Postal System | తపాలా వ్యవస్థ
తపాలా వ్యవస్థ
- ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా మనదేశం గుర్తింపు పొందింది.
- 1766 రాబర్ట్ ైక్లెవ్ మనదేశంలో తొలిసారిగా పోస్టల్ వ్యవస్థను ప్రారంభించారు.
- 1774 వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు.
- 1837లో కలకత్తా, మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీల్లో ఒకే రకమైన తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు.
- 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్డాక్ అనే తపాలా బిళ్లను కరాచీలో విడుదలచేశారు.
- ప్రపంచంలో తొలి తపాలా బిళ్లగా పెన్నిబ్లాక్ను బ్రిటన్లో విడుదల చేశారు.
- 1854-పోస్టాఫీస్ చట్టాన్ని 1954 అక్టోబర్ 1న చేశారు. పోస్టల్ విభాగం ఏర్పాటు చేశారు.
- 1876లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో మనదేశం చేరింది.
- 1880లో ‘మనీఆర్డర్ సర్వీస్’ ప్రారంభమైంది.
- 1884లో పోస్టాఫీసుల్లో బీమా సౌకర్యం కల్పించారు.
- 1911లో అలహాబాద్- నైనిటాల్ మధ్య తొలిసారిగా ఎయిర్ మెయిల్ ప్రారంభమయ్యింది.
- 1949లో పోస్ట్, టెలిగ్రాఫ్ బోర్డు ప్రారంభం
- 1964లో ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్లో చేరింది.
- 1972లో పిన్కోడ్ ఆధారిత బట్వాడా ప్రారంభమైంది.
- 1986లో నేషనల్ స్పీడ్ పోస్ట్ (ఈఎంఎస్) సేవలు ప్రారంభమయ్యాయి.
- 1990లో పోస్టాఫీసుల్లో కంప్యూటరీకరణ ప్రారంభమయ్యింది.
- 1994లో ఎక్స్ప్రెస్ పార్సిల్ సర్వీసు ప్రారంభమైంది.
- 1995లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభించారు.
- 1998లో శాటిలైట్ పోస్ట్ ప్రారంభమైంది.
- 2001లో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు ప్రారంభమయ్యాయి.
- 2004, అక్టోబర్ 1తో భారత తపాలా వ్యవస్థ 150 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ-పోస్ట్ సేవలను ప్రారంభించారు.
- 2009లో ‘ప్రాజెక్ట్ యూరో’ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం తపాలా శాఖలో టెక్నాలజీ ఆధారిత సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడం.
- 2013లో టెలిగ్రాఫ్ సేవలను జూలై 14 నుంచి పూర్తిగా రద్దు చేశారు.
- తపాలా సేవలను సత్వరం అందించడానికి కొన్ని ప్రత్యేక ఛానళ్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా బట్వాడా చేయడం ప్రారంభించారు.
- దేశంలో మెట్రోనగరాలైన ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ మధ్య బట్వాడాకు మోట్రో ఛానల్ సర్వీసులను ప్రారంభించారు. ఈ ఛానల్ కోసం ప్రత్యేకంగా ‘నీలం రంగు’ తపాలా పెట్టెలను ఏర్పాటు చేశారు.
- ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు చేసే బట్వాడా రాజధాని ఛానల్ ద్వారా జరుగుతుంది. ఈ ఛానల్ కోసం పసుపు రంగు తపాలా పెట్టెలను ఏర్పాటు చేశారు.
- గ్రీన్ ఛానల్ ప్రధాన నగరాల్లో స్థానికంగా బట్వాడా చేస్తారు. అందుకు ఆకుపచ్చ తపాలా పెట్టెలను ఉంచుతారు
- బిజినెస్ ఛానల్ ద్వారా కేవలం వ్యాపార సంబంధిత ఉత్తరాలు, ఇతర బిల్లులు బట్వాడా చేస్తారు.
- నెలలో, వారంలో, ఒకసారి వెలువడే న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు వంటి బట్వాడా కోసం పీరియాడికల్ ఛానల్ను వాడతారు.
- కేవలం మనీ ఆర్డర్లు, ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడానికి ఉద్దేశించినది ఉపగ్రహ ఛానల్. దీనివల్ల మనీ ఆర్డర్లు సులభతరం, వేగవంతం అవుతాయి.
- బల్క్ మెయిల్ ఛానల్ను రిజిస్టర్, బిజినెస్ ఉత్తరాల కోసం ఉపయోగిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు