏపీ).
- ప్రధాన కార్యాలయం కూడా ఉంది. దీన్ని 1995లో ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ అయిన ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఎస్ఆర్ఎస్) ప్రధాన కార్యాల యం కూడా ఇందులోనే ఉంది.
ఇస్రో విపత్తు నిర్వహణ మద్దతు కార్యక్రమం
- ఇస్రో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో సహజ విపత్తుల సమర్థవంతమైన నిర్వహణకు కావలసిన డేటాను, సమాచారాన్ని అందిస్తుంది.
- కమ్యూనికేషన్ వాతావరణానికి సంబంధించిన భూస్థిర కక్ష్య శాటిలైట్లు భూ పర్యవేక్షిత, భూ పరిశీలన శాటిలైట్లు, ఏరియల్ సర్వే సిస్టమ్స్ అన్నీ కలిపి విపత్తు నిర్వహణకు అవసరమైన పరిశీలన వ్యవస్థలకు కీలక అంశంగా పనిచేస్తున్నాయి.
- హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్.ఆర్.ఎస్.సి) వరదలు, తుఫాన్లు, వ్యవసాయ కరువు, భూపాతాలు, భూకంపాలు, కార్చిచ్చు (అడవులు తగలబడటం)వంటి ప్రకృతి విపత్తులను పర్యవేక్షించే పనిలో నిమగ్నమై ఉంది. అంతరిక్షంలోని ఏరోస్పేస్ సిస్టమ్‌ల ద్వారా వచ్చిన సమాచారాన్ని సంబంధిత అధికారులు లేదా వ్యవస్థలకు సకాలంలో పంపడం ద్వారా సత్వరమే నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించడం జరుగుతుంది.
- శాటిలైట్ ఇమేజరీ ద్వారా అందించే సమాచారం విపత్తు నిర్వహణ వలయంలోని అన్ని దశల(సంసిద్దత, ముందస్తు హెచ్చరిక, ప్రతిస్పందన, ఉపవమన, పునరావాస చర్యలు)కు సంబంధించిన అవసరాలను తీరుస్తుంది.
వరదలు - వరద ప్రభావిత ప్రాంతాల పరిధిని తెలుసుకోవడానికి శాటిలైట్ ఆధారిత ఇమేజరీలు (చిత్రాలు) అత్యుత్తమ సాధానంగా ఉపయోగపడతాయి.
- వరదలు ముంచెత్తిన ప్రాంతాలు వరదలు రాని ప్రాంతాల మ్యాపులను వేర్వేరు రంగులతో చిత్రించి, వాటిని సంబంధిత కేంద్ర/ రాష్ట్ర ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. వరద ప్రభావం అధికంగా ఉండే వేర్వేరు ప్రాంతాల చారిత్రక డేటా ద్వారా వరద వైపరీత్య జోనేషన్ను రూపొందించడం జరుగుతుంది. ఈ విధంగా అసోం, బీహార్, రాష్ర్టాలకు జిల్లాస్థాయి వైపరీత్య అట్లాస్‌లను తయారు చేశారు.
తుఫాను - తగు నమూనాలు శాటిలైట్ డేటా సహకారంతో తుఫాను ప్రయాణించే మార్గం తీవ్ర, భూమిని తాకే ప్రదేశాన్ని అంచనా వేయడానికి భారత వాతావరణ శాఖకు ఇస్రో సేవలందిస్తోంది. తుఫాను ఏర్పడిన తర్వాత అది పయనించే మార్గాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్లో అభివృద్ధి చేసిన ఒక గణిత నమూనాను ఉపయోగించి ప్రయోగంగా ప్రాతిపదికగా నిరంతరం పర్యవేక్షిస్తూ అంచనా వేయాలి.
- ఓషన్‌శాట్-2 స్కాటరోమీటర్ డేటా నమూనాల ద్వారా రూపొందించిన గాలి ప్రవాహతీరును బట్టి అల్పపీడనం తుఫానుగా మారకముందే తుఫాను దిశను అంచనా వేయడం జరుగుతుంది.
కరువు - ఖరీఫ్ సీజన్లో(జూన్ నుంచి నవంబర్ వరకు) రాష్ట్ర/ జిల్లా/ మండల స్థాయిలో కరువు సంభవించడం, తీవ్రతస్థాయి, అది కొనసాగిన కాలాన్ని అంచనా వేయడానికి కోర్సు రిజల్యూషన్ శాటిలైట్ డేటాను ఉపయోగిస్తారు.
కార్చిచ్చు - భారతదేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 55శాతం ప్రాంతానికి అగ్ని ప్రమాదం పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా కార్చిచ్చుల వల్ల సంవత్సరానికి రూ. 440 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.
- కార్చిచ్చులను శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా కనిపెట్టి సమాచారాన్ని రోజూ ఇండియన్ ఫారెస్ట్ ఫైర్ రెస్పాన్స్ అండ్ అసెన్మెంట్ వెబ్సైట్ కార్చిచ్చులు సంభవించే ఫిబ్రవరి -జూన్ కాలంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
భూపాతాలు - స్థానిక, ప్రాంతీయ స్థాయిలో ల్యాండ్సైడ్ ఇన్వెంటరీ మ్యాపింగ్‌కు రిమోట్ సెన్సింగ్ డేటా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించడమైంది. దీన్ని లిథాలజీ, జియోలాజికల్ స్ట్రక్చర్ జియోమార్ఫాలజీ, ల్యాండ్ యూజ్/ ల్యాండ్ కవర్, డ్రైనేజ్, భూపాత శిథిలం మొదలైన వాటికి సంబంధించిన మ్యాపుల రూపకల్పనకు ఉపయోగిస్తారు.
- అంతరిక్షశాఖ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హిమాలయాలు షిల్లాంగ్-సిల్చార్-ఐజ్వాల్ సెక్టార్లలో పర్యాటక యాత్రాస్థలాలతోపాటు భూపాత వైపరీత్య జోనేన్ మ్యానబీపులను కూడా రూపొందించింది.
భూకంపాలు - విపత్తు మిగిల్చిన ఆనవాళ్ల నుంచి రిమోట్ సెన్సింగ్ జీఐఎస్ అందించిన డేటా బేస్‌ను ఇతర జియోలాజికల్, ట్రోపోగ్రాఫికల్ డేటాబేస్‌తో కంబైన్ చేసి ఒక వైపరీత్య మ్యాప్‌ను రూపొందిస్తారు.
విపత్తు సంసిద్దతలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర
- విపత్తు సంసిద్దతలకు ఒక సంక్లిష్టమైన సహజ సామాజిక, ఆర్థిక వ్యవస్థల ఇంజినీరింగ్, పలు రకాల ప్రాథమిక అంశాలతోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల సహాయం కూడా అవసరమవుతుంది. విపత్తు సంసిద్ధత నిర్వహణలో దిగువ అంశాలు ఉంటాయి.
1) సమాచార విశ్లేషణ
2) విశ్లేషణ, నిర్ధారణ
3) విపత్తును గుర్తించడం
4) హెచ్చరికను ప్రచారం చేయడం
5) విపత్తు మానిటరింగ్
6) రక్షణ సహాయక చర్యలు
7) విపత్తు అనంతర పునరుద్ధరణ
8) పునర్నిర్మాణం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాత్ర - విపత్తుల ప్రభావాలను తగ్గించడం, విపత్తులను ఉపశమింప చేయడంలో ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందింప చేయడం కోసం సమాచారం, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని యోకోహమా డిక్లరేషన్ 1994లో నొక్కి చెప్పింది.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం వివిధ ప్రాంతాలు, వివిధ శాఖల్లో ఉన్న కంప్యూటర్లను అనుసంధానం చేయడం కోసం లోకల్ ఏరియా నెట్వర్క్(ఎల్.ఎ.ఎన్), వైడ్ ఏరియా నెట్వర్క్స్ (డబ్ల్యు.ఎ.ఎన్) సౌకర్యాన్ని కల్పించింది.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విపత్తు వలయంలోని అన్ని దశల్లో సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.
- విపత్తు నిర్వహణకు సంబంధించిన కమ్యూనికేషన్‌ను నాలుగు వేర్వేరు స్థాయిల్లో వర్గీకరించారు. అవి.
1) విపత్తు నిర్వహణలో పాల్గొనే నిపుణులు, విపత్తు నిర్వహణపై పరిశోధన చేసే వారి మధ్య కమ్యూనికేషన్
2) విపత్తు నిర్వహణలో పాలుపంచుకుంటున్న సంస్థలు, ఏజెన్సీల మధ్య కమ్యూనికేషన్
3) విపత్తులకు బాధితులయ్యే వారికి అవగాహన కల్పించేందుకు విపత్తు సంసిద్ధతలో కమ్యూనికేషన్ సాధనాలు
4) విపత్తులకు బాధితులు కాని ప్రజలకు విపత్తుపై అవగాహన కల్పించే కమ్యూనికేషన్ సాధనాలు
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు