మొక్కలు.. జాగ్రత్తలు

ఇంట్లో అందమైన మొక్కలుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లివింగ్ రూమ్, బాల్కనీలో పచ్చని మొక్కలను పెంచితే ఇల్లంతా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే, ఇండోర్ మొక్కలను పెంచడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

- ఇంట్లో పెంచాలనుకునే మొక్కలపై పూర్తి అవగాహన ఉండాలి.
- వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి.
- కుండీల్లో పెంచే మొక్కలకు నీళ్లు పోసే సమయంలో నీరు కింద పడి ఇల్లంతా తడిగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే కుండీలను ట్రేలలోగానీ, రెండు కుండీలను గానీ వాడితే మంచిది.
- కొన్నిరకాల మొక్కల వేర్లు మట్టిలో భారీగా విస్తరిస్తాయి. అలాంటి వాటిని చిన్న కుండీల్లో పెంచవద్దు.
- కొన్నిటికి సూర్యరశ్మి తప్పనిసరి. అలాంటివాటిని కిటికీల వద్దే సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి.
- ఇండోర్ మొక్కలు తక్కువ నీటిని తీసుకుంటాయి. అలాంటివాటికి ఎక్కువ నీరు పోస్తే చనిపోయే ప్రమాదం ఉంటుంది. వీటికి వారంలో ఒకటి రెండుసార్లు నీరు పోసినా సరిపోతుంది. కుండీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మట్టిలో ఒక అంగుళం మేర తడి లేనప్పుడు నీళ్లు పోస్తే మంచిది.
- కొన్ని మొక్కలు ఎక్కువగా తెగుళ్లబారిన పడుతుంటాయి. అలాంటివాటిని పెంచకపోవడమే బెటర్.
- ఆకులకు ఫంగస్ సోకినట్లు గుర్తిస్తే వెంటనే కట్ చేసేయాలి. లేకుంటే ఫంగస్ విస్తరించి మొక్కకూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది.
- కొన్ని రకాల మొక్కలు పూర్తిగా నీటిలోనే పెరుగుతాయి. అలాంటి వాటికి కనీసం 15 రోజులకు ఒకసారైనా నీటిని మార్చాలి.

- Tags
- nursary
- Sapling plants
Previous article
‘మిరా’కిల్ భవనం!
Next article
60శాతం అమ్మకాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






