POLITY | మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ?
పాలిటీ
32. సర్పంచ్ విధులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు
2) ఉప సర్పంచ్ పదవి ఖాళీ అయితే 30 రోజుల్లో కొత్త వారిని ఏర్పాటు చేస్తాడు
3) గ్రామ రికార్డులను తనిఖీ చేస్తాడు
4) గ్రామ పంచాయతీలో ఇతడు ఏక ఛక్రాధిపత్యం వహిస్తాడు
33. గ్రామ పంచాయతీ విధి కానిదేది?
1) 29 విధులను గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది.
2) వివాహ సమస్యలను పరిష్కరిస్తుంది
3) వీధి దీపాలను ఏర్పాటు చేస్తుంది
4) జనన మరణాలను నమోదు చేస్తుంది
34. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు కానివారు?
1) జిల్లా కలెక్టర్
2) ఆ మండల పరిషత్‌లోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు
3) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
4) జిల్లా పరిషత్ చైర్మన్
35. స్థాయీ సంఘాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) ప్రతి జిల్లాలో 7 స్థాయీ సంఘాలు ఉంటాయి
2) స్త్రీ సంక్షేమ స్థాయిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది
3) స్థాయీ సంఘాల సమావేశాలకు జిల్లా కలెక్టర్ హాజరవుతాడు
4) స్థాయీ సంఘాలకు పెసా చట్టం వర్తిస్తుంది
36. కింది వాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) 74వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగర సంస్థల గురించి తెలుపుతుంది
2)1687లో బ్రిటిష్‌వారు మద్రాస్‌లో మొదటి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు
3) దేశవ్యాప్తంగా 8 రకాలైన పట్టణ స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి
4) 1885లో రిప్పన్ స్థానిక సంస్థల తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు
37. 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) 9(A) 243 ప్రకరణలో 243(P)-243(ZG) వరకు 74వ రాజ్యాంగ సవరణ గురించి పేర్కొన్నారు
2) ఇది 1992లో అమలులోనికి వచ్చింది
3) ఈ సవరణ దేశవ్యాప్తంగా 1993 జూన్ 1న అమల్లోకి వచ్చింది
4) ఈ సవరణ జమ్ము-కశ్మీర్‌కు వర్తిస్తుంది
38. కింది సవరణల్లో సరికాని వాక్యాన్ని రాయండి?
1) 243(Q) మున్సిపాలిటీల నిర్మాణం
2) 243(S) వార్డుల నిర్మాణం
3) 243(V) అనర్హతలు
4) 243(T) ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
39. కింది సవరణల్లో సరికాని వాక్యాన్ని రాయండి?
1) 243(U) పదవీ కాలం
2) 243(W) అధికార విధులు
3) గ్రామ పంచాయతీలకు 18 విధులు కేటాయించారు
4) నగర పంచాయతీలకు 18 విధులు కేటాయించారు
40. కింది నిబంధనల్లో సరికాని వాక్యాన్ని రాయండి?
1) 243(X) ఆదాయ వనరులు, పన్నులు
2) 243(Z) అకౌంటింగ్
3) 243(Y) ఫైనాన్స్ కమిషన్
4) 243(Z) అకౌంటింగ్-ఆడిటింగ్
41. కింది నిబంధనల్లో సరికాని వాక్యాన్ని రాయండి?
1) 243(ZA) మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ
2) 243(ZB) షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపులో మినహాయింపులు
3) 243(ZE) మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ
4) 243(ZF) పాత శాసనాల కొనసాగింపు
42. కింది వాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) ప్రజా ప్రతినిధుల మీద వచ్చిన అభియోగాలపై అంబుడ్స్‌మన్ అనే స్వతంత్ర సంస్థ విచారణ జరిపి తీర్పునిస్తుంది
2) అంబుడ్స్‌మన్ అనే స్వతంత్ర సంస్థను కేరళ ఏర్పాటు చేసింది
3) బర్గా అంటే తెగల సమూహం అని అర్థం
4) ఆపరేషన్ బర్గాను ప్రవేశ పెట్టింది కర్ణాటక
43. కిందివాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) ఆంధ్రప్రదేశ్ పెసా చట్టం 1998
2) ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీ చట్టం 1994
3) ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 1986
4) ఆంధ్రప్రదేశ్ విలేజ్ పంచాయతీ చట్టం 1950
44. పురపాలక సంఘాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) మొదటి అంచె – నగర పంచాయతీ
2) రెండవ అంచె – పురపాలక సంస్థలు
3) మూడో అంచె – నగరపాలక సంస్థలు
4) నాలుగో అంచె – కార్పొరేషన్లు
45. కిందివాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) 40,000 -3 లక్షల మధ్య జనాభా ఉన్న పట్టణాన్ని పురపాలక సంస్థగా ఏర్పాటు చేశారు
2) వార్షిక ఆదాయం 8 కోట్లు ఉన్న దాన్ని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటారు
3) వార్షిక ఆదాయం 6 కోట్లు ఉన్న దాన్ని గ్రేడ్-1 మున్సిపాలిటీ అంటారు
4) వార్షిక ఆదాయం 4-6 కోట్లు ఉన్న దాన్ని గ్రేడ్-1 మున్సిపాలిటీ అంటారు
46. కిందివాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) వార్షిక ఆదాయం 6-8 కోట్ల మధ్య ఉంటే దాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటారు
2) వార్షిక ఆదాయం 1-2 కోట్ల మధ్య ఉంటే దాన్ని గ్రేడ్ -2 మున్సిపాలిటీ అంటారు
3) వార్షిక ఆదాయం 4-6 కోట్ల మధ్య ఉంటే దాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటారు
4) వార్షిక ఆదాయం 2-4 కోట్ల మధ్య ఉంటే దాన్ని గ్రేడ్ 2 మున్సిపాలిటీ అంటారు
47. మెట్రోపాలిటిన్ ప్రణాళిక కమిటీకి సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) దీన్ని రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా రూపొందించారు
2) దీనిలో 24 మంది సభ్యులుంటారు
3) దీనిలో 18 మంది కార్పొరేటర్లు సభ్యులుగా ఉంటారు
4) తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది
48. కిందివాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) నోటిఫైడ్ ఏరియా కమిటీలు పారిశ్రామిక వ్యవస్థను శీఘ్రతరం చేస్తాయి
2) టౌన్ ఏరియా కమిటీలు కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడలతాయి
3) కంటోన్మెంట్ బోర్డులు సైనిక శిభిరాల వద్ద పరిపాలన నిర్వహిస్తాయి
4) టౌన్‌షిప్‌లు పెద్ద పారిశ్రామిక ఉద్యోగులకు, కార్మికులకు సదుపాయాలను కల్పిస్తాయి
49. కిందివాటిలో సరికాని వాక్యాన్ని రాయండి?
1) పోర్ట్ ట్రస్టులు వాయు రవాణాను నిర్వహిస్తాయి
2) ప్రత్యేక ప్రయోజన సంస్థలు బహుళ ప్రయోజనార్థం పనిచేస్తున్నాయి
3) రీకాల్ వ్యవస్థ మధ్యప్రదేశ్‌లో 2001లో ప్రారంభమయ్యింది
4) రీకాల్ వ్యవస్థపై 1974లో జయప్రకాష్ నారాయణ్ ప్రస్తావించాడు
50. కిందివాటిలో కలెక్టర్ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) 1772లో కలెక్టర్ వ్యవస్థను మొదటి సారిగా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు
2) కలెక్టర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున విధులను నిర్వర్తిస్తాడు
3) ఇతడు జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులను నిర్వర్తిస్తాడు
4) ఇతడు కేంద్ర రిటర్నింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తాడు
51. న్యాయపంచాయతీల ఉద్దేశం?
1) గ్రామ పంచాయతీలను నిర్వహించడం
2) పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చిన తీర్పులు కొట్టి వేయడం
3) హైకోర్టు అప్పీలుకు అనుమతి ఇవ్వడం
4) గ్రామీణ ప్రజలకు ఎక్కువ ఖర్చు లేకుండా త్వరగా న్యాయాన్ని అందించడం
52. కింది వివరాలను పరిశీలించండి?
ఎ) రాజ్యంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలున్నాయి. దీన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు
బి) రాజ్యాంగంలోని 9(ఎ) భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రకరణ 243(Q) ప్రకారం ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనే రెండు రకాల మున్సిపాలిటీలుండాలి
1) 1 2) 2 3) 1, 2
4) రెండూ సరికాదు
53. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు వాటికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించరాదని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.
1) గోవా, జమ్ము-కశ్మీర్, పాండిచ్చేరి
2) ఢిల్లీ, గోవా, మిజోరాం, మేఘాలయ
3) మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం
4) మణిపూర్, నాగాలాండ్
54. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం
1) అశోక్‌మెహతా కమిటీ
2) బల్వంతరాయ్ మెహతా కమిటీ
3) వసంతరావ్ నాయక్ కమిటీ
4) రాజమన్నార్ కమిటీ
55. 1993 కొత్త పంచాయతీరాజ్ బిల్లులో గతంలో వలే కాకుండా అనేక కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. కింది వాటిలో ఏది వాటికి సంబంధించిన అంశం కాదు?
1) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్య, సామాజిక అడవులు లాంటి కొత్త విధులను చేర్చారు
2) నిర్దేశించిన సమయంలో అన్ని స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు జరపాలన్న నిబంధన
3) పంచాయతీల్లోని స్థానాల్లో 1/3వ వంతు మహిళలకు కేటాయింపు
4) క్రమశిక్షణ, జవాబుదారీతనం పంచాయతీ సభ్యుల్లో తీసుకొచ్చేందుకు వారికి జీతం ఇవ్వటం
56. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు?
1) కప్ట్రోలర్, ఆడిటర్ జనరల్
2) ప్రధానమంత్రి
3) రాష్ట్ర ప్రభుత్వం
4) భారత ఆర్థిక సంఘం
57. కింది వాటిలో మండల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసింది ఎవరు?
1) అశోక్‌మెహతా కమిటీ
2) బల్వంతరాయ్ మెహతా కమిటీ
3) నరసింహన్ కమిటీ
4) వెంగళరావు కమిటీ
58. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కిందివాటిలో ఏది అసత్యం?
1) భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థలో ఒక స్వతంత్ర స్థాయి కలిగి ఉంటుంది
2) స్థానిక ప్రభుత్వ సంస్థల్లో 33.33 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు
3) స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను ఒక కమిషన్‌ను కేటాయిస్తుంది
4) స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుంది
59. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో దేన్ని73వ రాజ్యాంగసవరణ ప్రతి పాదించలేదు?
1) స్థానిక ప్రభుత్వ సంస్థల్లో 33.33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలి
2) పంచాయతీరాజ్ సంస్థల్లో వనరుల కోసం రాష్ర్టాలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాయి
3) పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైనవారి ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే వారి పదవులను కోల్పోతారు
4) రాష్ట్ర ప్రభుత్వంచే పంచాయతీరాజ్ సంస్థ రద్దయితే 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి
60. పంచాయతీరాజ్‌లోని పాలనా వ్యవస్థ ఏది?
1) గ్రామస్థాయి ఒక అంచెగల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ
2) గ్రామ, బ్లాకుస్థాయిల్లో రెండంచెల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ
3) గ్రామ, బ్లాకు, జిల్లా స్థాయిల్లో మూడంచెల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ
4) గ్రామ, బ్లాకు, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో నాలుగంచెల స్వపరిపాలన వ్యవస్థ
61. గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?
1) జిల్లా కలెక్టర్
2) జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
4) ఆ ప్రాంతం జిల్లా మున్సిఫ్ కోర్టు
62. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ?
1) గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు
2) గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా ప్రజా పరిషత్
3) గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్
4) పైవేవీకావు
63. మున్సిపల్ కార్పోరేషన్ స్థాయి సంఘాల సభ్యులు
1) ఓటర్లు ఎన్నుకుంటారు
2) కార్పోరేటర్లు ఎన్నుకుంటారు
3) మేయర్ నామినేట్ చేస్తారు
4) కమిషనర్ నామినేట్ చేస్తారు
64. మండల పరిషత్ అధ్యక్షుడు కింది విధంగా ఎన్నుకుంటారు?
1) ఓటర్లతో ప్రత్యక్షంగా
2) మండల పరిషత్ సభ్యులచే
3) మండల పరిషత్‌లో ఎన్నుకున్న సభ్యులచే
4) మండలంలోని సర్పంచులచే
65. మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు లేని వారెవరు?
1) ఎన్నుకున్న సభ్యులు
2) కో ఆఫ్ట్ చేసిన సభ్యులు
3) మండలానికి చెందిన రాజ్యసభ సభ్యులు
4) ఆ మండలానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు
66. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశం గా ఏ చట్టంలో ప్రకటించారు?
1) 1909 మింటో మార్లే చట్టం
2) 1919 మాంటెంగ్ చేమ్స్‌ఫర్డ్ చట్టం
3) భారత ప్రభుత్వ చట్టం 1933
4) భారత స్వాతంత్య్ర చట్టం 1947
67. జతపరచండి.
1) సామాజికాభివృద్ధి పథకం ఎ) 1959 అక్టోబర్ 02
2) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం బి) 1993 ఏప్రిల్ 24
3) పంచాయతీరాజ్ వ్యవస్థ సి) 1952 అక్టోబర్ 02
3) నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ డి) 1953 అక్టోబర్ 02
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
68. సామాజికాభివృద్ధి పథకం లక్ష్యం ఏమిటి?
1) ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధి
2) ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల సాంస్కృతికాభివృద్ధి
3) ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి
4) పైవాటిలో ఏదీకాదు
జవాబులు
32-4 33-2 34-3 35-4
36-4 37-2 38-3 39-3
40-2 41-2 42-4 43-3
44-4 45-3 46-2 47-4
48-2 49-1 50-4 51-4
52-3 53-4 54-2 55-4
56-3 57-1 58-4 59-3
60-3 61-4 62-1 63-2
64-3 65-4 66-3 67-2
68-3
అంజి
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు