Indian History – Groups Special | తుంగభద్ర తీర నగరం.. బలమైన సైనిక సామ్రాజ్యం
విజయనగర రాజులు
- ఢిల్లీ సుల్తానులు వరంగల్లును జయించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది.
- అనంతరం ఔత్సాహిక యోధులైన నాయకులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
- దీనినే “కర్ణాటక సామ్రాజ్యం” అని కూడా అంటారు.
విజయనగరం : - విజయనగరం అంటే “విజయాలకు నగరం” అని అర్థం
- కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున విజయనగరాన్ని నిర్మించారు.
- క్రీ.శ. 1336లో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో “హరిహరరాయలు బుక్కరాయలు” విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు.
- విజయనగర సామ్రాజ్యం సుమారు 300 సంవత్సరాలు వర్థిల్లింది.
- విజయనగర రాజల్లో కొందరు కన్నడ భాష మాట్లాడేవారు.
- తెలుగుభాషకు సముచిత ప్రాధాన్యం కల్పించినవారు -శ్రీకృష్ణదేవరాయలు
విజయనగర రాజుల్లో ముఖ్యులు :
హరిహరరాయలు : క్రీ.శ.1336 – 1357
మొదటి బుక్కరాయలు : క్రీ.శ.1357 – 1377
రెండో దేవరాయలు : క్రీ.శ.1377-1404
సాళువ నరసింహరాయలు : క్రీ.శ.1486 – 1491
శ్రీకృష్ణదేవరాయలు : క్రీ.శ. 1509 – 1529
అచ్యుతరాయలు : క్రీ.శ.1529 – 1542
అళియ రామరాయలు : క్రీ.శ.1543 – 1565
వెంకటపతి రాయలు : క్రీ.శ.1585 – 1614
బహమనీ రాజ్యాలు : - తుంగభద్ర నదికి ఉత్తరంగా కొత్తగా వెలిసిన రాజ్యాలు.
- ఇది మహాసామ్రాజ్యం.
- ముఖ్యపట్టణం – గుల్బర్గా
- క్రీ.శ . 1489 – 1520 కాలంలో బహమనీ రాజ్యం ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది.
- వీటిలో పెద్ద రాజ్యాలు – బీజాపూర్, గోల్కొండ అందులో ఎక్కువ భాగం నేటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉంది.
- ఈ రాజ్యాలను ఇరాన్, అరేబియా నుంచి వచ్చిన సుల్తాన్లు, యోధులు పాలించారు.
- ఈ రాజ్యాలన్నీ నిరంతరం యుద్ధాలు చేస్తూ, తమ రాజ్య విస్తరణకు ప్రయత్నించారు.
- వీరు స్థానిక యోధులను, నాయకులను నియమించి వారి ద్వారా గ్రామీణ రైతులు, వ్యాపారుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసేవారు. గ్రామాలను అదుపులో ఉంచుకొనే వారు.
విజయనగర చరిత్రకు ఆధారాలు : - గ్రంథాలు, రాజప్రతులు, శాసనాలు, నాడు నిర్మించిన భవనాలు, నిత్యజీవిత పరిపాలన, సామాజిక సంస్థలు అందించిన వివరాలు.
విజయనగర పట్టణం : - విజయనగర పట్టణాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ ప్రాచీన విరూపాక్ష, పంపాదేవి ఆలయాలు కలిసి ఉంటాయి.
సైన్యం – సైనిక అధికారులు : - విజయనగర రాజులు సైనిక శక్తిని బలోపేతం చేయడానికి పెద్ద మొత్తం ఖర్చు చేశారు.
- అరేబియా, ఇరాన్ దేశాల నుంచి మేలిరకం గుర్రాలను పశ్చిమ తీరంలోని ఓడల ద్వారా దిగుమతి చేసుకున్నారు.
- సైనికులను నియమించుకున్నారు.
- కోటగోడలను పటిష్టంగా నిర్మించారు.
- రెండో దేవరాయలు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ తంత్రాలు నేర్పించాడు.
- వారి కోసం సైనిక శిబిరంలో మసీదులు కూడా నిర్మించారు.
- ఆ రోజుల్లోనే తుపాకులు, ఫిరంగులు ప్రవేశపెట్టారు.
- భారతదేశంలోనే ఆధునిక అశ్వదళం, సైనిక దళాల వల్ల విజయనగర సామ్రాజ్య సైన్యం అత్యంత శక్తిమంతమైన సైన్యాల్లో ఒకటిగా నిలిచింది.
- ఆ రోజుల్లో వేగవంతంగా కదలడానికి అశ్వదళాలను ఉపయోగించారు.
- నిదానంగా కదులుతూ శత్రు శిబిరాల్లో దాడులు చేయడంలో శక్తివంతమైనవి.
- సైనిక దళాల నాయకుడు – అమరనాయకుడు
- మొత్తం రాజ్యాన్ని సైనిక అధికారులే పరిపాలనా నియంత్రణ చూసేవారు.
డోమింగో పేజ్ ప్రకారం : - పోర్చుగీసు యాత్రికుడు శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు.
- ఆయన అభిప్రాయం ప్రకారం “రాజువద్ద గల లక్షల కొద్ది బలమైన సైన్యంలో 35,000 అశ్వదళం, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారట. అందువల్ల ఆయనంటే ఇతర రాజులకు భయం”
- ప్రభువు వర్గం నుంచే సైనికదళ అధికారులను నియమించేవారు.
- వారికి రాజ్యంలోని పట్టణాల మీద, నగరాల మీద, గ్రామాల మీద విస్తృతమైన అధికారం ఉండేది.
- వారిలో కొందరు లక్షల కొద్దీ బంగారు నాణేలు పన్నులుగా వసూలు చేసుకొనే వారు.
- మరి కొందరు రెండు వందలు, మూడు వందలు ఐదు వందలు, వేయి చొప్పున నాణేలను వసూలు చేసుకొనేవారు.
- సైనిక దళాధిపతి నిర్వహించే సైన్యం ఆధారంగా (పదాతి, అశ్వదళ, గజ) బంగారు నాణేల వసూళ్లకు రాజు నిర్ణయించేవాడు.
- ఆ సొమ్మును నాయకుడు పదాతి దళాలు, గుర్రాలు, ఏనుగుల పోషణ కోసం
ఖర్చు పెట్టేవారు. - ఏ సమయంలోనైనా వీటిని యుద్ధానికి సిద్ధంగా నిలిపేవారు.
- ఇదే కాకుండా రాజుకు వార్షిక చెల్లింపులు, బహుమానాలు, సమర్పించుకొనేవారు.
- దళాధిపతులు, నాయకుల సైన్యంతో పాటు రాజుకి సొంత సైన్యం ఉండేది.
- వీరికి రాజే జీతభత్యాలు చెల్లించేవాడు.
- సైనిక దళాధిపతులను నాయకులుగా కూడా నియమించేవారు.
- వీరినే “అమర నాయకులు”గా పిలిచారు.
అమర నాయకుల బాధ్యతలు – విధులు : - వీరికి ‘అమరం’పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను అప్ప చెప్పేవారు.
- నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం అమరంకి ఉండేది.
- అంటే వీరికి ఇచ్చిన గ్రామాలు, పట్టణాల నుంచి రెవెన్యూ వసూలు చేసుకొని, ఉపయోగించుకొనే అధికారం ఉంటుంది.
- అంతేకాకుండా ఆదాయంతో సైనిక దళాలను పోషించే బాధ్యత కూడా వీరికి ఉండేది.
- వీరి ఆర్థిక ప్రాంతాలపై పరిపాలన, న్యాయపరమైన అధికారాలను కలిగి ఉండేవారు.
- నేరస్థులను చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేసే అధికారం కూడా వీరికి ఉంది.
- నాటి ఢిల్లీ సుల్తానుల పరిపాలనకు దగ్గరగా ఉండేది.
- వారు కూడా ‘ఇక్తా’ల అధికారులైన ‘అమీర్’లకు రెవెన్యూ వసూలు చేసుకొనే అధికారం ఇచ్చారు.
- చాలా మంది అమర నాయకులు “తెలుగు వీరులే”
- వీరు సొంత గ్రామాల నుంచి, తమ బంధువుల నుంచి సైనికులను నియమించుకొని శిక్షణ ఇచ్చేవారు.
- ఈ సైనికులు రాజుకంటే నాయకులకే విధేయులై ఉండేవారు.
- శక్తిమంతమైన నాయకులైన సాళువ నరసింహ లేదా నరస నాయకుడు విశాల భూభాగంపై అధికారాన్ని పొంది కొన్ని సందర్భాల్లో విజయనగర రాజులకు సవాలుగా నిలిచేవారు.
- ఒకవేళ రాజు చనిపోతే రాజ్యాన్ని శక్తిమంతమైన నాయకులు తమ చేతుల్లోకి తీసుకొని తమని తాము రాజుగా ప్రకటించుకొనేవారు.
శిస్తు వసూలు : - చోళుల కాలంలో భూమి శిస్తును “మండళ్ల’ ద్వారా వసూలు చేసేవారు.
- విజయనగర రాజుల కాలంలో భూమి శిస్తును “అమర నాయకుల”ద్వారా వసూలు చేసేవారు.
శ్రీకృష్ణదేవరాయలు :
- శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509 నుంచి 1529 వరకు పరిపాలించాడు.
- బహమనీ సుల్తానులు, గజపతులకు (ఒడిశా) వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని విజయవంతంగా నడిపించిన గొప్ప యోధుడు.
- ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లోని నాయకులను అణచివేసి సామ్రాజ్యంపై ఆధిపత్యం సంపాదించాడు.
- దక్షిణ ప్రాంతం కృష్ణానది, తూర్పు ఓడరేవులపై నియంత్రణ సాధించాడు.
- పశ్చిమ తీరంలో గోవాలో ఓడరేవుల వద్ద స్థావరాలు ఏర్పరచుకుని నియంత్రణ సాధించిన పోర్చుగీసు వారితో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకొని వారి వద్ద నుంచి గుర్రాలు, పేలుడు సామగ్రి పొందాడు.
- తన సైన్యంలో పోర్చుగీసు దళాలను చేర్చుకొని వారితో దళాలను ఏర్పాటు చేశాడు.
- విజయదశమి రోజున అమర నామకులు, ప్రముఖులు, చక్రవర్తికి కానుకలు, కప్పం చెల్లించేవారు.
- శ్రీకృష్ణదేవరాయలు తమ సామ్రాజ్యంలో గల దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.
- వారు స్వయంగా తిరుపతి, శ్రీశైలం. అహోబిలం సందర్శించేవారు.
- చాలా దేవాలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలు సమర్పించేవారు.
- శ్రీకృష్ణదేవరాయలు అనేక యుద్ధాల్లో విజయం పొంది లభించిన ధనరాశులను దక్షిణ భారతదేశంలోని పెద్ద పెద్ద దేవాలయాలకు పంచిపెట్టాడు.
- ఈ దేవాలయాల్లో ఇతని గౌరవార్థం ‘రాయగోపురం’ అనే ఎత్తయిన ఆలయ ముఖద్వారాలను నిర్మించాడు.
- విజయనగర పట్టణాల్లో కూడా కొన్ని సుందర దేవాలయాలను నిర్మించాడు.
- శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా “తెలుగుసాహిత్యంలో” కవి.
- శ్రీకృష్ణదేవరాయలు “ఆండాళ్” అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా “ఆముక్తమాల్యద” గ్రంథం రచించాడు.
విజయనగర రాజుల పతనం : - శ్రీకృష్ణదేవరాయలు వారసులైన అచ్యుతదేవరాయలు, అళియ రామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింతగా పెరిగింది.
- వీరు బహమనీ సుల్తానుల రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు.
- వీరి నిరంతర జోక్యం ఫలితంగా ఆందోళన చెందిన ఐదుగరు బహమనీ సుల్తానులు 1565లో ఏకమై “రక్షస్ తంగడి యుద్ధం లేదా తళ్లికోట యుద్ధం”లో రామరాయలను ఓడించి, విజయనగర పట్టణాన్ని దోచుకుని సర్వనాశనం చేశారు.
- అనంతరం వచ్చిన వారసులు రాజధానిని తిరుపతికి సమీపంలోని చంద్రగిరికి తరలించారు. కాని పూర్వ వైభవాన్ని సాధించలేకపోయారు.
- కొంత ప్రాంతాన్ని సుల్తానులు ఆక్రమించుకోగా మిగిలిన భూభాగాన్ని నాయకులు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు.
- కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కొందరు సామంతరాజులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు.
వాటిలో బలమైన స్వతంత్ర రాజ్యాలు
1. దేవరకొండ, 2. రాచకొండ 3. వెలమ - ఇవి విజయనగర రాజుల, బహమనీ సుల్తానుల అధికారాన్ని సవాలు చేశాయి.
సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా : (1550 – 80) - తెలుగు సాహిత్యాన్ని పోషించి, బ్రాహ్మణులను, దేవాలయాలను ఆదరించాడు.
- ఈయన పోషణ పొందిన తెలుగు కవులు :
1. సింగరాచార్యులు
2. అద్దంకి గంగాధరుడు
3. కందుకూరు రుద్రకవి
4. పొన్నగంటి తెలగనార్యులు - ఈ కవులు ఇబ్రహీం కుతుబ్‌షాను “మల్కిభరాముడు” అని ప్రశంసించారు.
- ఈయన కాకతీయులవలె పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు.
- ప్రతాపరుద్రుని వద్ద సేవలందించిన కాకతీయుల సైన్యంలోని ప్రముఖలను తన సేనలోకి తీసుకున్నాడు.
- వ్యవసాయరంగంలో వారికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చాడు.
- కోటల నిర్వహణ బాధ్యతలను వారికే అప్పగించాడు.
- తెలంగాణ ముఖ్య భాగంలో వ్యవసాయ ఆధారాన్ని విస్తృత పరచడానికి కాకతీయ సాగునీటి విధానాన్ని కొనసాగించాలని అనుకున్నాడు.
హుస్సేన్‌సాగర్ : - నిర్మించిన వారు – ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
- నిర్మించిన సంవత్సరం – 1562
- ఈ చెరువు డిజైన్‌లో సహకరించిన వారు – సూఫీ సంత్ హజరత్ హుస్సేన్ షా వలీ.
- ఈయన పేరు మీద ఈ చెరువుకు హుస్సేన్‌సాగర్ అని పేరు పెట్టారు.
- అది మూసీనది నీటితో నిండి ఉండి, సంవత్సరం పొడవునా నీరు ఉండే కృత్రిమ చెరువు.
- అది హైదరాబాద్‌కు ప్రధాన మంచినీటి వనరుగా మారింది.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించినవి :
1. హుస్సేన్‌సాగర్
2. ఇబ్రహీంపట్నం దగ్గర చెరువు
3. పురానాపూల్
కుతుబ్‌షాహీల ఘనత - గోల్కొండ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రఖ్యాతి గాంచింది.
- కుతుబ్‌షాహీల ప్రధాన ఓడరేవు – మచిలీపట్నం
- ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరప్‌ల్లో వ్యాపారం సాగేది.
- కోస్తా ప్రాంతం నుంచి గోల్కొండకు ఒంటెలు, బంగారం, వెండి మొదలగు వాటిని వేర్వేరు దేశాల నుంచి దిగుమతి అయ్యేవి.
- గోల్కొండ కోటకి దగ్గరలో ఇబ్రహీంబాగ్‌లో కుతుబ్‌షాహీ పాలకుల ఏడు సమాధులు ఉండేవి.
- ఇవి పర్షియన్, హిందూ శైలిల మేళవింపుతో ఒక ప్రత్యేక భవన నిర్మాణ శైలిని కనబరుస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు