Indian Polity | ‘బోన్సి బాబా’గా పేరుపొందిన భారత ప్రధాని ఎవరు?
1. 1978 నుంచి నేటి వరకు స్థానిక సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం?
1. రాజస్థాన్ 2. ఆంధ్రప్రదేశ్
3. పశ్చిమబెంగాల్ 4. గుజరాత్
2. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన రాష్ట్రం?
1. రాజస్థాన్ 2. గుజరాత్
3. తెలంగాణ 4. కేరళ
3. గ్రామసభ ద్వారానే ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న రాష్ట్రం?
1. కేరళ 2. తెలంగాణ
3. హర్యానా 4. బీహార్
4. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1. 2005 2. 2006
3. 2003 4. 2004
5. కింది వాటిలో అటార్నీ జనరల్‌కు సంబంధించిన అసంబద్ధమైన వాక్యాన్ని గుర్తించండి.
1. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయ అధికారి అటార్నీ జనరల్
2. ఆర్టికల్ 76 ప్రకారం భారత రాష్ట్రపతి అటార్నీ జనరల్‌ను నియమిస్తాడు
3. ప్రస్తుతం భారత అటార్నీ జనరల్ వేణుగోపాల్
4. భారత రాష్ట్రపతి అటార్నీ జనరల్ ద్వారానే సుప్రీంకోర్టు న్యాయ సలహా పొందుతాడు
6. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అటార్నీ జనరల్ ఉభయ సభలో ప్రసంగించే/చర్చలో పాల్గొనే హక్కు ఉంటుంది?
1. ఆర్టికల్ 88 2. ఆర్టికల్ 87
3. ఆర్టికల్ 86 4. ఆర్టికల్ 76
7. కింది వాటిలో అడ్వకేట్ జనరల్‌కు సంబంధించిన అసంబద్ధమైన వాక్యాన్ని గుర్తించండి.
1. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు
2. భారత రాజ్యాంగంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నియామకం గురించి ఆర్టికల్ 165 తెలుపుతుంది
3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి అడ్వకేట్ జనరల్ డి .నరసరాజు
4. పైవన్నీ సరైనవే
8. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌కు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే హక్కు కలదు?
1. ఆర్టికల్ 165 2. ఆర్టికల్ 170
3. ఆర్టికల్ 177 4. ఆర్టికల్ 200
9. తెలంగాణ రాష్ట్ర తొలి అడ్వకేట్ జనరల్ ఎవరు?
1. ప్రకాష్ రెడ్డి
2. బి.శివానంద ప్రసాద్
3. రామకృష్ణారెడ్డి
4. ఎ.సుదర్శన్ రెడ్డి
10. కింది వారిలో ప్రొటెం స్పీకర్‌గా ఉండి స్పీకర్ గా ఎన్నికైన వారు?
1. జి.వి.మౌలాంకర్, సోమనాథ్ ఛటర్జీ
2. బలరాం జక్కర్, నీలం సంజీవరెడ్డి
3. సోమనాథ్ ఛటర్జీ, జీఎంసీ బాలయోగి
4. సుమిత్ర మహాజన్, ఓం బిర్లా
11. మొట్టమొదటిసారిగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు?
1. ప్రణభ్ ముఖర్జీ 2. ఇంద్రజిత్ గుప్తా
3. సోమనాథ్ ఛటర్జీ 4. మన్మోహన్ సింగ్
12. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక భారత రాష్ట్రపతి?
1. అబ్దుల్ కలాం
2. నీలం సంజీవరెడ్డి
3. రామ్‌నాథ్ కోవింద్
4. ప్రణబ్ ముఖర్జీ
13. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక భారత ఉప ప్రధాని?
1. ఎల్కే అద్వానీ
2. బాబు జగ్జీవన్ రామ్
3. సర్దార్ వల్లభాయ్ పటేల్
4. చరణ్ సింగ్
14. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న లోక్‌సభ స్పీకర్ ఎవరు?
1. నీలం సంజీవరెడ్డి
2. జీఎంసీ బాలయోగి
3. సుమిత్ర మహాజన్
4. సోమనాథ్ ఛటర్జీ
15. మండల కమిషన్ రిపోర్ట్‌ను అమలు చేయడానికి ప్రయత్నించిన భారత ప్రధాన మంత్రి ఎవరు?
1. రాజీవ్ గాంధీ 2. ఇందిరాగాంధీ
3. వి.పి.సింగ్ 4. చంద్రశేఖర్
16. ‘బోన్సి బాబా’గా పేరు పొందిన భారత ప్రధాని ఎవరు?
1. వి.పి.సింగ్ 2. చంద్రశేఖర్
3. చరణ్ సింగ్ 4. మొరార్జీ దేశాయ్
17. ప్రాథమిక విధులకు సంబంధించి అసంబద్ధమైన వాక్యం గుర్తించండి.
1. ప్రాథమిక విధుల అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాలి
2. ప్రతి సంవత్సరం జనవరి 3న ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలి
3. సర్దార్ స్వరన్ సింగ్ కమిటీ సిఫారసు మేరకు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించబడినవి
4. పైవన్నీ సరైనవే
18. వ్యక్తులకు సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించిన రాజ్యాంగ ఆర్టికల్ ఏది?
1. 19(సి) 2. 19(బి)
3. 19(ఏ) 4. 19(డి)
19. కింది వాటిలో సరైనది.
1. తంతి తపాలా, జనాభా లెక్కలు – కేంద్ర జాబితా
2. పౌరసత్వం, విద్య – ఉమ్మడి జాబితా
3. వ్యవసాయం, బ్యాంకింగ్ – రాష్ట్ర జాబితా
4. విదేశీ వ్యవహారాలు, విడాకులు – అవశిష్ట అధికారాలు
20. అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయమని తొలిసారిగా కోరిన రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్ 2. కేరళ
3. మహారాష్ట్ర 4. రాజస్థాన్
21. కింది వాటిలో అంతర్రాష్ట్ర మండలి నిర్మాణానికి సంబంధించిన అసంబద్ధమైన వాక్య ఏది?
1. అంతర్రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తాడు
2. అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు
3. ఢిల్లీ, పాండిచ్చేరి ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు
4. రాష్ట్రపతి పాలన అమల్లో గల రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు
22. కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం?
1. అడవులు 2. విద్య
3. గ్రంథాలయాలు
4. తూనికలు, కొలతలు
23. జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాజ్యసభ తీర్మానంతో పార్లమెంటు ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేస్తుంది?
1. ఆర్టికల్ 250 2. ఆర్టికల్ 249
3. ఆర్టికల్ 252 4. ఆర్టికల్ 251
24. కింది వాటిలో సరి కానిది?
1. ఆర్థిక సంఘం – ఆర్టికల్ 280
2. అంతర్రాష్ట్ర మండలి – ఆర్టికల్ 263
3. కేంద్ర ఆగంతుక నిధి -ఆర్టికల్ 266
4. రాజ్యాంగ సవరణ విధానం- ఆర్టికల్ 368
25. కేంద్ర రాష్ర్టాల మధ్య సంబంధాల గురించి భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది?
1. 11వ భాగంలో ఉంది
2. 11&12 వ భాగంలో ఉంది
3. 12వ భాగంలో ఉంది
4. తొమ్మిదో భాగంలో ఉంది
26. కింది వాటిలో ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు?
1. పోలీస్ శాఖకు 2. సీబీఐ శాఖకు
3. ఏసీబీ శాఖకు
4. ఆర్మీలో పనిచేసే వారికి
27. ఆర్టికల్ 16(4-A) అనేది దేని కోసం?
1. స్త్రీల రిజర్వేషన్
2. వికలాంగులకు రిజర్వేషన్
3. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్
4. ప్రమోషన్ రిజర్వేషన్
28. ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరింప చేయరాదు?
1. 13(1) 2. 14(1)
3. 13(2) 4. 13(3)
29. జాతీయ పతాకాన్ని గౌరవించడం?
1. ప్రాథమిక హక్కు
2. ప్రాథమిక బాధ్యత
3. చట్టానికి భయపడి 4. 2&3
30. 69 శాతం రిజర్వేషన్ మించినందున తమిళనాడు చట్టం కోర్టుకు పునః పరిశీలనకు గురికాకుండటం కోసం ఏ షెడ్యూల్లో చేర్చారు?
1. ఏడో షెడ్యూల్ 2. 9వ షెడ్యూల్
3. పదో షెడ్యూల్ 4. ఆరో షెడ్యూల్
31. రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ఏరియా జనాభా ఎంత?
1. పది లక్షల పైన 2. 20 లక్షల పైన
3. 30 లక్షల పైన 4. 40 లక్షల పైన
32. తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరు?
1. కుందూరు జానారెడ్డి
2. ఎస్ మధుసూదనా చారి
3. పద్మ దేవేందర్ రెడ్డి 4. స్వామి గౌడ్
33. భారతదేశ మహిళా ముఖ్యమంత్రుల్లో కింది వాటిలో సరికాని జత ఏది.
1. సుచేత కృపలాని – ఉత్తరప్రదేశ్
2. నందిని శతపతి – గోవా
3. మాయావతి – ఉత్తరప్రదేశ్
4. వసుంధర రాజె సింథియా- రాజస్థాన్
34. కింది వాటిలో సరికానిది ఏది?
1. స్వరాజ్ పార్టీ స్థాపన-1925
2. గదర్ పార్టీ స్థాపన-1913
3. అంతరంగిక అత్యవసర పరిస్థితి -1975
4. లోక్ సభకు తొలి మధ్యంతర ఎన్నిక -1971
35. కింది వాటిలో సరికానిది ఏది?
1. మున్సిపాలిటీల సీట్లు రిజర్వేషన్ – ఆర్టికల్ 243 (T)
2. మున్సిపాలిటీల ఆర్థిక సంఘం – ఆర్టికల్ 243 (Z)
3. మున్సిపాలిటీల నిర్వచనం – ఆర్టికల్ 243 (P)
4. మున్సిపాలిటీల ఏర్పాటు- ఆర్టికల్ 243(Q)
36. కింది వాటిలో సరికాని ఆర్టికల్ ఏది?
1. రాష్ట్ర హైకోర్టులు – ఆర్టికల్ 214
2. కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా హైకోర్టులు పనిచేయడం- ఆర్టికల్ 215
3. జిల్లా న్యాయమూర్తుల నియామకం – ఆర్టికల్ 233
4. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం – ఆర్టికల్ 224
37. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు ఒకే హైకోర్టును ఏర్పాటు చేయడం?
1. ఆర్టికల్ 214 2. ఆర్టికల్ 216
3. ఆర్టికల్ 231 4. ఆర్టికల్ 230
38. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టుల అధికార పరిధిని విస్తరింప చేయడం జరుగుతుంది?
1. ఆర్టికల్ 230 2. ఆర్టికల్ 231
3. ఆర్టికల్ 229 4. ఆర్టికల్ 227
39. సుప్రీంకోర్టు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు?
1. జస్టిస్ రోహిణి
2. జస్టిస్ రవీంద్ర భట్
3. జస్టిస్ రమణ 4. 1&4
40. కింది వారిలో రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉండేవారు ఎవరు?
1. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2. అటార్నీ జనరల్ & రాష్ట్ర గవర్నర్లు
3. అటార్నీ జనరల్ & అడ్వకేట్ జనరల్
4. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్
41. లోక్ పాల్ అనే పదాన్ని ముందుగా ఉపయోగించిన వ్యక్తి?
1. ఎల్.ఎం.సింఘ్వి 2. సర్కారియా
3. కే సంతానం 4. అరుణ రాయ్
42. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం అన్న ఏ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది?
1. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
2. గౌహతి హైకోర్టు
3. ఢిల్లీ హైకోర్టు
3. రాజస్థాన్ హైకోర్టు
43. లోకాయుక్తను అమలు పరిచిన తొలి రాష్ట్రం?
1. మహారాష్ట్ర 2. ఒడిశా
3. ఆంధ్రప్రదేశ్ 4. రాజస్థాన్
44. ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో ఢిల్లీలో సిక్కులపై జరిగిన ఊచకోతపై విచారణకు నియమించిన కమిషన్?
1. నానావతి కమిషన్
2. షా కమిషన్
3. సర్కారియా కమిషన్
4. 1&2
45. కింది వాటిలో రాష్ట్రపతితో నియామకం కాని జాతీయ కమిషన్?
1. ఎస్సీ కమిషన్
2. ఎస్టీ కమిషన్
3. మైనార్టీ కమిషన్
4. మానవ హక్కుల కమిషన్
సమాధానాలు
1-3, 2-2, 3-1, 4-4, 5-3, 6-1, 7-1, 8-3, 9-3, 10-1, 11-2, 12-4, 13-1, 14-4, 15-3, 16-2, 17-3, 18-1, 19-1, 20-2, 21-4, 22-3, 23-2, 24-3, 25-2, 26-4, 27-4, 28-1, 29-2, 30-2, 31-1, 32-3, 33-2, 34-1, 35-2, 36-4, 37-3, 38-1, 39-2, 40-2, 41-1, 42-2, 43-1, 44-1, 45-3
నరేష్ జాటోత్.
లెక్చరర్
సిద్ధార్థ డిగ్రీ పీజీ కళాశాల
నల్లగొండ.
8247887267
గుడ్డు-పోషక విలువలు
- గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్లు లోపించి ఉంటాయి.
- తెల్లసొనలో అల్బుమిన్ అనే ప్రొటీన్, పచ్చసొనలో కొలెస్టిరాల్ అనే కొవ్వు ఉంటుంది.
- గుడ్ల ఉత్పత్తిని పెంచేది సిల్వర్ విప్లవం.
- విటమిన్-సి తప్ప అన్ని విటమిన్లు గుడ్డులో ఉంటాయి.
- కోడి గుడ్డు పెంకులో కాల్షియం కార్బోనేట్ కూడా ఉంటుంది.
- ప్రతి భారతీయుడు సగటున ఏడాదికి 43 గుడ్లు తింటున్నాడు. జపనీయులు 346, మెక్సికన్లు 306,
చైనీస్ 312 గుడ్లు తింటున్నారు. - ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారాన్ని ప్రపంచ గుడ్డు దినోత్సవంగా నిర్వహిస్తారు.
- గుడ్డులోని పోషక పదార్థాలు: నీరు-38.8 గ్రా.,
- శక్తి-78 కి.కాలరీలు, ప్రొటీన్లు- 6.5 గ్రా., కొవ్వు-5.8గ్రా., సోడియం-7.2మి.గ్రా., పొటాషియం-6.7 మి.గ్రా.,
- కాల్షియం-29 మి.గ్రా., పాస్ఫరస్-103 మి.గ్రా.,
- ఐరన్-10మి.గ్రా., జింక్-0.7మి.గ్రా.,
- విటమిన్-ఇ-0.5 మి.గ్రా.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు